15, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5331

16-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ”
(లేదా...)
“అణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

  1. తే.గీ.

    త్రొంగి జూడక పరదేశ శాస్త్రులనిక
    మరళ గనమపురాతన చరితనందు
    భారతీయులెరుగు సృష్టి కారణంబు
    డాగెనణుగర్భమందజాండమ్ములెన్నొ


    ✍🏻ఇంద్రకంటి భార్గవ నృసింహ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    మట్టిఁ దిన్న కన్నయఁ బిల్చి మాతృమూర్తి
    చిన్ని నోటిఁ జూపుమనఁగ చెవి నులిమియు
    నెలరి విప్పఁ జూచితలచె, నిటుల నెటుల
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ?

    మత్తేభవిక్రీడితము
    క్షణమైనన్ సహియింప లేక వినుచున్ సంకర్షనున్ మాతయే
    యణువంచున్ తలపోయుచున్ బిలిచి కృష్ణయ్యన్ విలోకించి మృ
    త్కణమున్ గాకయె నోటినందు గనుచున్ దర్కించె, నెట్లెట్లు ని
    య్యణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో?

    రిప్లయితొలగించండి

  3. నోరు తెరవమటంచును నారి కోర
    తెరిచె కృష్ణుడా నోటను తరుణి గాంచె
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ
    యనువిధిసకల లోకాల నామె జూచె.

    ఫణియే పాన్పుగ గల్గినట్టి హరియే బాలుండుగా నింటిలో
    ప్రణయమ్మందున పెర్గువాడు మనునే భక్షించి నాడంచ టన్
    హృణితో నోటిని చూపమంచు నటనాయోషిత్తు తా గాంచగా
    యణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో.

    రిప్లయితొలగించండి


  4. శంకరాభరణం

    సమస్య .....16/12/2025

    “అణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో”

    మత్తేభ విక్రీడితము
    ******** *********

    క్షణమున్ నిల్వక వెన్న గోపికల వేశ్మమ్మందు దోచంగ దూ

    షణలన్ జేయుచుఁ గృష్ణు వెంటపడఁ దాఁ జక్కంగఁ బారున్ గదా!

    గణియింపన్ దరమౌనె లీలలను? లోకాలన్ గనన్ నోటిలో

    నణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  5. సూక్ష్మరీతిన నుండియు సోద్యమనుచు
    శాస్త్రవిదులు దెలిపిరచట శంకపడక
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ !
    వింత గ ననిపిం చును గాని విషయమదియ

    రిప్లయితొలగించండి
  6. హాలహలమును గ్రోలిన హరుడు తాను
    గరళమును నిల్పి యుంచెను గళమునందు
    విజ్ఞులు తెలిపియుండిరి వివరములను
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ

    అణువంతైనను లేదు సంశయము ప్రాణాధార మాశూలియే
    క్షణమైనన్ నిలువంగలేము మనకా సర్వజ్ఞుడౌ నాగ భూ
    షణుడే రక్షణమీయకున్న రయమున్ సంస్థానమే ప్రాప్తమౌ
    నణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో

    [అణువు = లేశము; అణువు = శివుఁడు]

    రిప్లయితొలగించండి
  7. ప్రణవంబే గళనాదబిందువయి
    సంరావించు నెబ్భంగినో
    ప్రణుతింగాంచుచు విశ్వచేతనకు
    నీ ప్రాణంబె సంభావ్యమౌ
    గుణమందొప్పుచు సర్వజీవులకు
    బాగున్ గూర్చ నీ దేహ ప్ర
    త్యణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబు లెన్నెన్నియో!

    రిప్లయితొలగించండి
  8. (శాస్త్రము ప్రకారము అణువు లోపల నెన్నియో దాగి ఉన్నవండి. 1895 నుండి జరుగుతున్న పరిశోధనల సారాంశము. ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నదండి)

    తే॥ శాస్త్ర పరిశోధన వరల సౌఖ్యముఁ గన
    జనులు కనుఁగొని రెన్నియో జగతి యందు
    నమ్మశక్యముఁ గానివి నగ్నమయ్యె
    డాఁగె నణు గర్భమందజాండమ్ము లెన్నొ

    మ॥ అణువుల్ చిత్ర విచిత్ర ప్రాథమికమున్ ఖ్యాతంబునౌ రేణువుల్
    కణముల్ గూర్చఁగ సంభవించునని వ్యాఖ్యానించి శాస్త్రజ్ఞులే
    పణమున్ బెట్టుచు నిర్ధరించిరి యటుల్ ప్రాణమ్ములన్ జూడఁగా
    నణు గర్భంబున దాగియుండె గద బ్రహ్మాండంబులెన్నెన్నియో

    వ్యాఖ్యానించు వివరించు

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:కథయు,మాటలు, పాటలు గలసి చిన్న

    ఫిల్ము చుట్టలో దాగె గన్ పించ కుండ
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ
    యనెడు తత్త్వమ్ము సత్యమే యనెడు రీతి
    (అణువు లో బ్రహ్మాందం ఉన్న దనేది తత్త్వశాస్త్రం. సినిమా మొత్తం ఒక ఫిల్మ్ చుట్ట లో సూక్ష్మరూపం లో ఇమిడి ఉండటం అటువంటిదే.)

    రిప్లయితొలగించండి
  10. మ:గణముల్,బ్రాసలు, కల్పనల్, పలు నలంకారమ్ములున్,గుండె నే
    క్షణమున్ బొంగుచు బైకి వచ్చును మహాకావ్యమ్ములై, బ్రహ్మనై
    గణుతింపగ నసాధ్యమైన సృజనల్ గావింతు, హృద్రూపమౌ
    నణు గర్భంబున దాగియుండెఁ గద బ్రహ్మాండంబులెన్నెన్నియో”
    (కవి హృదయం అనే అణువులో అనేక సృజనలు జరుగుతాయి.కవి ఒక బ్రహ్మ వంటి వాడు.)

    రిప్లయితొలగించండి
  11. మన్ను తింటున్న కృష్ణుణ్ణి మంద లించి
    చూ చె ను యశోద నోటిని చోద్య ముగను
    డా గె న ణు గర్భ మంద జాడ మ్ము లె న్నొ
    యనుచు నచ్చె రు వందె తా నద్భు తము గ

    రిప్లయితొలగించండి
  12. సమస్య
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ

    తే॥గీ
    ఊడలూనిన శిఖికైన నూత విత్తు!
    పుల్లు కణముగాదె జగతి పుట్టినిల్లు!
    ఈశు లీలతోడ జగతి వెలుగుచుండ
    డాఁగె నణు గర్భమం దజాండమ్ములెన్నొ

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మన్ను తింటివా చూపించ మనుచు తల్లి
    యడుగ నోరు తెరవ కృష్ణుడంత,కని య
    శోద సర్వ లోకములను చోద్యమందె
    డాగె నణు గర్భమం దజాండమ్ము లెన్నొ.

    రిప్లయితొలగించండి
  14. అడుగ మన్నేల తింటివి యంచు నమ్మ
    చిన్ని కృష్ణుఁడు చూపింపఁ జిత్రముగను
    బోటి గాంచె లోకమ్ముల నోటి లోన
    డాఁగె నణు గర్భమం దజాండమ్ము లెన్నొ


    క్షణ మాత్రమ్మును నాఁగ కుండఁ ద్రిజగత్సంచారముల్ సేయుచున్
    గణనాతీతము గాంచి యూహలను వీకం జిన్ని డెందమ్ము దా
    నణఁచున్ లోకము లన్నిటిం దనదు గర్భాండమ్మునన్ వింతగా
    నణు గర్భంబున దాఁగి యుండెఁ గద బ్రహ్మాండంబు లెన్నెన్నియో

    రిప్లయితొలగించండి