23-3-2026 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్”(లేదా...)“బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్”
కందంవిముఖతఁ జూపి శివునిపైదమనము గనె యజ్ఞమందు దక్షుడు మును, గర్వమెగసి కర్మము మూడినబ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్చంపకమాలవిముఖత జూపియున్ శివుని వేడ్కకుఁ బిల్వక నిందలాడుచున్దమనము యజ్ఞవాటిఁ గనె దక్షుడు గుండము దూకఁ బుత్రి.,గర్వమెగయ మన్నుమిన్ను గనరావన కర్మము మూడినంతటన్బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
అమితమగు కష్టముల బడిశ్రమము నికపయిన కొదుకయు సైపగ లేకన్ సమసారము విడ సుఖమనిబ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
అమృతము గొలచిన సుఖమని బ్రమయుట సహజమ్మె యగును, భవవిముఖులకున్శమలములు మూట గట్టుకు శ్రమలవి దిక్కయి మిగులును సంతాపమ్మే. అమరును సర్వ సౌఖ్యములు నందును గాదె యసాధ్య మైన యా యమృతమటంచు మానసము నందు పరాత్పరు గొల్చు వారలే బ్రమయుట సాజమౌ, భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్ శ్రమయది తప్పబోదిది సత్యము లోకము నందు గాంచగా.
గమకము నుత్తరుడు బలికెసమరము సేసి మరలింతు సౌరి నివహమున్సమయంబేతెంచ సురిగెబ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్సమరము సేయువీరుడను సాధ్యము గెల్పని పల్కె మత్స్యరాకొమరుడు డాంబికమ్ములను కోమలు లాతనిజూచుచుండగావిముఖతఁ జూపి వెన్దిరిగె వెల్లువనే గని యుద్ధభూమిలోబ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
శమదమములు పాటించుచుసమజములో తపమొనర్చు సాధువులయినన్ప్రమదల సౌందర్యముఁగనిబ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
సమజములో కఠోరమగు సాధన చేయుచు మోక్ష సిద్ధికైశ్రమపడు సాధుపుంగవులు సైతము మాయల జిక్కకుందురేప్రమదల వన్నెచిన్నెలకు వావిరిగా సడలించి బింకమున్బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
కం॥ సమముగ వేదములు చదివితమిఁగని భక్తినిఁ గొలుచుచుఁ దత్పరులైనన్దమ మది మోక్షము పైననె బ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్చం॥ ప్రమదము మీర వేదములు భక్తిని స్ఫూర్తిగ నభ్యసించుచున్గ్రమముగ దైవ చింతనలఁ గాలము నంతయు ధారవోసినన్దమ మది మోక్ష కామమునఁ దప్పక మూర్ఛిలుచుండు సర్వదాబ్రమయుట సాజమౌభవ పరాఙ్ముఖచిత్తుల కెల్ల వేళలన్(ఏదో ఒక దాని పైన ప్రేమ కోరిక లేకుంటే బ్రదుకు సాగదండి ఇహమో పరమో)
కుములరు దుఃఖమ్ముల భోగములం జిక్క రిల నిర్వికారులు మునులే మమత లెఱుంగమి నేరమి బ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్ మమతల నూతిఁ జిక్కుటకు మానవ సంచయ ఘోర దుఃఖ పుంజములకు సంత తాగణిత జన్మ పరంపర కార కాఖి లాఘములకు నెల్ల నక్కట జగమ్మున నాఁడుది కారణమ్ము నా బ్రమయుట సాజమౌ భవ పరాఙ్ముఖ చిత్తుల కెల్ల వేళలన్
సమరస భావము గల్గియు నమకము ప ఠి యించి జనులు నామ జపము తో తమకము లో మును గ గ నా బ్రమ యుట సహ జ మ్మె యగును భవ విము ఖులకున్
శమమును దమనముఁగలిగిన నమరులు సూడంగసతుల యవనపు కాంతుల్ దమదమ హద్దులు దాటుచు బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
శమమును గల్గియుండుముని సంతతియైననువారలైననున్ బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్ విమల మనస్కులైనఁదగవేశ్యలఁజూచిననూరకుందురే? ప్రమదమునొందుచుండుచును వాడిగ వేడిగ సంచరింతురే!
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అమరిన సంపదఁ దలచుచుసమయమ్మును లెక్కనిడక సతతము మదిలోతమిలో సుఖమున్నదనుచుబ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్.
గమనము నార్జనపై నిడిసమయా సమయము లెరుగక సతతము మదిలోఅమరు ధనమున్న సుఖమనిభ్రమయుట సహజమ్మెయగును భవ విముఖులకున్
కందం
రిప్లయితొలగించండివిముఖతఁ జూపి శివునిపై
దమనము గనె యజ్ఞమందు దక్షుడు మును, గ
ర్వమెగసి కర్మము మూడిన
బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
చంపకమాల
విముఖత జూపియున్ శివుని వేడ్కకుఁ బిల్వక నిందలాడుచున్
దమనము యజ్ఞవాటిఁ గనె దక్షుడు గుండము దూకఁ బుత్రి.,గ
ర్వమెగయ మన్నుమిన్ను గనరావన కర్మము మూడినంతటన్
బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
అమితమగు కష్టముల బడి
రిప్లయితొలగించండిశ్రమము నికపయిన కొదుకయు సైపగ లేకన్
సమసారము విడ సుఖమని
బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
రిప్లయితొలగించండిఅమృతము గొలచిన సుఖమని
బ్రమయుట సహజమ్మె యగును, భవవిముఖులకున్
శమలములు మూట గట్టుకు
శ్రమలవి దిక్కయి మిగులును సంతాపమ్మే.
అమరును సర్వ సౌఖ్యములు నందును గాదె యసాధ్య మైన యా
యమృతమటంచు మానసము నందు పరాత్పరు గొల్చు వారలే
బ్రమయుట సాజమౌ, భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
శ్రమయది తప్పబోదిది సత్యము లోకము నందు గాంచగా.
గమకము నుత్తరుడు బలికె
రిప్లయితొలగించండిసమరము సేసి మరలింతు సౌరి నివహమున్
సమయంబేతెంచ సురిగె
బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
సమరము సేయువీరుడను సాధ్యము గెల్పని పల్కె మత్స్యరా
కొమరుడు డాంబికమ్ములను కోమలు లాతనిజూచుచుండగా
విముఖతఁ జూపి వెన్దిరిగె వెల్లువనే గని యుద్ధభూమిలో
బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
శమదమములు పాటించుచు
రిప్లయితొలగించండిసమజములో తపమొనర్చు సాధువులయినన్
ప్రమదల సౌందర్యముఁగని
బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
సమజములో కఠోరమగు సాధన చేయుచు మోక్ష సిద్ధికై
రిప్లయితొలగించండిశ్రమపడు సాధుపుంగవులు సైతము మాయల జిక్కకుందురే
ప్రమదల వన్నెచిన్నెలకు వావిరిగా సడలించి బింకమున్
బ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
కం॥ సమముగ వేదములు చదివి
రిప్లయితొలగించండితమిఁగని భక్తినిఁ గొలుచుచుఁ దత్పరులైనన్
దమ మది మోక్షము పైననె
బ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్
చం॥ ప్రమదము మీర వేదములు భక్తిని స్ఫూర్తిగ నభ్యసించుచున్
గ్రమముగ దైవ చింతనలఁ గాలము నంతయు ధారవోసినన్
దమ మది మోక్ష కామమునఁ దప్పక మూర్ఛిలుచుండు సర్వదా
బ్రమయుట సాజమౌభవ పరాఙ్ముఖచిత్తుల కెల్ల వేళలన్
(ఏదో ఒక దాని పైన ప్రేమ కోరిక లేకుంటే బ్రదుకు సాగదండి ఇహమో పరమో)
కుములరు దుఃఖమ్ముల భో
రిప్లయితొలగించండిగములం జిక్క రిల నిర్వికారులు మునులే
మమత లెఱుంగమి నేరమి
బ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్
మమతల నూతిఁ జిక్కుటకు మానవ సంచయ ఘోర దుఃఖ పుం
జములకు సంత తాగణిత జన్మ పరంపర కార కాఖి లా
ఘములకు నెల్ల నక్కట జగమ్మున నాఁడుది కారణమ్ము నా
బ్రమయుట సాజమౌ భవ పరాఙ్ముఖ చిత్తుల కెల్ల వేళలన్
సమరస భావము గల్గియు
రిప్లయితొలగించండినమకము ప ఠి యించి జనులు నామ జపము తో
తమకము లో మును గ గ నా
బ్రమ యుట సహ జ మ్మె యగును భవ విము ఖులకున్
శమమును దమనముఁగలిగిన
రిప్లయితొలగించండినమరులు సూడంగసతుల యవనపు కాంతుల్
దమదమ హద్దులు దాటుచు
బ్రమయుట సహజమ్మె యగును భవవిముఖులకున్
శమమును గల్గియుండుముని సంతతియైననువారలైననున్
రిప్లయితొలగించండిబ్రమయుట సాజమౌ భవపరాఙ్ముఖచిత్తుల కెల్లవేళలన్
విమల మనస్కులైనఁదగవేశ్యలఁజూచిననూరకుందురే?
ప్రమదమునొందుచుండుచును వాడిగ వేడిగ సంచరింతురే!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అమరిన సంపదఁ దలచుచు
సమయమ్మును లెక్కనిడక సతతము మదిలో
తమిలో సుఖమున్నదనుచు
బ్రమయుట సహజమ్మె యగును భవ
విముఖులకున్.
గమనము నార్జనపై నిడి
రిప్లయితొలగించండిసమయా సమయము లెరుగక సతతము మదిలో
అమరు ధనమున్న సుఖమని
భ్రమయుట సహజమ్మెయగును భవ విముఖులకున్