ఈ సమస్యను చింతచిగురు పప్పు తో పూరించటమే పూర్తిగా తగిన పూరణ.చాలా మంది సమస్యని చివరి పాదం లోనే ఉంచాలని ప్రయత్నించటం వలన కొంత ఇబ్బంది పడ్డారు.సమస్యని రెండవ,లేక మూడవ పాదం లో ఉంచితే మరింత అందం వచ్చేది.చింత చిగురు పప్పు కాని పూరణలలో శ్రీ కడయింటి కృష్ణ మూర్తి గారు చేసిన పూరణ చక్కగా ఉంది. చీమ తన భర్తకి చింతాకు లో వడ్డించింది అనటం తెలివి గల కల్పన. వారికి అభినందనలు.
నిలువుము మిత్రమ! యిదియే
రిప్లయితొలగించండికలలోనం గాంచి తీవు కలికాలమునన్
తెలియం గోరెద నిట నే
చెలి వడ్డించెను విభునకు జింతాకుననే
మత్తేభం
రిప్లయితొలగించండిమలిసంధ్యాసమయంబులో కలిగె గమ్మత్తైన భావంబులున్
కలలో జూచిన మన్మధాకృతుడు సాక్షాత్కారమైనిల్వ వె
న్నెలలో సిగ్గులు మొగ్గలై విరియ పానీయంబులర్పించె నె
చ్చెలి వడ్డించెను ప్రాణవల్లభునకున్ చింతాకు లొఁబ్రేముడిన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు
కందం
రిప్లయితొలగించండి'పులుపున్ కారము నుప్పును
వలపున్ గలిపి', పొడుమంచు వర్షపు వేళన్
నులివెచ్చని రాగమొలికి
చెలి వడ్డించెను విభునకుఁ, 'జింతాకుననే'
మత్తేభవిక్రీడితము
వలపుల్ చిందుటె కాదు నా సతియె యస్వాదించెడున్ వంటలన్
బలుమారుల్ దిని పల్వరించు గతిలో పళ్లెంబునన్ గూర్చె నె
చ్చెలి వడ్డించెను ప్రాణవల్లభునకున్ జింతాకులోఁ బ్రేముడిన్
బులుపున్ కారమునుప్పుతోడ పొడుమౌ ముద్దంచు వర్షాననే
-
రిప్లయితొలగించండిపిలిచెను దేవుని పుత్రుడు
మొలకగ మునుగంగ తత్వమున బైబిలులో
పులకింతల తన్నుమరిచి
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
ప్రభువు దయ అందరి పై
ప్రసరించుగాక
ఆమెన్
జిలేబి
నిలయము నందేర్పరచిన
రిప్లయితొలగించండిపలు పత్రముల వలె విందు పాత్రము లుండన్
యెలమిని జూపించుచు నా
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే”
చలిచీమలజంట కుదిరి
రిప్లయితొలగించండిపులకించెను చింతచెట్టు బోదియ పైనన్
వలపును కలగలిపినదై
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
వలపుల్ పండగ జేయు చింతనమునన్ బ్రాచీన వృక్షంబుపై
చలిచీమల్ జతకూడెనంట నెనగా సాదృశ్యమే శూన్యమై
చెలువంబొప్పగ నుగ్గడించె కవి తా సృష్టించు కావ్యంబులో
చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్
రిప్లయితొలగించండికలధౌతముతో విస్తరి
చెలువుడు చింతాకువోలె జేసి పిరిమి హే
మలుడిచ్చెననుచు నివ్వగ
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే.
తలియే యిచ్చెనటంచు పెన్మిటి యటన్ స్తాలమ్ము నందివ్వ నా
చెలువుండిచ్చిన వెండి విస్తరదియే చింతాకు రూపంబునన్
గలదంచున్ గని యింతియే మురిసి యాకంచమ్ము లో నప్పుడే
చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్.
అలివేణి యింట గలదొక
రిప్లయితొలగించండిచెలువఁపు చింతాకుఁబోలు సిత పళ్ళెరమే
పొలుపుగ వండిన గారెలు
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
కం॥ ఇల పాతివ్రత్య మహిమ
రిప్లయితొలగించండిచెలఁగ నసాధ్యముఁ గలదొకొ స్త్రీలకు ధరలో
వలచిన పతి తృప్తిఁ బడయఁ
జెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
మ॥ ఇలలో సాధ్వి తలంచ సాధ్యమె సుమా యిచ్ఛాదృతిన్ గాంచఁగన్
దలవంచంగఁ ద్రిమూర్తులైన నటులన్ ధ్యానించి ప్రార్థించఁగన్
వలపుల్ మీరఁగ భర్త తృప్తిఁ గన సంభావించి సచ్ఛీలయౌ
చెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్
మ॥ అవధాన పుష్కరిణికి పంపినది మార్చి వ్రాసానండి (భావము అదే)
కం;వలపును దెల్పుచు నా నె
రిప్లయితొలగించండిచ్చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే”
కలగలిపిన పప్పును, తగు
పులుపును కారమున నొప్ప ముచ్చట బడుచున్
(చింత చిగురు పప్పు.)
విలసిత రీతిగ వండియు
రిప్లయితొలగించండిచెలివడ్డించె ను విభు నకు చింతాకుననే
పలు రుచి కర పాక o బు ను
వలపులు నిండిన దగుచును పాతివ్ర త యై
(2)మ:వలపున్ జిల్కుచు బొందుచున్ రుచిరమౌ పచ్చళ్ల తో బాటు,నా
రిప్లయితొలగించండిచెలి వడ్డించెను ప్రాణవల్లభునకుం జింతాకులోఁ బ్రేముడిన్
పులుపున్ గారము లన్ని గూర్చి సమమున్ బొందంగ దా బప్పు లో
కలగల్పున్ బొనరించి రుచ్య మనుచున్ గాంతుండు తృప్తిన్ గొనన్.
ఈ సమస్యను చింతచిగురు పప్పు తో పూరించటమే పూర్తిగా తగిన పూరణ.చాలా మంది సమస్యని చివరి పాదం లోనే ఉంచాలని ప్రయత్నించటం వలన కొంత ఇబ్బంది పడ్డారు.సమస్యని రెండవ,లేక మూడవ పాదం లో ఉంచితే మరింత అందం వచ్చేది.చింత చిగురు పప్పు కాని పూరణలలో శ్రీ కడయింటి కృష్ణ మూర్తి గారు చేసిన పూరణ చక్కగా ఉంది. చీమ తన భర్తకి చింతాకు లో వడ్డించింది అనటం తెలివి గల కల్పన. వారికి అభినందనలు.
రిప్లయితొలగించండిఅలరం జింతాకు పతక
రిప్లయితొలగించండిము లలన కంఠమ్మునఁ దన పురుషుని నరయన్
లలితాన్నము తత్క్షణమే
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
[చింతాకుననే = చింతాకుపతకముతోనే]
లలనా రత్నము సంతసం బొదవ నుల్లం బందు నీలాభ్ర కుం
తల వీక్షించి నిజేశు రాక నట నుత్సాహమ్మునన్ లేచి తా
నలవోకం దనరింపఁగా రుచుల నింపైనట్టి యా పచ్చడిం
జెలి వడ్డించెను బ్రాణవల్లభునకుం జింతాకు లోఁ బ్రేముడిన్
[చింతాకు = చింతచిగురు; లో = లోపల]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వలపును గలిపిన వంటను
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే
కలగలిపి పప్పునందున
పులుపుకు తగినంత కారమును రుచించన్.