నిప్పులందు దూకెగద పునీత సీత స్వర్ణ దీధితి జన్మించె సత్యసంధ పవన సఖునితో వారిసంబంధమరయ ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
పాథము నందు దూకినది పావనియౌ కుజ రామపత్నియే పాథము నుండి పుట్టినది పాండవ గాదిలి ద్రౌపతేకదా గాథలు విప్పిచెప్పుగద కాంతల బంధము వేడివేల్పుతో మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో
తే॥ జానకియు ద్రౌపదియు ఘన సద్గుణ యుత వర్తనులు నయోనిజలౌచు వ్యథల నొంది భువిని సామ్యముఁ గాంచిన పొలుపుఁ గనఁగ ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
ఉ॥ గాథను గాంచి జానకిది కానల లోపల బాధలెంచఁగన్ బాథము నందు పుట్టి యటు పాండవ పత్నిగ సౌఖ్య మొందకన్ మాథము నందు కష్టపడి మన్ననఁ బొందుట యొక్క రీతియై మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పడో
పొలుపు విధము పాథము అగ్ని మాథము మార్గము
(ఇద్దరు ఒకే రకంగా కష్టపడుట వలన ఆసామ్య రూపములో అక్క చెల్లెండ్రు అనే భావనతో నండి)
ఉ;గాథల లోని సామ్యముల గాంచ నయోనిజ యైన సీత యే బాధల నెన్నొ పొందె వనవాసము లందున యాజ్ఞసేనియా బాధల బొందె, వారి పతిభక్తుల జన్మల తీరు జూడగా మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో ” (సీత, ద్రౌపది ఇద్దరూ అయోనిజలే. ఇరువురి జన్మలు ఉన్నత మైనవే.ఇరువురూ పతివ్రతలే. ఇద్దరూ వనవాసం బాధలు పొందిన వారే. కనుక ద్రౌపది సీతకి పోలిక లో చెల్లి వంటిదే. )
తేటగీతి
రిప్లయితొలగించండిఅన్న శ్రీరామచంద్రునిననుసరించి
లక్ష్మణుండు కానలకేగ రమ్య సుగుణ
మనగ నిదురనెంచిన 'నూర్మిళనెవర' నుచు?
ద్రౌపది యన, 'జానకికి సోదరియె కాదె'
తేటగీతి
భర్తవలదన్న కానల బాటనెంచి
యశము గన్నట్టి సీతమ్మ ననుసరించి
పతులతో వనములకేగు పథమునందు
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె!
నాథుడు చేయలేవనిన నర్మిలి తా వనవాసమెంచుచున్
గాధకు మూలమై యశము గాంచిన జానకి మార్గమెంచుచున్
నాథుల వెంట కానలకు నాతిగ సాగగఁ దత్పథమ్మునన్
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో!
వృత్తములో రెండవ పాదాది, 'గాథకు'
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసీత యగ్ని పరీక్ష తో చిచ్చు సుతగ
మారె, ద్రౌపది పుట్టె నంగారమందు
నిరువు రిటుల చూడగ వింత యేమి కనగ
ద్రౌపది యన జానాకికి సోదరియె కాదె.
నాథుడు కోరినంత ధరుణమ్మున దూకిన రామపత్ని యా
మైథిలి ధూమకేతునకు మాలిక యయ్యెను, భారతమ్మనే
గాథను జూడ ద్రోవదియు ఘాసి కొమార్తెయె కాదె కాంచగా
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో.
మగని యెంచు కొనె మొదట మైథిలి గద ,
రిప్లయితొలగించండిదానిని గని పై యుగమున దగిన దనుచు
దృపద సుతయు పాటించె , నీ తీరు జూడ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
నిప్పులందు దూకెగద పునీత సీత
రిప్లయితొలగించండిస్వర్ణ దీధితి జన్మించె సత్యసంధ
పవన సఖునితో వారిసంబంధమరయ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
పాథము నందు దూకినది పావనియౌ కుజ రామపత్నియే
పాథము నుండి పుట్టినది పాండవ గాదిలి ద్రౌపతేకదా
గాథలు విప్పిచెప్పుగద కాంతల బంధము వేడివేల్పుతో
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో
తే.గీ:ఎన్ని బాధల సైచియు నింత నింద
రిప్లయితొలగించండితమను జేయని పాంచాలి దలచి మురిసి
భీము డనె నన్నతో నెంతొ విజ్ఞత గల
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె”
వనము లందలి వసీయించి బాధ పడిరి
రిప్లయితొలగించండిపూత చరితల ని ద్దరి పోల్చి చూడ
కష్ట సుఖముల యందున కాంచ తెలియు
ద్రౌపది యన జానకికి సో దరి యె కాదె!
తే॥ జానకియు ద్రౌపదియు ఘన సద్గుణ యుత
రిప్లయితొలగించండివర్తనులు నయోనిజలౌచు వ్యథల నొంది
భువిని సామ్యముఁ గాంచిన పొలుపుఁ గనఁగ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
ఉ॥ గాథను గాంచి జానకిది కానల లోపల బాధలెంచఁగన్
బాథము నందు పుట్టి యటు పాండవ పత్నిగ సౌఖ్య మొందకన్
మాథము నందు కష్టపడి మన్ననఁ బొందుట యొక్క రీతియై
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పడో
పొలుపు విధము పాథము అగ్ని మాథము మార్గము
(ఇద్దరు ఒకే రకంగా కష్టపడుట వలన ఆసామ్య రూపములో అక్క చెల్లెండ్రు అనే భావనతో నండి)
మైథిలివోలె ద్రౌపదియు మాన్యతనొందిన సచ్చరిత్రయే
రిప్లయితొలగించండిబాధలనెన్నొ సైచి తన భర్తలతో వనవాసమేగె నీ
గాథల ధర్మరక్షణము కాంతల సామ్యముఁగాంచినంతటన్
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో
పతులతోగూడి తానేగె వనములకును
రిప్లయితొలగించండిధరణిజకు సాటి గొనముల ద్రౌపదియును
తరుణు లిరువురి తీరును తరచి చూడ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
ఉ;గాథల లోని సామ్యముల గాంచ నయోనిజ యైన సీత యే
రిప్లయితొలగించండిబాధల నెన్నొ పొందె వనవాసము లందున యాజ్ఞసేనియా
బాధల బొందె, వారి పతిభక్తుల జన్మల తీరు జూడగా
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో ”
(సీత, ద్రౌపది ఇద్దరూ అయోనిజలే. ఇరువురి జన్మలు ఉన్నత మైనవే.ఇరువురూ పతివ్రతలే. ఇద్దరూ వనవాసం బాధలు పొందిన వారే. కనుక ద్రౌపది సీతకి పోలిక లో చెల్లి వంటిదే. )
సీత త్రేతా యుగమ్మున ఖ్యాతి నంద
రిప్లయితొలగించండిద్రౌపది వడసె యశమును ద్వాపరమున
యాజ్ఞసేని పాతివ్రత్య మందుఁ గాంచ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె
నాథులతోఁ జరించిరి వనమ్ముల నిర్వురు గాంచఁ బూర్వ త
ద్గాథల నగ్నిగుండమునఁ గారణ జన్మము నందెఁ గృష్ణయే
మైథిలి యగ్నిగర్భ కిల మానిని వుట్టిన దక్కజమ్ముగా
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పాండురాజు కుమారుల పత్నియె గద
ద్రౌపది యన; జానకికి సోదరియె కాదె
యూర్మిళయు లక్ష్మణుని సతి నొప్పుగాను
పదియు నాలుగే ళ్లెడబాసె పతిని తాను.
అవని పుట్టిన సాధ్వియే అమ్మ సీత
రిప్లయితొలగించండిఅగ్నినుండి యుద్భవమొందె యాజ్ఞసేని
ధరన ధర్మము నిలుపగ దాల్చె తనువు
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె!
డా .అన్నపరెడ్డి వీర కుమారి
పాండు పుత్రుల కెల్లను పత్నియేను
రిప్లయితొలగించండి*“ద్రౌపది యన, జానకికి సోదరియె కాదె”*
ఊర్మిళయు త్రేత యుగమున నొప్పుగాను
దశరథునకు కోడళ్ళైరి ధరణియందు