6-7-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుఁడే దిక్కగు రఘురామున కెపుడున్”
(లేదా...)
“రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్”
కందంచేవగలవాడనంచునుకావరమున సీతఁదెచ్చికాముకుఁడైనన్సేవక వానరులుండఁగరావణుఁ డే దిక్కగు రఘురామున కెపుడున్?
ఉత్పలమాలచేవ నహమ్ము మీరఁగ విశేషవరమ్ముల గర్వమెక్కువైకావరమందునన్ జననిఁ గానక సీతను లంకజేర్చఁగన్సేవకవానరుల్ సతము సిద్ధమటంచును వెంటనుండగన్రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్?
ఉ.పావక దారుణ ప్రకట భామయ కీల యుత ప్రదీప్తిమై దైవత జాల శక్తి వడి ధారుణిఁ జూపెడి యస్త్ర సంపదల్ కావగ భాను వంశజుని కాదరువౌ, పుర దైత్య వీర విద్రావణుఁడెప్డు దిక్కగను రామునకున్ రణరంగమందునన్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
దీవికి మండోదరి పతిరావణుఁడే దిక్కగు ; రఘురామున కెపుడున్గావలె ప్రజా పదిలమే !ఆవిభుడు సలిపిన శిష్టి యనువగు నెపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ప్రజా పదిల' మన్నది వైరి సమాసం. *గావెలె ప్రజల పదిలమే* అనండి.
🙏
రావణు పై విలువిద్యాకోవిదుడగు రాఘవుండు క్రుద్దుండగుచున్దా విజినమ్ములు విడువగరావణుఁడే దిక్కగు రఘురామున కెపుడున్చావుకు చేరువైన తఱి జానకినే హరియించె మూఢుడైరావడి తెచ్చిపెట్టెగద రావణుడే తన లంక కివ్విధిన్పావన రాముడుగ్రుడయి బాణములన్ నిగిడింపజూడగారావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్[దిక్కు = దిశ; direction]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
జీవనుని తుల్యుడాతడుచేవను జూపించియెత్తె శివధనువును తానీ వసుధనుపుట్టిన హరి రావణుఁడే దిక్కగు రఘురామున కెపుడున్.(రావణుడు రామునకు సముడెప్పుడు కాడని)కావరమందు నంధుడయి కాముకుడా దనుజా ధముండటన్ పావని బంధిసేసెనని పావని తెల్పిన యంత నుగ్రుడైయావహమందు ద్రుంచ తివి కట్టడి గట్టిన వానికింక నారావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్.?
భావన సేయగ లంకకురావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్దేవనికాయముఁ బోలినపావనధామంబయోధ్య వాసస్థలమౌ
పావన నాముఁడార్తజన పాలుఁడు రాముడు భక్తవత్సలుండా వనమాలికీ భువనమందున సాటియెవండు దందడిన్భావనసేయ రాఘవుడు భండనభీముఁడు, దైత్యుడైననారావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్?
వావి వరుసల నె రుంగక కావరమున మెలగు నట్టి కడు నీచుండై పావని చెర బట్టి న తడు రావణు డే దిక్కగు రఘు రామున కెపు డున్
కం:"ఓ వనిత! సీత ! నీ కిటరావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్నీ వంక వచ్చు దారులులేవని రంగన లట వెకిలిగ నవ్వులతోన్
ఉ:"ఓ వనితామణీ!వినవె! ఓపిక మాకు నశించుచుండె, నీవేవిధి యేడ్చినన్ విఫలమే యగు నీ యది కాని లంకలోరావణుఁ డెప్డు దిక్కగును, రామునకున్ రణరంగమందునన్చావొకటే శరణ్య" మని సల్పిరి బోధలు రాక్షసాంగనల్.
కావరమున్నయసురులకు*“రావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్”*జీవితముననొక మాటయుపావనియౌసతియునొకతె వసుధాస్థలిలోచేవను చూపలేక నట చేతల యందున నార్భటమ్ముతోభావము నందు దుష్టమగు వాంఛలు నిండిన దైత్య మూకకున్*“రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగ మందునన్”*సేవలనందచేయుగను సిద్ధముగానిలిచెన్ సమీరుడే
సమస్య:“రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్”ఉత్పలమాల: పావన భక్తుడే వినడు పావని వీడ విభీషణుండనన్ “రావణుఁ డెప్డు దిక్కగును, రామునకున్ రణరంగమందునన్”సేవలు సేయు మారుతియు సేమము కోరుతు నండయుండగా కావగ రాముడే మనకు కాగల రాజని నమ్మి దైత్యులే
ప్రశ్నొత్తరికం:"రావణునిది లంక కదా!రావణుఁడే దిక్కగు రఘురామున ?" "కెపుడున్నీవడుగు బ్రశ్న లిట్టివెరావణునిది దక్షిణమ్ము రాము నగరికిన్"
పావన చరిత్రునకుఁ గరుణా వననిధి కెన్న భవ్య నర జన్మంబే, చావ వలె నన్న రణమున రావణుఁడే, దిక్కగు రఘురా మున కెపుడున్ వేవురు ఘోర రాక్షసులు వీరులు సేరిరి కాలు నింటినిం గేవల మా దశాననుని కృత్య నిమిత్తము సత్వరమ్ముగా నా వనజాక్షి జానకిని నారయ వే గుఱిగా నొనర్పగన్ రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగ మందునన్ [దిక్కు = నెలవు]
కందం
రిప్లయితొలగించండిచేవగలవాడనంచును
కావరమున సీతఁదెచ్చికాముకుఁడైనన్
సేవక వానరులుండఁగ
రావణుఁ డే దిక్కగు రఘురామున కెపుడున్?
ఉత్పలమాల
తొలగించండిచేవ నహమ్ము మీరఁగ విశేషవరమ్ముల గర్వమెక్కువై
కావరమందునన్ జననిఁ గానక సీతను లంకజేర్చఁగన్
సేవకవానరుల్ సతము సిద్ధమటంచును వెంటనుండగన్
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్?
ఉ.
రిప్లయితొలగించండిపావక దారుణ ప్రకట భామయ కీల యుత ప్రదీప్తిమై
దైవత జాల శక్తి వడి ధారుణిఁ జూపెడి యస్త్ర సంపదల్
కావగ భాను వంశజుని కాదరువౌ, పుర దైత్య వీర వి
ద్రావణుఁడెప్డు దిక్కగను రామునకున్ రణరంగమందునన్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదీవికి మండోదరి పతి
రిప్లయితొలగించండిరావణుఁడే దిక్కగు ; రఘురామున కెపుడున్
గావలె ప్రజా పదిలమే !
ఆవిభుడు సలిపిన శిష్టి యనువగు నెపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రజా పదిల' మన్నది వైరి సమాసం. *గావెలె ప్రజల పదిలమే* అనండి.
🙏
తొలగించండిరావణు పై విలువిద్యా
రిప్లయితొలగించండికోవిదుడగు రాఘవుండు క్రుద్దుండగుచున్
దా విజినమ్ములు విడువగ
రావణుఁడే దిక్కగు రఘురామున కెపుడున్
చావుకు చేరువైన తఱి జానకినే హరియించె మూఢుడై
రావడి తెచ్చిపెట్టెగద రావణుడే తన లంక కివ్విధిన్
పావన రాముడుగ్రుడయి బాణములన్ నిగిడింపజూడగా
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్
[దిక్కు = దిశ; direction]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండి
రిప్లయితొలగించండిజీవనుని తుల్యుడాతడు
చేవను జూపించియెత్తె శివధనువును తా
నీ వసుధనుపుట్టిన హరి
రావణుఁడే దిక్కగు రఘురామున కెపుడున్.
(రావణుడు రామునకు సముడెప్పుడు కాడని)
కావరమందు నంధుడయి కాముకుడా దనుజా ధముండటన్
పావని బంధిసేసెనని పావని తెల్పిన యంత నుగ్రుడై
యావహమందు ద్రుంచ తివి కట్టడి గట్టిన వానికింక నా
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్.?
భావన సేయగ లంకకు
రిప్లయితొలగించండిరావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్
దేవనికాయముఁ బోలిన
పావనధామంబయోధ్య వాసస్థలమౌ
పావన నాముఁడార్తజన పాలుఁడు రాముడు భక్తవత్సలుం
రిప్లయితొలగించండిడా వనమాలికీ భువనమందున సాటియెవండు దందడిన్
భావనసేయ రాఘవుడు భండనభీముఁడు, దైత్యుడైననా
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్?
వావి వరుసల నె రుంగక
రిప్లయితొలగించండికావరమున మెలగు నట్టి కడు నీచుండై
పావని చెర బట్టి న తడు
రావణు డే దిక్కగు రఘు రామున కెపు డున్
కం:"ఓ వనిత! సీత ! నీ కిట
రిప్లయితొలగించండిరావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్
నీ వంక వచ్చు దారులు
లేవని రంగన లట వెకిలిగ నవ్వులతోన్
ఉ:"ఓ వనితామణీ!వినవె! ఓపిక మాకు నశించుచుండె, నీ
రిప్లయితొలగించండివేవిధి యేడ్చినన్ విఫలమే యగు నీ యది కాని లంకలో
రావణుఁ డెప్డు దిక్కగును, రామునకున్ రణరంగమందునన్
చావొకటే శరణ్య" మని సల్పిరి బోధలు రాక్షసాంగనల్.
కావరమున్నయసురులకు
రిప్లయితొలగించండి*“రావణుఁడే దిక్కగు, రఘురామున కెపుడున్”*
జీవితముననొక మాటయు
పావనియౌసతియునొకతె వసుధాస్థలిలో
చేవను చూపలేక నట చేతల యందున నార్భటమ్ముతో
భావము నందు దుష్టమగు వాంఛలు నిండిన దైత్య మూకకున్
*“రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగ మందునన్”*
సేవలనందచేయుగను సిద్ధముగానిలిచెన్ సమీరుడే
సమస్య:
రిప్లయితొలగించండి“రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగమందునన్”
ఉత్పలమాల:
పావన భక్తుడే వినడు పావని వీడ విభీషణుండనన్
“రావణుఁ డెప్డు దిక్కగును, రామునకున్ రణరంగమందునన్”
సేవలు సేయు మారుతియు సేమము కోరుతు నండయుండగా
కావగ రాముడే మనకు కాగల రాజని నమ్మి దైత్యులే
ప్రశ్నొత్తరి
రిప్లయితొలగించండికం:"రావణునిది లంక కదా!
రావణుఁడే దిక్కగు రఘురామున ?" "కెపుడున్
నీవడుగు బ్రశ్న లిట్టివె
రావణునిది దక్షిణమ్ము రాము నగరికిన్"
పావన చరిత్రునకుఁ గరు
రిప్లయితొలగించండిణా వననిధి కెన్న భవ్య నర జన్మంబే,
చావ వలె నన్న రణమున
రావణుఁడే, దిక్కగు రఘురా మున కెపుడున్
వేవురు ఘోర రాక్షసులు వీరులు సేరిరి కాలు నింటినిం
గేవల మా దశాననుని కృత్య నిమిత్తము సత్వరమ్ముగా
నా వనజాక్షి జానకిని నారయ వే గుఱిగా నొనర్పగన్
రావణుఁ డెప్డు దిక్కగును రామునకున్ రణరంగ మందునన్
[దిక్కు = నెలవు]