28-3-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్”(లేదా...)“వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే”
కందందాసుడె గతమున నేతకుమోసము లన్నింటి నెఱుఁగు ముఖ్యుడనంగన్గాసిలి సకలము దెలుపుచువ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్ఉత్పలమాలదాసునిగా చరించి మును దాడులఁ జేసియు నేతకోసమైమోసము లెన్నియో సలిపి భూరిగ సంపద గూడఁ బెట్టియున్గాసిలి మీదటన్ దుదకు కల్మషమెల్ల జగంబెఱుంగగన్వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే!
ఆసక్తి జుపి పగతునిమీసముపై మచ్చిక గొని మేలగు రీతిన్ వాసి బడయు విధముగనేవ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
కాసుల నాశించుచు పీ నాసి ప్రభువు జేరి మిగుల నైపుణ్యముతో వాసుర లో పేద కవియె వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.వ్రాసిరి పూర్వ మందె కవి వర్యులు రమ్యత గన్న కావ్యముల్ వాసుర మందు గాంచ నవి ప్రాకట మై వెలుగొందు చుండగా వాసి నుతించు రీతిగను వాటిని మించు విధమ్ము నన్ భువిన్ వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే.
మోసపు నేత వడిన్ గాజేసిన సొత్తు వివరములు చెప్పదలచినన్జేసిన యత్నంబు వృథావ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్మోసము సల్పగా పొగరు బోతుకు పెత్తనమే లభింప కాజేసిన సొత్తుపై కవిత చెప్పి విమర్శకు పూనుకొన్నచోదూసెద కత్తులంచు మరి దుష్టునిపై గుఱివెట్టి పొల్పునన్వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పాసిక రవముల మెచ్చుచుకీసర లంఘనమె నచ్చు కలుషిత సభలన్శ్రీసుమ గంధము గొనరువ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్!
కం:నీ సరస కవిత జూపగనాస పడుచు తడవు జేయ కవధానివరా! గోస బడి మనము నందునవ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్(అవధానం లో ఆశువు చెప్పేటప్పుడు చాలా సరస మైనది చెప్పాలని మనస్సులో రాసుకుంటూ కూర్చో కూడదు. అక్కడ సరసత కంటే వేగం ముఖ్యం. )
వాసము నందునే సతము బంధుర తోడుత కుల్కుచున్ సదా సీసల కొద్ది త్రాగి సుర చిందులు వేయుచు ధర్మ భాగినిన్గాసిల బెట్టు నీచుని జగంబున ప్రస్తుతి జేయ వానిపైవ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే
ఉ॥ రోసిరి ప్రాత పద్ధతుల లోపము నెక్కడ యున్నదో కదా!వాసిగ చింకి బట్టలను భవ్యమటంచు ధరించి మెచ్చిరే!దాసులమంచు స్థాయికుడు దైవ సమానుఁడనంగ నొప్పిరేవ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగ భంగమే! స్థాయికుడు అధికారి (చింకి బట్టలు పైమోజు. పైఅధికారికిని దైవము రీతిగ కొల్చేవారికే వెసులుబాటు. అలాంటి చోట సత్కవిత్వమునకు విలువ ఉండదని)
చూసిన వన్నియు మనసున వాసిగ నిలిపియు కవితగ ప్రభావించ o గా భాసము నొందాక నట్టివి వ్రాసిన సత్కవిత శృంగ భంగ మ్మె యగున్
రెండవ పాదంలో ప్రభవించo గా అని సవరణ చేయడమైనది
భాసురముగ ఘోరాటవిఁ బూసిన పూవుల విధమ్ము పూర్ణము విద్యాభ్యాసము లేని జగమ్మున వ్రాసిన సత్కవిత శృంగ భంగమ్మె యగున్ కాసులు పెక్కు లున్న వని గర్వము నూని వచింప నొప్పునే బాస నెఱింగి క్షుణ్ణముగఁ బల్కిన దోస మొకింత యుండునే వాసికి నెక్క లోకమునఁ బాండితి లేక సభాంతరమ్మునన్ వ్రాసెద సత్కవిత్వ మను వానికిఁ దప్పదు శృంగ భంగమే
వాసిగ వెలయును కావ్యమువ్రాసిన పదగుంఫనముల ప్రన్నదనముతోదోసఁపు వ్యాకరణమ్మునవ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్దోసములేమి లేక పరితోషముఁ గూర్చెడు రీతి కావ్యమున్వ్రాసిన సత్కవీశ్వరుఁడు భాసిలు కావ్యము శ్లాఘనీయమౌకాసులు కూడగట్టుటయె కర్జముగా నుపఘాతమౌ విధిన్వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్. మోసము జేయుచు మరొకరువ్రాసిన కవిత తనదనుచు వాసికి నెక్కన్మోసము బయటపడగ కవివ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.
కాసులనొసగుచు పరులిలవ్రాసినరచనలనుతమదుపాటవమనుచున్కోసిన కోతల నవ్విధి*"వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్”*ప్రాసలు వాడకుండ యతులన్ తగుచోటుల కూర్చకుండగన్నాసిరకమ్ముగా తనకు నచ్చిన యట్టుల వ్రాయుచెప్పుడున్దోసములెంచిచూపినను త్రోయుచు నావల బుద్ధిహీనుడైవ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే
వాసిగ పూర్వకావ్యముల ప్రాకటమౌ గతి నేర్చి యిచ్చతో బాసకు వన్నె తెచ్చుచు నవారితమైన మనీష తోడుతన్ దోసపు వృత్తితో మెలగు ధూర్తపు నేతల మెచ్చకున్నచో వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే
కందం
రిప్లయితొలగించండిదాసుడె గతమున నేతకు
మోసము లన్నింటి నెఱుఁగు ముఖ్యుడనంగన్
గాసిలి సకలము దెలుపుచు
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
ఉత్పలమాల
దాసునిగా చరించి మును దాడులఁ జేసియు నేతకోసమై
మోసము లెన్నియో సలిపి భూరిగ సంపద గూడఁ బెట్టియున్
గాసిలి మీదటన్ దుదకు కల్మషమెల్ల జగంబెఱుంగగన్
వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే!
ఆసక్తి జుపి పగతుని
రిప్లయితొలగించండిమీసముపై మచ్చిక గొని మేలగు రీతిన్
వాసి బడయు విధముగనే
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
రిప్లయితొలగించండికాసుల నాశించుచు పీ
నాసి ప్రభువు జేరి మిగుల నైపుణ్యముతో
వాసుర లో పేద కవియె
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.
వ్రాసిరి పూర్వ మందె కవి వర్యులు రమ్యత గన్న కావ్యముల్
వాసుర మందు గాంచ నవి ప్రాకట మై వెలుగొందు చుండగా
వాసి నుతించు రీతిగను వాటిని మించు విధమ్ము నన్ భువిన్
వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే.
మోసపు నేత వడిన్ గా
రిప్లయితొలగించండిజేసిన సొత్తు వివరములు చెప్పదలచినన్
జేసిన యత్నంబు వృథా
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
మోసము సల్పగా పొగరు బోతుకు పెత్తనమే లభింప కా
జేసిన సొత్తుపై కవిత చెప్పి విమర్శకు పూనుకొన్నచో
దూసెద కత్తులంచు మరి దుష్టునిపై గుఱివెట్టి పొల్పునన్
వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాసిక రవముల మెచ్చుచు
రిప్లయితొలగించండికీసర లంఘనమె నచ్చు కలుషిత సభలన్
శ్రీసుమ గంధము గొనరు
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్!
కం:నీ సరస కవిత జూపగ
రిప్లయితొలగించండినాస పడుచు తడవు జేయ కవధానివరా!
గోస బడి మనము నందున
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
(అవధానం లో ఆశువు చెప్పేటప్పుడు చాలా సరస మైనది చెప్పాలని మనస్సులో రాసుకుంటూ కూర్చో కూడదు. అక్కడ సరసత కంటే వేగం ముఖ్యం. )
వాసము నందునే సతము బంధుర తోడుత కుల్కుచున్ సదా
రిప్లయితొలగించండిసీసల కొద్ది త్రాగి సుర చిందులు వేయుచు ధర్మ భాగినిన్
గాసిల బెట్టు నీచుని జగంబున ప్రస్తుతి జేయ వానిపై
వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే
ఉ॥ రోసిరి ప్రాత పద్ధతుల లోపము నెక్కడ యున్నదో కదా!
రిప్లయితొలగించండివాసిగ చింకి బట్టలను భవ్యమటంచు ధరించి మెచ్చిరే!
దాసులమంచు స్థాయికుడు దైవ సమానుఁడనంగ నొప్పిరే
వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగ భంగమే!
స్థాయికుడు అధికారి (చింకి బట్టలు పైమోజు. పైఅధికారికిని దైవము రీతిగ కొల్చేవారికే వెసులుబాటు. అలాంటి చోట సత్కవిత్వమునకు విలువ ఉండదని)
చూసిన వన్నియు మనసున
రిప్లయితొలగించండివాసిగ నిలిపియు కవితగ ప్రభావించ o గా
భాసము నొందాక నట్టివి
వ్రాసిన సత్కవిత శృంగ భంగ మ్మె యగున్
రెండవ పాదంలో ప్రభవించo గా అని సవరణ చేయడమైనది
తొలగించండిభాసురముగ ఘోరాటవిఁ
రిప్లయితొలగించండిబూసిన పూవుల విధమ్ము పూర్ణము విద్యా
భ్యాసము లేని జగమ్మున
వ్రాసిన సత్కవిత శృంగ భంగమ్మె యగున్
కాసులు పెక్కు లున్న వని గర్వము నూని వచింప నొప్పునే
బాస నెఱింగి క్షుణ్ణముగఁ బల్కిన దోస మొకింత యుండునే
వాసికి నెక్క లోకమునఁ బాండితి లేక సభాంతరమ్మునన్
వ్రాసెద సత్కవిత్వ మను వానికిఁ దప్పదు శృంగ భంగమే
వాసిగ వెలయును కావ్యము
రిప్లయితొలగించండివ్రాసిన పదగుంఫనముల ప్రన్నదనముతో
దోసఁపు వ్యాకరణమ్మున
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్
దోసములేమి లేక పరితోషముఁ గూర్చెడు రీతి కావ్యమున్
వ్రాసిన సత్కవీశ్వరుఁడు భాసిలు కావ్యము శ్లాఘనీయమౌ
కాసులు కూడగట్టుటయె కర్జముగా నుపఘాతమౌ విధిన్
వ్రాసెద సత్కవిత్వమను వానికిఁ దప్పదు శృంగభంగమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మోసము జేయుచు మరొకరు
వ్రాసిన కవిత తనదనుచు వాసికి నెక్కన్
మోసము బయటపడగ కవి
వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్.
కాసులనొసగుచు పరులిల
రిప్లయితొలగించండివ్రాసినరచనలనుతమదుపాటవమనుచున్
కోసిన కోతల నవ్విధి
*"వ్రాసిన సత్కవిత శృంగభంగమ్మె యగున్”*
ప్రాసలు వాడకుండ యతులన్ తగుచోటుల కూర్చకుండగన్
నాసిరకమ్ముగా తనకు నచ్చిన యట్టుల వ్రాయుచెప్పుడున్
దోసములెంచిచూపినను త్రోయుచు నావల బుద్ధిహీనుడై
వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే
వాసిగ పూర్వకావ్యముల ప్రాకటమౌ గతి నేర్చి యిచ్చతో
రిప్లయితొలగించండిబాసకు వన్నె తెచ్చుచు నవారితమైన మనీష తోడుతన్
దోసపు వృత్తితో మెలగు ధూర్తపు నేతల మెచ్చకున్నచో
వ్రాసెద సత్కవిత్వమను వానికి దప్పదు శృంగభంగమే