(1)కం:ఫణిధరునకు సతిగా స ద్గుణవతి యౌ గిరిజ రాగ గురుతరభక్తిన్ గణములుగ వేడ్క బర్వత గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
(2)చం: గణగణ యంచు నా డమరుకధ్వని జేయుచు,నాట్య కేళి జృం భణ మొనరించు నా శివుని పాణి గ్రహించగ దల్చె గౌరి త త్క్షణములె ధర్మ రక్ష కని తల్చుచు భక్తిగ శైలమాలికా గణపతి పుత్రి పెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌను లెల్లరున్ (శైలమాలికా గణపతి పుత్రి =పర్వతరాజపుత్రి.ఆ వివాహం కుమారస్వామి జననానికి రాక్షససంహారానికి అని తెలిసి మునులు వచ్చారు.)
కందం
రిప్లయితొలగించండిగుణవతిగ సేవలిడ, సుర
గణంపు వినతిని, నపర్ణఁ గాలుఁడు నొప్పన్
ప్రణతుల హిమశైలప్రాం
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
చంపకమాల
తొలగించండిప్రణతుల శైవ కార్ముకముఁ బాటిగ నెత్తఁగ రామచంద్రుడున్
గణగణ మ్రోగ గంటలట కాలిడి భార్గవుఁడొప్పినంతటన్
గుణవతి సీత మెచ్చగను గూర్చఁగఁ దా జనకుండు సత్ప్రజా
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
గణపతి యనుఒక బాపడు
రిప్లయితొలగించండిపణములు సమకూర్చెనుసుత పరిణయమునకై
రుణములు స్నేహితు లివ్వగ
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
వినుడు సుజనులార గిరిజ
రిప్లయితొలగించండిమనువాడగ పరమశివుని మదిఁగోరినదై
చనుదెంచఁగ హిమశైలాం
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
రిప్లయితొలగించండి*(గణపతి అను శిష్యునికి అతని గురువు చెబుతున్న మాటలుగా )*
ఫణి భూషణు డొప్పెను సుర
గణమ్ము వేడ మనువాడ కాళిని యా స
ద్గుణశీలి తండ్రి పిలువగ
గణపతి, సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్.
ఫణిధరు జేరిదేవతలు ప్రార్థన జేయ తపమ్ము వీడి స
ద్గుణవతి కొండచూలిదగు కోరిక దీర్చుట కొప్పుకొన్న భీ
షణునకు దారకర్మమది శాంభవి తోనని తండ్రి పిల్వగా
గణపతి, పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్.
అనిమిషుల యీశుడింద్రుని
రిప్లయితొలగించండియనువగు స్థానీయమయిన యమరావతి నం
దన వనమందున యా సుర
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్”
గణపతి సాధకుండతడు కాళికి పూజలు సేయుభక్తుడున్
రిప్లయితొలగించండిగణపతి కూతురౌసరళ కమ్మనిగాత్రము గల్గియున్నదిన్
గణపతి అగ్నిహోత్రమును గైకొన వేడగ వైదికమ్ముగన్
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
గుణవతి శైలసుతను కా
రిప్లయితొలగించండిరణకారణుడే గ్రహించె ప్రాణేశ్వరిగా
గణియింపనెటుల కోల్పడు
గణపతి, సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
అణకువ తోడ శాంతి హృదయార్పణ చేసెను శూలపాణికే
ఫణిధరుడే ప్రసన్నుడయి పర్వత పుత్రిని జేరవచ్చి యా
గుణవతి నాదరించె, మరి కోల్పడు నెట్టుల పుట్టలేదుగా
గణపతి, పుత్రి పెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
[పుత్రి = పార్వతి; కోల్పడు = అగపించు ]
(1)కం:ఫణిధరునకు సతిగా స
రిప్లయితొలగించండిద్గుణవతి యౌ గిరిజ రాగ గురుతరభక్తిన్
గణములుగ వేడ్క బర్వత
గణపతి సుత పెండ్లిఁగనఁగఁ గదలిరి దివిజుల్
(2)చం: గణగణ యంచు నా డమరుకధ్వని జేయుచు,నాట్య కేళి జృం
భణ మొనరించు నా శివుని పాణి గ్రహించగ దల్చె గౌరి త
త్క్షణములె ధర్మ రక్ష కని తల్చుచు భక్తిగ శైలమాలికా
గణపతి పుత్రి పెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌను లెల్లరున్
(శైలమాలికా గణపతి పుత్రి =పర్వతరాజపుత్రి.ఆ వివాహం కుమారస్వామి జననానికి రాక్షససంహారానికి అని తెలిసి మునులు వచ్చారు.)
గుణవతి శైలరాజసుత కోరి వరించెను కాలకంఠునిం
రిప్లయితొలగించండిబొనరిచె పూజలుందపము పొందఁగ నీశ్వరునామె భర్తగా
తన తపముల్ఫలించె పతితానగు నీశుడటంచు గ్రావపుం
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
ప్రణయము పుట్టెను శివునకు
రిప్లయితొలగించండిగుణవతి గిరిజకును జరిగె కూరిమి మను వే
చని రి గ నయ్యె డ పర్వత
గణ పతి సుత పెండ్లి గనగ గదలిరి దివిజుల్
ప్రణతు లొసఁగి పిల్చిన కా
రిప్లయితొలగించండిరణమునఁ దమ దోడు రాఁగ రజనీ జాతుల్
మణి భూషాలంకారులు
గణపతి సుత పెండ్లిఁ గనఁగఁ గదలిరి దివిజుల్
[దివిజులు = పగలు పుట్టిన వారు]
గణన కతీతమెన్నఁగ జగమ్మున వేంకట నాథు పెండ్లి స
ద్గుణముల రాశి పద్మ సుమ కోమలి వెల్గఁగఁ బెండ్లి కూఁతురై
ప్రణతు లొసంగి పిల్వఁగ నభఃపతి నాముఁడె యగ్రగామి కా
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గుణధాముడు శ్రీరాముడు
ఫణిభూషణు విల్లు విరువ పరవశమున మా
లను వేసె జానకి ప్రజా
గణపతి సుత పెండ్లిఁ గనగఁ గదలిరి దివిజుల్.