23-4-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”(లేదా...)“కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”
మారుని బారికి గురియై వారిజ నేత్రను వలచియు పరిణయ మాడన్ తోరపు రసికత కున్ మమ కారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తీరవు నీవవి తెంచకభారపు పగ్గములు నరుల పాపపు తనువుల్చేరెద నిను నీపై మమకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
గు రు మూ ర్తి ఆ చా రి ( SYND. BANK ) , వె లు గో డు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,గు రు భ్యో న మః ( దయచేసి మొన్నటి పూరణ స్వీకరించ మనవి )సమస్య = వసుదేవుని గాంచి వాలి పక్కున నవ్వెన్...................................................................................... '' వసుధ '' యను పడతి తన బా వ , " సుదేవుని '' గాంచి వాలి పక్కున నవ్వెన్ , గుసగుస నావిడ చెవిలో హసనము కలిగించు పలుకు లాతడు గొణుగన్ ! ![ వాలి పక్కున నవ్వెన్ = ముందుకు వాలి పడిపడి నవ్వెను : హసనము కలిగించు = నవ్వు పుట్టించు ]***************************************
చేరగమనసులుదగ్గరవీరికనోకటేయనగనుపెంపునుగనగన్భారములేకనుకలసాకారమెప్రేమికులకుఁగనఁగడుముద్దుసుమా
మీరక చెప్పిన మాటలుఊరక పొగడుచును సాగు ఊసుల తోనంవేరవని తియ్యనగు మమకారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమా
పొరపాటు ---- ఊసుల తోనన్
ధోరణి మార్చవె గయ్యాళీ! రయ్యన దుముకకె సతి లీలావతి! సంప్రేరణను జేర్చెడా మమకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!జిలేబి
ధారుణి భోగ భాగ్యములు , దండిగ చేరెడు రత్న రాశులున్, కోరరు వేద వేద్యులును , కోర్కెలు వీడిన వార్కి ముద్దు ఓంకారమె ; యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”జారెడు వాన దేహముల జ్వాలలు రేపుచు ముద్ద సేయగన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
హారము కంఠమందిడగనందము లీను ముఖంబు, కూరలోకారము కొంచెమై విరియ కమ్మని స్వాదువు నందజేయు, సంస్కారము మానవాళి కిడు కాంతియు, నా తెరయీఁగ కంఠ ఝుంకారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమ జంటకున్భారముగాదు జీవనము,భాతములీను నలంకృతిన్ సదా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తారుణ్యమందు కామవికారపు చేష్టలను ప్రేమగా దలచుదురే గారముతో మెదిలెడు సంస్కారమె ప్రేమిలకుఁ గనఁ గడు ముద్దు సుమా.పేరిమి కాదు మోహమది విజ్ఞత వీడుచు ప్రాయమందు శృంగారము గాంచి బేటపు వికారపు చేష్టలె సుమ్మ యంధులై స్వైరము తో చరింపక విచారము గల్గి పరిభ్రమించు సంస్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మారముసేయకన్మనసుపండగసిగ్గులపెళ్లికూతురైసారెకుచూపుసోయగముసందడిసేయగసాధుపుంగవున్గారముమీరుమాటలనుగాండివిగాగనుపల్కరించునాకారమెయెంతోముద్దునయగారములుండినప్రేమజంటకున్
మిత్రులందఱకు నమస్సులు!పూరిత సద్గుణమ్ములును, భూరియశోద్భుతశక్తియుక్తులున్,గౌరవయుక్తపద్ధతులు, గణ్యవిరాజితమూర్తిమత్త్వమున్,ధీరమహత్త్వపూర్ణసువిధేయత వెల్గుచునున్న, వారి సంస్కారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమ జంటకున్!
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
సమస్య :కారమె యెంతొ ముద్దు నయ గారములుండిన ప్రేమజంటకున్ ( అధికజనసంఖ్యతో అవస్థ లెందుకు ?)ఉత్పలమాల ....................మారిన కాలమందు మతి మంతులు మంచిని పంచగావలెన్ ;ఘోరము ; నూటముప్ప దగుకోటులు దాటెను సంఖ్య జూడగా ;మారని నిర్ణయాత్ములయి " మా కొక రంతె " యనంగ గల్గు సం స్కారమె యెంతొ ముద్దు ; నయ గారములుండిన ప్రేమజంటకున్ .
కారణమేమై యున్ననుపోరాడకు మెల్లవేళ పొలతుక తోడన్శ్రీరాముడు సీతా సహకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”
అందరికీ నమస్సులు🙏దూరము నోర్వలే కుభయ దోసము లెంచక కయ్యమందునన్భారము దీరగన్ గలువ భ్రాంతిని వీడుచు నొక్కటాయెనాగారము బోవ నిర్వురును కౌగిట జిత్తగు మోహమం దలం*“కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”**వాణిశ్రీ నైనాల*
క్రొవ్విడి వెంకట రాజారావు: కూరిమి నెంతయు గూడుచుతీరున నొక్కరి కొకరుగ మెలగెడి పసతో దోరుచు ప్రకటించెడి సహ కారమె ప్రేమికులకు గన కడు ముద్దుసుమా!
ఉ: పోరుచు నుండ మాటకును ప్రొద్దున రాత్రులు బెట్టు చేయుచున్సారము శూన్యమై తెలివి చాలక యున్న యనుంగు వారటన్క్షీరము నీరమున్ గలియు జీవన సౌఖ్యమునొంద నో పరిష్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
కారులుమేడలుచూడరువారుగనుదురుతమయెదలవాత్సల్యమునేఆరనిమమతలతమమమ కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
క్రొవ్విడి వెంకట రాజారావు: కూరిమి గూడి త్రిమ్మరుచు కొంచెము నైనను ప్రేమవీడకున్ వేరిమికాని భావమున వీకను సాగుచు ధీమసమ్మునన్ తీరగు రీతినిన్ సతము తీయని నైఖ్యత నెంచునౌ సుసం స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ప్రేమ వీడకే...'
అయ్యయ్యో :(నీరజనేత్ర రాగమయి నెవ్వపు రూపు కరోన కైవడిన్ప్రేరణ కొంత తగ్గవలె క్రీడల వేళల ముద్దులాటలోన్మారిన కాలమిద్ది! భళి మాస్కులు మోమును కప్పుచుండు ప్రాకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్జిలేబి
కారులు మేడలన్ గొనగ కాంతల యార్జన ముద్దుగూర్చుచోదూరుటమాని యింతులను దోషములెంచుచు వంటలందునన్కూరిమి నిత్యకృత్యముల గొమ్మకు సాయముజేయు చిత్తసంస్కారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్
సంస్కారవంతమైన చక్కని పూరణ. అభినందనలు.
ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తీరులు వేరగుగద బంగారమె కాముకులకు గన గడుముద్దు సుమావారి నడుమనుండిన మమకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
బం ? శృం ?
శ్రీ గురుభ్యోనమఃఅందరికీ నమస్కారాలు 🙏కం.బేరము లాడక జీవితసారము తెలియగ నిరువురు సమమని సతమున్ప్రేరణ నిండినదౌ సహకారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమాఅపర్ణ గాడేపల్లి
భూరి ధనంబు మేటి గృహ భూ కనకంబులు నంబరాదులున్కారణమౌనె ప్రీతికిల ? గారవ మద్దిన మంచి మాటలున్వారణ సేయలేని ప్రియ వాక్కులె బంధము గూర్చు నిత్య సాకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
మారుని శరముల ధాటికితీరని తమకమున సొక్కి దెందములందున్వారణనొందని యా మమకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
ప్రేరణరాధకృష్ణులనవెల్లువలెత్తెమనోహరంబువిస్పారితదివ్యలోకమున,సత్యపుబ్రేమమునైక్యమొందగాగారణజన్ములైనిలచిగల్మషమొందనిదత్వమౌనిరాకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్కొరుప్రోలు రాధాకృష్ణరావు
సారముగల బ్రతుకు సంస్కారముగల నడవడియు, సంసారమునన్క్షీరము నీరమువలె మమకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!
దూరపు కొల్వులో ప్రియుడు తోరపుఁ బ్రేమము చూపి మించగానారని కోరికల్ మనసు నారడి పెట్టి దహించు చుండగాప్రేరణ చేయ మన్మథుడు, పెండ్లికి పెద్దలొసంగు నట్టి శ్రీకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
కందంవారించ పెద్దలెల్లరునోరిమితో శంక దీర్చి యొప్పించుచు నవ్వారి, వరించెడు కల సాకారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా! ఉత్పలమాలనేరము గాదు ప్రేమయని నిర్మల మానస చిత్తులై మనన్మీరకుమంచు పెద్దలట మేరలు సెప్పుచు నడ్డగింప నవ్వారలు నొప్పగా మసలి వాంఛిత ప్రేమ వివాహ స్వప్న సాకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
కోరి వరించు వారలతి కోర్కులజోలికి బోక వేదనాభారములుండిన్ సుమన భావముతో దొలిగించుచున్ సదాకూరిమితోడ కాపురము గువ్వల తీరుగ సాగ నిత్య సాకారమె యెంతొ ముద్దు నయగారములుండిన ప్రేమ జంటకున్
మారుని ప్రేరణ చేతనుజేరగ దాభర్తదరికిచిత్తమునలరన్ తోరమువశమైమన,మమకారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా
కోరుదురెల్లవేళలను కూరిమి యొండొరులందు మెండుగన్వేరుతలంపులుండవిక వేమరు నేమరుపాటు నొందుచున్వారిది వేరు లోకమని భావనజేసెదరట్టిదౌ సుసంస్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
భారము కా దెన్నం డవిచారపు సుద్దులు వలికిన సమ్మతములు సూవారక దెందమ్ముల మమకారమె ప్రేమించినఁ గనఁ గడు ముద్దు సుమా (కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా) కోరినవాఁడు భర్తగను గోమలి కింపుగ దక్క మిక్కిలిన్ మూరదె డెంద మందుఁ దగఁ బొంగుచు నిత్యము హర్ష మెంచఁగన్ వారక యుండ దీవనలు పన్నుగఁ బెండ్లికిఁ బెద్దవారి స్వీకారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ పక్షికిన్
మఱొక పూరణము:వజ్ఝలవారికి నమస్సులతో...కారమె కూరకున్ సొగసు; కమ్రసువాఙ్మృదురూపవాక్య సంస్కారమె పూరుషాళి రుచి; సన్నియమాఢ్యవినమ్రతోన్నమస్కారమె మాన్యు కిచ్చు నగ; సద్వరవస్త్రయుతమ్మునౌ నలంకారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమజంటకున్!
భారకుచమ్ములొప్పుసతిబాహుపటుత్వము పాతికొప్ప సొంపారెడి కౌను శోభనకు, వర్ధిల శ్రీపతి పద్మనాభుడైప్రేరిత రాసలీల మురిపించగ మల్లెల పాన్పు *మన్మథా**కారమె, యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్*తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
కోరి పరస్పరంబు దగ గూరిమి మీరగ నూసులాడుచున్చేరువయైన డెందముల చిందెడి మోజుల లొంగిపోవకన్తీరుగ పాణిబంధమున దీవెనలన్ గొను దాఁక నొప్పుగాదూరమె మేలటంచు ధృతితో పచరించెడి చక్కనైన సంస్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
మీరక హద్దులెన్నడు మమేకపుభావన గల్గునట్టిసంస్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్ గోరినవాడు భర్తగనుగూర్మి లభీంచుట యోగమేకదాపారమునొందవీలగును భవ్యతరాలకు వీరిసర్గముల్
కేరున నేడ్చుచున్ దనదు కేళులజాపుచు నేత్తుకొమ్మనున్ చారెడు కన్నులన్ మెఱయు చక్కని దృక్కులముద్దులొల్కెడిన్ఔరస పుత్రునిన్ గనగ నర్రుల జాచెడు మంచిస్వప్న సాకారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్
కోరిన వనితయె సతియై తీరుగ కాపురము చేయ తేలుచు ముదమున్కూరిమితోచూపినమమకారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా.
మారుని బారికి గురియై
రిప్లయితొలగించండివారిజ నేత్రను వలచియు పరిణయ మాడన్
తోరపు రసికత కున్ మమ
కారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితీరవు నీవవి తెంచక
రిప్లయితొలగించండిభారపు పగ్గములు నరుల పాపపు తనువుల్
చేరెద నిను నీపై మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి ( SYND. BANK ) , వె లు గో డు
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
గు రు భ్యో న మః ( దయచేసి మొన్నటి పూరణ స్వీకరించ మనవి )
సమస్య = వసుదేవుని గాంచి వాలి పక్కున నవ్వెన్
......................................................................................
'' వసుధ '' యను పడతి తన బా
వ , " సుదేవుని '' గాంచి వాలి పక్కున నవ్వెన్ ,
గుసగుస నావిడ చెవిలో
హసనము కలిగించు పలుకు లాతడు గొణుగన్ ! !
[ వాలి పక్కున నవ్వెన్ = ముందుకు వాలి పడిపడి నవ్వెను :
హసనము కలిగించు = నవ్వు పుట్టించు ]
***************************************
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేరగమనసులుదగ్గర
రిప్లయితొలగించండివీరికనోకటేయనగనుపెంపునుగనగన్
భారములేకనుకలసా
కారమెప్రేమికులకుఁగనఁగడుముద్దుసుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరక చెప్పిన మాటలు
రిప్లయితొలగించండిఊరక పొగడుచును సాగు ఊసుల తోనం
వేరవని తియ్యనగు మమ
కారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమా
పొరపాటు ---- ఊసుల తోనన్
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధోరణి మార్చవె గయ్యా
ళీ! రయ్యన దుముకకె సతి లీలావతి! సం
ప్రేరణను జేర్చెడా మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధారుణి భోగ భాగ్యములు , దండిగ చేరెడు రత్న రాశులున్,
రిప్లయితొలగించండికోరరు వేద వేద్యులును , కోర్కెలు వీడిన వార్కి ముద్దు ఓం
కారమె ; యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”
జారెడు వాన దేహముల జ్వాలలు రేపుచు ముద్ద సేయగన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహారము కంఠమందిడగ
రిప్లయితొలగించండినందము లీను ముఖంబు, కూరలో
కారము కొంచెమై విరియ
కమ్మని స్వాదువు నందజేయు, సం
స్కారము మానవాళి కిడు
కాంతియు, నా తెరయీఁగ కంఠ ఝుం
కారమె యెంతొ ముద్దు, నయ
గారము లుండిన ప్రేమ జంటకున్
భారముగాదు జీవనము,
భాతములీను నలంకృతిన్ సదా!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితారుణ్యమందు కామవి
కారపు చేష్టలను ప్రేమగా దలచుదురే
గారముతో మెదిలెడు సం
స్కారమె ప్రేమిలకుఁ గనఁ గడు ముద్దు సుమా.
పేరిమి కాదు మోహమది విజ్ఞత వీడుచు ప్రాయమందు శృం
గారము గాంచి బేటపు వికారపు చేష్టలె సుమ్మ యంధులై
స్వైరము తో చరింపక విచారము గల్గి పరిభ్రమించు సం
స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమారముసేయకన్మనసుపండగసిగ్గులపెళ్లికూతురై
రిప్లయితొలగించండిసారెకుచూపుసోయగముసందడిసేయగసాధుపుంగవున్
గారముమీరుమాటలనుగాండివిగాగనుపల్కరించునా
కారమెయెంతోముద్దునయగారములుండినప్రేమజంటకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిపూరిత సద్గుణమ్ములును, భూరియశోద్భుతశక్తియుక్తులున్,
గౌరవయుక్తపద్ధతులు, గణ్యవిరాజితమూర్తిమత్త్వమున్,
ధీరమహత్త్వపూర్ణసువిధేయత వెల్గుచునున్న, వారి సం
స్కారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమ జంటకున్!
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండికారమె యెంతొ ముద్దు నయ
గారములుండిన ప్రేమజంటకున్
( అధికజనసంఖ్యతో అవస్థ లెందుకు ?)
ఉత్పలమాల
....................
మారిన కాలమందు మతి
మంతులు మంచిని పంచగావలెన్ ;
ఘోరము ; నూటముప్ప దగు
కోటులు దాటెను సంఖ్య జూడగా ;
మారని నిర్ణయాత్ములయి
" మా కొక రంతె " యనంగ గల్గు సం
స్కారమె యెంతొ ముద్దు ; నయ
గారములుండిన ప్రేమజంటకున్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికారణమేమై యున్నను
రిప్లయితొలగించండిపోరాడకు మెల్లవేళ పొలతుక తోడన్
శ్రీరాముడు సీతా సహ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిదూరము నోర్వలే కుభయ దోసము లెంచక కయ్యమందునన్
భారము దీరగన్ గలువ భ్రాంతిని వీడుచు నొక్కటాయెనా
గారము బోవ నిర్వురును కౌగిట జిత్తగు మోహమం దలం
*“కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్”*
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికూరిమి నెంతయు గూడుచు
తీరున నొక్కరి కొకరుగ మెలగెడి పసతో
దోరుచు ప్రకటించెడి సహ
కారమె ప్రేమికులకు గన కడు ముద్దుసుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిపోరుచు నుండ మాటకును ప్రొద్దున రాత్రులు బెట్టు చేయుచున్
సారము శూన్యమై తెలివి చాలక యున్న యనుంగు వారటన్
క్షీరము నీరమున్ గలియు జీవన సౌఖ్యమునొంద నో పరి
ష్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికారులుమేడలుచూడరు
రిప్లయితొలగించండివారుగనుదురుతమయెదలవాత్సల్యమునే
ఆరనిమమతలతమమమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికూరిమి గూడి త్రిమ్మరుచు కొంచెము నైనను ప్రేమవీడకున్
వేరిమికాని భావమున వీకను సాగుచు ధీమసమ్మునన్
తీరగు రీతినిన్ సతము తీయని నైఖ్యత నెంచునౌ సుసం
స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రేమ వీడకే...'
రిప్లయితొలగించండిఅయ్యయ్యో :(
నీరజనేత్ర రాగమయి నెవ్వపు రూపు కరోన కైవడిన్
ప్రేరణ కొంత తగ్గవలె క్రీడల వేళల ముద్దులాటలోన్
మారిన కాలమిద్ది! భళి మాస్కులు మోమును కప్పుచుండు ప్రా
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికారులు మేడలన్ గొనగ కాంతల యార్జన ముద్దుగూర్చుచో
రిప్లయితొలగించండిదూరుటమాని యింతులను దోషములెంచుచు వంటలందునన్
కూరిమి నిత్యకృత్యముల గొమ్మకు సాయముజేయు చిత్తసం
స్కారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్
సంస్కారవంతమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితీరులు వేరగుగద బం
రిప్లయితొలగించండిగారమె కాముకులకు గన గడు
ముద్దు సుమా
వారి నడుమనుండిన మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబం ? శృం ?
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యోనమః
రిప్లయితొలగించండిఅందరికీ నమస్కారాలు 🙏
కం.
బేరము లాడక జీవిత
సారము తెలియగ నిరువురు సమమని సతమున్
ప్రేరణ నిండినదౌ సహ
కారమె ప్రేమికులకు గన కడు ముద్దు సుమా
అపర్ణ గాడేపల్లి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభూరి ధనంబు మేటి గృహ భూ కనకంబులు నంబరాదులున్
రిప్లయితొలగించండికారణమౌనె ప్రీతికిల ? గారవ మద్దిన మంచి మాటలున్
వారణ సేయలేని ప్రియ వాక్కులె బంధము గూర్చు నిత్య సా
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
మారుని శరముల ధాటికి
రిప్లయితొలగించండితీరని తమకమున సొక్కి దెందములందున్
వారణనొందని యా మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా
ప్రేరణరాధకృష్ణులనవెల్లువలెత్తెమనోహరంబువి
రిప్లయితొలగించండిస్పారితదివ్యలోకమున,సత్యపుబ్రేమమునైక్యమొందగా
గారణజన్ములైనిలచిగల్మషమొందనిదత్వమౌనిరా
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
సారముగల బ్రతుకు సం
రిప్లయితొలగించండిస్కారముగల నడవడియు, సంసారమునన్
క్షీరము నీరమువలె మమ
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!
దూరపు కొల్వులో ప్రియుడు తోరపుఁ బ్రేమము చూపి మించగా
రిప్లయితొలగించండినారని కోరికల్ మనసు నారడి పెట్టి దహించు చుండగా
ప్రేరణ చేయ మన్మథుడు, పెండ్లికి పెద్దలొసంగు నట్టి శ్రీ
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
కందం
రిప్లయితొలగించండివారించ పెద్దలెల్లరు
నోరిమితో శంక దీర్చి యొప్పించుచు న
వ్వారి, వరించెడు కల సా
కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా!
ఉత్పలమాల
నేరము గాదు ప్రేమయని నిర్మల మానస చిత్తులై మనన్
మీరకుమంచు పెద్దలట మేరలు సెప్పుచు నడ్డగింప న
వ్వారలు నొప్పగా మసలి వాంఛిత ప్రేమ వివాహ స్వప్న సా
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
కోరి వరించు వారలతి కోర్కుల
రిప్లయితొలగించండిజోలికి బోక వేదనా
భారములుండిన్ సుమన భా
వముతో దొలిగించుచున్ సదా
కూరిమితోడ కాపురము గువ్వ
ల తీరుగ సాగ నిత్య సా
కారమె యెంతొ ముద్దు నయ
గారములుండిన ప్రేమ జంటకున్
మారుని ప్రేరణ చేతను
రిప్లయితొలగించండిజేరగ దాభర్తదరికిచిత్తమునలరన్
తోరమువశమైమన,మమ
కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా
కోరుదురెల్లవేళలను కూరిమి యొండొరులందు మెండుగన్
రిప్లయితొలగించండివేరుతలంపులుండవిక వేమరు నేమరుపాటు నొందుచున్
వారిది వేరు లోకమని భావనజేసెదరట్టిదౌ సుసం
స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
భారము కా దెన్నం డవి
రిప్లయితొలగించండిచారపు సుద్దులు వలికిన సమ్మతములు సూ
వారక దెందమ్ముల మమ
కారమె ప్రేమించినఁ గనఁ గడు ముద్దు సుమా
(కారమె ప్రేమికులకుఁ గనఁ గడు ముద్దు సుమా)
కోరినవాఁడు భర్తగను గోమలి కింపుగ దక్క మిక్కిలిన్
మూరదె డెంద మందుఁ దగఁ బొంగుచు నిత్యము హర్ష మెంచఁగన్
వారక యుండ దీవనలు పన్నుగఁ బెండ్లికిఁ బెద్దవారి స్వీ
కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ పక్షికిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమఱొక పూరణము:
రిప్లయితొలగించండివజ్ఝలవారికి నమస్సులతో...
కారమె కూరకున్ సొగసు; కమ్రసువాఙ్మృదురూపవాక్య సం
స్కారమె పూరుషాళి రుచి; సన్నియమాఢ్యవినమ్రతోన్నమ
స్కారమె మాన్యు కిచ్చు నగ; సద్వరవస్త్రయుతమ్మునౌ నలం
కారమె యెంతొ ముద్దు, నయగారము లుండిన ప్రేమజంటకున్!
భారకుచమ్ములొప్పుసతి
రిప్లయితొలగించండిబాహుపటుత్వము పాతికొప్ప సొం
పారెడి కౌను శోభనకు, వర్ధిల శ్రీపతి పద్మనాభుడై
ప్రేరిత రాసలీల మురిపించగ మల్లెల పాన్పు *మన్మథా*
*కారమె, యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
కోరి పరస్పరంబు దగ గూరిమి మీరగ నూసులాడుచున్
రిప్లయితొలగించండిచేరువయైన డెందముల చిందెడి మోజుల లొంగిపోవకన్
తీరుగ పాణిబంధమున దీవెనలన్ గొను దాఁక నొప్పుగా
దూరమె మేలటంచు ధృతితో పచరించెడి చక్కనైన సం
స్కారమె యెంతొ ముద్దు నయగారము లుండిన ప్రేమ జంటకున్
మీరక హద్దులెన్నడు మమేకపుభావన గల్గునట్టిసం
రిప్లయితొలగించండిస్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్
గోరినవాడు భర్తగనుగూర్మి లభీంచుట యోగమేకదా
పారమునొందవీలగును భవ్యతరాలకు వీరిసర్గముల్
కేరున నేడ్చుచున్ దనదు కేళులజాపుచు నేత్తుకొమ్మనున్
రిప్లయితొలగించండిచారెడు కన్నులన్ మెఱయు చక్కని దృక్కుల
ముద్దులొల్కెడిన్
ఔరస పుత్రునిన్ గనగ నర్రుల జాచెడు మంచి
స్వప్న సా
కారమె యెంతొముద్దు నయగారము లుండిన ప్రేమజంటకున్
కోరిన వనితయె సతియై
రిప్లయితొలగించండితీరుగ కాపురము చేయ తేలుచు ముదమున్
కూరిమితోచూపినమమ
కారమె ప్రేమికులకు గన గడు ముద్దు సుమా.