5-6-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్”(లేదా...)“శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్”
పరమాత్మునిలీలలలోపరమార్థమ్మును గ్రహింప వశమా మనకున్విరివిగవరములనొసగెడువరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సిరిగల వాఁడే యైనన్ధర మూడడుగుల నడిగెను దానవ పతినేహరి,విధిలిఖితము తప్పునె*వరకోటీశ్వరుఁడు యాయవారముఁజేసెన్.*
చక్కని పూరణ. అభినందనలు.
అరయగనధ్యాత్మంబగుసిరితోడనుశోభిలుచునుసిద్ధుడుతానైపురిలోకాశీయందునవరకోటీశ్వరుఁడుయాయవారముఁజేసెన్
సిరి యెంత యుండి కూడనువరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్విరతిని బొందక ; తదుపరితరతరముల వారికొరకు దాచగ నెంచన్
సీమాంతఃపురవాసమున్గనకశోషిల్లుగాదేహమున్ధీమంతుండునునాయెబుద్ధుడునుతాఁదీర్చెన్జనాక్రందనల్వామాక్షిన్గనకామెవీడెగదభవ్యంబౌపథంబందుగాశ్రీమంతుండగువాఁడుసిగ్గువీడిజేసెన్యాయవారమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. సవరించండి.
క్షమించండిచూసుకోలేదుసీమాంతఃపురవాసమున్న్గనకతాశోషిల్లగాదేహమున్
కందంసిరిగల భావప్రౌఢుడువరుసన దుర్వ్యసనములకు వశుడై కరిగించె, రయమున సంపదలను, చివర ,కోటీశ్వరుడు యాయ వారము జేసెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు గురువు గారు.
ధరణీ శురంతి దేవుడు నిరవుగ దాదానమిచ్చి యిత్వరు డగుటన్ నరసితె కాలపుగతి భూ వర! కోటీశ్వరుడు యాయవారము జేసెన్
అరయఁగ నాటక మందున ధరి యించెను పాత్ర నొకటి దని కుండ య్యున్ హరిదాసు వేష మందున వర కోటీ శ్వ రుడు యాయ వారము జేసెన్
ధర భారతి వెలసిన వాసరలో నాచారమదియె స్థానక మందున్ తిరుపము నెత్తుట గాంచిన వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్ భామున్ బుత్రుడు కర్ణుడా కలనులో ప్రావీణ్యమున్ జూపినన్ క్షేమంబయ్యది కాదు క్రీడి కనుచున్ చింతించుచున్ వేగ సూత్రాముండంతట విప్ర వేషమునతా దానంబునే కోరగన్ శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కందంసిరులందించిన ప్రజకైవరదల దివిసీమఁ గాంచి పట్టుచు జోలెన్పురముల తారకరాముడువరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్! శార్దూలవిక్రీడితముగ్రామాలున్ దివిసీమ వానలకు సంద్రమ్మట్లుగా నిండగన్సీమన్జుట్టుచు జోలెపట్టి ప్రజలన్ సేవించు సంకల్పమైహోమమ్మట్లుగ నందమూరి నటుడై యూర్లన్నిటిన్ దిర్గుచున్శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ధీమంతుల్ మఱి ధైర్యవంతులు సురల్,దేవేంద్ర బ్రహ్మాదులున్స్వామీ!యంచును మ్రొక్క శ్రీహరి బలిన్ జంపంగ మూడడ్గులన్భూమింగోరగ వామనుండునయి,సమ్మోదంబుతో నిచ్చెగా *శ్రీమంతుండగువాఁడు సిగ్గువిడి చేసెన్ యాయవారమ్మునున్.*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అమ్మా శాంభవి! నీదు శక్తిని గనన్ నయ్యారెశక్యంబునే నీమా హాత్మ్యము మాకు లభ్యమె యికన్ నీవేగ మారక్ష సూశ్రీమాతా హిమ పుత్రికా!సతి!వెసన్ శ్రేయంబు లీడేరునా శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సరగున నెవరేమడిగిననరమరికలు లేకనిచ్చి యప్పుగ ధనమున్కరుగగ నాస్తులు చివరకువరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
శ్రీమంతుండను నాకు సాటియగు వారే లేరటంచున్ సదానీమంబుల్ విడనాడి విచ్చలవిడిన్ నేస్తాలతో క్లబ్బులన్ధీమంతంబుగ ఖర్చుజేసి ధనమున్ తీర్థంబు వోలెన్ తుదన్శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
గ్రామమ్మందున వాన లేని కతనన్ క్షామమ్ము తోరమ్ముగాన్సామాన్యుల్ కడు వ్యాకులమ్ముగొనగా స్పందించి వేగమ్ము సంక్షేమమ్మున్ బొనరింప నెంచి మదిలో కీనాశులన్ కావగాశ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
శ్రీమంతంబగు నాకలోక మిడగా శ్రీ విష్ణు వాదిత్యుడైశ్రీమాతా హృదయారవిందుడరిగెన్ చిత్రంబు పెంపెక్కగన్,ప్రేమంబొప్ప విరోచనున్ ప్రియసుతున్ భేదింప గర్వోన్నతిన్శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.
పరహితమే విహితంబిలపరమోత్కృష్టంబటంచు బంచెను సర్వంబరయఁగ ధర్మాత్ముండావరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
పరఁగంగ వింత రోగము ధరఁ దన తల్లికి గురుండు తనతో ననఁగాఁ గర ముంచి నమ్మకమ్మును వర కోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్ ఏమీ వింత విభుండు దృశ్యుఁ డయి యైదేండ్లేఁగ నింటింటికిన్ సామాన్యుం డన వచ్చి కొల్చుచును వాక్చాతుర్య మేపారఁగన్ నే మీ కిత్తును సర్వ సౌఖ్య తతులన్ నిండారఁ దన్నెన్నఁగన్ శ్రీమంతుం డగు వాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
ఏమో చెప్పగలేము కాల గమనమ్మేరీతిగాసాగునో!శ్రీ మాన్యుండొకనాడు గౌరవముతో చెన్నొందిసంఘంబునన్భూమమ్మంతయుబోయిపేదయయి తాభోజ్యంబుకే దూరమైశ్రీమంతుండగువాడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
సురపతికొసగగ నాకముసిరిపతివచ్చెబలికడకు శీఘ్రముగా తానరెరే గనుమా హరియేవరకోటీశ్వరుడు యాయువారము జేసెన్
పరమాత్మునిలీలలలో
రిప్లయితొలగించండిపరమార్థమ్మును గ్రహింప వశమా మనకున్
విరివిగవరములనొసగెడు
వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసిరిగల వాఁడే యైనన్
రిప్లయితొలగించండిధర మూడడుగుల నడిగెను దానవ పతినే
హరి,విధిలిఖితము తప్పునె
*వరకోటీశ్వరుఁడు యాయవారముఁజేసెన్.*
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఅరయగనధ్యాత్మంబగు
రిప్లయితొలగించండిసిరితోడనుశోభిలుచునుసిద్ధుడుతానై
పురిలోకాశీయందున
వరకోటీశ్వరుఁడుయాయవారముఁజేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసిరి యెంత యుండి కూడను
రిప్లయితొలగించండివరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
విరతిని బొందక ; తదుపరి
తరతరముల వారికొరకు దాచగ
నెంచన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీమాంతఃపురవాసమున్గనకశోషిల్లుగాదేహమున్
రిప్లయితొలగించండిధీమంతుండునునాయెబుద్ధుడునుతాఁదీర్చెన్జనాక్రందనల్
వామాక్షిన్గనకామెవీడెగదభవ్యంబౌపథంబందుగా
శ్రీమంతుండగువాఁడుసిగ్గువీడిజేసెన్యాయవారమ్మునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
క్షమించండిచూసుకోలేదు
తొలగించండిసీమాంతఃపురవాసమున్న్గనకతాశోషిల్లగాదేహమున్
కందం
రిప్లయితొలగించండిసిరిగల భావప్రౌఢుడు
వరుసన దుర్వ్యసనములకు వశుడై కరిగిం
చె, రయమున సంపదలను, చి
వర ,కోటీశ్వరుడు యాయ వారము జేసెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు.
తొలగించండిధరణీ శురంతి దేవుడు
రిప్లయితొలగించండినిరవుగ దాదానమిచ్చి యిత్వరు డగుటన్
నరసితె కాలపుగతి భూ
వర! కోటీశ్వరుడు యాయవారము జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయఁగ నాటక మందున
రిప్లయితొలగించండిధరి యించెను పాత్ర నొకటి దని కుండ య్యున్
హరిదాసు వేష మందున
వర కోటీ శ్వ రుడు యాయ వారము జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధర భారతి వెలసిన వా
సరలో నాచారమదియె స్థానక మందున్
తిరుపము నెత్తుట గాంచిన
వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
భామున్ బుత్రుడు కర్ణుడా కలనులో ప్రావీణ్యమున్ జూపినన్
క్షేమంబయ్యది కాదు క్రీడి కనుచున్ చింతించుచున్ వేగ సూ
త్రాముండంతట విప్ర వేషమునతా దానంబునే కోరగన్
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిసిరులందించిన ప్రజకై
వరదల దివిసీమఁ గాంచి పట్టుచు జోలెన్
పురముల తారకరాముడు
వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్!
శార్దూలవిక్రీడితము
గ్రామాలున్ దివిసీమ వానలకు సంద్రమ్మట్లుగా నిండగన్
సీమన్జుట్టుచు జోలెపట్టి ప్రజలన్ సేవించు సంకల్పమై
హోమమ్మట్లుగ నందమూరి నటుడై యూర్లన్నిటిన్ దిర్గుచున్
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిధీమంతుల్ మఱి ధైర్యవంతులు సురల్,దేవేంద్ర బ్రహ్మాదులున్
రిప్లయితొలగించండిస్వామీ!యంచును మ్రొక్క శ్రీహరి బలిన్ జంపంగ మూడడ్గులన్
భూమింగోరగ వామనుండునయి,సమ్మోదంబుతో నిచ్చెగా
*శ్రీమంతుండగువాఁడు సిగ్గువిడి చేసెన్ యాయవారమ్మునున్.*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅమ్మా శాంభవి! నీదు శక్తిని గనన్ నయ్యారెశక్యంబునే
రిప్లయితొలగించండినీమా హాత్మ్యము మాకు లభ్యమె యికన్ నీవేగ మారక్ష సూ
శ్రీమాతా హిమ పుత్రికా!సతి!వెసన్ శ్రేయంబు లీడేరునా
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసరగున నెవరేమడిగిన
రిప్లయితొలగించండినరమరికలు లేకనిచ్చి యప్పుగ ధనమున్
కరుగగ నాస్తులు చివరకు
వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీమంతుండను నాకు సాటియగు వారే లేరటంచున్ సదా
రిప్లయితొలగించండినీమంబుల్ విడనాడి విచ్చలవిడిన్ నేస్తాలతో క్లబ్బులన్
ధీమంతంబుగ ఖర్చుజేసి ధనమున్ తీర్థంబు వోలెన్ తుదన్
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగ్రామమ్మందున వాన లేని కతనన్ క్షామమ్ము తోరమ్ముగాన్
రిప్లయితొలగించండిసామాన్యుల్ కడు వ్యాకులమ్ముగొనగా స్పందించి వేగమ్ము సం
క్షేమమ్మున్ బొనరింప నెంచి మదిలో కీనాశులన్ కావగా
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
శ్రీమంతంబగు నాకలోక మిడగా శ్రీ విష్ణు వాదిత్యుడై
రిప్లయితొలగించండిశ్రీమాతా హృదయారవిందుడరిగెన్ చిత్రంబు పెంపెక్కగన్,
ప్రేమంబొప్ప విరోచనున్ ప్రియసుతున్ భేదింప గర్వోన్నతిన్
శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.
పరహితమే విహితంబిల
రిప్లయితొలగించండిపరమోత్కృష్టంబటంచు బంచెను సర్వం
బరయఁగ ధర్మాత్ముండా
వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
పరఁగంగ వింత రోగము
రిప్లయితొలగించండిధరఁ దన తల్లికి గురుండు తనతో ననఁగాఁ
గర ముంచి నమ్మకమ్మును
వర కోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
ఏమీ వింత విభుండు దృశ్యుఁ డయి యైదేండ్లేఁగ నింటింటికిన్
సామాన్యుం డన వచ్చి కొల్చుచును వాక్చాతుర్య మేపారఁగన్
నే మీ కిత్తును సర్వ సౌఖ్య తతులన్ నిండారఁ దన్నెన్నఁగన్
శ్రీమంతుం డగు వాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్
ఏమో చెప్పగలేము కాల గమనమ్మేరీతి
రిప్లయితొలగించండిగాసాగునో!
శ్రీ మాన్యుండొకనాడు గౌరవముతో చెన్నొంది
సంఘంబునన్
భూమమ్మంతయుబోయిపేదయయి తా
భోజ్యంబుకే దూరమై
శ్రీమంతుండగువాడు సిగ్గు విడి చేసెన్
యాయవారమ్మునున్
సురపతికొసగగ నాకము
రిప్లయితొలగించండిసిరిపతివచ్చెబలికడకు శీఘ్రముగా తా
నరెరే గనుమా హరియే
వరకోటీశ్వరుడు యాయువారము జేసెన్