16, మార్చి 2026, సోమవారం

సమస్య - 5410

17-3-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”
(లేదా...)
“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”

17 కామెంట్‌లు:

  1. కందం
    ఐహిక సుఖముల నొసఁగుచు
    దాహము తీర్చక గడింప తహతహ రేపున్
    మోహపడక ధనమున సం
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్

    ఉత్పలమాల
    ఐహిక సౌఖ్యముల్ బడయ నందరుకోరు ధనమ్ము పొందుటన్
    దాహము తీర్చకే కుతిని నర్మిలి పెంచునునంతకంతకున్
    మోహము సెందకే మితియె ముఖ్యమటంచు గడించుటందు సం
    దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో!



    రిప్లయితొలగించండి
  2. తాహతును మీరు కోర్కెల
    మోహితుడై మిగులకస్తి మొగపడి యుండన్
    గేహముగనెంచు యాత్మకు
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”

    రిప్లయితొలగించండి
  3. డా బల్లూరి ఉమాదేవి

    మోహము చూపక సతతము
    నైహికబంధములపట్ల ,నచ్యుతు గొలువన్
    నాహరినేనమ్ముచుసం
    *“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”*



    దేహముశాశ్వతమ్మనుచుతీరుగ చేసిన దుష్ట కార్యముల్
    మోహముతోడతప్పదిక ముప్పను మాటను మర్వకన్ సదా
    సోహపుభావనల్ విడిచి చూచుచు నెల్లర మంచిగాను, సం
    *“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”*




    రిప్లయితొలగించండి

  4. ఐహిక సుఖముల పై వ్యా
    మోహమ్ము కలిగిన వారె పుడమి నరులనన్
    ద్రోహులు దుర్మతు లను సం
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్.


    ఐహిక మైన సౌఖ్యముల నర్మిలి పొందుట యందు హెచ్చు వ్యా
    మోహము కల్గి యీశ్వరుడు మోక్షము గూర్చి వచించు వారలన్
    ద్రోహులటంచు సంపదల దోచెడి మార్గమె వారి కంచు సం
    దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో.

    రిప్లయితొలగించండి
  5. ఊహల చిందులతో ను
    త్సాహము పొంగారు వేళ తన చిత్తములో
    మోహముఁ బోనొత్తెడు సం
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్

    ఊహలు చిందులేసి మధురోహల చిక్కిన మానసమ్ము ను
    త్సాహము పొంగులెత్తి మరి తప్పులు సేయగ నెంచినంతనే
    మోహమునే జయింపమను మోసపు మాటలు కల్గజేయు సం
    దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో

    రిప్లయితొలగించండి
  6. దేహము గలుగు వరకు సం
    దోహముగా సందియములు దొలుచును మదినే
    దేహికి మది నెట్టన సం
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్

    రిప్లయితొలగించండి
  7. కం॥ మోహమొ నిజమొ తెలియునొకొ
    దేహము వీడినఁ గలుఁగు బదింబది సుఖముల్
    దేహి మొఱకుఁ డెఱుఁగ వశమె
    సాహసమొనరించ నాకు శక్య మగునొకో

    ఉ॥ దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో
    దేహియె ధారుణిన్ గనిన దీపిలు విత్తముఁ బుణ్య రూపునన్
    దోహద కారియౌ ననిరి దూఁకొన సౌఖ్యము నాకమందునన్
    మోహమొ నిక్కమో యెఱుఁగ మూఢుని శక్తికి సాధ్యమౌనొకో!

    మొఱకుడు మూర్ఖుడు దూకొను పొందు

    (నాలాంటి వారికిది శక్తిని మించిన విషయమని అండి)

    రిప్లయితొలగించండి
  8. ఐహిక సుఖాలు నిజమని
    మోహ వ శంబున మునిగియు మూఢ త తోడ న్
    దేహము శాశ్వత మను సం
    దేహము వీడిన గలుగు బది o బది సుఖము ల్

    రిప్లయితొలగించండి

  9. కం;ఊహల విడి దేహపు మి
    థ్యాహము విడి యాత్మ నెరుగ ధ్యానము లో నన్
    సోహ మను బ్రజ్ఞ తో సం
    దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”
    (ఆధ్యాత్మికతని కేవలం ఊహలలో కాక ఇలా అపరోక్షానుభూతి తో తెలుసుకుంటే సందేహాలు తొలగి సుఖం కలుగుతుంది. )

    రిప్లయితొలగించండి
  10. ఉ; ఊహ లవేల బెండ్లి యని? యొక్కనికిన్ దను విచ్చి వాని కా
    మాహము లెల్ల దీర్చు సతి వై బతు కీడ్చిన గొప్ప యౌనె నీ
    స్నేహము గోరు రాజులకు జేయుము నీ కులవృత్తి వారికిన్
    దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో
    (పెళ్లి చేసుకుంటా ననే కూతురు తో ఒక వేశ్య కులానికి చెందిన తల్లి అంటోంది. ఎవడో ఒక మగవాడికి భార్య వై వాడితో బాధలు పడటం గొప్పా? నీ కులవృత్తి రాజులకి చేసి నీ దేహాన్ని అర్పిస్తే సుఖ పడతావు అని. ఇదీ ఒక తర్కమే. )

    రిప్లయితొలగించండి
  11. దేహికి నిహ లోకమ్మున
    నైహిక సుఖ తతులఁ దేల కనునిత్యంబున్
    మోహము, నిత్యం బంచును
    దేహము, వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్


    బాహుల నెత్తి మోదుకొని భార్యను దిట్టుచు మిక్కుటమ్ముగా
    ద్రోహము సేసె నాకు నని దుఃఖము నంది కరమ్ము నుండకే
    గేహిని పైన నిత్యమును గించి దవశ్య మెడంద వ్యర్థ సం
    దేహము వీడి నప్పుడె పదింబదిగా సుఖ మబ్బు డబ్బుతో

    రిప్లయితొలగించండి
  12. ఐహికసుఖములు గలుగవు
    దేహమువీడిన, గలుఁగుఁబదింబది సుఖముల్
    గుహనా బుధ్ధిని వీడుచు
    పాహియని శివునిఁబిలిచినఁబదిలముఁజేయున్

    రిప్లయితొలగించండి
  13. దాహము వేయగాజలముఁద్రాగిన దాహముఁ దీరునట్లుగా
    దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు ,డబ్బుతో
    మాపగ వచ్చు నేరమును మందిని గూడఁగఁజేయవచ్చుగా
    రేపులు మాపులంచుఁదగ రీలులు వేయగ వచ్చు నోకదా!

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఐహిక బంధముల విడచి
    మోహము చూపక గొలుచుచు మోహన
    కృష్ణున్
    దేహ మశాశ్వతమను సం
    దేహము వీడినఁ గలుగుఁ బదింబది
    సుఖముల్.

    రిప్లయితొలగించండి
  15. మోహము చూపక సతతము
    నైహికబంధములపట్ల ,నచ్యుతు గొలువన్
    నాహరినేనమ్ముచుసం
    *“దేహము వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్”*

    డా బల్లూరి ఉమాదేవి

    దేహముశాశ్వతమ్మనుచుతీరుగ చేసిన దుష్ట కార్యముల్
    మోహముతోడతప్పదిక ముప్పను మాటను మర్వకన్ సదా
    సోహపుభావనల్ విడిచి చూచుచు నెల్లర మంచిగాను, సం
    *“దేహము వీడినప్పుడె పదింబదిగా సుఖమబ్బు డబ్బుతో”*

    రిప్లయితొలగించండి