19-3-2026 (గురువారం)
కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము”
(లేదా...)
“రామునకుం ఘటిల్లెను పరాభవ మావహమందు ఘోరమై”
కవిమిత్రులారా,
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము”
(లేదా...)
“రామునకుం ఘటిల్లెను పరాభవ మావహమందు ఘోరమై”
నాటకము జక్కనగు రీతి నడచుచుండ
రిప్లయితొలగించండి" నీ జనకుడు గోరినటుల నీవడవిన
మనవలె " ననగ , జెప్పెడు మాట మరువ
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము
తేటగీతి
రిప్లయితొలగించండిరావణుండు దండెత్త స్వర్గమ్ముపైన
బ్రహ్మ వరగర్వమున రెచ్చి రావణి యట
సాహసంబున నోర్చ శచీహృదయవి
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము
ఉత్పలమాల
భీమ బలంబునన్ జెలఁగి వేల్పుల లోకము నాక్రమించెడున్
గామనతోడ రావణుఁడు క్రన్నన దాడినిజేసినంతటన్
దోమటియైన రావణియె దుందుడుకందున నోడఁజేయ సు
త్రామునకుం గలింగెను పరాభవ మావహమందు ఘోరమై
వేడుక కయి దమ పురికి వెడలిరిగద ,
రిప్లయితొలగించండికడు సులువని యెంచ , భటుల కంటబడగ
పత్సరము నకుగల పేరు పగిది , దొంగ
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము
రిప్లయితొలగించండిధర్మమును నిలుపగ నెంచి ధరణి యందు
హరియె కాదె మానవ రూపమందు బుట్టె
హీనునివలె పలుకనేల నెప్పు డంటి
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము?
భామిని రుక్మి సోదరికి భర్తయె పారిజ మిచ్చె నంచ టన్
కోమలి సత్య భామ కడు క్రోధము బూనుచు గోర దానినిన్
భూమికి యామె యను మోదము తీర్చ దలంచు వేళ సు
త్రామునకుం గలింగెను పరాభవ మావహమందు ఘోరమై.
తే॥ శివ ధనుర్భంగమును జేసి సీత మదిని
రిప్లయితొలగించండిదోఁచి పరిణయమాడఁగ దూరుచు ఘన
విష్ణు చాపముఁ దెచ్చిన విభుఁడు పరశు
రామునకుఁ గల్గె ఘోర పరాభవమ్ము
ఉ॥ ఏమని తెల్పఁగా వలయు నెంతయొ కీర్తి సురాధిపత్యమున్
ధామము స్వర్గమై మరియు ధన్యత సేవకు దేవకాంతలున్
బ్రేమగఁ బొంది యున్న బలి భీకర శౌర్యముఁ గాంచి పోర సు
త్రామునకుం ఘటిల్లెను పరాభవ మాహవమందు ఘోరమై
దేవకాంతలు అప్సరలండి
రావణుని తోడ సల్పిన రణము నందు
రిప్లయితొలగించండితనదగు విధము మిక్కిలి ఘన విజయము
రామునకుఁ గల్గె; ఘోరపరాభవమ్ము
దొరకొని దశకంఠుడనిని మరణమొందె
తామసుడైన రావణుడు దాడియొనర్చెను దేవ భూమిపై
సోమముఁ జూపయుద్ధమును జొచ్చిన రావణ నందయంతుడౌ
దోమటి యింద్రజిత్తునకు తొందర పాటున చిక్కినట్టి సు
త్రామునకుం గలింగెను పరాభవ మావహమందు ఘోరమై
రావ ణా సురు తో పోరు రణము నందు
రిప్లయితొలగించండివీరు డ గుచు ను జెలరేగ విజయ మపుడు
రామునకు గల్గె : ఘోర పరాభ వమ్ము
కలిగె రావ నాసు రు కును కయ్య మునను
బాలలు నిపుణతను చూప బవర మందు
రిప్లయితొలగించండికాచ లేక యాగాశ్వాన్ని గంప మొంది
సేన, తమ్ములు మూర్చిల్ల, చిత్రముగని
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము
డా .అన్నపరెడ్డి వీర కుమారి
నేను కొత్తగా పద్యాలు నేర్చుకుని వ్రాస్తున్నాను.తప్పులు సరి చూపగలరు
గోప కాంతలు చెంగటఁ గొలిచి యుండ
రిప్లయితొలగించండివారి కీయఁ బ్రీతిని బలభద్రుఁ డడరి
రమ్మనిన రాక యున్న వర నది యమున
రామునకుఁ గల్గె ఘోర పరాభవమ్ము
ఆ ముని పుంగవుం డకట యాత్మ నెఱుంగక రామచంద్రునే
యేమఱి పిల్చెఁ గయ్యమున కెంచక వైరి బలమ్ము స్వీయమున్
రాముఁడు విష్ణు చాపముఁ గరమ్మునఁ గైకొన నక్కజమ్ముగా
రామునకున్ఘటిల్లెను బరాభవ మాహవ మందు ఘోరమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ కెల్లరకు నుగాది శుభాకాంక్షలు.
తొలగించండిశ్రీ పరాభవ నామ సంవత్సరము మోక్షప్రదంబై విశ్వ మానవ కల్యాణ కారకంబై విశేషించి భరత ఖండమున రక్షాకవచమై శాంతి సౌఖ్యానురాగ వాయు తరంగములను భూమండలమునఁ బ్రసరింపఁ జేయుఁ గావుత!!!
అవమానం బని నిన్ను నెంచెదరు నిత్యం బాత్మ లందుం బరా
భవ మన్నం బరమంపు మోక్షమని సంభావింప నొప్పున్ ధరన్
స్వవనీ సంతతి మోక్ష కారణము నిత్యానంద సంధాయినీ
భవ బంధమ్ములఁ ద్రెంపు మమ్మ వసుధా భద్రమ్ము నిమ్మా కలిన్
[పరా + అభవము = పరమ మైన జన్మ రాహిత్యము]
ఈ వపరాభవై తనరి హీనపరాభవ గానొనర్పుమా
యీ వసుధాతలమ్మును నహీన పరాభవ వత్సరంబ నీ
దీవనలే సెలంగఁ గడతేఱ విపత్తులు విశ్వ మందు వే
కావు మొసంగి శాంతిని సుఖమ్మును మెండుగ మానవాళికిన్
పెరిగెఁ బరాభవమ్ము లిల విశ్వ విశేష జనాంతరమ్ములన్
నరులకు ద్వేష భావము ఘనమ్ముగ నాత్మల నుద్భవించెనే
విరివిగ యుద్ధ మేఘములు విశ్వ నభమ్మున సంచరింపఁగా
నరయవె నూత్న వత్సరమ యమ్మవు నై యిల నింకఁ గావవే
రామ పట్టాభి షేకమ్ము రమ్యముగను
రిప్లయితొలగించండిజరుపఁదలపెట్ట ,కైకేయి వరము వలన
నడవి కేగుట మూలాన హరియునైన
రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
శివుని విల్లును విరిచియు సీత దండ
వేయు నంతలో నిచ్చెను విష్ణు చాప
మును విరవమని, విరువ రాముండు, పరశు
రామునకుఁ గల్గె ఘోర పరాభవమ్ము.
శివధనస్సునటవిరచి సీత తోడ
రిప్లయితొలగించండిదాశరథియుతాను పురికి తరలు చుండ
విరువమన విష్ణువిల్లును విరువ పరశు
*"రామునకుఁ గల్గె ఘోరపరాభవమ్ము”*