8-12-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె”(లేదా...)“అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా”
ప్రజల సొమ్ము దోచగనెంచి ప్రభువులెల్లఆంధ్ర వారుణ వాహిని కవధి లేకఏరులై సురాపానమ్ము పార నట్టిఅమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పూరింపవలసిన సమస్య మరచెమధుమేహమున్నట్లుమామగారుత్రాగెపంచామృతమ్మునుతనివితీరపయనమైవచ్చుచున్ జూడ బస్సునెక్కిఅమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసెగాదిరాజు మధుసూదనరాజు
చాలా బాగుంది
రుచిగ నున్నదని మితిమీరుటగు కీడు,పూజ పిమ్మటను మిగిలి పోయినదనిమ్రింగ పంచామృతపు భాండమెల్ల, కడకుఅమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.
అమరపురము నందు సురల కమరుచుండుయమృతపానమ్ము మరణమ్ము నాపు జేయభరణి పయిన పు డమి నుండి ప్రాపణమగుయమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
తేటగీతిమదిర తెచ్చిన మాలిని మాటలల్లినాట్యశాలకు రమ్మని నటనమాడరోయఁ గీచకుఁడట పరస్త్రీ యధరఁపుటమృతపానమ్ము! మరణమ్మునందజేసె!చంపకమాలఅమరుచ దెచ్చియున్ మదిరి యంగన మాలిని నాట్యశాలకున్నిమురగ రమ్మురమ్మునఁగ నేరక వ్యూహము గీచకుండటన్దెములఁగ జంపెనే వలలు దెబ్బ! పరాంగన మ్రోవిఁ గోరఁగానమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు! ద్రాగఁ బోకుమా! !
🙏
చం.గమనము దుర్లభంబు దివిఁ గాంచము నైజము మానవాళికిన్ విమలము నందనంబు బలి విష్ణుని ప్రీతుడు శుక్ర సూచనన్ శమనము లోకులందరికి శక్రుని క్రుష్టము మిశ్రమైనచో*నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా!*
పామమది సోకె ననినాటు వైద్యు డొకడుసిద్ధధాతువు గొనుమంచు చెప్పెనంచుశీనడగు రోగి మితిమీరి చేయ, నదియెఅమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.(అమృతము= పాదరసము)ప్రమదలు వాసిగా నచట వల్వల శుభ్రము చేయుచుండగాకుమతులు స్వార్థ చిత్తులయి కొల్లలుగా నెల కొల్పగా పరిశ్రమలవి వ్యర్థముల్ విడువ శంబరమే విషమయ్యె గాదె యాఅమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా.(అమృతము = జలము)
అమృతమునకు నానార్థమ్ము లమరుగాదెపాలు నెయ్యి నీరు పాదరసము విషముపానమొనరింప గరళము ప్రాణముఁగొనెనమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసెఅమృతము లభ్యమౌననుచు నంబుధిఁ జిల్కిరి దేవదానవుల్శ్రమగొని హాలహాలమది చప్పున వెల్వెడె సాగరంబునన్దమకిక నీవెదిక్కనుచు ధైర్యము వీడుచుఁ వేడ నీశ్వరా యమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా
తినగతినగ గుల్యమ్మౌను తిక్తముగనుమితిని మీరిన నేదైన గతిని దప్పునని యెరుకలేని యుక్కివుఁడతిగ సేయనమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
అమితముగా గొనంగనెది యైనను హానిని గూర్చు నెన్నడున్తమిగొని మద్యమున్ మితముదప్పి గ్రహించిన మందభాగ్యుకున్క్రమముగ దేహమందు రుధిరమ్ము విషమ్ముగ మారిపోవునాఅమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా
వ్యాధి గలవాడు మిక్కిలి బాధితుండువైద్యుడొ స గిన సల హాలు వమ్ము జేసితినగ త్రాగగ మొదలి డె తియ్య నైననమృత పానమ్ము మరణమ్ము నంద జేసె
తే॥ జలము నేఁడు గరళమయ్యె జగతి నందుఘన పరిశ్రమల్ వ్వర్థముల్ గలుపుచుండమనుజ తప్పిదనము చేత మహిని యిటులనమృత పానము మరణమ్ము నందఁ జేసెచం॥ సమముగ నేఁడు వ్యర్థముల సారము వాహిని యందుఁ జేరఁగాను మనుజ వ్యాపకమ్ములను నోచు కొనంగను లేక శుద్ధ నీరమిలను ద్రావు నీరమున రక్షను గాంచఁగ లేకఁ బోవఁగానమృతము ప్రాణహానికర మందురు విజ్ఞలు ద్రాగఁ బోకుమాఅమృతము జలముత్రాగక తప్పదనుకోండి. Water treatment has become a prolific n highly profit making business.
అమరులైరిచేసి దివిజుల నవరతమునమృత పానమ్ము, మరణమ్ము నందజేసెనమృతమని గ్రోలమద్యము నవనియందుగాన రుచిచూడ బోకుము కలను నైనడా బల్లూరి ఉమాదేవిఅమృతసమానమంచునదిహాయినిగూర్చునటంచుమద్యమున్అమితముగాను గ్రోలినను యాతన హెచ్చున టంచు నెంచుమామమతనుబూనినియ్యదియెమానుగచెప్పుచునుంటిమిత్రనీఅమృతము ప్రాణహానికరమందురువిజ్ఞులు త్రాగ బోకుమా
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. అమృత సమమిది యదిగొ సురాలయము కన్పడుచునుండెఁ సేవించగ సుర ననుచునధిక మోతాదు మించియు నతడు చేయనమృత పానమ్ము , మరణమ్ము నందఁ జేసె.
ప్రజల సొమ్ము దోచగనెంచి ప్రభువులెల్ల
రిప్లయితొలగించండిఆంధ్ర వారుణ వాహిని కవధి లేక
ఏరులై సురాపానమ్ము పార నట్టి
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపూరింపవలసిన సమస్య
తొలగించండిమరచెమధుమేహమున్నట్లుమామగారు
త్రాగెపంచామృతమ్మునుతనివితీర
పయనమైవచ్చుచున్ జూడ బస్సునెక్కి
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
గాదిరాజు మధుసూదనరాజు
చాలా బాగుంది
తొలగించండిరుచిగ నున్నదని మితిమీరుటగు కీడు,
రిప్లయితొలగించండిపూజ పిమ్మటను మిగిలి పోయినదని
మ్రింగ పంచామృతపు భాండమెల్ల, కడకు
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.
అమరపురము నందు సురల కమరుచుండు
రిప్లయితొలగించండియమృతపానమ్ము మరణమ్ము నాపు జేయ
భరణి పయిన పు డమి నుండి ప్రాపణమగు
యమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిమదిర తెచ్చిన మాలిని మాటలల్లి
నాట్యశాలకు రమ్మని నటనమాడ
రోయఁ గీచకుఁడట పరస్త్రీ యధరఁపు
టమృతపానమ్ము! మరణమ్మునందజేసె!
చంపకమాల
అమరుచ దెచ్చియున్ మదిరి యంగన మాలిని నాట్యశాలకున్
నిమురగ రమ్మురమ్మునఁగ నేరక వ్యూహము గీచకుండటన్
దెములఁగ జంపెనే వలలు దెబ్బ! పరాంగన మ్రోవిఁ గోరఁగా
నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు! ద్రాగఁ బోకుమా! !
🙏
తొలగించండి🙏
తొలగించండిచం.
రిప్లయితొలగించండిగమనము దుర్లభంబు దివిఁ గాంచము నైజము మానవాళికిన్
విమలము నందనంబు బలి విష్ణుని ప్రీతుడు శుక్ర సూచనన్
శమనము లోకులందరికి శక్రుని క్రుష్టము మిశ్రమైనచో
*నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా!*
రిప్లయితొలగించండిపామమది సోకె ననినాటు వైద్యు డొకడు
సిద్ధధాతువు గొనుమంచు చెప్పెనంచు
శీనడగు రోగి మితిమీరి చేయ, నదియె
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.
(అమృతము= పాదరసము)
ప్రమదలు వాసిగా నచట వల్వల శుభ్రము చేయుచుండగా
కుమతులు స్వార్థ చిత్తులయి కొల్లలుగా నెల కొల్పగా పరి
శ్రమలవి వ్యర్థముల్ విడువ శంబరమే విషమయ్యె గాదె యా
అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా.
(అమృతము = జలము)
అమృతమునకు నానార్థమ్ము లమరుగాదె
రిప్లయితొలగించండిపాలు నెయ్యి నీరు పాదరసము విషము
పానమొనరింప గరళము ప్రాణముఁగొనె
నమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
అమృతము లభ్యమౌననుచు నంబుధిఁ జిల్కిరి దేవదానవుల్
శ్రమగొని హాలహాలమది చప్పున వెల్వెడె సాగరంబునన్
దమకిక నీవెదిక్కనుచు ధైర్యము వీడుచుఁ వేడ నీశ్వరా
యమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా
చాలా బాగుంది
తొలగించండితినగతినగ గుల్యమ్మౌను తిక్తముగను
రిప్లయితొలగించండిమితిని మీరిన నేదైన గతిని దప్పు
నని యెరుకలేని యుక్కివుఁడతిగ సేయ
నమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె
అమితముగా గొనంగనెది యైనను హానిని గూర్చు నెన్నడున్
రిప్లయితొలగించండితమిగొని మద్యమున్ మితముదప్పి గ్రహించిన మందభాగ్యుకున్
క్రమముగ దేహమందు రుధిరమ్ము విషమ్ముగ మారిపోవునా
అమృతము ప్రాణహానికర మందురు విజ్ఞులు ద్రాగఁ బోకుమా
వ్యాధి గలవాడు మిక్కిలి బాధితుండు
రిప్లయితొలగించండివైద్యుడొ స గిన సల హాలు వమ్ము జేసి
తినగ త్రాగగ మొదలి డె తియ్య నైన
నమృత పానమ్ము మరణమ్ము నంద జేసె
తే॥ జలము నేఁడు గరళమయ్యె జగతి నందు
రిప్లయితొలగించండిఘన పరిశ్రమల్ వ్వర్థముల్ గలుపుచుండ
మనుజ తప్పిదనము చేత మహిని యిటుల
నమృత పానము మరణమ్ము నందఁ జేసె
చం॥ సమముగ నేఁడు వ్యర్థముల సారము వాహిని యందుఁ జేరఁగా
ను మనుజ వ్యాపకమ్ములను నోచు కొనంగను లేక శుద్ధ నీ
రమిలను ద్రావు నీరమున రక్షను గాంచఁగ లేకఁ బోవఁగా
నమృతము ప్రాణహానికర మందురు విజ్ఞలు ద్రాగఁ బోకుమా
అమృతము జలము
త్రాగక తప్పదనుకోండి.
Water treatment has become a prolific n highly profit making business.
అమరులైరిచేసి దివిజుల నవరతము
రిప్లయితొలగించండినమృత పానమ్ము, మరణమ్ము నందజేసె
నమృతమని గ్రోలమద్యము నవనియందు
గాన రుచిచూడ బోకుము కలను నైన
డా బల్లూరి ఉమాదేవి
అమృతసమానమంచునదిహాయినిగూర్చునటంచుమద్యమున్
అమితముగాను గ్రోలినను యాతన హెచ్చున టంచు నెంచుమా
మమతనుబూనినియ్యదియెమానుగచెప్పుచునుంటిమిత్రనీ
అమృతము ప్రాణహానికరమందురువిజ్ఞులు త్రాగ బోకుమా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అమృత సమమిది యదిగొ సురాలయము
కన్పడుచునుండెఁ సేవించగ సుర ననుచు
నధిక మోతాదు మించియు నతడు చేయ
నమృత పానమ్ము , మరణమ్ము నందఁ జేసె.