18-12-2025 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దాత నిలుచు బుద్బుదంబు వోలె”(లేదా...)“దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ”
శా.స్రోతోవేగము భంగి కీర్తి క్షితిపై శోభించి నిండారగా వాతూలాహి సమాన దుర్జనులకున్ బల్విత్తముం గూర్చి నానా తోషంబులతోడ తూగి ప్రజలన్ నష్టంబులో ముంచు త ద్దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ !
జరుగినట్టి దాని సత్యమునంతనుదాత , నిలుచు బుద్బుదంబు వోలె ,యెపుడు బయలుపర్చ నెరుకలేనందున వాని బ్రతిమలాడి వద్దనదగు
దాన మీయవలయు దనియగ పేదలుదాని వలన కలుగు ధర్మసిద్ధి!పాత్రత గనలేక పరగ దానమిడగదాత నిలుచు బుద్బుదంబు వోలె!
శక్తి నెఱగి పేద జనులకు చేసెడి దాన మదియె తెచ్చు దండి కీర్తి తనదు శక్తి మించి దానంబు జీసెడి దాత నిలుచు బుద్బుదంబు వోలె.*(శుక్రుడు బలితో పలికిన మాటలు )*నీ తాహత్తు నెఱుంగకుంటివి కదా నీశత్రువాతండిటన్ చేతిన్ జాపిన విప్రు డాతడెగనన్ శ్రీనాథుడాతండె గా సాతిన్ గోరుచు వచ్చినట్టి యరికిన్ సత్రమ్ము నే జేసె డిన్ దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మభ్యపెట్ట గోరి మతదాత లెల్లరిన్ పంచి డబ్బు వివిధ పథకములను,ప్రజ్ఞ లేని, సుపరి పాలన చేయని,దాత నిలుచు బుద్బుదంబు వోలె
దాన గుణము వలన దాత యశమునొందుదాన గుణము కయిన తప్పదు మితిదానమతిశయింప దైన్యమే కొదవడు దాత నిలుచు బుద్బుదంబు వోలెప్రీతిన్ దానమొసంగు వారినెపుడున్ వేనోళ్ళ శ్లాఘించినన్దాతృత్వమ్ము కడున్ బ్రమాదకరమై తగ్గించు నీసంపదన్దాతల్ తామిడకున్న హద్దు మిగులున్ దారిద్ర్య బాధల్ మహాదాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
ఆ.వె:తాత పైన బ్రేమ ధర్మమే నీకుంట,గాని వైద్య మింక గష్ట మోయియెంత వైద్యమున్న నీ నాడె శ్రమ తోడదాత నిలుచు బుద్బుదంబు వోలె”("తాత" సరళాదేశము తో "దాత")
అప్పుడు తోడఁ - ఇట్టు లరసున్న నుంచవలెనండి. తాత అన్న యర్థమే వచ్చును
ఆ॥ ధర్మబద్ధుఁడైన ధరనపాత్రులకిడుదానమెపుడు హితముఁ దాల్చదయ్యమితము నెరగ కున్న మిగుల దుఃఖమొదవుదాత నిలుచు బుద్బుదంబు వోలెశా॥ నీతిన్ బాయక ధర్మవర్తనమునన్ నిత్యమ్ము దీపించఁగన్దాతల్ పేదల యార్తిఁ దీర్చి యటులుద్భాసిల్లఁగన్ సర్వదాదాతృత్వమ్ము నపాత్రమైన విరియున్ దౌర్భాగ్య మేపారుచున్దాతల్ నిల్తురు బద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
శా:దాతృత్వమ్మును జూపి దైవమునకై దానమ్ము లీయంగ మాతాతల్ వారిని దల్చ రెన్నడును నేతల్,వారి చుట్టమ్ములున్నీతిన్ వీడుచు దోచి వేసిరి గుడిన్,నిర్లజ్జగా నే డిటన్దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ(గుళ్లకి భూములు దానా లిచ్చిన వారిని తలచ నైనా తలచరు.పలుకుబడి గల వాళ్లు ధర్మకర్తలుగా పెత్తనాలు చేసి దోచేస్తూ ఉంటారు.చివరికి దాతలు పష్చాత్తాపము చెందుతారు.)
దాతృత్వమ్మున ఖ్యాతిఁగాంచెనిలలో ధన్యాత్ముఁడౌ కర్ణుడాదాతృత్వమ్మె పరాభవమ్ములను సంధానించె శాపమ్ములైదాతృత్వమ్మున పాత్రతన్ గననిచో ధ్వంసంబు ప్రాప్తంబగున్దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
దాన గుణముచేత తల్లడము బడిరిగాదె కర్ణుఁడు బలి యాది ఘనులుదానమడుగువారి దౌర్జన్య ఫలముగాదాత నిలుచు బుద్బుదంబు వోలె
చేతి కెముక లేక చేసెడి దానాలు పాత్ర మెరుగ కుండ పంచు వేళ దాత నిలుచు బుద్భు దంబు వోలె కాన దెలిసి మనుట కమ్మ నగును
ధనమె మూల మంద్రు తత్త్వజ్ఞు లెల్లరు తన్ను మాలి నట్టి ధర్మ మేల స్థిరములే తలంప సిరులు సంపత్తిల దాత! నిలుచు బుద్బుదంబు వోలె చేతో మోదము సన్నగిల్లు వినఁగాఁ జీత్కారముల్ నిత్యముంబ్రాతః కాలము లేవఁ గష్ట మగు దుష్ప్రాప్తంబులౌ నిద్రలే చేతుల్ కాళ్లును గంప మందు సత మిస్సీ వార్ధకంబేర్పడం దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ [తానము = స్నానము]
ఆటవెలదిప్రాణహాని మఱచి రవి సుతుండు హరికిదానమిడ కవచము ధరను గూలెదానమొసఁగు చుండ తన సేమము మఱచిదాత నిలుచు బుద్బుదంబు వోలె!శార్దూలవిక్రీడితమునీతిన్ వీడియు మారువేషమున నందెన్ దానమున్ వజ్రియేభీతిన్ కర్ణుని బొందలమ్ము సుతుఁడౌ భీభత్సు శ్రేయంబునన్జేతిన్ శల్యములేని రీతి తనదున్ సేమమ్ము దానమ్మిడన్దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్! దానమ్ము దుష్కార్యమౌ!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.శక్తి నెఱిగి చేయు జనులకు దానముగొప్ప పేరు తెచ్చు కువలయానచేయ శక్తి మించి చిన దానమైననుదాత నిలుచు బుద్బుదంబు వోలె.
శా.
రిప్లయితొలగించండిస్రోతోవేగము భంగి కీర్తి క్షితిపై శోభించి నిండారగా
వాతూలాహి సమాన దుర్జనులకున్ బల్విత్తముం గూర్చి నా
నా తోషంబులతోడ తూగి ప్రజలన్ నష్టంబులో ముంచు త
ద్దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ !
జరుగినట్టి దాని సత్యమునంతను
రిప్లయితొలగించండిదాత , నిలుచు బుద్బుదంబు వోలె ,
యెపుడు బయలుపర్చ నెరుకలేనందున
వాని బ్రతిమలాడి వద్దనదగు
దాన మీయవలయు దనియగ పేదలు
రిప్లయితొలగించండిదాని వలన కలుగు ధర్మసిద్ధి!
పాత్రత గనలేక పరగ దానమిడగ
దాత నిలుచు బుద్బుదంబు వోలె!
రిప్లయితొలగించండిశక్తి నెఱగి పేద జనులకు చేసెడి
దాన మదియె తెచ్చు దండి కీర్తి
తనదు శక్తి మించి దానంబు జీసెడి
దాత నిలుచు బుద్బుదంబు వోలె.
*(శుక్రుడు బలితో పలికిన మాటలు )*
నీ తాహత్తు నెఱుంగకుంటివి కదా నీశత్రువాతండిటన్
చేతిన్ జాపిన విప్రు డాతడెగనన్ శ్రీనాథుడాతండె గా
సాతిన్ గోరుచు వచ్చినట్టి యరికిన్ సత్రమ్ము నే జేసె డిన్
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమభ్యపెట్ట గోరి మతదాత లెల్లరిన్
రిప్లయితొలగించండిపంచి డబ్బు వివిధ పథకములను,
ప్రజ్ఞ లేని, సుపరి పాలన చేయని,
దాత నిలుచు బుద్బుదంబు వోలె
దాన గుణము వలన దాత యశమునొందు
రిప్లయితొలగించండిదాన గుణము కయిన తప్పదు మితి
దానమతిశయింప దైన్యమే కొదవడు
దాత నిలుచు బుద్బుదంబు వోలె
ప్రీతిన్ దానమొసంగు వారినెపుడున్ వేనోళ్ళ శ్లాఘించినన్
దాతృత్వమ్ము కడున్ బ్రమాదకరమై తగ్గించు నీసంపదన్
దాతల్ తామిడకున్న హద్దు మిగులున్ దారిద్ర్య బాధల్ మహా
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
ఆ.వె:తాత పైన బ్రేమ ధర్మమే నీకుంట,
రిప్లయితొలగించండిగాని వైద్య మింక గష్ట మోయి
యెంత వైద్యమున్న నీ నాడె శ్రమ తోడ
దాత నిలుచు బుద్బుదంబు వోలె”
("తాత" సరళాదేశము తో "దాత")
అప్పుడు తోడఁ - ఇట్టు లరసున్న నుంచవలెనండి. తాత అన్న యర్థమే వచ్చును
తొలగించండిఆ॥ ధర్మబద్ధుఁడైన ధరనపాత్రులకిడు
రిప్లయితొలగించండిదానమెపుడు హితముఁ దాల్చదయ్య
మితము నెరగ కున్న మిగుల దుఃఖమొదవు
దాత నిలుచు బుద్బుదంబు వోలె
శా॥ నీతిన్ బాయక ధర్మవర్తనమునన్ నిత్యమ్ము దీపించఁగన్
దాతల్ పేదల యార్తిఁ దీర్చి యటులుద్భాసిల్లఁగన్ సర్వదా
దాతృత్వమ్ము నపాత్రమైన విరియున్ దౌర్భాగ్య మేపారుచున్
దాతల్ నిల్తురు బద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
శా:దాతృత్వమ్మును జూపి దైవమునకై దానమ్ము లీయంగ మా
రిప్లయితొలగించండితాతల్ వారిని దల్చ రెన్నడును నేతల్,వారి చుట్టమ్ములున్
నీతిన్ వీడుచు దోచి వేసిరి గుడిన్,నిర్లజ్జగా నే డిటన్
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
(గుళ్లకి భూములు దానా లిచ్చిన వారిని తలచ నైనా తలచరు.పలుకుబడి గల వాళ్లు ధర్మకర్తలుగా పెత్తనాలు చేసి దోచేస్తూ ఉంటారు.చివరికి దాతలు పష్చాత్తాపము చెందుతారు.)
దాతృత్వమ్మున ఖ్యాతిఁగాంచెనిలలో ధన్యాత్ముఁడౌ కర్ణుడా
రిప్లయితొలగించండిదాతృత్వమ్మె పరాభవమ్ములను సంధానించె శాపమ్ములై
దాతృత్వమ్మున పాత్రతన్ గననిచో ధ్వంసంబు ప్రాప్తంబగున్
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
దాన గుణముచేత తల్లడము బడిరి
రిప్లయితొలగించండిగాదె కర్ణుఁడు బలి యాది ఘనులు
దానమడుగువారి దౌర్జన్య ఫలముగా
దాత నిలుచు బుద్బుదంబు వోలె
చేతి కెముక లేక చేసెడి దానాలు
రిప్లయితొలగించండిపాత్ర మెరుగ కుండ పంచు వేళ
దాత నిలుచు బుద్భు దంబు వోలె
కాన దెలిసి మనుట కమ్మ నగును
ధనమె మూల మంద్రు తత్త్వజ్ఞు లెల్లరు
రిప్లయితొలగించండితన్ను మాలి నట్టి ధర్మ మేల
స్థిరములే తలంప సిరులు సంపత్తిల
దాత! నిలుచు బుద్బుదంబు వోలె
చేతో మోదము సన్నగిల్లు వినఁగాఁ జీత్కారముల్ నిత్యముం
బ్రాతః కాలము లేవఁ గష్ట మగు దుష్ప్రాప్తంబులౌ నిద్రలే
చేతుల్ కాళ్లును గంప మందు సత మిస్సీ వార్ధకంబేర్పడం
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ
[తానము = స్నానము]
ఆటవెలది
రిప్లయితొలగించండిప్రాణహాని మఱచి రవి సుతుండు హరికి
దానమిడ కవచము ధరను గూలె
దానమొసఁగు చుండ తన సేమము మఱచి
దాత నిలుచు బుద్బుదంబు వోలె!
శార్దూలవిక్రీడితము
నీతిన్ వీడియు మారువేషమున నందెన్ దానమున్ వజ్రియే
భీతిన్ కర్ణుని బొందలమ్ము సుతుఁడౌ భీభత్సు శ్రేయంబునన్
జేతిన్ శల్యములేని రీతి తనదున్ సేమమ్ము దానమ్మిడన్
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్! దానమ్ము దుష్కార్యమౌ!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శక్తి నెఱిగి చేయు జనులకు దానము
గొప్ప పేరు తెచ్చు కువలయాన
చేయ శక్తి మించి చిన దానమైనను
దాత నిలుచు బుద్బుదంబు వోలె.