ఉ:భావము నందు కేశవుని భద్రముగా విలసిల్ల జేసి తా నే విరచింతునన్ దలపు నింతయు జెందక రామభద్రుడే తా విరచింప జేయునని తల్చెను పోతన కాదె? య ట్లహం భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్” (పలికించెడు వాడు రామ భద్రుండట అన్నారు పోతన గారు. ఆ అహంకారరహితస్థితి నుంచే ఆ మహాత్ముని కలం నుంచి అంత అద్భుత పద్యాలు వచ్చాయి.భాగవతమే కాదు.ఈ ప్రపంచం లో ఎంత గొప్ప ఆవిష్కరణ లైనా అహాన్ని వదలిన ఒక సమాధి స్థితి నుంచే వస్తాయని తత్త్వవేత్తలు చెపుతారు. )
భావము జీవము రచనకు
రిప్లయితొలగించండిభావము స్పష్టపడని యెడఁ బద్యంబగునా
భావము నిండై ద్వైదీ
భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్
భావము లేనిపద్యమును వ్రాసిన మెత్తురె పండితోత్తముల్
తొలగించండిభావము జీవమంద్రు గద పద్యములో విశదీకరించినన్
భావము పూర్ణమైనపుడె పద్యము దీపిలుచుండు నన్యథా
భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఏ విధముగ తలపోసిన
రిప్లయితొలగించండిభావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్
దేవానాంప్రియుఁని మదిని ,
ఏ విదుడైనను నుతించ నింగమె ముఖ్యమ్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి'ప్రియుని' లో అరసున్న లేదు. 'నింగమె ముఖ్యమ్'?
కందం
రిప్లయితొలగించండిఠీవిగ సమస్యఁ గైకొని
చేవఁ జమత్కారమొలుక సింగారముగన్
గావించు పూరణన్ దు
ర్భావ మభావమయినయెడఁ బద్యము వెలుగున్!
ఉత్పలమాల
ఏవముగన్ సమస్యలిడ నింపగు దృశ్యము సృష్టిఁజేయుచున్
జేవఁ జమత్కరించి స్మరణీయమనంగ సభాసదుల్, దగన్
జీవము నింపి పూరణము సిందులువేయ ముగించువేళ దు
ర్భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్!
రిప్లయితొలగించండిభావ మభావంబగు తరి
చేవ గల కవీంద్రు జెంత జేరుచు ప్రియ యే
భావము జూపిన నిక ని
ర్భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్.
చేవను గల్గి నట్టి కవి చెంతను జేరుచు చేతు లందునన్
వీవెన వీచె డందమగు భీరువు ప్రేమగ మాటలాడుచున్
భావ తరంగ మాలికకు ప్రాణము పోసిన చాలు నింక ని
ర్భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్.
భావము తో రాణింప గ
రిప్లయితొలగించండిధీవరు లెల్ల రును మెఛ్చి దివ్యంబ న రే
పావన మై వె లుగు చు చెడు
భావ మ భావ మయిన యెడ బ ద్యము వెల్గు న్
మీ పూరణ బాగున్నది.
తొలగించండి-
రిప్లయితొలగించండిఓ విదుర! నీరసించును
భావ మభావమయిన యెడఁ బద్యము; వెల్గున్
జీవముతో నెల్లపుడు ప్ర
భావము తో పద్దెమున్ గుభాళింపంగన్
విరుపుతో చక్కని పూరణ.
తొలగించండి
రిప్లయితొలగించండిhttps://youtube.com/shorts/RfZ17uG83hE?si=p4N88SqCbwvv81OH
బాగుంది AI తో...
తొలగించండిఉ॥ రావము రాగమున్ గలపి శ్రావ్య మనోహర రీతిఁ బాడఁగన్
రిప్లయితొలగించండిదావుల నీను పద్యములఁ దత్పరుఁ డై యటు వ్రాసి యొప్పినన్
దీవెన లొంది మెప్పుఁ గను తీరును గాంచఁగ, విప్లవాది దు
ర్భావ మభావమై నపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్
కం:భావించు వస్తువుననే
రిప్లయితొలగించండిభావము సంలీన మైన, "ప్రతిభలు, కవితల్
నా" వని తలబోయు నహం
భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్”
(కవి కవితావస్తువులో ఐక్య మవ్వాలి. అహం అనేది వదిలెయ్యాలి. అప్పుడే మంచి పద్యం వస్తుంది. )
ఉ:భావము నందు కేశవుని భద్రముగా విలసిల్ల జేసి తా
రిప్లయితొలగించండినే విరచింతునన్ దలపు నింతయు జెందక రామభద్రుడే
తా విరచింప జేయునని తల్చెను పోతన కాదె? య ట్లహం
భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్”
(పలికించెడు వాడు రామ భద్రుండట అన్నారు పోతన గారు. ఆ అహంకారరహితస్థితి నుంచే ఆ మహాత్ముని కలం నుంచి అంత అద్భుత పద్యాలు వచ్చాయి.భాగవతమే కాదు.ఈ ప్రపంచం లో ఎంత గొప్ప ఆవిష్కరణ లైనా అహాన్ని వదలిన ఒక సమాధి స్థితి నుంచే వస్తాయని తత్త్వవేత్తలు చెపుతారు. )
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి.
తొలగించండిపూవుల తావులు కడుస్వా
రిప్లయితొలగించండిభావికమై యలరుచుండ భాసిల్లునిలన్
భావమయమై యనుకృతి స్వ
భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్
జీవన్ముక్తిని కోరుచు
రిప్లయితొలగించండిపావన మూర్తిని వరదుని భక్తి దలిర్పన్
భావింప కీర్తి నిందగ
భావ మభావమయిన యెడఁ బద్యము వెల్గున్
భావన జేసి సత్కవులు భవ్యముగా రచియింప పద్యముల్
జీవము చెంగలించుగద చేతము నుల్లసమందు నొక్కచో
పావనమూర్తి దైవమును భక్తిగ సల్పిన కీర్తినింద యా
భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్
వావిరి సందేహమ్మున
రిప్లయితొలగించండివేవురు పలు మారు లడరి విబుధులు శోధిం
పావంతైన నహో దు
ర్భావ మభావ మయిన యెడఁ బద్యము వెల్గున్
భూవర నిక్క మెంచినఁ దపో మహి మింతయు లేక యున్న స
ద్భావ మెడంద నుద్భవము పండితుఁ డైనను గల్గ నేర్చునే
చేవ వెలుంగ సత్కవికి శ్లిష్ట మభావము దోఁప భావమై
భావ మభావమై నపుడె పద్యము హృద్య మటంద్రు పండితుల్
ఠీవిగ కావ్య సంతతి పఠించుచు నిత్యము చిత్తశుద్ధితో
రిప్లయితొలగించండిపావనమైన చిత్తమున వ్రాయుచు పాద్యము లెన్నొ నిష్ఠతో
చేవను జూపుచుండినను, చెన్నగు కైతల, లోపయుక్తమౌ
భావ మభావమైనపుడె పద్యము హృద్యమటంద్రు పండితుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
భావమె ముఖ్యము కవితకు
భావమె పద్యమ్మునకును ప్రాణసమంబౌ
జీవము కనిపించును దు
ర్భావ మభావమయిన యెడఁ బద్యము
వెల్గున్.