22-2-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె”(లేదా...)“వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నలుబదేండ్లకు పూర్వమీ నారిజూడమిగుల సుందరాంగి యనుచు మెచ్చి యిట్టివృద్ధ నారిని బాలుఁడు పెండ్లియాడెనాడు, బంధువుల్ మెచ్చ నానందమందు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బొక్కి నోటిదానవనుచు వెక్కిరించెవృద్ధనారిని బాలుఁడు , పెండ్లియాడెనెటుల మాతామహుడు దీని నెరిగికూడ ,వింత గొలిపె ననుచు శంక వెలువరించె
వలిపపు కుంతలా లవయవమ్ములు శక్తివిహీనమై సదావలిగొనుచుండు, నోటగన వక్త్రజమొక్కటి యైనలేని యా చెలువను గాంచిబాలకుడు చేయ సహాయము మూర్ఖుడిట్లనెన్ వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్.
తేటగీతివలపుకత్తె యొకతె తన వయసు మరచిలేత యవ్వన దశలోని లేత బుగ్గల చినవానికి వలపు వలవిసరగనెవృద్ధనారిని బాలుడు బెండ్లియాడెప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'యౌవనదశ' అనండి.
తేటగీతిబాలసుందరమ్మనకుండ బాలుఁడనెడుపేర పిలుచుటె తెలిసిన నూరి వారువాని షష్టి పూర్తికి వింతఁ బలికిరిటుల"వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె"చంపకమాలపిలుతురు బాలసుందరుని వేడుక బాలుఁడటంచు నూరిలోఁదెలిసిన వారలందరిని తృప్తిగఁ బిల్వఁగ షష్టి పూర్తికిన్గలకలలాడు మండపము నాడట చేరినవారు పల్కిరే"వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్”
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఎన్నిజన్మల బంధమో యేమొగానిచెలిని జన్మాంతరమునందు కలుసుకొనెనుయేళ్ళుపూళ్ళుగ తనరాక కెదురుచూచువృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కలుసుకొనెను+ఏళ్ళు' అన్నపుడు యడాగమం రాదు.
లేతవయసున్న రాజ్యాధినేత చూపెనతిపురాతనసామ్రాజ్యమాక్రమించిరాజ్యలక్ష్మినిచేబూని రాజసమ్మువృద్దనారినిబాలుడు పెండ్లి యాడె
ఆమె పేరున నున్నట్టి యాస్తు లన్ని దక్కు మను వాడు వానికి తప్పకనుచు పెద్ద లందరు బలవంత పెట్టుచుండ వృద్ధ నారిని బాలుడు పెండ్లి యాడె
ఆటవెలదిఔర!యనియె//వృద్ధనారిని బాలుడు“పెండ్లి యాడె//దఁగడు ప్రేమ తోడనేఁబెనిమిటి నౌదు నీదు పౌత్త్రికకునునీవె యిపుడు మాకు దీవెనిమ్ము”
బళిబళి!పెండ్లియాడెనొక పందిరిలో వరుఁడైన వృద్ధుడున్వలచిన వృద్ధనారి,నొక బాలుడు పెండిలి యాడెఁబ్రీతితోకళకళలాడు బాలికను కన్నుల పండువయయ్యెఁజూడగాఫెళఫెళ మ్రోగె దుందుభులు వీరి వివాహముహూర్త వేళలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పిలచిన పల్కుచున్ సతము పేరిమి తోడ నొసంగి సాయమున్చెలగుచు నున్న బాలకుని చెన్నును కన్గొని పౌత్రి నియ్యగావలచిన వృద్ధనారి, నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్తలచి సమున్నతిన్ బుధులు తద్దయు ప్రీతిని స్వాగతింపగా
తే.గీ:కాలమున మార్పు గమనించకయె ఘనముగబామ్మ చెప్పిన దని గౌరవమున జూచివృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె బాలికన్ మేన మరదలన్ వరుస నెంచి.
చం:కులమును వీడి ప్రాయమున గొప్పగ నన్యకులస్థు నొక్కనిన్వలచిన వృద్ధురాలి గని ,బాలుడు పెండిలి యాడె బ్రీతితోవలచిన యామె పౌత్రిని వివాహము జూచిన వార లెల్లరున్భళియని మెచ్చగా,కులపు భావము దాను దిరస్కరించుచున్.(ఆ వృద్ధురాలు తన యౌవనం లో కులాంతరవివాహం చేసుకొన్నది.ఆమెని చూసిన అబ్బాయి ఆమె మనుమరాలిని కులాంతరవివాహమే చేసుకొన్నాడు.)
ధనికొండ వారు సమస్యను మార్చారు. ఒక బదులు కని అని
రోడ్డు దాటించె భక్తిని గెడ్డము రవివృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె జూడ జక్కని గీతను జూడగానె మనసు మనసులు గలువగ గనులు కూడ
తలపున దానె నుండగను దానకిశోరుడు పెండ్లి యాడెనే వలచిన వృద్ధనారిని. నొకబాలుడు పెండిలియాడె బ్రీతితోన్ కళకళలాడు మోముగల కైటభమర్దను భక్తురాలినిన్ లలనల యందునన్మిగుల లాలిత రూపము గల్గునామెనున్
వీస మైనను జెందక భీతి నెడఁదఁ జెలఁగి కాదన్న వారిని నిలిపి బయట బాస సేసిన కన్యను ద్రోసి పుచ్చి వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడెకలుగఁగఁ బ్రేమ చిత్రముగఁ గాంచిన యంతటనే యెడంద లోపల వడి నుద్యమించి కడు పంతము నూని యెదిర్చి యెల్ల వారల నృప కన్యకా మణిని రాచ కుటుంబపుఁ గొట్టి నమ్మ లే వల చిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తలపునకైన నొప్పవలె తప్పు వచింపగ నేల మిత్రమా!కలవరమీయు నిట్టివగు కల్పనలల్లిన మాట లెప్పుడున్తలచకుమోయి చిత్రమిదిధర్మమునొప్పక చెప్పనోపునే-"వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్"!
కంటి మంట కాహుతియైన కాయజుండుమరల పుట్టిపెరిగెతాను మాయ చెంతపెద్దవాడయినపిదపపెంచినట్టివృద్ధనారిని బాలుఁడు పెండ్లి యాడె”*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినలుబదేండ్లకు పూర్వమీ నారిజూడ
మిగుల సుందరాంగి యనుచు మెచ్చి యిట్టి
వృద్ధ నారిని బాలుఁడు పెండ్లియాడె
నాడు, బంధువుల్ మెచ్చ నానందమందు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబొక్కి నోటిదానవనుచు వెక్కిరించె
రిప్లయితొలగించండివృద్ధనారిని బాలుఁడు , పెండ్లియాడె
నెటుల మాతామహుడు దీని నెరిగికూడ ,
వింత గొలిపె ననుచు శంక వెలువరించె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలిపపు కుంతలా లవయవమ్ములు శక్తివిహీనమై సదా
రిప్లయితొలగించండివలిగొనుచుండు, నోటగన వక్త్రజమొక్కటి యైనలేని యా
చెలువను గాంచిబాలకుడు చేయ సహాయము మూర్ఖుడిట్లనెన్
వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండివలపుకత్తె యొకతె తన వయసు మరచి
లేత యవ్వన దశలోని లేత బుగ్గ
ల చినవానికి వలపు వలవిసరగనె
వృద్ధనారిని బాలుడు బెండ్లియాడె
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'యౌవనదశ' అనండి.
తేటగీతి
రిప్లయితొలగించండిబాలసుందరమ్మనకుండ బాలుఁడనెడు
పేర పిలుచుటె తెలిసిన నూరి వారు
వాని షష్టి పూర్తికి వింతఁ బలికిరిటుల
"వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె"
చంపకమాల
పిలుతురు బాలసుందరుని వేడుక బాలుఁడటంచు నూరిలోఁ
దెలిసిన వారలందరిని తృప్తిగఁ బిల్వఁగ షష్టి పూర్తికిన్
గలకలలాడు మండపము నాడట చేరినవారు పల్కిరే
"వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్”
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఎన్నిజన్మల బంధమో యేమొగాని
రిప్లయితొలగించండిచెలిని జన్మాంతరమునందు కలుసుకొనెను
యేళ్ళుపూళ్ళుగ తనరాక కెదురుచూచు
వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కలుసుకొనెను+ఏళ్ళు' అన్నపుడు యడాగమం రాదు.
లేతవయసున్న రాజ్యాధినేత చూపె
రిప్లయితొలగించండినతిపురాతనసామ్రాజ్యమాక్రమించి
రాజ్యలక్ష్మినిచేబూని రాజసమ్ము
వృద్దనారినిబాలుడు పెండ్లి యాడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆమె పేరున నున్నట్టి యాస్తు లన్ని
రిప్లయితొలగించండిదక్కు మను వాడు వానికి తప్పకనుచు
పెద్ద లందరు బలవంత పెట్టుచుండ
వృద్ధ నారిని బాలుడు పెండ్లి యాడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఔర!యనియె//వృద్ధనారిని బాలుడు
“పెండ్లి యాడె//దఁగడు ప్రేమ తోడ
నేఁబెనిమిటి నౌదు నీదు పౌత్త్రికకును
నీవె యిపుడు మాకు దీవెనిమ్ము”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబళిబళి!పెండ్లియాడెనొక పందిరిలో వరుఁడైన వృద్ధుడున్
రిప్లయితొలగించండివలచిన వృద్ధనారి,నొక బాలుడు పెండిలి యాడెఁబ్రీతితో
కళకళలాడు బాలికను కన్నుల పండువయయ్యెఁజూడగా
ఫెళఫెళ మ్రోగె దుందుభులు వీరి వివాహముహూర్త వేళలో.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపిలచిన పల్కుచున్ సతము పేరిమి తోడ నొసంగి సాయమున్
రిప్లయితొలగించండిచెలగుచు నున్న బాలకుని చెన్నును కన్గొని పౌత్రి నియ్యగా
వలచిన వృద్ధనారి, నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్
తలచి సమున్నతిన్ బుధులు తద్దయు ప్రీతిని స్వాగతింపగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:కాలమున మార్పు గమనించకయె ఘనముగ
రిప్లయితొలగించండిబామ్మ చెప్పిన దని గౌరవమున జూచి
వృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె
బాలికన్ మేన మరదలన్ వరుస నెంచి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం:కులమును వీడి ప్రాయమున గొప్పగ నన్యకులస్థు నొక్కనిన్
రిప్లయితొలగించండివలచిన వృద్ధురాలి గని ,బాలుడు పెండిలి యాడె బ్రీతితో
వలచిన యామె పౌత్రిని వివాహము జూచిన వార లెల్లరున్
భళియని మెచ్చగా,కులపు భావము దాను దిరస్కరించుచున్.
(ఆ వృద్ధురాలు తన యౌవనం లో కులాంతరవివాహం చేసుకొన్నది.ఆమెని చూసిన అబ్బాయి ఆమె మనుమరాలిని కులాంతరవివాహమే చేసుకొన్నాడు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధనికొండ వారు సమస్యను మార్చారు. ఒక బదులు కని అని
తొలగించండిరోడ్డు దాటించె భక్తిని గెడ్డము రవి
రిప్లయితొలగించండివృద్ధనారిని,బాలుడు పెండ్లి యాడె
జూడ జక్కని గీతను జూడగానె
మనసు మనసులు గలువగ గనులు కూడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితలపున దానె నుండగను దానకిశోరుడు పెండ్లి యాడెనే
రిప్లయితొలగించండివలచిన వృద్ధనారిని. నొకబాలుడు పెండిలియాడె బ్రీతితోన్
కళకళలాడు మోముగల కైటభమర్దను భక్తురాలినిన్
లలనల యందునన్మిగుల లాలిత రూపము గల్గునామెనున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీస మైనను జెందక భీతి నెడఁదఁ
రిప్లయితొలగించండిజెలఁగి కాదన్న వారిని నిలిపి బయట
బాస సేసిన కన్యను ద్రోసి పుచ్చి
వృద్ధనారిని బాలుఁడు పెండ్లియాడె
కలుగఁగఁ బ్రేమ చిత్రముగఁ గాంచిన యంతటనే యెడంద లో
పల వడి నుద్యమించి కడు పంతము నూని యెదిర్చి యెల్ల వా
రల నృప కన్యకా మణిని రాచ కుటుంబపుఁ గొట్టి నమ్మ లే
వల చిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితలపునకైన నొప్పవలె
రిప్లయితొలగించండితప్పు వచింపగ నేల మిత్రమా!
కలవరమీయు నిట్టివగు
కల్పనలల్లిన మాట లెప్పుడున్
తలచకుమోయి చిత్రమిది
ధర్మమునొప్పక చెప్పనోపునే-
"వలచిన వృద్ధనారి నొక బాలుఁడు పెండిలియాడెఁ బ్రీతితోన్"!
కంటి మంట కాహుతియైన కాయజుండు
రిప్లయితొలగించండిమరల పుట్టిపెరిగెతాను మాయ చెంత
పెద్దవాడయినపిదపపెంచినట్టి
వృద్ధనారిని బాలుఁడు పెండ్లి యాడె”*