21-3-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”(లేదా...)“ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్”
మగనికి మదిరను గ్రోలుట దగదని చెప్పినను గూడ ద్రాగుచు నుండన్తగురీతి బుద్ధి నొసగినమగువన్ శ్లాఘింతురు గద ! మగనిం గొట్టన్”
కందంఅగణిత మేధన్ గలిగినమగువన్ శ్లాఘింతురు గద, 'మగనిం గొట్టన్'సెగఁబెట్టి గతమునందున,దగ న్యాయస్థానమందు దగవున గెలువన్మత్తేభవిక్రీడితముసమయస్ఫూర్తిని న్యాయశాస్త్ర నియమాల్ సంధించి గెల్వంగనేప్రమదారత్నము శ్లాఘనీయ యగు, భర్తం గొట్టి నిందించినన్నిమిషంబైన విరామమున్ మఱచి నిర్నిద్రన్ సమీక్షించుచున్కుమతుల్ వైరులు జిక్క వ్యాజ్యమునఁ దా గుప్పించి సిద్ధాంతముల్
మగనిని కొట్టిన మగువను జగతిని శ్లాఘింపరంచు జనకుడు చెప్పన్ భగదేవుడు వ్రాసె నిటుల మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.గమనింపన్ మన సంస్కృతిన్ దెలుపు సత్కావ్యమ్ము లెన్నెన్నియో ప్రమదల్ భూరి యశమ్ము నందిరి గదా భర్తృవ్రతల్ ధాత్రిలో సుమతుల్ మెచ్చరు నీదు మాటలనిటన్ చోద్యం బదే యెక్క డే ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్?
సుగుణాలరాశి యనుచున్మగువన్ శ్లాఘింతురు గద; మగనిం గొట్టన్దిగులొందక సత్వరమేబిగియించును గద పిడికిలి విమతుల పైనన్సమకాలీన సమాజమందు నతివల్ సాధింత్రు సర్వార్థముల్కమనీయంబగు రీతి శక్తియుతయై కార్యంబు సాధింపగాప్రమదారత్నము శ్లాఘనీయ యగు; భర్తం గొట్టి నిందించినన్సమతౌల్యంబును వీడకుండునుగదా సాధింపగా న్యాయమున్
మగఁడన్న స్వాతిశయమునమగనాలినిఁ దిట్టి కొట్టు మందుని యెడలన్ తెగియించి తిరగబడునా“మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”
(నేటి సమాజంలో లోతుగా పాతుకుపోయిన దురలవాట్లు మద్యపానం జూదం) కం॥ తగవుల్ వీడకఁ ద్రాగుచుఁబగలని రాత్రియని మరచి పరఁగు వాఁడైమిగుల వ్యథఁ గూర్చ సైఁచనిమగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్మ॥ ప్రమిదల్ దీపిలు మోదమౌ బ్రదుకు భార్యా భర్తలత్యంత స్నేహము నొందంగ సమాదరమ్ముఁగన, మద్యంబందు వ్యామోహమైస్వము వెచ్చించఁగ బుద్ధి నేర్పుటకు దౌర్భాగ్యమ్ము వీడంగ నాప్రమదా రత్నము శ్లాఘనీయమగు భర్తం గొట్టి నిందించినన్స్వము ధనము
కం:మగనిన్ దన్నగ సత్యయెతగ స్త్రీ వాదులు ఘనతగ దలతురు , మారెన్యుగధర్మము స్వేచ్ఛ ఘనముమగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”(కొందరు స్త్రీవాదులు సీత రుక్మిణి మొదలైన పాత్రల కంటే సత్యభామ పాత్రనే గొప్పగా భావిస్తారు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
(2)మ:తమ చాతుర్యము జూపి తప్పు నయినన్ ధరమ్ము గా జెప్పి హాస్యము బండించుట సత్కవీంద్రులకు సాజమ్మే కదా ! సత్యనున్తమ కావ్యమ్మున తిమ్మనార్యు లటులే దర్శించె, నా తీరులన్ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్”(కవీశ్వరులు చమత్కారం గా తప్పుని ఒప్పుగా సమర్థించ గలరు. ఉదా:-నంది తిమ్మన గారు సత్యభామ శ్రీకృష్ణుణ్ని తంతే తప్పు అనక పోగా" నాథుల్ నేరముల్ జేయ పే రలుకన్ జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే? " అని సమర్థించారు. )
తగిన పని యంచుఁ బురుషుల్ మగనిన్ శ్లాఘింతురు గద మగువం గొట్టం దగిన పని యంచు మగువల్ మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్ సమ దానేకపరాజ యాన సరసస్వాంతమ్ము జృంభింపఁగా రమణీయం బగుఁ దిన్న విన్నను మహా రాత్రమ్మునన్ భర్తకుం గమనీయం బగు సన్నివేశ మది శృంగారప్రమోదమ్మునం బ్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్
పగతుర జోలికి వెళ్ళుచు భగభగ మని మండునట్లు పలుకులు బలుకన్ రగులుచు భర్తను గసిరెడు మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్”కమలా! వింటివె?యెక్కడైనయిదిసక్రంబౌనెనూహించుమా రమణుల్నోర్పున నుండువారలని గర్తవ్యంబుఁబాలించరా? విమలంబౌమదితోడనుండుచును నెవ్వేళంబ్రవర్తించనౌ
మగడే తన దైవ మనె డి మగువ న్ శ్లా ఘింతురు గద :: మగనిన్ గొ ట్ట న్ తగ ని పని యంచు తెగ డుచు మగు వను దూషింతురు గద మహి లో మిగులన్
కుమతుండై పతినన్న స్వాతిశయముం గోపమ్ము జూపించుచున్కొమరాలిన్గడు హైన్యభావమున సంకోచించకన్ దిట్టుచున్నిముసంబేని ప్రశాంతినీయని మహా నీచుం డతండైనచోప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.తెగ త్రాగుచు భర్త యితరమగువలతో తిరుగుచుండ మానిని విసిగెన్తగురీతి బుద్ధి చెప్పగమగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.
తగదిది త్రాగకుమన్ననుతెగబడి త్రాగెడు పతిగని తిట్టుచుసతితాతగురీతిబుద్దిచెప్పిన*“మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”*
మగనికి మదిరను గ్రోలుట
రిప్లయితొలగించండిదగదని చెప్పినను గూడ ద్రాగుచు నుండన్
తగురీతి బుద్ధి నొసగిన
మగువన్ శ్లాఘింతురు గద ! మగనిం గొట్టన్”
కందం
రిప్లయితొలగించండిఅగణిత మేధన్ గలిగిన
మగువన్ శ్లాఘింతురు గద, 'మగనిం గొట్టన్'
సెగఁబెట్టి గతమునందున,
దగ న్యాయస్థానమందు దగవున గెలువన్
మత్తేభవిక్రీడితము
సమయస్ఫూర్తిని న్యాయశాస్త్ర నియమాల్ సంధించి గెల్వంగనే
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు, భర్తం గొట్టి నిందించినన్
నిమిషంబైన విరామమున్ మఱచి నిర్నిద్రన్ సమీక్షించుచున్
కుమతుల్ వైరులు జిక్క వ్యాజ్యమునఁ దా గుప్పించి సిద్ధాంతముల్
రిప్లయితొలగించండిమగనిని కొట్టిన మగువను
జగతిని శ్లాఘింపరంచు జనకుడు చెప్పన్
భగదేవుడు వ్రాసె నిటుల
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.
గమనింపన్ మన సంస్కృతిన్ దెలుపు సత్కావ్యమ్ము లెన్నెన్నియో
ప్రమదల్ భూరి యశమ్ము నందిరి గదా భర్తృవ్రతల్ ధాత్రిలో
సుమతుల్ మెచ్చరు నీదు మాటలనిటన్ చోద్యం బదే యెక్క డే
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్?
సుగుణాలరాశి యనుచున్
రిప్లయితొలగించండిమగువన్ శ్లాఘింతురు గద; మగనిం గొట్టన్
దిగులొందక సత్వరమే
బిగియించును గద పిడికిలి విమతుల పైనన్
సమకాలీన సమాజమందు నతివల్ సాధింత్రు సర్వార్థముల్
కమనీయంబగు రీతి శక్తియుతయై కార్యంబు సాధింపగా
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు; భర్తం గొట్టి నిందించినన్
సమతౌల్యంబును వీడకుండునుగదా సాధింపగా న్యాయమున్
మగఁడన్న స్వాతిశయమున
రిప్లయితొలగించండిమగనాలినిఁ దిట్టి కొట్టు మందుని యెడలన్
తెగియించి తిరగబడునా
“మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”
(నేటి సమాజంలో లోతుగా పాతుకుపోయిన దురలవాట్లు మద్యపానం జూదం)
రిప్లయితొలగించండికం॥ తగవుల్ వీడకఁ ద్రాగుచుఁ
బగలని రాత్రియని మరచి పరఁగు వాఁడై
మిగుల వ్యథఁ గూర్చ సైఁచని
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్
మ॥ ప్రమిదల్ దీపిలు మోదమౌ బ్రదుకు భార్యా భర్తలత్యంత స్నే
హము నొందంగ సమాదరమ్ముఁగన, మద్యంబందు వ్యామోహమై
స్వము వెచ్చించఁగ బుద్ధి నేర్పుటకు దౌర్భాగ్యమ్ము వీడంగ నా
ప్రమదా రత్నము శ్లాఘనీయమగు భర్తం గొట్టి నిందించినన్
స్వము ధనము
కం:మగనిన్ దన్నగ సత్యయె
రిప్లయితొలగించండితగ స్త్రీ వాదులు ఘనతగ దలతురు , మారెన్
యుగధర్మము స్వేచ్ఛ ఘనము
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”
(కొందరు స్త్రీవాదులు సీత రుక్మిణి మొదలైన పాత్రల కంటే సత్యభామ పాత్రనే గొప్పగా భావిస్తారు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి(2)మ:తమ చాతుర్యము జూపి తప్పు నయినన్ ధరమ్ము గా జెప్పి హా
రిప్లయితొలగించండిస్యము బండించుట సత్కవీంద్రులకు సాజమ్మే కదా ! సత్యనున్
తమ కావ్యమ్మున తిమ్మనార్యు లటులే దర్శించె, నా తీరులన్
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్”
(కవీశ్వరులు చమత్కారం గా తప్పుని ఒప్పుగా సమర్థించ గలరు. ఉదా:-నంది తిమ్మన గారు సత్యభామ శ్రీకృష్ణుణ్ని తంతే తప్పు అనక పోగా" నాథుల్ నేరముల్ జేయ పే రలుకన్ జెందిన యట్టి కాంత లుచిత వ్యాపారముల్ నేర్తురే? " అని సమర్థించారు. )
తగిన పని యంచుఁ బురుషుల్
రిప్లయితొలగించండిమగనిన్ శ్లాఘింతురు గద మగువం గొట్టం
దగిన పని యంచు మగువల్
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్
సమ దానేకపరాజ యాన సరసస్వాంతమ్ము జృంభింపఁగా
రమణీయం బగుఁ దిన్న విన్నను మహా రాత్రమ్మునన్ భర్తకుం
గమనీయం బగు సన్నివేశ మది శృంగారప్రమోదమ్మునం
బ్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్
పగతుర జోలికి వెళ్ళుచు
రిప్లయితొలగించండిభగభగ మని మండునట్లు పలుకులు బలుకన్
రగులుచు భర్తను గసిరెడు
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్”
రిప్లయితొలగించండికమలా! వింటివె?యెక్కడైనయిదిసక్రంబౌనెనూహించుమా
రమణుల్నోర్పున నుండువారలని గర్తవ్యంబుఁబాలించరా?
విమలంబౌమదితోడనుండుచును నెవ్వేళంబ్రవర్తించనౌ
మగడే తన దైవ మనె డి
రిప్లయితొలగించండిమగువ న్ శ్లా ఘింతురు గద :: మగనిన్ గొ ట్ట న్
తగ ని పని యంచు తెగ డుచు
మగు వను దూషింతురు గద మహి లో మిగులన్
కుమతుండై పతినన్న స్వాతిశయముం గోపమ్ము జూపించుచున్
రిప్లయితొలగించండికొమరాలిన్గడు హైన్యభావమున సంకోచించకన్ దిట్టుచున్
నిముసంబేని ప్రశాంతినీయని మహా నీచుం డతండైనచో
ప్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తెగ త్రాగుచు భర్త యితర
మగువలతో తిరుగుచుండ మానిని విసిగెన్
తగురీతి బుద్ధి చెప్పగ
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్.
తగదిది త్రాగకుమన్నను
రిప్లయితొలగించండితెగబడి త్రాగెడు పతిగని తిట్టుచుసతితా
తగురీతిబుద్దిచెప్పిన
*“మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్”*