2, మే 2026, శనివారం

సమస్య - 5457

3-5-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్”

(లేదా...)

“పావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డాసభన్”

(పి.ఎల్. నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      అంచితముగ భారతమును
      బంచఁగ నేర్చిన విదురులు ప్రవచింపక మీ
      రెంచిన కృత్రిమ మేధన్ఉ
      "బాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్"


      ఉత్పలమాల
      జీవన గమ్యమంద ప్రవచింపగ భారతమెంచ కోవిదుల్
      శ్రావణమెప్పుడున్ దగును చక్కని విజ్ఞతలుల్లసిల్లగన్
      ద్రోవను దప్పి కృత్రిమపు రోగమునంటిన మేధ దిక్కనన్
      "బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డా సభన్"

      తొలగించండి

  2. ఎంచగ మూర్ఖుని వోలెను
    పంచమ వేదమ్ము లోని వాస్తవ మాలో
    చించక వాగితి వెప్పుడు
    పాంచాలిని భీష్ముఁడు గని పక్కున నవ్వెన్?


    నీవొక నిప్పు రవ్వవని నీచులె ఱుంగక దుష్ట బుద్ధితో
    కావరమెచ్చి యివ్విధి వికారపు చేష్టల చేయనేమి ని
    న్నా వనమాలి ప్రోచె నని యర్మిలి జూపి సభాంతరమ్ము నన్
    బావని ద్రోవదిం గనుచు పక్కున నవ్వెను భీష్ముఁ డాసభన్.

    రిప్లయితొలగించండి
  3. మంచి సతిగ దీవెననిడె
    పాంచాలిని భీష్ముఁడు గని ; పక్కున నవ్వెన్
    అంచన నుండిన కుంతియె
    పంచ పతుల తోడుత నది వసమా యనుచున్

    రిప్లయితొలగించండి
  4. కం॥
    పాంచాలి వేషమూనిన
    మించగు పేరున్ననటుడు, మీసము తోడన్
    వేంచేయ నాత్రమున నా
    "పాంచాలి"ని భీష్ముడుగని ఫక్కుననవ్వెన్!!

    రిప్లయితొలగించండి