11, ఏప్రిల్ 2015, శనివారం

పద్య రచన - 876

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(జ్యోతి వలబోజు గారికి ధన్యవాదాలతో)

12 కామెంట్‌లు:

  1. సామాన్యుని భోజన మది
    ఏమాత్రము దొరకు నంట యెందరి కిలలో
    నీమాయ ధరలు మింటను
    ప్రామాణిక మనుచు బ్రతుక బడుగుల కెల్లన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఆకుకూర పప్పు, మరియు నావకాయ,
    చారు, యిగురు, వేప్పుళ్ళతో తీరుగాను
    షడ్రుచులతోడ నాంధ్రులు సంతతమ్ము
    భోజనము చేయు చుందురు ముదముతోడ

    రిప్లయితొలగించండి
  4. కూర సాంబారు పప్పును కూడి యుండి
    యన్న మయ్యెడ శోభిల్లె చెన్ను తోడ
    ఆర గించగ రండిక యార్య ! మీరు
    ఆల సించిన చల్లారి మారు రుచియ

    రిప్లయితొలగించండి
  5. ఆన్నమందున కూరలు నావకాయ
    చారు పప్పుయు గూడెగా చాలుచాలు
    తెలుగు భోజనమిది గాదె తెలియగాను
    పెరుగు జేర్చిన తిను కోర్కె పెరుగునయ్య

    రిప్లయితొలగించండి
  6. ఆలు ,బెండయు, దొండయు, నావకాయ
    పళ్ళె మందున ,ప్రక్కన పప్పు,చారు ,
    నరయ పరమాత్మ రూపమే యన్నమంద్రు
    నారగించగా తరలండి నార్యులార !!!

    రిప్లయితొలగించండి
  7. Umadevi Balluri గారి పద్యం.....

    ఆవకాయ మరియు నన్నము కూరయు
    చూడగానె త్వర పడమనెగద
    రసన,పప్పు తోడ రసము నోరూరింప
    వేగ రండు యింక వేచుటేల.

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    చివరిపాదంలో యతి తప్పింది.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పప్పుయు’ అనరాదు, ‘పప్పును’ అనండి.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో గణ యతి దోషాలు... ‘చూడ త్వరపడు మనుచుండెను గద’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. పప్పున్నది! కూరున్నది!
    కప్పున గుమగుమల చారు కమ్మని రుచితో
    నప్పడమొకటున్నదొరకు
    కప్పుపెరుగు దూరమందు కంజము మనకున్!

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. అన్నము,పప్పుచారునకు-అందినరంగుల కాయగూరలున్
    వెన్నయులేకనేనిడిన?పెట్టెడివారికివందనంబె|యే
    మున్నదిభోజనాన?పరమోన్నతపౌష్టిక మున్నచాలు.లో
    కోన్నతమౌనువిందు మనకోసమె యన్నవిదంబుతిన్నచో

    రిప్లయితొలగించండి
  12. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి