12, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5328

13-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్”
(లేదా...)
“అవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్”

12 కామెంట్‌లు:

  1. కందం
    శ్రవణీయమ్మగు కంఠము
    కవనమొలకగన్ విదేశ గమనమమరగా
    నవగుణపుటసభ్య నడత
    నవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    మత్తేభవిక్రీడితము
    శ్రవణీయంబగు గాత్రమున్ గలుగుచున్ సాహిత్యమందించుచున్
    గవనమ్మొల్కి విదేశయానములతోఁ గల్గంగ సత్కీర్తియే
    వివశుండౌచు నసభ్యవర్తనమునన్ వేదింపగన్ గాంతనే
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి

  2. అవమానించకు మంటిని
    యవనిన్ యశమును గడించి నట్టి బుధిలు డం
    టి, విదుడిపుడు నీ కంటికి
    యవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్?


    కవికాదాతడు కాంచగా నెపుడు సత్కావ్యమ్ములన్ వ్రాసి యీ
    యవనిన్ గీర్తిని పొందలేదు సఖులే యర్థింప పోనాడకన్
    సవయస్కుండ్ర గృహమ్ము లందు తన కౌశల్యమ్ముతో మేటిగా
    నవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్.

    రిప్లయితొలగించండి
  3. ఠవరయని కీర్తి నొందిరి
    యవధానములెన్నొ చేసి ; యల్పుండయ్యెన్
    అవసరము లేక యున్నను
    ప్రవీణతను గనబరచుట వాడుక యగుటన్

    రిప్లయితొలగించండి
  4. వివరించుఁ గాలి వానలు
    భవితవ్యపు హెచ్ఛరికలు భగ్నములవగా
    నవమానించుట మొదలై
    అవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    [అవధానము = హెచ్ఛరిక]

    అవధానంబనఁ జిత్తగించవలెనా యష్టావధానంబునే?
    వివరింపంగ విలక్షణంబయినవే వేర్వేరు రంగాలలో!
    నవధానంబులు పెక్కు సల్పెనతడన్యంబైన రంగాలలో
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి
  5. కం:నవలల గథలన్ వ్రాయుచు
    యువతకు మార్గమ్ము జూపు నొక లేఖకు డ
    య్యవి వీడి,వ్యర్థ పాండితి
    నవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్”
    (సామాజికస్పృహ తో నవలలు,కథలు వ్రాసిన ఒక రచయిత అవి వదలి పాండిత్య ప్రదర్శన తప్ప ఏ ప్రయోజనమూ లేని అవధానాలకి పోవటం ద్వారా అల్పు డయ్యాడు.)

    రిప్లయితొలగించండి
  6. వ్యవధానము లేకనెపుఁడు
    నవధానమ్ముల సలుపుచు నాతండిపుడున్
    కవనమ్ముల వ్రాయమరచి
    యవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    రిప్లయితొలగించండి
  7. కవియాతండు రచించె నింతదనుకన్ కావ్యమ్ములన్ మెండుగా
    యవధానమ్ములపైన దృష్టి మరలన్ వ్యగ్రమ్ముగా సల్పుచున్
    వ్యవధానమ్మొక సుంతలేక కవితా వ్యాసంగమున్ వీడెనే
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి
  8. మ:అవధానమ్మున నిల్వ,ప్రార్థనను జేయన్ బల్క సంచాలకుం
    "డవ ధానమున నన్ను గాచు జననీ యల్పుండ నే" నంచు భ
    క్తి వచించెన్ దన బ్రార్థనన్ సుకవి యా దీనత్వ పద్యమ్ము లో
    నవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్”

    (ఆ అవధాని గొప్ప కవే కానీ దైవ ప్రార్థనలో భక్తి తో కాస్త ఓవర్ యాక్షన్ చేసి తనని తానే అల్పుని గా చెప్పుకున్నాడు. ఆ పద్యం లో ఆయన అల్పుడై పోయాడు. )

    రిప్లయితొలగించండి
  9. కం॥ అవనిని శ్రేష్ఠుఁడు నమ్రుఁడు
    కవితా మాధురినిఁ గీర్తిఁ గని వినయముతో
    నవకమున విజ్ఞుల యెదుట
    నవధానములెన్నొ చేసి యల్పుండయ్యెన్

    మ॥ అవనిన్ శ్రేష్ఠుఁడు నమ్రతాదరము సౌహార్దమ్ముతో నొప్పఁడే!
    కవితా మాధురిఁ బంచి కీర్తిఁగని సంస్కారాన్వితుండై యటుల్
    నవకమ్మొంది తలంచె నీపగిది ధన్యంబొందినన్ సర్వదా
    అవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    నవకము మృదుత్వము

    రిప్లయితొలగించండి
  10. భువిలో ప్రసిద్ధు డ య్యె గ
    నవధానము లె న్నొ చేసి ::యల్పు o డ య్యె న్
    కవనము లల్లుట తెలియ క
    నవతను మెప్పించలేక నవ్వుల పాలై

    రిప్లయితొలగించండి
  11. వివరమ్ముగఁ జెప్పిన సుం
    త వినక యేమని వచింతు ధారణ లేమిం
    గవిమాని వలదనినఁ దా
    నవధానము లెన్నొ చేసి యల్పుం డయ్యెన్


    నృ వరా యెన్నుమ యా కవిత్వ మెదలో నిష్పక్షపాతమ్ముగాఁ
    గవివర్యుండవు సాటి సత్కవినిఁ గక్షా యుక్త మీర్ష్యాళువై
    యవమానించుట నీకు నిట్లు తగు నయ్యా పండితశ్రేష్ఠుఁడై
    యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అవధానము జరుగునపుడు
    నవ విధముల నిరుకున నిడి నచ్చని వారున్
    అవమాన పరచ నెంచగ
    నవధానము లెన్నొ చేసి యల్పుండయ్యెన్.

    రిప్లయితొలగించండి