21, జూన్ 2022, మంగళవారం

సమస్య - 4114

22-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్”
(లేదా...)
“ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా”

39 కామెంట్‌లు:

  1. కందం
    సరిగమ పదని లతోడన్
    మురళీ గానమున నేను మునకలు వేయన్
    బిరబిర పలువురు స్వరశే
    ఖర సముదాయమ్ము వచ్చె గాంచగ నన్నున్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  2. విరివిగ సత్కృత్య o బులు
    మరులుగ నొనరించి సతము మాన్యుడ నైతిన్
    కర మను రాగ మున విలే
    ఖర సముదాయమ్ము వచ్చె గాంచగ నన్నున్

    రిప్లయితొలగించండి
  3. సరిగమల మయము లగుచును
    నరుదగు గానముల చేత నలరించెడునా
    స్వరములు బలికెడు స్వరశే
    ఖర సముదాయమ్మువచ్చె గాంచగ నన్నున్

    రిప్లయితొలగించండి
  4. సరిగమసాధనచాలక
    సురగానముమిగులచేదుసోయగమగుచున్
    గరగరశబ్దమురాగా
    ఖరసముదాయమ్మువచ్చెగాంచగ నన్నున్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కందం
      హరిఁ బురుషోత్తము నచ్యుతు
      నరసఖు భీష్ముఁడు సహస్రనామంబులతో
      శరతల్పుండనె గుణశే
      ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్

      చంపకమాల
      హరిఁ బురుషోత్తమున్ వరదు నచ్యుతు శౌరి ననంతుఁ గృష్ణునిన్
      నరసఖు నాపగేయుఁడు వినమ్రత భక్తి సహస్రనామ హో
      త్రరతుడు నంత్యకాల శరతల్పుఁడనెన్ గని సద్గణాది శే
      ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁజూడుమా!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశాంతంగా ఉన్నవి అభినందనలు

      తొలగించండి
  6. సరిగమయంచు నెప్పుడును సజ్జను లౌచునుసుస్వరాధిశే
    ఖర సముదాయ మిచ్చటకు గాంచుటకై నను వచ్చె జూడుమా
    అరుదగు గాన పాటవము నంచిత మౌలయ గల్సి యొప్పగా
    విరజిల యట్లు చేసెనట వేవురు సంతస మొందు రీతిగా

    రిప్లయితొలగించండి
  7. పురమున గల బాలికలం
    దరిలో నతి సుందరినని , దనకు దగుననన్
    పరిణయమునకై పుర శే
    ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్

    రిప్లయితొలగించండి
  8. కందం:
    హరువగు కలగంటిని నే
    నరుదగు ఘనకీర్తినొందనాటలయందున్
    సరగున నాకడకు విలే
    ఖరసముదాయమ్ము వచ్చెఁగాంచఁగ నన్నున్

    రిప్లయితొలగించండి
  9. చంపకమాల:
    వరదలతోడ నిర్ఝరిణి పల్లపు భూములు ముంచివేయగా
    సరగున నీటమున్గునొక చానను తీరము జేర్చినాడ నా
    యరుదగు సాహసమ్ము గనియందరు మెచ్చిరి యంతటన్ విలే
    ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురమందిరమందున నా
      పరిచయ కార్యక్రమమున పలువురు ముఖ్యుల్
      విరివిగ పాఠక కవిశే
      ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్

      తొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    గురువుల గరిమను దెలుపుచు
    విరచించిన నా కవితలు వినినంతటనే
    పరితోషముతో కవిశే
    ఖర సముదాయమ్ము వచ్చె గాంచగ నన్నున్.

    గురువుల ఖ్యాతి పేర్కొనుచు కూర్చిన నాదు కవిత్వ కల్పనల్
    వరుసగ నభ్యసించి పెనుపైనవిగా వినుతించి ప్రీతితో
    పురమున సత్కరించగను పూనిక గూడుచు సత్కవుల్ విలే
    ఖర సముదాయ మిచ్చటకు గాంచుటకై నను వచ్చె జూడుమా!

    రిప్లయితొలగించండి

  12. నిరతము శివనామమదే
    శరణమటంచు కొలువగనె సత్వర మందున్
    కరుణించి చంద్రమశ్శే
    ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్.


    గరళము కంఠమందు నురగమ్మది భూషణమై వెలుంగుచున్
    గరమున శూలమున్ గలుగు గౌరిమనోహరు డైన ఫాలుడే
    శరణమటంచు వేడగనె సత్వరమే కరుణించి చంద్రశే
    ఖర సముదాయమిచ్చటకు గాంచుటకైనను వచ్చె జూడుమా.

    రిప్లయితొలగించండి
  13. కరమని బహుజన శ్రేయ
    స్కరమని దివ్యౌషధమును కనుగొన, కనగన్
    పరిశోధనను ప్రపంచ శి
    ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్

    రిప్లయితొలగించండి
  14. పరిణయమెంచి రాజులకు వార్తనుపంపగ తండ్రి నా స్వయం
    వరమున పాల్గొనంగ పలువైపుల నుండి రయమ్ము రాజశే
    ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా
    సరగున రమ్ము చేకొనగ చక్కని మొగ్గరమున్ రచించి చూ

    రిప్లయితొలగించండి
  15. తరుణి త్వదీయ బాంధవులు త్వద్ధిత వర్గమువార లెన్నడున్
    ధర గనిపించ రొక్కరన తత్పతి పండుగనాడు నాప్తులన్
    మరిమరి బిల్చి యిట్లనియె మానిని! యియ్యదె యాత్మమిత్రశే
    ఖర సముదాయ మిచ్చటకుఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా”

    రిప్లయితొలగించండి
  16. త్వరితమ్ముగ మిత్రులు గూ
    డి రింపుగను గాంచ నెంచి డెందము లందుం
    బరమానందము సఖి శే
    ఖర! సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్


    వర కపిఁ జూడ వచ్చితిమి బాలక! యిందఱ మంది యాతనల్
    కరము ముదమ్ము నందితిమి కంటివె నిన్నిటఁ జూడఁగా ననన్
    వర దరహాస మొల్కఁగను బల్కితి నాతని తోడ నివ్విధిన్
    ఖర సముదాయ మిచ్చటికిఁ గాంచుటకై నను వచ్చెఁ జూడుమా

    రిప్లయితొలగించండి

  17. కరుణించమంచు వేడగ
    శరవణ భవుడున్ నగజ గజముఖుడుఁ నందీ
    శ్వరులైన చంద్రమశ్శే
    ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగఁ నన్నున్.

    రిప్లయితొలగించండి

  18. జఱభుడు తారకాసురుని చాగరలాడెడు వానికోసమై

    గిరిజను పెండ్లియాడమని ఖేచరులెల్లరు వేడినంత నా

    పురహరుడంపగా మునులు పుష్కరనాభుడు ధాత చంద్రశే

    ఖర సముదాయమిచ్చటకు గాంచుటకైనను వచ్చె జూడుమా.

    రిప్లయితొలగించండి
  19. సరసిజ నాభుని చరితము
    సరుగున నేవ్రాసినంత చదువుచు వడిగా
    దరిచేరంగసుకవిశే
    *ఖర సముదాయమ్ము వచ్చెఁ గాంచఁగ నన్నున్”*

    రిప్లయితొలగించండి