19, జూన్ 2022, ఆదివారం

సమస్య - 4112

20-6-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్”
(లేదా...)
“సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసితురే”
(ప్రాసయే సమస్య. అన్యభాషాపదాలు వాడవచ్చు)

23 కామెంట్‌లు:

  1. కందం
    సెల్ఫీకై పరుగెట్టెడి
    గల్ఫు జనావళి నటులను గని తిక్కగొనెన్
    విల్ఫుల్ సమస్య గనుగొని
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  2. సెల్ఫోను గురిచి యీయది
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్
    సెల్ఫోను నుండ తప్పదు
    సెల్ఫోనులు లేనివారి జీవన మెవృధా

    రిప్లయితొలగించండి
  3. సెల్ఫిష్గాచేతనునిలు
    సెల్ఫీలెన్నియొదిగుటనుజేయునుసులువై
    అల్పంబునుగాదేగన
    సెల్ఫోన్కరభూషణమనిచెప్పెదరుకవుల్

    రిప్లయితొలగించండి
  4. సెల్ఫోనొక్కటి చేర వేయు విశయం జిత్రంబుగా క్షిప్రమే,
    సెల్ఫోనందున గూగులుండ గనగా సిద్ధంబుగా సర్వమున్,
    సెల్ఫోనివ్విధి ముంచివైచె యువతన్ శృంగార కృత్యంబులన్,
    సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింతురే?

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  6. కుల్ఫీ మలాయి ఖాద్యము
    సల్ఫరదియె చూడనొక రసాయన మనుచున్
    డాల్ఫినన జలచరమ్మని
    సెల్ఫోన్ గరభూషణమని చెప్పెదరు కవుల్.

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి శంకరాభరణం వారి సమస్య

    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్


    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో


    తెలియని పదములు‌ సులువుగ తెలుసుకొ
    న వలెనన్న
    బరువై నట్టి పుస్త

    కమ్ములను వెదుకంగనవ సరములేదు
    కావ్యముల్ వీక్షించ ఖర్చు చేసి

    గ్రంధములనుకొనగ నవసరము లేదు
    సభలలో పాల్గొన శ్రమతోడ

    దేశము మొత్తము‌ తిరుగగ పనిలేదు
    గృహమున కూర్చుండి ఖేదములను

    బడయక మీటింగ్‌న పాల్గొని ‌
    మోదము
    బడయగ వచ్చును,భరణి నందు

    భువిని( *సెల్ఫోన్ కరభూషణ*
    *మనిచెప్పెదరు కవు* లె)ప్పుడు
    సరస గతిని


    తరచి చూడంగ యీనాడు ధనము కన్న

    విలువ గలదిట,పరికించ కలము కన్న

    గొప్ప దనెదరు సెల్ఫోను కోరి నేటి

    కవులు ముదమును బడయుచు భువన మందు

    రిప్లయితొలగించండి
  8. సెల్ఫోన్ యున్నన్ చాలిక
    నాల్ఫెబటులునేర్వవచ్చు నలయకనింటన్
    సెల్ఫోనునకార్యములగు
    “సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్”

    రిప్లయితొలగించండి
  9. కుల్ఫీబాలల కిష్టఖాద్యమనుచున్ కొండాటమేయంచు నా

    యల్ఫా హోటలు గాంచ పట్టణముకే యందాల సౌదమ్ముగా


    సెల్ఫీ గోరుచు ఫోజులిచ్చుటదియే జీండ్రమ్మనిన్ దిట్టుచున్

    సెల్పోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింతురే

    రిప్లయితొలగించండి
  10. సెల్ఫీలీజగతిన్గనంగనతివాషేమంచుభావింతువా
    సల్ఫర్వోలెనుమండుటెందులకునేసైచన్నినున్జూడుమా
    అల్పంబాయిదిగాదుగానిలనునీయాలోకముల్జూపుగా
    సెల్ఫోన్హస్తవిభూషణంబనికవిశ్రేష్షుల్ప్రశంసింతురే

    రిప్లయితొలగించండి
  11. కందము
    ఆల్ఫీచర్స్ నిక్షిప్తము
    సెల్ఫీలకు పట్టుగొమ్మ సేఫ్టీ డౌటే!
    ఆల్ఫ్రెండ్సు!మనకు వరమీ
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్.

    రిప్లయితొలగించండి
  12. కుల్ఫీ తెమ్మని జెప్పగ
    గుల్ఫము వాచినది గాన గుదరదని వడిన్
    సెల్ఫీ జూపితి , గనుకనె
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్

    రిప్లయితొలగించండి
  13. సెల్ఫో నంబను సాధనంబది గనన్ జేజీయ మానంబుగా
    సెల్ఫుల్ దీయగ వీలు గల్గును నికన్ జేవ్రాత లేకుండ నౌ
    సెల్ఫో నందున జూడ వచ్చుట కతన్ లోకంపు టాచారమున్
    సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసితురే”

    రిప్లయితొలగించండి
  14. గోల్ఫాడే సమయములో
    సెల్ఫీ గోలేలనోయి శ్రీరఘురామా
    విల్ఫుల్గా నెంచుకొనిన
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్

    రిప్లయితొలగించండి
  15. సెల్ఫోన్ లోఁగనవచ్చు డేటు,టయిముల్,సిన్మాలు,క్రీడాదులున్
    సెల్ఫీల్ తీసికొనంగవచ్చు తృటిలో జీపేని వాడంగనౌ
    ఉల్ఫాగా నిడవచ్చు మిత్రులకు నోహోహో!మహామాయ యీ
    సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింపరే.
    ఉల్ఫా=కానుక
    -------దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  16. సెల్ఫీ దిగనగు, హృదయము
    వెల్ఫేర్ తెలియనగు, దారి విదితమగు, నిలన్
    ఆల్ఫీచర్స్ సమకూరగ
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్

    రిప్లయితొలగించండి
  17. సెల్ఫీలను యిన్స్టాలో
    సెల్ఫోనునఁదీసి పోస్టు చేయగ వచ్చున్
    సెల్ఫోనే సర్వస్వము
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్

    రిప్లయితొలగించండి
  18. కందం
    మాల్ఫర్మేషను జెందక
    విల్ఫుల్గా జ్ఞానమందు వేడ్కన్ గాంచన్
    వెల్ఫేరు భావనమునన్
    సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్

    శార్దూలవిక్రీడితము
    అల్ఫాన్సా వగలొల్కు నాట్యములలో నంగాంగముల్ జూచుచున్
    వోల్ఫుల్ పొర్లుననంగ కేళులమరన్ బోకారఁ గాంచన్మనః
    మాల్ఫర్మేషనధోగతిన్ గనక, సంపాదింప విజ్ఞానమున్
    సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింతురే

    రిప్లయితొలగించండి
  19. సెల్ఫీ లు దిగుట కొఱకై
    సెల్ఫోనును చేత బట్టి చెల రేగ గ నా
    C
    సెల్ఫోనే ముప్పు గద ర
    సెల్ఫోన్ కర భూషణ మని చెప్పుదురు కవుల్

    రిప్లయితొలగించండి
  20. ఉల్ఫాగానిడ తండ్రి ప్రేమఁ, గరమౌయున్మాదమున్ జూపుచున్
    సెల్ఫీలంచు ప్రమాదముల్ గొనుచు సౌశీల్యమ్మునేకోల్పడన్
    సెల్ఫోన్ పిచ్చిని గొన్ననేటి యువతన్ ఛీకొట్టెడిన్ గాని యా
    సెల్ఫోన్ హస్తవిభూషణంబని కవిశ్రేష్ఠుల్ ప్రశంసితురే?

    రిప్లయితొలగించండి
  21. ఫాలమునకు బదులు ఫోల మని (సురా సేవనమునఁ గావచ్చు) పలుకు చుండఁ బలు కషాయముల వలనఁ బొట్టలు ప్రక్షాళనము లయి ఫో ను వీడి ఫా పలుకుచు ఫాలము హస్త విభూషణ మని పలుకు సందర్భము :


    పల్ ఫాంటమ్ములు త్రాగఁ ద్రాగఁ దమినిం బ్రక్షాళనంబై వెసం
    బల్ ఫండమ్ములు శుద్ధి యై పలుకు విన్మా చేసి దండమ్ములే
    వేల్ ఫాలాగ్రము, మాని యక్కరము వేవేగంబ భక్షించి దో
    సెల్ ఫోన్, హస్త విభూషణం బని కవిశ్రేష్ఠుల్ ప్రశంసింతురే

    [ఫాంటము = కషాయము; ఫండము = పొట్ట; ఫాలాగ్రము = ఫాలము (నాఁగటి కఱ్ఱు) చివర నున్నది, నాఁగలి; ఫోన్ = ఫో యను నక్షరమును ]

    రిప్లయితొలగించండి
  22. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు.
    భాషా సంకర మున్న సమస్యను మీరే యిచ్చి తిరిగి పలువురు చేత చేయించడ మెందు కండి?

    రిప్లయితొలగించండి
  23. సెల్ఫోన్ యున్నన్ చాలిక
    నాల్ఫెబటులునేర్వవచ్చు నలయకనింటన్
    సెల్ఫోనునకార్యములగు
    “సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్”

    మరొక పూరణ

    2.కం:సెల్ఫోనేయిలనెల్లయు
    సెల్ఫోనేగురువునయ్యెజీవులకెల్లన్
    సేల్ఫోనులేనిదెవరికి?
    *సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్*

    రిప్లయితొలగించండి