4, మార్చి 2026, బుధవారం

సమస్య - 5398

5-3-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరినిఁ గని మకరము గడు వడంకె”
(లేదా...)
“కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే”

15 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    ఆయుధమ్ములేని హరిని లెక్కింపక
    పట్టు బిగిచియుఁ గరి పదము పైన,
    తరలి రాన్ వెనుక సుదర్శన చక్రంపు
    కరినిఁ గని మకరము గడు వడంకె!

    (కరి = గురి,లక్ష్యము)

    చంపకమాల
    కరమున శంఖుచక్రముల కంపన లేదన శౌరిఁ జూచియున్
    వెరువక కుంజరమ్ము కడు వేదనఁజెంద బిగించి పట్టునే
    తరలుచు వెంట వచ్చెడు సదర్శన చక్ర ప్రచండ వేగపున్
    గరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే!

    రిప్లయితొలగించండి


  2. నీరు లేని నదిని నిలువగ లేనంచు
    పారమందు తిరుగు పాళమందు
    పరుగు తోడ వచ్చు పర్వతమంటి పు
    ష్కరినిఁ గని మకరము గడు వడంకె.


    ధరణము లేని ద్వీపవతి దాళగ లేకను తీరమందునన్
    తిరుగుచు నున్న పాళమున దీప్తమటన్ దరుమంగ వేగమున్
    బరుగిడి వచ్చు పర్వతము వంటి భయంకర మైన నొక్క పు
    ష్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే.


    *(నీటిలోన మొసలి...... అను పద్య ఆధారము తో)*

    రిప్లయితొలగించండి
  3. సరసులోకి దిగిన సామజమును బట్టి
    లాగుచుండె కుంభి లాఘవమున
    శరణు వేడగ కరి తరలిన హరిని ను
    క్కరినిఁ గని మకరము గడు వడంకె

    సరసిని డిగ్గు పుష్కరిని సత్వర మేగని లాగుచుండె మీ
    నరము జలాంతరంబునకు నాగము లాగుచునుండె నొడ్డుకున్
    గరి మొర వెట్టినంతట పొకాలు పరేశుని కైటభారి ను
    క్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే

    రిప్లయితొలగించండి
  4. తరుణము కడచిన కతన నోపజాలని
    విరివగు గొద నొందు వేళ వచ్చె
    నెరనొసగెడు వాని కీడుజోడగు మరొ
    కరినిఁ గని మకరము గడు వడంకె

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఆ॥ నీటియందు మొసలి నిజ బలము విరియు
    నిలను జతికిలపడు నిక్కముగద
    గజము నడచు చుండ గరిమగ క్షమ పైనఁ
    గరినిఁ గని మకరము గడు వడంకె

    చం॥ సరగున నీటియందుఁ గరి శక్తిని మించు బలమ్ము నొందఁగన్
    వరలుచు వార్భటమ్మిలను బ్రాకుచుఁ బోరుట దుర్లభమ్మగున్
    దరుగఁగ లావు భీతిఁగను, స్థానము మారఁగ ధాత్రి యందునన్
    గరినిఁ గనంగనే మిగుల గాతర భావమునందె నక్రమే

    వార్భటము మొసలి

    రిప్లయితొలగించండి
  7. ఆ.వె:కరిని గావ రాగ హరి యొక్క క్షణములో
    నతడు పట్టినట్టి యాయుధమగు
    నా సుదర్శనమ్ము,నఘ యూధ విధ్వంస
    కరినిఁ గని మకరము గడు వడంకె”

    రిప్లయితొలగించండి
  8. కరిని గని మకరి గడు వడంకెడిరీతి
    మకరని గని కరియు మలయుచుండ
    మకరి నోట చిక్కిన కరి మ్రాన్పడి మొరలిడ
    కరుణ జూప వచ్చె కౌస్తుభ ధారి ( కైట భారి)


    కరినిఁ గని మకరము గడు వడంకెడి రీతి
    మకరిని గని కరియు గడు వడంకె;
    నొకరి గెలువ నొకరు నుగ్రులై పోరున
    బెనగి రొకరినొకరు బెట్టుగాను

    అన్నపరెడ్డి వీర కుమారి

    రిప్లయితొలగించండి
  9. చం;హరియె హుటాహుటిన్ గదలి యాత్రత తోడ సుదర్శనమ్ము నే
    కరమున దాల్చి, దాని దన కంఠము పై గురి వెట్టి నంత న
    చ్చెరు విడు దివ్య తేజమున, చెండగ వచ్చెడు నట్టి యా భయం
    కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావమునందె నక్రమే”

    రిప్లయితొలగించండి
  10. క్రమాలంకారం లో ---
    జలము గ్రోల వచ్చు సామాజ మును బట్టి
    రెవరు? వెరచె మిగుల నెవరు విష్ణు
    చక్రము గని తాను చకిత మై మడుగున?
    కరిని గని మకరము :: గడు వడo కె

    రిప్లయితొలగించండి
  11. దరినిఁ జేరి నంత దర్పం బడరఁగ మ
    కరము కనఁబడె వెస ఘన మృగమ్ము
    హరి మృగేంద్రు సకల కరి రాణ్నిచయ భయం
    కరినిఁ గని మకరము గడు వడంకె


    కరివర ఘోర నక్రముల కయ్యము నందు జయింప లేక యా
    కరి హరి నంతఁ దన్ను దగఁ గావఁగ రమ్మని వేఁడ వచ్చినన్
    హరి శిత చక్ర హస్తు సుజ నావను రక్షిత తప్త దేహ వ
    త్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావము నందె నక్రమే

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నీటి నుంచి వచ్చి నేల పైకి మొసలి
    గజము వచ్చుచుండ గాంచినంత
    జ్ఞప్తి వచ్చి మునుపు జరిగిన గాథయు
    కరినిఁ గని మకరము గడు వడంకె.

    రిప్లయితొలగించండి
  13. డా బల్లూరి ఉమాదేవి

    సరసునందుచేరిజలముగ్రోలెడునేళ
    దంతిసంతుతోడ తరలిరాగ
    ననుసరించి చక్రి యడుగులిడుచునుండ
    *"కరినిఁ గని మకరము గడు వడంకె”*

    రిప్లయితొలగించండి