7-4-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ”
(లేదా...)
“సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:తేకువ మీర పెండ్లిగొని తీరిచి దిద్దెడి సాఫ్టువేరునన్ ప్రాకట మొందినన్ సతిని బంగరు బొమ్మవు నీవటంచునున్వేకువనందు లేచి కడు ప్రీతిని బోవుచు మందు కొట్టులన్ సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
__/\__
మిత్రులందఱకు నమస్సులు!ఆఁకలితోడి రోదనల నమ్మనుఁ బిల్వఁగ మాటి మాటికిన్;వ్యాకుల చిత్తయై మగని వైపునఁ జూడఁగఁ; దత్తఱిల్లి, తాసాఁకఁగ లేక బిడ్డలను, సాకులఁ జెప్పెడివాఁడె భర్తయౌనే? కడు దుష్టుఁడున్ ఖలుఁడు హీనుఁడునుం బదయుగ్మజంతువౌ!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నమఃపూర్వక ధన్యవాదాలండీ!
మైలవరపు వారి పూరణ ఆకలికేకలన్ వినగనమ్మగ నా మది బాధనొందె., చీకాకుల కాకిగోల యన కాపురముండెను., ద్వారకాపురిన్నీకొక మిత్రుడుండెనతనిన్ గన బొమ్ము., ధనమ్ము దెమ్మిలన్సాకగలేక బిడ్డలను సాకుల జెప్పెడివాడెయభర్తయౌ!!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
లంచమడుగనుమాటునలావులేదుధర్మమెంచుచుజీవించుధరణియందుకూడుగుడ్డలనీరీతిఁగూర్చలేడుసాకలేకబిడ్డలఁజెప్పెసాకులెన్నో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలునొక్కడు సుతుడని యేలయనిరి; లక్షణముగ తమ్ముని సుతులకు సగమ్ముభాగమునడుగ రాజేమి బదులు తెలిపెసాఁక లేక బిడ్డలఁ ; జెప్పె సాకులెన్నొ”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
భారమయ్యెనుసాపాటు భార్యపోరుచదువు వైద్యమున్యాయమ్ము నదుపుదప్పెదాచినదితస్కరులపాలి ధైర్యముడిగిసాఁకలేకబిడ్డలఁజెప్పె సాకులెన్నొ
చీకటిచాటు కార్యముల జిక్కిన వాడయి దుష్టచిత్తమున్ పీకలదాక త్రాగి తనపిల్లల తల్లిని చంపివేసి, వారాకలి కాగలేరనుచు యర్భకులంచును, కొత్తభార్యకైసాకగలేక బిడ్డలను, సాకుల జెప్పెడివాడె భర్తయౌ
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
సమస్య : సాకగ లేక బిడ్డలను సాకుల జెప్పెడివాడె భర్తయౌ ( కోకిలమ్మ కోకిలయ్యతో )ఉత్పలమాల ,,,,,,,,,,,,,,,,,,,,,,ఆకుల సందుసందునను అందము చిందగ గెంతుచుందువే !ఆకులపాటు చెంద కిటు నందరి బిడ్డల సృష్టిజేతువే !కాకుల గూట నుంచుటకు కాతరమందవు ; హా ! పతీశ్వరా !సాకగ లేక బిడ్డలను సాకుల జెప్పెడివాడె భర్తయౌ .
భర్త సహకార మందని భార్య యొకతె పలు విధమ్ముల రోగాలు బాధ పెట్ట సంతు వలదని కొనియును సాధ్వి తాను సాక లేక బిడ్డల జెప్పె సాకు లెన్నొ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉ: ఏకము జేసి సర్వమునె యిచ్చెను దానముసత్యసంధుడేప్రాకట మొందె సత్య పరి పాలనమందున, సత్య నిష్ఠకున్వ్యాకులమంది తా వదిలె పత్నియు పుత్రుని పోషణార్థమైసాకగలేక బిడ్డలను, సాకుల జెప్పెడివాడె భర్తయౌవై. చంద్రశేఖర్
ధన్యవాదములు
వేఁకటి వచ్చినన్ సఖియ వేదన తప్పద టంచెఱంగుమా నీకది తెచ్చు కష్టములు నెయ్యము వాడుట సత్యమే కదా శ్రీకరి యాలకించుమిది చిక్కులనెందుకు కోరుకదువే సాఁకగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాడె భర్తయౌ.
మీరునాకు బిడ్డల వంటి వారనుచునెపలువిధముల బ్రోచెదనని పలికి, గద్దెనెక్కి నట్టి యానాయకుడిందుమీదసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
అందరికీ నమస్సులు 🙏ఆకసమంత యోర్పుగల యమ్మకు చుక్కలు చూపు పిల్లలున్లోకువ గట్టి పెద్దలకు లోటుల నెంచుచు జిన్నబుచ్చగాదేకువ లేని యామగని తీరును జూడగ నిట్లు తోచెడిన్*సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ”**వాణిశ్రీ నైనాల*
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!హు! హు! హు! నువ్వు మగాడివే? హుంక రించెపట్నపు జిలేబి! బెదిరెను పాప మా పెనిమిటి! గడగడ వణికెను నీరసపడి!జిలేబి
నాకము భూమి చేరెను త్సునామిని చేర్చెను ప్రత్యహమ్ము! హా!శోకము తీరునెప్పుడకొ! సూనృతమెప్పుడు దక్కు జీవికిన్!చాకలి జీవితమ్ము ! మరి చాలని జీతము! కస్తి గంపెడౌ!సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ!జిలేబి
పడిలేచెడు సంద్రపుటడలడి! సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్త యౌరా?సుడిగుండములోన బతుకు సున్నమయెనురా!జిలేబి
సిటీ లైట్స్ అండ్ లైఫ్!బడుగు జీవి పయనమయ్యె బడిత పూజలయ్యె దేవుని దీవెనలౌర ! నరుడుయొంటి కంబపు మేడలో యొప్పలేకసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!జిలేబి
తొండమును పెంచి నా పాము తోక లాగినాడొక తనయు డనుచుండె, మాడు పైన సేద తీరెడు గంగను బాది నాడుమరొక బిడ్డడని పలుమార్లరచు చుండెకునుకు తీయతలచి తనకు నొసగంగసాక లేక బిడ్డల జెప్పె సాకులెన్నొయనుచు నగజ తన వెతను హరికి తెలిపె
చీకును చింతయున్ విడచి శ్రీరమణీపతి యొక్క భక్తుడైలోకపు పోకడల్ కనక లోభమొకింతయు లేక తృప్తుడైప్రాకెడి వారినందరిని బ్రహ్మముగా గని వేరు దృష్టితో సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
ధరలు నింగినిదాకెను ధరను వీడిబ్రతుకు బండిని లాగుట భారమాయెసంతులేదని తనవారు చింతవడగసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
ఆకలి బాధతోనలగునా పసివారల నచ్చలించునే సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె; భర్తయౌతేకువ దోడ కాపురము దీర్చుచు భార్యను కన్న బిడ్డలన్సాకు సమర్ధు డాతనికి చక్కగ నెల్లరు దోడు నిల్తురే
పేకలరాయుడై సిరుల పెంచక జూదము నందుపోవ్యాకులచిత్తుడై గుమిలె వ్యధను భార్యయు పిల్లలందరిన్ఆఁకలితోడి రోదనల నమ్మనుఁ బిల్వఁగ మాటి మాటికిన్ సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
Pl ignore this 👆
తేటగీతిచదువుకొనుమని తలిదండ్రి వదలివైచవసతి గృహమున బాల్యాన వగపుఁ జెంది,యాలి గోరఁగ భర్త నేడట్టులుంచిసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొఉత్పలమాలశ్రీ కరుణించ దాయె నిను సేయ ప్రయత్నము విత్తమార్జనన్మీ కసికందులున్ జదువుమేరకు మా గృహమందునుంచుమన్శ్రీకరమొల్కు బావఁగని శ్రీమతి మెచ్చ పరాయి పంచలన్సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
దాతలు కఱవు కాఁగ బాధ సెలఁగ నెద నా యనాథాశ్రమము నందు నందఱి నిఁక, దారి లేక యిం కెద్దియుఁ దనకుఁ దాన, సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ వీఁకను బెండ్లియాడి తగు ప్రీతిని దారకుఁ దీర్చి కోరికల్ తాఁకఁగ లేక యంబరముఁ దాఁకు సమున్నత వాంచితమ్ములం బ్రాఁకుచు నంత జానువుల భార్యను జక్కఁగ నూఱడించుచున్ సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలనపగలు గడుచుటబహుభార మగుట,సరిగసాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొతల్లిదండ్రుల బాధలు దరమె చెప్ప
చీకటి కాలముం గడుపు చిత్తవి కారుడు జీవితాంతమున్నాక లి చేత బాధ పడె డాలికిబుక్కెడు బువ్వ పెట్టియున్సాకగ లేక బిడ్డలను సాకులు జెప్పెడు వాడు భర్తయౌనే! కరుణా విహీనుడయి యెప్పుడు సౌఖ్య మొనర్చకుండినన్.
ఆకలిగొన్న పిల్లలకు హాళిగ నన్నము వండబోవగన్నూకలు లేక మానసము నొవ్వగ నోపగలేని వేళనన్రూకల నప్పు నివ్వమని లోకులు జెప్పగ నిందుమీదగన్సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
పగలు రేయి త్రాగుచునుండి బాధ్యతలనువీడి తిరుగుచుండి సతము వీధులందుకారణము లేక భార్యతో కలహమాడి*సాక లేక బిడ్డల చెప్పు సాకులెన్నొ.*
ఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనేసాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?సాకగ దప్పదేరికిని సంతును గాయముకష్ట మైననున్నీకలికాలమంతయును నిట్లుగనుండును జెప్పనేటికిన్
చాకిరి చేసి పోషణము సల్పుచు నుండగ భార్య, త్రాగుచున్పాకలలోనచేరి, మురిపమ్మును పంచుచు వేశ్య కెప్పుడున్చీకటి కార్యముల్ సలిపి చిక్కులు బెట్టుచు నుండ నెవ్విధిన్సాకగలేక బిడ్డలను సాకుల జెప్పెడి వాడె భర్తయౌ?
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
తేకువ మీర పెండ్లిగొని తీరిచి దిద్దెడి సాఫ్టువేరునన్
ప్రాకట మొందినన్ సతిని బంగరు బొమ్మవు నీవటంచునున్
వేకువనందు లేచి కడు ప్రీతిని బోవుచు మందు కొట్టులన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండి__/\__
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిఆఁకలితోడి రోదనల నమ్మనుఁ బిల్వఁగ మాటి మాటికిన్;
వ్యాకుల చిత్తయై మగని వైపునఁ జూడఁగఁ; దత్తఱిల్లి, తా
సాఁకఁగ లేక బిడ్డలను, సాకులఁ జెప్పెడివాఁడె భర్తయౌ
నే? కడు దుష్టుఁడున్ ఖలుఁడు హీనుఁడునుం బదయుగ్మజంతువౌ!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండినమఃపూర్వక ధన్యవాదాలండీ!
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆకలికేకలన్ వినగనమ్మగ నా మది బాధనొందె., చీ
కాకుల కాకిగోల యన కాపురముండెను., ద్వారకాపురిన్
నీకొక మిత్రుడుండెనతనిన్ గన బొమ్ము., ధనమ్ము దెమ్మిలన్
సాకగలేక బిడ్డలను సాకుల జెప్పెడివాడెయభర్తయౌ!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిలంచమడుగనుమాటునలావులేదు
రిప్లయితొలగించండిధర్మమెంచుచుజీవించుధరణియందు
కూడుగుడ్డలనీరీతిఁగూర్చలేడు
సాకలేకబిడ్డలఁజెప్పెసాకులెన్నో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచాలునొక్కడు సుతుడని యేలయనిరి;
రిప్లయితొలగించండిలక్షణముగ తమ్ముని సుతులకు సగమ్ము
భాగమునడుగ రాజేమి బదులు తెలిపె
సాఁక లేక బిడ్డలఁ ; జెప్పె సాకులెన్నొ”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారమయ్యెనుసాపాటు భార్యపోరు
రిప్లయితొలగించండిచదువు వైద్యమున్యాయమ్ము నదుపుదప్పె
దాచినదితస్కరులపాలి ధైర్యముడిగి
సాఁకలేకబిడ్డలఁజెప్పె సాకులెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచీకటిచాటు కార్యముల జిక్కిన వాడయి దుష్టచిత్తమున్
రిప్లయితొలగించండిపీకలదాక త్రాగి తనపిల్లల తల్లిని చంపివేసి, వా
రాకలి కాగలేరనుచు యర్భకులంచును, కొత్తభార్యకై
సాకగలేక బిడ్డలను, సాకుల జెప్పెడివాడె భర్తయౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిసాకగ లేక బిడ్డలను
సాకుల జెప్పెడివాడె భర్తయౌ
( కోకిలమ్మ కోకిలయ్యతో )
ఉత్పలమాల
,,,,,,,,,,,,,,,,,,,,,,
ఆకుల సందుసందునను
అందము చిందగ గెంతుచుందువే !
ఆకులపాటు చెంద కిటు
నందరి బిడ్డల సృష్టిజేతువే !
కాకుల గూట నుంచుటకు
కాతరమందవు ; హా ! పతీశ్వరా !
సాకగ లేక బిడ్డలను
సాకుల జెప్పెడివాడె భర్తయౌ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభర్త సహకార మందని భార్య యొకతె
రిప్లయితొలగించండిపలు విధమ్ముల రోగాలు బాధ పెట్ట
సంతు వలదని కొనియును సాధ్వి తాను
సాక లేక బిడ్డల జెప్పె సాకు లెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:
తొలగించండిఏకము జేసి సర్వమునె యిచ్చెను దానముసత్యసంధుడే
ప్రాకట మొందె సత్య పరి పాలనమందున, సత్య నిష్ఠకున్
వ్యాకులమంది తా వదిలె పత్నియు పుత్రుని పోషణార్థమై
సాకగలేక బిడ్డలను, సాకుల జెప్పెడివాడె భర్తయౌ
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివేఁకటి వచ్చినన్ సఖియ వేదన తప్పద టంచెఱంగుమా
రిప్లయితొలగించండినీకది తెచ్చు కష్టములు నెయ్యము వాడుట సత్యమే కదా
శ్రీకరి యాలకించుమిది చిక్కులనెందుకు కోరుకదువే
సాఁకగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాడె భర్తయౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరునాకు బిడ్డల వంటి వారనుచునె
రిప్లయితొలగించండిపలువిధముల బ్రోచెదనని పలికి, గద్దె
నెక్కి నట్టి యానాయకుడిందుమీద
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు 🙏
రిప్లయితొలగించండిఆకసమంత యోర్పుగల యమ్మకు చుక్కలు చూపు పిల్లలున్
లోకువ గట్టి పెద్దలకు లోటుల నెంచుచు జిన్నబుచ్చగా
దేకువ లేని యామగని తీరును జూడగ నిట్లు తోచెడిన్
*సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ”*
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!
హు! హు! హు! నువ్వు మగాడివే? హుంక రించె
పట్నపు జిలేబి! బెదిరెను పాప మా పె
నిమిటి! గడగడ వణికెను నీరసపడి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినాకము భూమి చేరెను త్సునామిని చేర్చెను ప్రత్యహమ్ము! హా!
శోకము తీరునెప్పుడకొ! సూనృతమెప్పుడు దక్కు జీవికిన్!
చాకలి జీవితమ్ము ! మరి చాలని జీతము! కస్తి గంపెడౌ!
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపడిలేచెడు సంద్రపుటడ
లడి! సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జె
ప్పెడి వాఁడె భర్త యౌరా?
సుడిగుండములోన బతుకు సున్నమయెనురా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసిటీ లైట్స్ అండ్ లైఫ్!
బడుగు జీవి పయనమయ్యె బడిత పూజ
లయ్యె దేవుని దీవెనలౌర ! నరుడు
యొంటి కంబపు మేడలో యొప్పలేక
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితొండమును పెంచి నా పాము తోక లాగి
రిప్లయితొలగించండినాడొక తనయు డనుచుండె, మాడు పైన
సేద తీరెడు గంగను బాది నాడు
మరొక బిడ్డడని పలుమా
ర్లరచు చుండె
కునుకు తీయతలచి తనకు నొసగంగ
సాక లేక బిడ్డల జెప్పె సాకులెన్నొ
యనుచు నగజ తన వెతను హరికి తెలిపె
చీకును చింతయున్ విడచి శ్రీరమణీపతి యొక్క భక్తుడై
రిప్లయితొలగించండిలోకపు పోకడల్ కనక లోభమొకింతయు లేక తృప్తుడై
ప్రాకెడి వారినందరిని బ్రహ్మముగా గని వేరు దృష్టితో
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
ధరలు నింగినిదాకెను ధరను వీడి
రిప్లయితొలగించండిబ్రతుకు బండిని లాగుట భారమాయె
సంతులేదని తనవారు చింతవడగ
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
ఆకలి బాధతోనలగునా పసివారల నచ్చలించునే
రిప్లయితొలగించండిసాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె; భర్తయౌ
తేకువ దోడ కాపురము దీర్చుచు భార్యను కన్న బిడ్డలన్
సాకు సమర్ధు డాతనికి చక్కగ నెల్లరు దోడు నిల్తురే
పేకలరాయుడై సిరుల పెంచక జూదము నందుపో
రిప్లయితొలగించండివ్యాకులచిత్తుడై గుమిలె వ్యధను భార్యయు పిల్లలందరిన్
ఆఁకలితోడి రోదనల నమ్మనుఁ బిల్వఁగ మాటి మాటికిన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
Pl ignore this 👆
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచదువుకొనుమని తలిదండ్రి వదలివైచ
వసతి గృహమున బాల్యాన వగపుఁ జెంది,
యాలి గోరఁగ భర్త నేడట్టులుంచి
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
ఉత్పలమాల
శ్రీ కరుణించ దాయె నిను సేయ ప్రయత్నము విత్తమార్జనన్
మీ కసికందులున్ జదువుమేరకు మా గృహమందునుంచుమన్
శ్రీకరమొల్కు బావఁగని శ్రీమతి మెచ్చ పరాయి పంచలన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
దాతలు కఱవు కాఁగ బాధ సెలఁగ నెద
రిప్లయితొలగించండినా యనాథాశ్రమము నందు నందఱి నిఁక,
దారి లేక యిం కెద్దియుఁ దనకుఁ దాన,
సాఁక లేక బిడ్డలఁ జెప్పె సాకులెన్నొ
వీఁకను బెండ్లియాడి తగు ప్రీతిని దారకుఁ దీర్చి కోరికల్
తాఁకఁగ లేక యంబరముఁ దాఁకు సమున్నత వాంచితమ్ములం
బ్రాఁకుచు నంత జానువుల భార్యను జక్కఁగ నూఱడించుచున్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలన
రిప్లయితొలగించండిపగలు గడుచుటబహుభార మగుట,సరిగ
సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ
తల్లిదండ్రుల బాధలు దరమె చెప్ప
చీకటి కాలముం గడుపు చిత్త
రిప్లయితొలగించండివి కారుడు జీవితాంతము
న్నాక లి చేత బాధ పడె డాలికి
బుక్కెడు బువ్వ పెట్టియున్
సాకగ లేక బిడ్డలను సాకులు
జెప్పెడు వాడు భర్తయౌ
నే! కరుణా విహీనుడయి యెప్పు
డు సౌఖ్య మొనర్చకుండినన్.
ఆకలిగొన్న పిల్లలకు హాళిగ నన్నము వండబోవగన్
రిప్లయితొలగించండినూకలు లేక మానసము నొవ్వగ నోపగలేని వేళనన్
రూకల నప్పు నివ్వమని లోకులు జెప్పగ నిందుమీదగన్
సాఁకఁగ లేక బిడ్డలను సాకులఁ జెప్పెడి వాఁడె భర్తయౌ
రిప్లయితొలగించండిపగలు రేయి త్రాగుచునుండి బాధ్యతలను
వీడి తిరుగుచుండి సతము వీధులందు
కారణము లేక భార్యతో కలహమాడి
*సాక లేక బిడ్డల చెప్పు సాకులెన్నొ.*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనే
రిప్లయితొలగించండిసాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?
సాకగ దప్పదేరికిని సంతును గాయముకష్ట మైననున్
నీకలికాలమంతయును నిట్లుగనుండును జెప్పనేటికిన్
చాకిరి చేసి పోషణము సల్పుచు నుండగ భార్య, త్రాగుచున్
రిప్లయితొలగించండిపాకలలోనచేరి, మురిపమ్మును పంచుచు వేశ్య కెప్పుడున్
చీకటి కార్యముల్ సలిపి చిక్కులు బెట్టుచు నుండ నెవ్విధిన్
సాకగలేక బిడ్డలను సాకుల జెప్పెడి వాడె భర్తయౌ?