30, మార్చి 2026, సోమవారం

సమస్య - 5424

31-3-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్”
(లేదా...)
“ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్”

15 కామెంట్‌లు:

  1. పాషాణ హృదయులనకుము
    భోషాణము నందు దూరి పొత్తము లదినన్
    మూషికములపై కలిగిన
    ద్వేషమె , సోదరుల కిడెను విరివిగ శుభముల్”

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      భాషణమున కౌంతేయుల
      భూషణమగు ధర్మమైన పోకడయె మదిన్
      ఘోషింప నధర్మముపయి
      ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్

      ఉత్పలమాల
      భాషణమందు తల్లి గురువర్యులు సేసిన బోధలందునన్
      భూషణమైన వర్తనము పోకడలందున ధర్మపూరితా
      వేషమె పాండునందనుల విజ్ఞత దెల్పగనా యధర్మ వి
      ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్

      తొలగించండి

  3. రోషము చూపక నగ్రజు
    భాషితమున్ గౌర వించు వారు సుగుణమే
    భూషణ మౌచు నధర్మ
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్.


    భేషజ మందు ద్యూతమును వృత్రులు గెల్చిన వేళ నచ్చటన్
    రోషము వీడి రాజ్యము విరోధి కొసంగిన వారు ధర్మమే
    భూషణ మై చెఱంగు పృథ పుత్రుల నీతి, యధర్మ మార్గ వి
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్.

    రిప్లయితొలగించండి
  4. దోషముతో కౌరవ తతి
    ద్వేషము రగిలించినారు వీరుల మదిలో
    దోషులపై పొంగిన వి
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్

    యోషిత సత్యపోడిమిని యోచన జేయని దుండగీలపై
    ద్వేషము తమ్మిమొగ్గరపు భీషణ మందభిమన్యుఁ జంప వి
    ద్వేషము పెచ్చరిల్ల ననిఁ వీరులు పాండవులే చెలంగిరే
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్

    రిప్లయితొలగించండి
  5. కం:భూషలు వారి సుగుణములు
    భాషయు మర్యాద లొలుకు బండిత హిత మై
    ద్వేషము నెడ వారికి గల
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్”

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ రోషము వీడి యొద్దికగ లోపము లన్నియుఁ జక్కఁబెట్టి సం
    తోషము మీర నెమ్మిఁ గని స్తోమత వృద్ధికి శక్తి యుక్తులన్
    బోషణఁ జేసి సద్గుణముఁ బొందుచుఁ గాంచఁగ బద్ధకమ్ముపై
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వ శుభమ్ము లొక్కటన్

    రిప్లయితొలగించండి
  7. ఉ:వేషము లెన్ని వేయుదురు వీరలు! చూడ చెరొక్క పక్షమై
    ద్వేషము జూపు కొందు రతితీవ్రత, వీరికి రెందు ప్రక్కలన్
    భూషను బోలుచున్ పదవి పొందుగ దక్కు ప్రదర్శనార్థమౌ
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్”
    (అన్నదమ్ము లిద్దరూ చెరొక పార్టీ లో ఉండి ద్వేషం ప్రదర్సించి తిట్టుకుంటారు.రెండు పార్టీల లోనూ వీళ్లకి పదవు లొస్తాయి.ఈ దొంగ ద్వేషపు ప్రదర్శన వీళ్లకి రాజకీయం గా లాభం. )

    రిప్లయితొలగించండి
  8. భూషణము గాదు బొంకుట
    భాషణము న సత్య వాక్కు భాసించు గడు న్
    దోషము న ధర్మ ము ల వి
    ద్వేషమ్మె సోదరుల కిడు విరివిగ శుభముల్

    రిప్లయితొలగించండి
  9. వే షాలంకా రోదిత
    భాషాదులఁ జక్కఁదనము వఱలచు నుండన్
    భూషా సంచయ వసుధా
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్


    భాషణ కోమలత్వమును బాంధవ సంచయ సన్నిధానమున్
    దోష విహీన వర్తనము దుష్ట జనాశ్రయ వర్జనమ్మునున్
    రోష విహీన జీవనము లుప్త పరస్పర దుర్భ రోద్భవ
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వ శుభమ్ము లొక్కటన్

    రిప్లయితొలగించండి
  10. భూషణమౌ సత్యములను
    భాషించఁగ వలయు నెపుఁడు వహ్వా యనగన్
    భాషనుదిగజార్చుటయను
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్”

    రిప్లయితొలగించండి
  11. తోషమతిశయించగ కా
    వేషము విడనాడి కూర్మి పెంపు వహింపన్
    పోషించఁగ దౌష్ట్యముపై
    ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్


    దోషము లేని జీవనము తోషముగా వెలయించుచున్ సదా
    భూషగ దాల్చి చిర్నగవు భూరి విరాళములిచ్చి పేదలన్
    పోషణ జేసి యాదుకొను పోఁడిమి మెల్గుచు బాదరించు వి
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్

    రిప్లయితొలగించండి
  12. కావరులై చెలంగుచును కౌరవ బృందము కాన కంపగా
    ధీవరులై వనమ్ములను తేకువతోడ చరించి మించుచున్
    పావనుడైన శ్రీహరిని ప్రాపుగ నెంచుచు వాని సాటియౌ
    దేవుడె లేనె లేడనుచు దీరుగ బాండవులందిరే కృపన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ద్వేషమ్మిడగ నపార్ధము
    భాషించగ సౌమ్యమైన వాక్కులతోడన్
    రోషము లేకను, వీడగ
    ద్వేషము సోదరుల కిడెను విరివిగ శుభముల్.

    రిప్లయితొలగించండి
  14. భాషింపక కుత్సితమున
    భేషని మెచ్చగ జనములు వీనులకెల్లన్
    తోషమగునధర్మముపయి
    *“ద్వేషమె సోదరుల కిడెను విరివిగ శుభముల్”*


    దూ‌షణచేయకన్ సతము దోషములెంచక బంధు కోటిలో
    తోషముకల్గచేయగను తూలకమాటలు నాడుచున్ సదా
    భూషణ భాష ణమ్ములను భూరిగ చూపెడునా యధర్మవి
    ద్వేషమె యన్నదమ్ములకుఁ దెచ్చెను సర్వశుభమ్ము లొక్కటన్”
    .....................................................

    రిప్లయితొలగించండి