19-12-2023 (మంగళవారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్” (లేదా...) “సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్” (ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)
రంగుల లోకమున్ సతికి రక్షణ లేదనెఱంగి బాధతో బంగరు తల్లినింక మగవానికి ధీటుగ భూత మాతయౌ మంగళ భంగి పెంచ సుకుమారి భయంబును వీడి తండ్రి న ర్సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరంగస్థలమందున బహు
రిప్లయితొలగించండిఅంగుగ పలువేషములను యాడిన యస్వీ
రంగారావు తనయ నట
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్
సింగముల జంటకు గలిగె
రిప్లయితొలగించండిచెంగుమని యెగిరెడు చిన్ని సింగము లందా
డంగిని వీడదొకటి, మగ
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్”
రిప్లయితొలగించండినింగికి యెదుగెడు హింసల
సంగతి గని స్త్రీలపైన జడిసియు సతమున్
నంగ బలముగలిగిన నర
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్”
మ్రింగ మెతుకు లేక యిలుల
రిప్లయితొలగించండిముంగిట దారాడుచుండి ముష్టి నడుగుచున్
చొంగను కార్చుచు నా నర
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్
అంగన నొక్కని గాంచియు
రిప్లయితొలగించండిపొంగిన వలపునను దాను పొందెను వానిన్
చెంగట జేరియు నా నర
సింగము వెంట నడచు నొక చిన్నది యె పుడన్
కందం
రిప్లయితొలగించండిమంగళదాయిని లక్ష్మియె
రంగని మీనమయినను వరాహమునైనన్
జెంగటఁగొని నతడన నర
సింగము, వెంట నడుచు నొక చిన్నది యెపుడున్!
ఉత్పలమాల
మంగళమందుఁజేయు రమ మాతగ సృష్టికి విష్ణు పత్నిగన్
భంగమొనర్చ రాక్షసుల పాలిటి మిత్తిగ ఎన్నొ రూపముల్
రంగడు దాల్చె మత్స్యము వరాహము లట్లుగఁ దా సగమ్మునౌ
సింగము, వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్!
పంగది వీడుచు సింగము
రిప్లయితొలగించండిభంగివనమ్మున తిరుగగ వలయుననుచు తా
నంగనఁ బెంచగ పిత నర
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్.
రంగుల లోకమున్ సతికి రక్షణ లేదనెఱంగి బాధతో
బంగరు తల్లినింక మగవానికి ధీటుగ భూత మాతయౌ
మంగళ భంగి పెంచ సుకుమారి భయంబును వీడి తండ్రి న
ర్సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్.
మంగళముకూర్చ హరియే
రిప్లయితొలగించండిసింగముగామారినంత శ్రీలక్ష్మియెతా
పొంగగ మదిచెంచెతగా
సింగము వెంట నడచు నొక చిన్నది యెపుడున్
బంగరు రంగుల దుస్తులు
రిప్లయితొలగించండిచంగున కదలాడుచుండు చానల తోడన్
రంగము సిద్ధము చేసిరి
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్
బంగరు రంగులున్న లఘువస్త్రములే గల ధీర కాంతలన్
రంగము నందు నిల్పెదరు రమ్యముగా మృగరాజు చెంతనే
పొంగులువారు సంతసము పొల్తుక చూపెడు లీలలే కనన్
సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్
సింగము విపినమునందున
రిప్లయితొలగించండినంగుగ చరియించుచుండు ననవరతంబున్
చెంగున గంతులు వేయుచు
సింగము వెంట నడుచు నొక చిన్నదియెపుడున్
కం॥ అంగన తర్ఫీదుఁ బడసి
రిప్లయితొలగించండిచెంగున జంతువుల శాలఁ జేరెను దానై
నింగినిఁ దాకు దిటవుఁ గని
సింగము వెంట నడుచు నొక చిన్నది యెపుడున్
ఉ॥ నింగినిఁ దాకు ధైర్యమును నేర్పును బొందుచు జంతుశాలలో
నంగన చేరెనంట తగదన్నను బెద్దలు నాఁడువారికిన్
భంగము గాని భావమును బాధ్యతఁ జూపుచు నద్భుతమ్ముగన్
సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్
సింగపుకూనలన్న నతి చేరిక యర్మిలి తల్లికెన్నడున్
రిప్లయితొలగించండిజంగలమందునున్న పలు జంతువులన్ బరిమార్చుచుండునీ
సింగము, వేటకున్ జనగ చెంగున దూకుచు గారవంబుగన్
సింగము వెంట సాగు నొక చిన్నది నిత్యము నిర్భయమ్ముగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
సింగముచే విన్యాసము
హంగుగ చేయించి సర్కసందున తుదకున్
రింగును దాటుచు నేగును
సింగము వెంట నడుచునొక చిన్నది
యెపుడున్.