8, జులై 2025, మంగళవారం

సమస్య - 5176

9-7-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్”

(లేదా...)

“దుష్టుఁడు సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్”

21 కామెంట్‌లు:

  1. ఉ.
    కష్ట విశేష దుర్భవ విఘాత వినూత్న విధానముల్ సదా
    స్రష్ట వలెన్ సృజించుచు ప్రజావళి సౌఖ్యముఁ గాచు శక్తితో
    సృష్టిని వెల్గె, సంపదల చేత ప్రశాంతత లబ్ధుడైన తాఁ
    దుష్టుడు సర్వ లోకముల దుర్దశలం దొలగించె నేర్పునన్ !

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      దృష్టిని కర్తవ్యముపై
      నిష్టమ్ముగ నిల్ప నరుఁడు నిరవుగ వీడన్
      భ్రష్టత, గీతాకృష్ణుడుఁ
      దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్

      ఉత్పలమాల
      దృష్టిని జేయు కార్యమున తీరుగ నిల్పగ వేదశాస్త్ర సం
      పుష్టిగ గీత పేరిటను మూర్ఖము వాపుచు యోగవిద్యఁ దా
      నిష్టమనంగ నేర్వగన్ నరుఁడు నింపుగగెల్పొనఁగూడ కృష్ణుడున్
      దుష్టుఁడు సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్

      తొలగించండి
  3. కం॥ సృష్టినిఁ జేయఁగ నెప్పుడు
    దుష్టుఁడు లోకత్రయార్తిఁ, దొలఁగించె వడిన్
    శిష్టులఁ బ్రోచుచు ననఘుఁడు
    స్పష్టమొ నర్చుచుచు నియతిఁ బరఁగఁగ లోకుల్

    ఉ॥ ఇష్టము మీర వర్తిలుచు యిమ్ముగఁ గాంచుచుఁ బాపకార్యముల్
    సృష్టినిఁ జేయు క్రూరతను ఛిద్రమొ నర్చుచు మంచి నెల్లెడల్
    దుష్టుఁడు సర్వలోకముల దుర్దశలన్, దొలగించె నేర్పునన్
    శిష్టులఁ బ్రోచి నచ్యుతుఁడు శ్రేయముఁ గూర్చెను దుష్టశిక్షణన్

    రిప్లయితొలగించండి

  4. *(శిశుపాలునితో భీష్ముని మాటలుగా నూహించి)*

    భ్రష్టుడ వో శిశుపాలుడ
    శిష్టుల రక్షించు నట్టి శ్రేష్ఠుడు కృష్ణుం
    డిష్టుండతడే నీవనె
    దుష్టుఁడు , లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్.


    భ్రష్టుడ వోయి నీవు శిశుపాలుడ నీకిది న్యాయమౌనటే
    శిష్టుల రక్షజేయు కడు శ్రేష్ఠుడు దేవకి పుత్రుడాతడే
    కష్టము లెన్నొయోర్చి గిరికర్ణిక ధర్మము నిల్పె నీవనే
    దుష్టుఁడు , సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్.

    రిప్లయితొలగించండి
  5. దుష్టముగ దల్లి దండ్రుల
    గష్టములందు బడవేయు కథనము నంతన్
    ద్రష్టగ , మామను చంపిన
    దుష్టుఁడు , లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్

    రిప్లయితొలగించండి
  6. సృష్టికిమూలంబతడే
    దృష్టినిడున్ బాపహరణ కృత్యము లందున్
    శిష్టుడు, దైత్యాళి మదిన్
    దుష్టుఁడు, లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్

    సృష్టికి మూలదైవతము క్షేమము గూర్చగ నెల్లవారికిన్
    దృష్టిని నిల్పు దోషములఁ ద్రెంచెడు కృత్యములందునెన్నడున్
    శిష్టుడు లోకరక్షకుడు శ్రేష్ఠుడు, రాక్షసకోటి దృష్టిలో
    దుష్టుఁడు, సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్

    రిప్లయితొలగించండి
  7. కృష్ణా వ తారం లో ----
    శిష్ట జనుల బాధి o చుచు
    కష్టము గలిగించు వారి కడ తే ర్చ ంగా
    సృష్టి ని దుష్టు ల పాలిట
    దుష్టు డు లోక త్ర యార్తి దొలగించె వడిన్

    రిప్లయితొలగించండి
  8. కం:శిష్టుల సంరక్షణ కై
    దుష్టు లొసగు వేదనలను దూర మొనర్చన్
    సృష్టిన్ గృష్ణుడు ,నిర్జిత
    దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్”
    (పరిత్రాణాయ సాధూనాం ,వినాశాయ చ దుష్కృతాం.)

    రిప్లయితొలగించండి
  9. ఉ:భ్రష్టుడు రావణుండు తన పాపము పండి నశింప సత్య ధ
    ర్మిష్టులు మౌను లిట్లు తమ రీతి వచించిరి రాము మెచ్చుచున్
    శిష్టుల గాచె రాముడు నశించగ ధర్మవిరోధి యైన యా
    దుష్టుఁడు, సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్”

    రిప్లయితొలగించండి
  10. ఇష్టుఁడు సాధుసంతతికి నిష్టుఁడు దీనుల రక్షణంబునన్
    భ్రష్టుల దైత్యులన్ దునిమి భక్తులఁగాచిన జెట్టి యాతఁడు
    త్కృష్టములన్ని లీలలును కృష్ణుడు దుష్టులపట్ల తానగున్
    దుష్టుఁడు సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్

    రిప్లయితొలగించండి
  11. ఇష్టుఁడు శిష్ట జనాళికి
    కష్టములను దొలఁగఁజేయు కరుణామయుఁడే
    భ్రష్టులు దైత్యుల పాలిటి
    దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్

    రిప్లయితొలగించండి
  12. పుష్టిగ బల మున్న ఘనుఁడు
    శిష్ట మనస్కుఁడు హరి కృప చేత నడరి ష
    ష్టాష్టక హీనుఁడు వర్జిత
    దుష్టుఁడు లోకత్రయార్తిఁ దొలఁగించె వడిన్


    శిష్ట జనోపకారి ఋజుశీలుఁడు దుష్ట జనాపకారి సం
    తుష్ట మనో విరాజి పరితుష్ట న రార్చ్యుఁడు ధైర్య శౌర్య సం
    శ్లిష్టుఁడు సర్వ సద్గుణ విశిష్టుఁడు నిష్ఠుర కష్టకాల ని
    ర్దుష్టుఁడు సర్వ లోకముల దుర్దశలన్దొలఁగించె నేర్పునన్

    రిప్లయితొలగించండి

  13. అష్టమి నాడు పుట్టెనట నచ్యుతు డాచెరసాలలో భువిన్
    శిష్టుల కాచి దుష్టులకు శిక్ష నిడంగను ద్వాపరమ్మునన్
    కష్టములెల్ల బాపగను కన్నడు నయ్యెను రాక్షసాళికిన్
    *“దుష్టుఁడు సర్వలోకముల దుర్దశలన్ దొలఁగించె నేర్పునన్”*



    శిష్టుల కావగ నెంచుచు
    నష్టమగర్భాన పుట్టె నవనినిహరియే
    కష్టములిడుచుండగనా
    దుష్టుడు లోకత్రయార్తి తొలగించె వడిన్


    రిప్లయితొలగించండి