13, జులై 2025, ఆదివారం

సమస్య - 5181

14-7-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య”

(లేదా...)

“గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే”

(పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అగ్నిలింగమై శివుఁడు తానఘము గాల్చ
    హరుఁడె యరుణాచలమ్మని గురువులనఁగ
    నమ్మకముఁ బాప మీలోని వైరులారు
    గురు, గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    చంపకమాల
    అరుణగిరీంద్రుఁడై శివుడు నార్తిని బాపగ నగ్నిలింగమై
    హరుని స్వరూపమంచు నరుణాచలమున్ ప్రజ మ్రొక్కుచుండఁగన్
    స్థిరమగు నమ్మకమ్ము విడి చిందులు వేయగ లోన వైరు లా
    ర్గురు, గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే!

    రిప్లయితొలగించండి

  2. క్రైస్తవ సమూహమట జేరి క్రీస్తు చరిత
    జెప్పుచుండ నర్చకుడు వచించె నిటుల
    మీరు హిందుమతమునకు వైరు లారు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య.


    తరుణులు కష్టమంచనక ధైర్యము జూపుచు జేయవచ్చు పా
    ర్పరులకు ప్రాణగొడ్డమని వైద్యుడు నాడు వచించె గాదుటే
    యరయగ శ్వాశకోశముల వ్యాధిని గల్గిన వారలైన స
    ద్గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తే॥ వరలు నాషాఢభూతులు గురువులఁ గని
      కపట చిత్తము దాచుచు కడు నటనల
      ప్రణతుల నొసఁగు చుండఁగఁ బలికితినిటు
      గురు గిరి ప్రదక్షిణము మీకుదగగయ్య

      చం॥ గురువును గౌరవించుటకుఁ గూర్చిన విద్యలఁ బంచ నెంచినన్
      గరిమగ శాస్త్ర శోధనను గాంచుచు విద్యలఁ బెంచ మోదమే
      మరచుచు నన్ని స్వార్థమున మాన్యులఁ దల్చుచు వ్యాస పూర్ణిమన్
      గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే

      తే॥ గురు గిరిప్రదక్షిణము లో రి గురువాండి, అప్పుడు గిరి అంటే కొండే ఔతుంది

      తొలగించండి
  4. ఇప్పుడాషాఢమని దమ యిష్టుడు నర
    సింహమూర్తి రూపున వెలసిన గిరి కడ
    వయసు మీరగ ముదుసలి వారగు నలు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    రిప్లయితొలగించండి
  5. అగ్ని పర్వతము పగుల నగ్ని రగిలి
    వేడి శగలను రగిలించు వేళలోన
    తత్తరపడి వేగ పరుగులెత్తగ పదు
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగదయ్య

    గిరులను చూడవచ్చిన నొకించుక చూపుము జాగరూకతన్
    వరదుని కాణయాచి యని వచ్చిన భక్తుల ముందు విచ్చి జ్వా
    లరగిలి పెద్దయెత్తున శిలాద్రవమున్ వెదజల్లు చున్న జే
    గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే

    రిప్లయితొలగించండి
  6. సమస్య:
    గురు గిరికింప్రదక్షిణము కొండొక ఘోరతరాపరాధమే.

    చంపకమాల:

    గురుతర బాధ్యతల్ సలుప కూడని భారపు కార్య మందురే !
    మరిమరి యోచనల్ తగును మందర కొండకు శేషు జుట్టకే
    చిరుచిరు కేశముల్ వటిగ జేయ సుధాకలశంబు రాదు, చే
    గురు, గిరికింప్రదక్షిణము, కొండొక ఘోరతరాపరాధమే.

    (చేకూరు/చేకురు = లభించు)

    రిప్లయితొలగించండి
  7. చేరి రరుణా చలమ్మును శీ ఘ్ర ముగను
    వృద్ధు లా గిరి చుట్టంగ వెడల గానె
    వారి నయ్యె డ గాంచియు పలికి రారు
    గురు గిరి ప్రదక్షిణ ము మీకు దగ ద య్య

    రిప్లయితొలగించండి
  8. పర్వతమ్ము పైన నిలిపి భక్తి భృశము
    మెల్లమెల్లనఁ జనఁ దగు నుల్ల మలర
    విగత భక్తి తత్పరతఁ బరుగు పరుగున
    గురు గిరిప్రదక్షిణము మీకుఁ దగ దయ్య


    గురు గిరి సుప్రదక్షిణము కోరిన కోర్కు లొసంగు నన్నచో
    గురుతర సత్య వాక్యము లగుం బరికించినఁ జిత్త శుద్ధితో
    గురుతర నాస్తికప్రజలు కుత్సిత చిత్తులు పల్కు మాటలే
    గురు గిరికిం బ్రదక్షిణము కొండొక ఘోర తరాపరాధమే

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:నాస్తికత్వమ్ము మాకు నిన్నాళ్లు నేర్పి,
    మమ్ము లోక శత్రువులుగ మార్చి నీవు
    సఖులతో గూడి కొండ కై సాగు టేమి
    గురు! గిరిప్రదక్షిణము మీకు దగదయ్య”
    (ఈ రోజుల్లో ప్రతి వాణ్ని గ్రూప్ అనటం మామూలు కనుక గురూ!అని పిలిచాడు.మా అందరినీ నాస్తికుల్ని చేసి నువ్వు గిరిప్రదక్షిణాలు చేయట మేంతిమె గురూ! అని.)

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:నాస్తికత్వమ్ము మాకు నిన్నాళ్లు నేర్పి,
    మమ్ము లోక శత్రువులుగ మార్చి నీవు
    సఖులతో గూడి కొండ కై సాగు టేమి
    గురు! గిరిప్రదక్షిణము మీకు దగదయ్య”
    (ఈ రోజుల్లో ప్రతి వాణ్ని గురూ అనటం మామూలు కనుక గురూ!అని పిలిచాడు.మా అందరినీ నాస్తికుల్ని చేసి నువ్వు గిరిప్రదక్షిణాలు చేయట మేంటి గురూ! అని.)

    రిప్లయితొలగించండి