3, అక్టోబర్ 2026, శనివారం

సమస్య - 5609

4-10-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్”

(లేదా...)

“అభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్”

(న.చ. సాహిత్ శతావధానంలో క్రొవ్విడి వేంకట రాజారావు గారి సమస్య)

11 కామెంట్‌లు:

  1. కందం
    ప్రభువుకు ద్వారికులగుచున్
    ముభావమున మునుల నడ్డి పొందియు, హరితో
    నభయమ్మునఁ దొలగినదన
    నభిశాపము, మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్


    మత్తేభవిక్రీడితము
    ప్రభు సేవించెడు ద్వారపాలకులు శాపాలంది నిర్వేదాన వా
    రభివాదమ్మున బ్రోవుమన్న హరియే నందించ మర్మమ్ము నా
    నభయమ్మందున మూడు జన్మములతో నాశమ్మునన్ వీడగా
    నభిశాపమ్ములు, మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    రిప్లయితొలగించండి

  2. ఇభయాన యూర్వశి, విజయు
    డభిభవమున్ దెల్పినంత నాగ్రహమున తా
    నభిశాపమొసగ క్రీడికి
    నభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్.


    సభలో క్రీడిని గాంచి యూర్వశియె తా సమ్మోహియై చేరగా
    నభిభావమ్మును తెల్ప నప్సరసయే యామర్షమున్ జెంది తా
    నభిశాపమ్మొసగన్ బృహన్నలగ తామజ్ఞాతవాసమ్ము లో
    నభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    రిప్లయితొలగించండి
  3. అభివృద్ది కోరి జనకుడు
    విభవము గలిగిన నుగూడ బిడ్డల కొరకై
    అభిలాష లేమి జేసెడు
    అభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్

    రిప్లయితొలగించండి
  4. విభవంబౌ దేవేంద్రుని
    సభలో నూర్వశి వరించి శాపంబిడినన్
    శుభమయ్యెఁ సవ్యసాచికి
    యభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్

    విభవంబొప్పెడు స్వర్గమేగి నపుడా వివ్వచ్చుకున్ దేవరా
    ట్సభలోనాట్యము సల్పు యప్సరసయే శాపంబు తానిచ్చినన్
    శుభమైయొప్పెను క్రీడి జీవితములో చోద్యంబు వీక్షింపగా
    నభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    రిప్లయితొలగించండి
  5. కం:సభలన్ నీ విడు మూర్ఖపు
    టభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్”
    బ్రభుతకు , బ్రథాని పైననె
    యభిమానము బెరుగు నెరుగవా బొద్దింకా!
    (ఎన్నికలలొ ప్రభుత్వం పైన అడ్డగోలు విమర్శలు చేస్తే అవి తమకు ఫలితం ఇవ్వక పోగా ప్రభుత్వం పై సానుభూతి పెంచుతాయి.)

    రిప్లయితొలగించండి
  6. మ॥ సభ యందున్ శిశుపాలుఁడా విధిగ నుత్సాహమ్ముతో దూరఁగన్
    విభవమ్మెంతయొ నల్లనయ్యకుఁ గనన్ విచ్చెన్ బ్రవీక్షించఁగన్!
    రభసన్ దిట్టిరి మెచ్చి కృష్ణునచటన్ లాలించి కీర్తించిరే!
    అభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    అభిశాపము లేని నేరము మోపుట

    రిప్లయితొలగించండి
  7. మ:ప్రభువన్ నాదగు వేట మీ సుతునివే ప్రాణమ్ములన్ దీయ న
    న్నభిమానింతురె మౌనివర్య! కడు శాపార్హుండ నే గాని మీ
    అభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్”
    లభియించున్ సుతుడంచు నీ దశరథున్ లాలించుచున్! ధన్యుడన్.



    రిప్లయితొలగించండి
  8. అభిరాముని నా కృష్ణుని
    సభార్యుఁ జేసెను బకారి సకల భువన స
    ద్విభునిన్ సత్రాజిత్తు దు
    రభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్


    ప్రభలం దెన్నఁగ సూర్య సన్నిభము దుర్వారోగ్ర శాపమ్ము దు
    ర్లభ లక్ష్మీ పతి జన్మ కారణమునై లాభమ్ము సేకూర్చెనే
    యభయం బిచ్చెనె యక్కిరీటికి నహో యయ్యూర్వసీ శాపమే
    యభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    రిప్లయితొలగించండి
  9. విభవమ్మొప్పగ నర్జునుండుచనగా వేగంటి లోకమ్ము నా
    సభలో నూర్వసి గాంచి సుందరుడునౌ సంక్రందనా పుత్రకు
    న్నభికామమ్మును తెల్పి, భంగపడి తానావేశమున్ దూఱ నా
    యభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్

    రిప్లయితొలగించండి
  10. సభలో శిశుపాలుడు పలు
    యభిశంసనములను సలుప హరి చక్రముతో
    విభజించెను వాని శిరము
    నభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్

    రిప్లయితొలగించండి