అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘సాటి’ టైపాటువల్ల ‘చాటి’ అయింది. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. ‘అష్టభుజము లున్న యాదిశక్తిని బోలి| యింట...’ అనండి.
పల్లా నరేంద్ర గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. కందంలో రెండు, నాలుగు పాదాల చివరి అక్షరాలు గురువులై ఉండాలి. ‘విడకన్’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యంలో క్రింది సవరణలను గమనించండి. ఒకచేత కెటిలు పట్టియు నొకచేతను ల్యాపుట్యాపు నోజలు వినగా నొకచేత మొబైల్,ఫైలును, నొకచేతను యౌషధమ్ము నొకటను గొడుగున్. ***** ఊకదంపుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పల్లా నరేంద్ర గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, భలే! ఎంత చక్కగా స్త్రీల అవధానం గురించి వ్రాశారు. చాలా బాగుంది. అభినందలు.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, నిజమే! ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి. మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘బాగు నోగులను’ అనండి. అలాగే పద్యం చివర ‘నిండిపోయిరే’ అనండి.
అన్నుల మిన్నలు నేడిల
రిప్లయితొలగించండియన్నిట మేమంచు నారు హస్తము లంధున్
కన్నుల విందగు పనులను
మిన్నంటిన వేడ్క తోన మేరువు తామై
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఇంటి పనుల నన్ని యింపుగా జేయుచు
రిప్లయితొలగించండిరచ్చ కెక్కినారు రమణులంత
సవ్య సాచి మాకు చాటిరా డనుచును
చేయు చుండ్రి పనులు స్వేచ్ఛగాను
ఆ.వె: అలుపు సొలుపు లేక నన్నిపనులు జేయు
రిప్లయితొలగించండినేటి మహిళ కెవరు సాటి యిలను
అష్ట భుజము లున్న యాదిశక్తివోలె
నింట బయట పనుల నిర్వహించు.
డా.బల్లూరి ఉమాదేవి.
23/4/15.
ఎన్ని కార్యము లైనను చెన్ను మీఱ
రిప్లయితొలగించండిచేయుచుండిరి వనితలు స్వేచ్ఛగాను
దేశ వృద్ధికి తామంత దివ్వెలగుచు
సతము షట్కర్మ యుక్తలై సాగుచుండ్రి
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సాటి’ టైపాటువల్ల ‘చాటి’ అయింది.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘అష్టభుజము లున్న యాదిశక్తిని బోలి| యింట...’ అనండి.
గురువుగారి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితడబడకను నేడు పడతి
రిప్లయితొలగించండివడివడిగను పనులు చేసి వరుసగ విడకను
అడుగిడ కడు రంగములను
విడిగను మరివుమ్మడిగను విజయము తనదై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఒకచేత కెటిలు పట్టును
ఒకచేతను ల్యాపుట్యాపు ఓజలు వినగా
నొకచేత మొబైల్,ఫైలుయు,
నొకచేతను యౌషధమ్ము నొకటను గెుడుగున్
2.వంటకు చిహ్నము కెటిలవ
వంటికి నారోగ్యమునకు వైద్యుడు పనికై
వెంటను ల్యాప్టాప్పు మొబైల్,
గంటివ నవయుగపు కలువ కంటుల బ్రతుకుల్
,
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరయ నారు రూపమ్ములౌ నతివకిపుడు
రిప్లయితొలగించండిబార్య, యున్నతోద్యోగిని , పాక శాస్త్ర
నిపుణురాలు, దూత,గతినిర్ణేత మరియు
సహజమౌతల్లి విధులును సమ్మతమున
పల్లా నరేంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కందంలో రెండు, నాలుగు పాదాల చివరి అక్షరాలు గురువులై ఉండాలి. ‘విడకన్’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో క్రింది సవరణలను గమనించండి.
ఒకచేత కెటిలు పట్టియు
నొకచేతను ల్యాపుట్యాపు నోజలు వినగా
నొకచేత మొబైల్,ఫైలును,
నొకచేతను యౌషధమ్ము నొకటను గొడుగున్.
*****
ఊకదంపుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు.
రిప్లయితొలగించండివంద పనులనైన నొకతె
రిప్లయితొలగించండివందనీయ గతుల నొనర్చు వనితామణి చే
వం దగఁ మెచ్చుచు నామదిఁ
వందన మింపుగ ఘటింతు వందల మార్లున్
ఆడవారు కా దిపుడార్య యబలు లుమఱి
రిప్లయితొలగించండిఅన్ని రంగాల యందున మిన్న గాను
రాణి కెక్కుచు నుండిరి రమ్య ముగను
చెప్పు చున్నది చిత్రము చేతి తోడ
పతితోడ సెల్ఫోను భాషణ సేయుచు
రిప్లయితొలగించండిపాపాయి పాలను బట్ట జూచు
లాపుటాపును బట్టి నాపురేటొనరించి
కుక్కరు కూతలఁ లెక్కగట్టు
ఆఫీసు ఫైళ్ళను నతి జాగరూకత
చేతుల వంపుల చేర బట్టు
వామ కరమునందు వానిటీ బ్యాగును
వాలుగ నిరికించి వడిసి పట్టు
ఆ. వె అన్ని పనుల నొక్క యతివ సులువుగాను
సేయుచుండ నెంతొ స్పీడు తోడ
మాడరన్ను గాను మాడిఫై యైనట్టి
ఆదిశక్తి రూపమనగ గంటి
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నాయాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వండి పెట్టెడి వేళ వంటింటి మహరాణి
రిప్లయితొలగించండి. ....యన్నపూర్ణయె తాను హంసయాన
విద్యలందు నపుడు విజ్ఞాన ఖనియామె
. ........పలుకుతొయ్యలి గాదె తలిరుబోడి
యిలను గెలిచి జూపు నే వృత్తి నందైన
. ....విజయలక్ష్మి యగును వెలది తాను
సంతసమ్ముగ తాను సంతానలక్ష్మియౌ
. .......కన్న సుతుల గాచు కలువకంటి
సవ్యసాచి వోలె సంధాన కర్తయౌ
నొక్క వనిత జేయు పెక్కు పనులు
నారు రూపులందు నలరారు రుచిరాంగి
యాదిశక్తి గాదె యవని యందు!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
మాతృత్వమునను ప్రేమను
రిప్లయితొలగించండిదాతృత్వమునను పనులను ధాటిగ గెలువన్
నేతృత్వమునను మేటిగ
భ్రాతృత్వము యిలనుపెరగ భాసిల్లుననెన్
ఇల్లును తీర్చిదిద్దుకొను నెంతటి యోర్పుగ నింటిలోని వా
రిప్లయితొలగించండిరెల్లరి బాగు యోగుగను నింతులె యంతటి నేర్పుతోడనే
సెల్లును ల్యాపుటాపులను చేతను బట్టుకు వాడగల్గునా
చల్లని తల్లులీ యిలను సర్వము తాముగ నిండి పోయెగా
ధన్యవాదములు గురువుగారు...
రిప్లయితొలగించండిఇల్లాలి పాలిట పిల్లాడి హోంవర్కు దత్తపదిగ మారఁ దారి జూపి!
రిప్లయితొలగించండితనబాబు యప్రస్తుత ప్రసంగమునకు
పాలపీకనొసగి గోలనాపి!
న్యస్తాక్షరినిబోలు యాఫీసు పనులనుల్యాపుటాపునదీర్చి యార్తిబాపి
సెల్లున భర్త నిషిద్ధాక్షరుల పొల్లు పోకుండ పాటించి బుద్ధిఁ జూపి
కూత గంటా గననమెంచి కుక్కరాపి
మామకొక పురాణపఠన మప్పజెప్పి
పోకిరీ తెచ్చు సమస్యకు పూరణిచ్చి
గుడిని దేవుని వర్ణణఁ గూర్చిపాడ
సతికి సంసారమవధాన గతియె జూడ!
పల్లా నరేంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
భలే! ఎంత చక్కగా స్త్రీల అవధానం గురించి వ్రాశారు. చాలా బాగుంది. అభినందలు.
masaaroo..my poem
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండినిజమే! ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘బాగు నోగులను’ అనండి. అలాగే పద్యం చివర ‘నిండిపోయిరే’ అనండి.