(2)మ: సిరియున్,గౌరియు నొక్కరే యనుచు దా జెప్పంగ నా తిక్కనన్ సరియే యంచని నేను వాణి నచటన్ జేర్చంగ నన్యాయమే? యరుదౌ ప్రార్థన నే నొనర్చితిని కావ్యమ్మందు నీ రీతిగన్ వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా” ( తిక్కన గారు శ్రీ యన గౌరినా బరగు అని ఇద్దరికి అద్వైతాన్ని కూర్చినప్పుడు నేను వాణిని కూడా కలిపితే తప్పా? నేను ఆమెని కూడా ఐక్యం చేసి కావ్యం లో ప్రార్థించాను. )
ద్విపద
రిప్లయితొలగించండివాణివై యొకచోట వాసిగా వెలసి
రాణివై పరమేశు ప్రాణసఖివన
రాణకెక్కితివె కొల్హాపురి రమగ
వీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ము
మత్తేభవిక్రీడితము
స్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!
వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివై
కురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!
మ.
రిప్లయితొలగించండిస్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం
గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా
ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !
రిప్లయితొలగించండిప్రాణ భాస్వంతపు వశవీవు నా పు
రాణ పురుషునకు ప్రాణ సఖి రమ
పాణిని పొత్తమున్ వాసిగ దాల్చు
వీణాధరీ, దుర్గ, విభవమ్ము లిమ్ము.
హరి డెందమ్మున నుందువో శివుని దేహార్ధంబునన్ నిల్తువో
యరవిందాసను నాననమ్ము వగు విద్యాదేవివో నీవు మా
మొర లాలింపగ రమ్ము వేగమున నంభోజాక్షి ధ్యానింతు నే
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా.
వాణివి నీవని వచియింతురమ్మ
రిప్లయితొలగించండిప్రాణ రక్షవు నీవు భ్రామరివమ్మ
క్షోణిపై వెలసిన గోమిని వమ్మ
వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము
గిరిపై నీగుడిఁ జేరి కొల్తుముగదా క్షేమంకరీ! శాంభవీ!
మరినీరూపము రోజుకొక్కటనుచున్ మాతంగి నిన్ దీర్చగా
పరమానందము గల్గజేయు దసరా భక్తాళి నేత్రాలకే
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా
[విజయవాడ దుర్గ గుడిలో దసరా వేడుకల్లో అమ్మవారి అలంకారములు రోజు కొక్క రీతిని జేయుట విదితమే]
ప్రాణ సఖి గ గౌరి పరమేశు సతి గ
రిప్లయితొలగించండిరాణ కెక్కి జగతి రాజిల్లు నటుల
రాణి గా పలు చోట్ల రమ్య మౌ రూప
వాణిగా వెలయదే వాంఛ దీర్ప
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిద్విపద
రిప్లయితొలగించండిగౌణంపు రీతి భాగ్యమ్మును,చదువు,
ప్రాణశక్తియు గల్గ పాలించి లక్ష్మి!
వీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ము
గా నొసంగుడు తల్లు లైన మీ రెపుడు
(క్రమాలంకారం లో ప్రార్థన. భాగ్యం ఇమ్మని లక్ష్మిని, చదువు ఇమ్మని వాణిని,శక్తి నిమ్మని దుర్గ ని ప్రార్థించినట్లు. )
(2)మ: సిరియున్,గౌరియు నొక్కరే యనుచు దా జెప్పంగ నా తిక్కనన్
రిప్లయితొలగించండిసరియే యంచని నేను వాణి నచటన్ జేర్చంగ నన్యాయమే?
యరుదౌ ప్రార్థన నే నొనర్చితిని కావ్యమ్మందు నీ రీతిగన్
వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా”
( తిక్కన గారు శ్రీ యన గౌరినా బరగు అని ఇద్దరికి అద్వైతాన్ని కూర్చినప్పుడు నేను వాణిని కూడా కలిపితే తప్పా? నేను ఆమెని కూడా ఐక్యం చేసి కావ్యం లో ప్రార్థించాను. )
ద్విపద.
రిప్లయితొలగించండిత్రాణమై మాకు నిత్యము కాచుచుండ,
వీణాధరీ, దుర్గ విభవమ్ము లిమ్ము
నిరతం బింపుగ నీకు మ్రొక్కెద మిలన్ నీరేజ పత్రేక్షణా
కరుణా దృక్కుల మమ్ము గావుమ సతీ కాత్యాయనీ బిడ్డలన్
హర మాయా మహి మాదిశక్తి సిత దుగ్దాంభోధి సంజాతవై
వరవీణా మృదు పాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్పుమా
వాణిగా నిన్ను శర్వాణిగా గొలుతు
రిప్లయితొలగించండివీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రాణివై నలువకు రాజిల్లినావు
వాణి నామమ్మున వాసి గన్నట్టి
పాణిని పొత్తమున్ పట్టినావమ్మ
వీణాధరీ!; దుర్గ! విభవమ్ము నిమ్ము.
సరసిజనేత్రివి చదువులతల్లి
రిప్లయితొలగించండినిరతముమామది నిలువుముదేవి
వాణి మాతానినువదలక కొలుతు
వీణాధరి దుర్గ విభవములిమ్ము
ద్విపద
రిప్లయితొలగించండిత్రాణ మొసగు తల్లి దమగను మమ్మ
వీణాధరీ దుర్గ విభవమ్ములిమ్ము
మ॥ నెరవై విశ్వము నందు నిండి దయతో నిత్యమ్ము పాలించుచున్
వరముల్ పొందుగ నాదిశక్తి యిడు సంభావించి సన్మార్గులై
ధరలో నెమ్మిని భక్తి వీడక సదా ధ్యానించి పల్కన్ రమా
వరవీణా పాణివై వరలు శార్వాణీ సిరుల్ గూర్చుమా!
త్రాణము రక్షణము