ఒల్లక యే పని పాటలఁ గల్లరి సంతతము గోరుఁ గలిమి కొఱకు, నీ ర్పల్లమునకుఁ బాఱు పగిది, నిల్లరికము నందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
తల్లడిలంగ నేల పరితాపము సెందఁగ నేల నిక్కమై చెల్లును నాదు మాట విను జిక్కులు గల్గవు నమ్ము మిత్రమా యుల్లము నందు మాన మది యుండక సుంత చరించు వాండ్ర కీ యిల్లరికంబు నందుఁ గల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికల్ల యనరాదిది నిజమె ,
రిప్లయితొలగించండియిల్లాలు దనయిలు విడక నెలమిని బొందన్
చెల్లును కోరికలన్నియు
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
రిప్లయితొలగించండితల్లిని దండ్రిని వీడుచు
ముల్లె లభించునని భూరి మోదము తోడన్
హల్లోహలము వలదనిన
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్.
తల్లిని దండ్రినిన్ విడిచి దాసుని గానుపరాయి కొంపలో
నల్లుని గౌరవమ్మదియె యందక పోయిన నేమి భూరిగా
ముల్లెలభించునంచు కడు మోదముతో విడ స్వాభి మానమే
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్.
పెల్లుగ కష్టమొందకనె పిండము జక్కగ సాగదీ యగన్
రిప్లయితొలగించండిచల్లగ మామసంపదను సాపడు చుండనొప్పీ , కో
కొల్లల కావ్యక ల్పనము గూర్చుచు నుండుట వీలుగల్గు నీ
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్”
తల్లికితండ్రికి నొకతై
రిప్లయితొలగించండిపిల్లలు మరిలేకయున్న ప్రియ గృహమునకున్
సల్లలితంబుగ తరలిన
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
వల్లభ తల్లిదండ్రులకు ప్రాణసమంబగు నొక్క పుత్రికై
చెల్లెలు నక్కలేనిదయి చేకుఱు భ్రాతలు శూన్యమైనచో
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
పల్లకి మోతలే పొసగు వల్లభుడై తరియించు వానికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య : “ఇల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్”
రిప్లయితొలగించండికం. అల్లన ప్రేమించి సిరుల
వెల్లువగల పడుచుకేలు వేడుకఁగొని తా
నొల్లమినోర్చుచు బ్రతికిన
*నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్*
ఎల్లలు లేని స్వతంత్రము
రిప్లయితొలగించండియిల్లరికము తానొసంగు నింటల్లునకున్
తల్లడములు దరిచేరవు
యిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
ఇల్లరికంపు టల్లునకు నెన్నఁడు కష్టములుండబోవు తా
రిప్లయితొలగించండినెల్లలులేని యర్మిలిని యీప్సిత సిద్ధిని పొందు, నల్లునిన్
చల్లగ జూడ నెల్లరును సంపదలందున దేలియాడు నా
యిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
కం॥ అల్లునకు బ్రహ్మరథమును
రిప్లయితొలగించండిమల్లెల వలె కోమలియగు మానిని సుతనున్
జల్లఁగ నిడి పట్టెదమన
నిల్లరికమునందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
ఉ॥ అల్లుడనంగ మాన్యతయు నంతకు మించిన యాస్తిమంతులున్
మల్లెల వోలె కోమలిగ మక్కువ నొందిన యొక్క కూతురున్
దల్లడ మొందకుండ తమ దాపున నుందువ యంచుఁ గోరఁగా
నిల్లరికంబునందుఁ గలదెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
అల్లుని గ మామ యింటను
రిప్లయితొలగించండితల్ల డ పడ కుండ దాను దైర్యము తొడన్
చెల్లెడి రూక గ నుండగ
నిల్ల రికము నందు గలుగు నె న్నొ సుఖంబుల్
ఒల్లక యే పని పాటలఁ
రిప్లయితొలగించండిగల్లరి సంతతము గోరుఁ గలిమి కొఱకు, నీ
ర్పల్లమునకుఁ బాఱు పగిది,
నిల్లరికము నందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్
తల్లడిలంగ నేల పరితాపము సెందఁగ నేల నిక్కమై
చెల్లును నాదు మాట విను జిక్కులు గల్గవు నమ్ము మిత్రమా
యుల్లము నందు మాన మది యుండక సుంత చరించు వాండ్ర కీ
యిల్లరికంబు నందుఁ గల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
చెల్లీ! సత్యమె కదయిది
రిప్లయితొలగించండియిల్లరికమునందుఁగలుఁగు నెన్నొ సుఖంబుల్
యిల్లాలి కౌగిలింతల
నెల్లప్పుఁడు పొందవచ్చు నెత్తఱి నైనన్
ఇల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
రిప్లయితొలగించండికల్లయుగాదుసత్యమది కాంతను జూచుచు నుండ వచ్చుగా
బిల్లల పుట్టుకై వడిని ప్రేమను బంచుచు జీవకోటినిన్
బల్లకి మోతనా పగిది పైరవి లీలను జేయ వీలగున్
అల్లుని గౌరవించుచు నయమ్మున గాంచుచు నున్న యత్తయున్
రిప్లయితొలగించండికల్లలెరుంగ నట్టి సతి కమ్మని భోజన మిచ్చి మించుచున్
మల్లెలు దాల్చి రాతిరి సమాగమమందు సుఖమ్ము దేల్చినన్
ఇల్లిరకంబునందుగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
కందం
రిప్లయితొలగించండికొల్లగ రాబడి నిచ్చెడి
దెల్లఁ గనెడు పెత్తనంబు నింపగు సుతతో
నుల్లమలరనిడఁ గలలో
నిల్లరికమునందుఁ గలుగు నెన్నొ సుఖంబుల్
ఉత్పలమాల
కొల్లగఁ జిందు రాబడిని గూర్చెడు వర్తక వ్యాపకంబుపై
చెల్లెడు పెత్తనంబులను, శ్రీరమ రూపిణి కన్నకూతుతో
నుల్లము సంతసింపనిడ నొప్పిన వేళల స్వప్నసీమలో
నిల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అల్లుడె కొడుకని తలచుచు
పిల్లనొసగి భూరిగాను పెండ్లిని చేసెన్
ఇల్లును సంపద లివ్వగ
నిల్లరికమునందుఁ గలుగు నెన్నొ సుఖంబుల్.
అల్లుడెతమకికకొడుకని
రిప్లయితొలగించండిఉల్లము నందున తలచుచు నుత్సాహముతో
పిల్లనొసగిచక్కగగన
నిల్లరికము నందు గలుగు నెన్నొ సుఖంబుల్