20, ఫిబ్రవరి 2022, ఆదివారం

సమస్య - 3998

21-2-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా”
(లేదా...)
“గంగను గానకుంటివి సఖా యిఁకఁ దప్పవు కష్టనష్టముల్”

18 కామెంట్‌లు:

  1. కందం
    గంగాధరుండు వరమి
    వ్వంగా భూమిపయి జేరె భాగీరథి, ఘో
    రంగ నదికి చేటు సలుప
    గంగను గానవిక నీకు గష్టములె గదా
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  2. అంగన కిచ్చినమాటను
    భంగముజేసియునరపతి,ప్రశ్నించితివా
    ఛంగునవెనుకకుబాఱెను
    గంగనుగానవిక నీకు కష్టముల గదా

    రిప్లయితొలగించండి
  3. అంగన బలికెను బతితో
    చెo గట నదిలోన నీద చేరిన సుతుడు న్
    ఖంగు తిని యు దా నట మును
    గంగ గానవిక నీవు గష్ట ములె kadaa!

    రిప్లయితొలగించండి
  4. రంగులమాయలోకమునరంజిలుబుద్ధినిహింససేయుచున్
    పొంగినదుష్టభావములప్రోదిగజీవితమల్లలాడగా
    భంగముకాగధర్మమునుభావినిచింతనమానివాయివా
    గంగనుగానకుంటివిసఖాయికదప్పవుకష్టనష్టముల్

    రిప్లయితొలగించండి

  5. వెంగలి విత్తులు మనుజులు
    జంగలముల ద్రుంచుచుండ్రి స్వార్థము తోడన్
    రంగా! వార్ధము లలిగిన
    గంగను గానవిఁక నీకు గష్టములె కదా!


    జంగలమందు భూరిగను సంపదలుండునటంచు వాటినే

    దొంగిలి సేయ వృక్షముల ద్రుంచుచు కానల యిక్కపట్టునే

    భంగమొనర్చినందులకు వారిధరమ్ములె యచ్చలింగగా

    గంగను గానకుంటివి సఖా యిక దప్పవు కష్టనష్టముల్.

    రిప్లయితొలగించండి
  6. పొంగులువారుచు దూకిన
    గంగను బంధించె శివుడు గర్వంబడచన్
    గంగకు గమనంబెటులో
    గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా

    రిప్లయితొలగించండి
  7. లింగని కాశీ పురమున
    పొంగి బొరలు దటిని యందు
    మురికిని గనవే !
    వెంగలి వలె వర్తించుచు
    గంగను గాన విఁక , నీకుఁ గష్టములె కదా !

    రిప్లయితొలగించండి
  8. కందం
    ఇంగితము మఱచి యడవుల
    భంగపఱచి వర్షలేమి వలచితె నరుఁడా!
    బెంగపడఁగ భూగర్భపు
    గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా?

    ఉత్పలమాల
    ఇంగితమెట్లు లేదొ? ధర నిచ్ఛను వచ్చిన రీతి కానలన్
    భంగము జేసితే నరుఁడ! వర్షపురాకడ మృగ్యమయ్యెడున్!
    గ్రుంగగ నీటిమట్టమది కుంభిని సాగగ జీవకృత్యముల్
    గంగను గానకుంటివి సఖా యిఁకఁ దప్పవు కష్టనష్టముల్!

    రిప్లయితొలగించండి
  9. శృంగము నుండి దూకుచును చేరి వసుంధరపై పవిత్రమై
    భంగము చేయ మానవులు బాధ్యత వీడి మరల్చి వ్యర్థముల్
    రంగులు మారి జీవనది ప్రాకటమే నశియించ స్వచ్ఛమౌ
    గంగను గానకుంటివి సఖా యిఁకఁ దప్పవు కష్టనష్టముల్

    రిప్లయితొలగించండి
  10. మంగళ దాయకమ్మయిన మార్గము వీడి ధనమ్ము కోసమీ
    భంగిని మత్తు మందులకు బానిస జేయుచు దేశవాసులన్
    మ్రింగగ కోట్ల సొమ్ములను మేలిడ బోవదు! దారితప్పి సా
    గం గను కానకుంటివి సఖా యిక తప్పవు కష్ట నష్టముల్!

    రిప్లయితొలగించండి
  11. అంగాంగంబుల తానము
    గంగయె దాజేయగోరి గంగను దూకన్
    గంగను మునుగుట వలనన్
    గంగను గానవిక నీకు కష్టములె కదా

    రిప్లయితొలగించండి
  12. క్రుంగ వెత లెల్లఁ దాఁకఁగ
    నింగి విజృంభించి కరము నిన్నెల్లరుఁ ద
    క్కంగ సఖులు సాయం బడు
    గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా


    భంగము లయ్యె నాశలు శుభం బొనగూరెడు మార్గ మెద్ది యె
    బ్భంగినిఁ దోఁప కున్న యది పన్నుగ రక్షణ మీయ నెంచి యు
    త్సంగము నందుఁ గైకొనెడి త్రాతను దుర్భర శోక వార్ధి ము
    న్గంగను గాన కుంటివి సఖా యిఁకఁ దప్పవు కష్ట నష్టముల్

    రిప్లయితొలగించండి
  13. వెంగలివై వనంబులను విచ్చలుగా హననం బొనర్చగా
    భంగముగల్గె తుల్యతకు వర్షపుచుక్కకు  నోచుకోని తీ
    రుంగన గడ్డుకాలమిది రోయుపరిస్థితి  దాపురింపనా
    గంగను గానకుంటివి సఖా యిఁకఁ దప్పవు  కష్టనష్టముల్

    రిప్లయితొలగించండి
  14. వెంగలివై భూజంబుల
    భంగమొనర్పగ కురియవు వానలు నీ తీ
    రుంగననిక తొందరలో
    గంగను గాన విఁక నీకుఁ గష్టములె కదా

    రిప్లయితొలగించండి
  15. గంగ మునింగె దానదిని గట్టున నుండుచు తానమాడగా
    భంగము లొక్కమారుగను భామను దాకుచు మున్గజేయుటన్
    గంగను గానకుంటివి సఖా యికదప్పవు కష్టనష్టముల్
    గంగకు సాటియెవ్వరును గానగ నుండరు లోకమెచ్చటన్

    రిప్లయితొలగించండి
  16. గంగను వెంట బెట్టుకొని కాశికి పోయెను
    భర్త భక్తితో
    గంగను స్నానమాడ సతి కాలిడ వెల్లువ
    తీవ్రమాయె నీ
    గంగ తదీయ నీటబడి కంటికి గన్పడ
    కుండబోయెడిన్
    గంగను గానకుంటివి సఖా యిక దప్పవు
    కష్ట నష్టముల

    రిప్లయితొలగించండి
  17. అంగన కొసగిన మాటను
    భంగము చేసిన కతమున పరుగులు దీసెన్
    చెంగట నుండక, వినుమా
    గంగను గానవిక నీకుగష్టములె కదా*

    రిప్లయితొలగించండి