కుత్తుక లుత్తరించగల క్రూర మనస్కులు దుష్ట బుద్ధితో విత్తము బంచి ఎన్నికల వేళ పరిస్రుత తో జనాళి నే మత్తున ముంచి గెల్చి యిల మానవ దేవులు గా వెలుం గెడిన్ జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ.
ఉ॥ మొత్తము ధ్యాస యంతయును ముద్దుగఁ బై యధికారి చూపులన్ జిత్తము నందు నుండుగతిఁ జేయు సమర్థుఁడు శ్రేయ మొందు పై కెత్తబడున్ గదా యిదియు నెంచి గ్రహించఁగ లేని పల్కులే ”జిత్తుల మారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”
(ఇందులో అసంబద్ధమే లేదండి. ప్రజ్ఞ ఉన్నవాడు ఆఫీసు (లేక ఇండస్ట్రీ) పనిచేస్తాడు బాసు కనుసన్నలలో ఉండేవాడు ప్రమోషన్లందుకుంటాడు. ఇది సర్వత్రా జరుగుతున్నదే నండి)
కం:సత్తువ తో పని జేసెద, జిత్తులు నా కెరుకలేవు, చేయుట స్తుతులున్ జిత్తులు మా యక్కల పని, జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్ (జిత్తులన్+ అక్కలకె=జిత్తుల నక్కలకె.వీడు పని చేస్తాడు కానీ జిత్తులు తెలియవు. వీడి అక్కలకి జిత్తులు తెలుసు. వాళ్లకి జీతా లెక్కువ.)
చిత్తము దలచిన విధముగ
రిప్లయితొలగించండినిత్తెము గొలువున పనులను నెరపుట యందున్
సత్తువ జూపుచు నుండెడి
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
రిప్లయితొలగించండివిత్తము నెగజల్లి పరి
స్రుత్తును ద్రావించి గెలుచు శుంఠలె గద క్ష్మా
భృత్తులుగా వెలిగెడి యా
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్.
కుత్తుక లుత్తరించగల క్రూర మనస్కులు దుష్ట బుద్ధితో
విత్తము బంచి ఎన్నికల వేళ పరిస్రుత తో జనాళి నే
మత్తున ముంచి గెల్చి యిల మానవ దేవులు గా వెలుం గెడిన్
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ.
చిత్తము దోచిన వారల
రిప్లయితొలగించండికుత్తమ మైన పదవులని కుమతుల్ సతమున్
దొత్తుల కిచ్చుచునుండగ
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
చిత్తము చిత్తమంచు తమచిత్తము గెల్చిన జంబుకాలకే
యుత్తమ మైన పట్టమిడు వ్యూహము నేర్చిరి నేత లెల్లరున్
దొత్తుల వోలె మారి మరి తొందరగా మది దోచువారలౌ
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ
ఉ:విత్తనముల్ గొనంగ ధర పెచ్చగు సంకర విత్తనమ్ముకే
రిప్లయితొలగించండిచెత్త కవిత్వమే వెలుగు చెప్పెడు వా డొక ముఖ్యు డైనచో
విత్తము గల్గు నా చవట వేయు చమత్కృతి నవ్వ జేసెడిన్
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”
(పనికి రాని వాటికి విలువ యెక్కువ అనటానికి ఇన్ని ఉదాహరణలు. మూడవ పాదం- ఎ రిచ్ మ్యాన్స్ జోక్ ఈజ్ ఆల్వేజ్ ఫన్నీ. )
ఉ॥ మొత్తము ధ్యాస యంతయును ముద్దుగఁ బై యధికారి చూపులన్
రిప్లయితొలగించండిజిత్తము నందు నుండుగతిఁ జేయు సమర్థుఁడు శ్రేయ మొందు పై
కెత్తబడున్ గదా యిదియు నెంచి గ్రహించఁగ లేని పల్కులే
”జిత్తుల మారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ”
(ఇందులో అసంబద్ధమే లేదండి. ప్రజ్ఞ ఉన్నవాడు ఆఫీసు (లేక ఇండస్ట్రీ) పనిచేస్తాడు బాసు కనుసన్నలలో ఉండేవాడు ప్రమోషన్లందుకుంటాడు. ఇది సర్వత్రా జరుగుతున్నదే నండి)
కం:సత్తువ తో పని జేసెద,
రిప్లయితొలగించండిజిత్తులు నా కెరుకలేవు, చేయుట స్తుతులున్
జిత్తులు మా యక్కల పని,
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
(జిత్తులన్+ అక్కలకె=జిత్తుల నక్కలకె.వీడు పని చేస్తాడు కానీ జిత్తులు తెలియవు. వీడి అక్కలకి జిత్తులు తెలుసు. వాళ్లకి జీతా లెక్కువ.)
కందం
రిప్లయితొలగించండివిత్తమునొందెడు మిషతో
నత్తఱి తమనుంచఁగ సలహాదారులనే
పెత్తనమున నేతఁ బొగడు
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్!
ఉత్పలమాల
మెత్తని మాటలన్ బలికి మేలుగనందలమెక్క నేతలున్
విత్తము దోచుటే మదిని ప్రీతిగ నాశ్రితపక్షమంచు వా
రత్తఱి గద్దెలెక్క సలహాలనొసంగెడు వంకమూగెడున్
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ! ప్రజ్ఞ శూన్యమౌ!
రిప్లయితొలగించండిఎత్తులు నిత్యము వేసియు
సత్తెము గడు మబ్యపెట్టు చతురులతోడన్
పొత్తుల బేరము జేసిన
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
రిప్లయి
జిత్తు లన రాదు వానిని
రిప్లయితొలగించండినెత్తు లనఁగ నొప్పు నయ్య యెత్తులకును పై
నెత్తులు దోషము లగునే
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్
పొత్తులు మిన్ను నంట గెలుపుల్ వెనువెంటఁ జరించు నిత్యమున్
విత్తము లున్న వార లిల విజ్ఞులుగాఁ దనరారు చుందురే
పొత్త మెఱుంగ నట్టి నర పుంగవుఁ డూనును నాయకత్వమే
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెత్తనము ఠలాయించుచు
మొత్తము తానను విధముగ మోసము తోడన్
నెత్తిని చేతులు పెట్టెడు
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్.