17-1-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”(లేదా...)“పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్”(భరతశర్మ గారి శతావధానంలో మాచవోలు శ్రీధర్ రావు గారి సమస్య)
తేటగీతివాణి కారుణ్యమున్ బొంది పాటవముననింపి శబ్దార్థ సమతూకమింపుగానుపృచ్ఛకులె కాదు ప్రేక్షకుల్ నచ్చనట్లుపద్యములు రాని యవధాని వాసిఁ గాంచె! మత్తకోకిలవిద్యనేర్చియు వాణిదీవెన ప్రీతిఁగొల్పెడు శైలితోహృద్యశైలిని పట్టునందియు పృచ్ఛకాళియు ప్రేక్షకుల్వద్యమైన యలంకృతమ్ములఁ బల్కువాడన, నాసిగన్పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!
నిగమమందున నవధాన నియమ మంత చక్కని పరువడిని కొనసాగ , కొనన అబ్రముగ బాలుడడిగిన యాంగ్ల భాష పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”
విజ్ఞులెల్లరు మెచ్చెడి విధము నిపుడుపద్యముల్ చెప్పనేమిర బాల్యమందునప్పగించమనుచు నొజ్జ యడిగినంత పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె.విద్యలందున వాసిగాంచిన విజ్ఞులెల్లరు మెచ్చుచున్ హృద్యమంచు నుతించు రీతిని యింపుగా నవధాననున్ బద్యమల్లిన వాడు పూర్వము పామరుండట బాల్యమున్ పద్యమొక్కటి రాని బాలుఁడు , వాసిఁ గాంచె వధానిగన్
విద్యయే వ్యవసాయ మంచును బ్రీతితో గొనసాగగన్యుద్యమించుచు చిన్నప్రాయమునూని బూన కవిత్వమున్హృద్యమై లభియించె కైత లనేకమై యట దోషమున్బద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!
పాఠశాలలో నాడట బాల్యమందుపద్యమన్నది నేర్వని బాలుడతడునేడు నేత్రావధానమ్ము నేర్చినాడుపద్యములు రాని యవధాని వాసిఁ గాంచెవిద్యలెన్నియొ లోక మందున వీలు వెంబడి నేర్వగన్హృద్యమైనవి గావె చూడగ తృప్తినిచ్చెడి ప్రక్రియల్చోద్యమేమియు లేని సంగతి చూడ చిన్నతనంబునన్బద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్
ఎత్తుకు ఎత్తులు పైయ్యెత్తుల పదని సల నిషిద్ధాక్షరి సౌరు చూడ సమస్య పూరణ సమస్యను సమయ స్ఫూర్తితో పూరించి సొబగు తోడదత్త పది పదాల దక్షత చూపుతూ పద్య వల్లరి యల్లె ప్రౌడి కూడి ఆశు పద్యమ్ముల ధారవర్ణన లెల్ల చిందులేయించేను చిత్త మందు చిత్ర కవిత ,యప్రస్తుతం ,చిత్ర కథలు అంశ మేదియై నాయవ ధానమందు వీనులకు కనులకు తగు విందు కాని పద్యములు రాని యవధాని వాసిగాంచె
అందరికీ నమస్కారములు.నేను అర్థశాస్త్ర అధ్యాపకురాలను .ఈ మధ్యనుండి పద్యములు నేర్చుకుంటున్నాను.ఇది 5 వ సీస పద్యము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
(అవధానమంటే ఏకాగ్రత జాగరూకత అండి. అవధాని అంటే ఏకాగ్రత జాగరూకత కలవాడండి)తే॥ స్వాస్థ్యసేవలఁ జేయఁగ వైద్యుఁడొకఁడుమిగుల యేకాగ్రత వడసి మేదినిఁ జనస్వార్థరహితుఁడై వరలుచు సాటిఁ గనునెపద్యములు రాని యవధాని వాసిఁ గాంచెమత్త॥విద్య నేర్వఁగఁ బట్టుబట్టుచు వీడకుండఁగ సాధనన్వైద్యుఁడయ్యెను స్వాస్థ్య సేవల స్వార్థమన్నది లేకయేహృద్యమౌ విధి జూగరూకత నెంచి చేయఁగ మెచ్చరేపద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్
తే.గీ:అన్న పే రవధానియే,యనుజు పేరునదియె, పద్యమ్ములన్ వ్రాసి యన్న యశముబొందకుండెను, కథలను వంద వ్రాసిపద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”(అన్న దమ్ము లిద్దరి పేరులోను అవధాని అనే పదం ఉంది.అన్నకి పద్యాలు రాసినా పేరు రాలేదు.పద్యాలు రాని తమ్ముడు కథలు రాసి పేరు పొందాడు.)
సమస్య : "పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె""పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె"ననియె నెరుగని యజ్ఞానధని యొకండుప్రతిభ భాషాపరిజ్ఞాన పాటవములుధారణాశక్తి వారల వరముగాదె
సమస్య:పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!ఉ.మా:విద్యయన్నది నేటి బిడ్డలు వేయి రీతుల నేర్తురేసద్యనిర్మిత పద్యమల్లగ సాధ్యమైనది యంత్రమున్ వేద్య వైదిక ఛందమే బహు వీలు నైనది ధారణే పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!చోద్యమే భళి ! యంత్రసాయము చోరవిద్యల జ్ఞానమే !!
మ.కో:విద్య నేర్చెను తెల్గునన్, రుచి వీడి యాంగ్లము నందునన్పద్య విద్యయు నేర్చి చక్కగ బట్టె నీ యవధానమున్"విద్య లేదట యాంగ్లమం" దని వెక్కిరింతునె? షేక్స్పియర్పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్”
దిట్ట వేదాధ్యయనమున దిట్ట యౌ నితం డుపన్యాసము లొసంగ మెండుగాను గద్యములు వ్రాయ నేర్చినఁ గాని వ్రాయఁబద్యములు రాని యవధాని వాసిఁ గాంచె [అవధాని = వేదముల నేర్పరి] చోద్య మాతని పాటవమ్ము వచో విశారదుఁ డిద్ధరన్ విద్యలన్ ఘటికుండు మేటి వివేకి నైపుణుఁ డూహలం బద్య సంచయ కల్పనా నుత పారగుం డయి వర్ణ నాపద్య మొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్ [వర్ణన + అపద్యము = వర్ణ నాపద్యము, నీచమైన వర్ణనము]
తే॥గీపృచ్ఛకులిడుముడినివెట్ట బెదరిపోకరమ్య భావకలిత పద్య రచనజేయతరముగానివగుచు నూక దంపుడైనపద్యములురాని యవధాని వాసిఁగాంచె!!
ఆశు పద్యాలు ధా ర గా నల్ల గలిగి ప్రేక్షకాళి ని మెప్పించ విధ ము గాగ పద్యముల చెప్పు నెప్పుడు భావ రహిత పద్యములు రాని యవధాని వాసి గాంచె
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.యతియు,గణములు,ఛందస్సు గతులు తప్ప కుండ పద్య నియమములు కుదురుగానుచెప్పి యొక్క తప్పైనను చేయనట్టిపద్యములు రాని యవధాని వాసిఁ గాంచె.
తేటగీతి
రిప్లయితొలగించండివాణి కారుణ్యమున్ బొంది పాటవమున
నింపి శబ్దార్థ సమతూకమింపుగాను
పృచ్ఛకులె కాదు ప్రేక్షకుల్ నచ్చనట్లు
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె!
మత్తకోకిల
విద్యనేర్చియు వాణిదీవెన ప్రీతిఁగొల్పెడు శైలితో
హృద్యశైలిని పట్టునందియు పృచ్ఛకాళియు ప్రేక్షకుల్
వద్యమైన యలంకృతమ్ములఁ బల్కువాడన, నాసిగన్
పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!
నిగమమందున నవధాన నియమ మంత
రిప్లయితొలగించండిచక్కని పరువడిని కొనసాగ , కొనన
అబ్రముగ బాలుడడిగిన యాంగ్ల భాష
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”
రిప్లయితొలగించండివిజ్ఞులెల్లరు మెచ్చెడి విధము నిపుడు
పద్యముల్ చెప్పనేమిర బాల్యమందు
నప్పగించమనుచు నొజ్జ యడిగినంత
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె.
విద్యలందున వాసిగాంచిన విజ్ఞులెల్లరు మెచ్చుచున్
హృద్యమంచు నుతించు రీతిని యింపుగా నవధాననున్
బద్యమల్లిన వాడు పూర్వము పామరుండట బాల్యమున్
పద్యమొక్కటి రాని బాలుఁడు , వాసిఁ గాంచె వధానిగన్
విద్యయే వ్యవసాయ మంచును
రిప్లయితొలగించండిబ్రీతితో గొనసాగగన్
యుద్యమించుచు చిన్నప్రాయము
నూని బూన కవిత్వమున్
హృద్యమై లభియించె కైత ల
నేకమై యట దోషమున్
బద్యమొక్కటి రాని బాలుఁడు
వాసిఁ గాంచె వధానిగన్!
పాఠశాలలో నాడట బాల్యమందు
రిప్లయితొలగించండిపద్యమన్నది నేర్వని బాలుడతడు
నేడు నేత్రావధానమ్ము నేర్చినాడు
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె
విద్యలెన్నియొ లోక మందున వీలు వెంబడి నేర్వగన్
హృద్యమైనవి గావె చూడగ తృప్తినిచ్చెడి ప్రక్రియల్
చోద్యమేమియు లేని సంగతి చూడ చిన్నతనంబునన్
బద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్
ఎత్తుకు ఎత్తులు పైయ్యెత్తుల పదని
రిప్లయితొలగించండిసల నిషిద్ధాక్షరి సౌరు చూడ
సమస్య పూరణ సమస్యను సమయ
స్ఫూర్తితో పూరించి సొబగు తోడ
దత్త పది పదాల దక్షత చూపుతూ
పద్య వల్లరి యల్లె ప్రౌడి కూడి
ఆశు పద్యమ్ముల ధారవర్ణన లెల్ల
చిందులేయించేను చిత్త మందు
చిత్ర కవిత ,యప్రస్తుతం ,చిత్ర కథలు
అంశ మేదియై నాయవ ధానమందు
వీనులకు కనులకు తగు విందు కాని
పద్యములు రాని యవధాని వాసిగాంచె
అందరికీ నమస్కారములు.నేను అర్థశాస్త్ర అధ్యాపకురాలను .ఈ మధ్యనుండి పద్యములు నేర్చుకుంటున్నాను.ఇది 5 వ సీస పద్యము
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి(అవధానమంటే ఏకాగ్రత జాగరూకత అండి. అవధాని అంటే ఏకాగ్రత జాగరూకత కలవాడండి)
రిప్లయితొలగించండితే॥ స్వాస్థ్యసేవలఁ జేయఁగ వైద్యుఁడొకఁడు
మిగుల యేకాగ్రత వడసి మేదినిఁ జన
స్వార్థరహితుఁడై వరలుచు సాటిఁ గనునె
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె
మత్త॥విద్య నేర్వఁగఁ బట్టుబట్టుచు వీడకుండఁగ సాధనన్
వైద్యుఁడయ్యెను స్వాస్థ్య సేవల స్వార్థమన్నది లేకయే
హృద్యమౌ విధి జూగరూకత నెంచి చేయఁగ మెచ్చరే
పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్
తే.గీ:అన్న పే రవధానియే,యనుజు పేరు
రిప్లయితొలగించండినదియె, పద్యమ్ములన్ వ్రాసి యన్న యశము
బొందకుండెను, కథలను వంద వ్రాసి
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”
(అన్న దమ్ము లిద్దరి పేరులోను అవధాని అనే పదం ఉంది.అన్నకి పద్యాలు రాసినా పేరు రాలేదు.పద్యాలు రాని తమ్ముడు కథలు రాసి పేరు పొందాడు.)
సమస్య : "పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె"
రిప్లయితొలగించండి"పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె"
ననియె నెరుగని యజ్ఞానధని యొకండు
ప్రతిభ భాషాపరిజ్ఞాన పాటవములు
ధారణాశక్తి వారల వరముగాదె
సమస్య:
రిప్లయితొలగించండిపద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!
ఉ.మా:
విద్యయన్నది నేటి బిడ్డలు వేయి రీతుల నేర్తురే
సద్యనిర్మిత పద్యమల్లగ సాధ్యమైనది యంత్రమున్
వేద్య వైదిక ఛందమే బహు వీలు నైనది ధారణే
పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!
చోద్యమే భళి ! యంత్రసాయము చోరవిద్యల జ్ఞానమే !!
మ.కో:విద్య నేర్చెను తెల్గునన్, రుచి వీడి యాంగ్లము నందునన్
రిప్లయితొలగించండిపద్య విద్యయు నేర్చి చక్కగ బట్టె నీ యవధానమున్
"విద్య లేదట యాంగ్లమం" దని వెక్కిరింతునె? షేక్స్పియర్
పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్”
దిట్ట వేదాధ్యయనమున దిట్ట యౌ ని
రిప్లయితొలగించండితం డుపన్యాసము లొసంగ మెండుగాను
గద్యములు వ్రాయ నేర్చినఁ గాని వ్రాయఁ
బద్యములు రాని యవధాని వాసిఁ గాంచె
[అవధాని = వేదముల నేర్పరి]
చోద్య మాతని పాటవమ్ము వచో విశారదుఁ డిద్ధరన్
విద్యలన్ ఘటికుండు మేటి వివేకి నైపుణుఁ డూహలం
బద్య సంచయ కల్పనా నుత పారగుం డయి వర్ణ నా
పద్య మొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్
[వర్ణన + అపద్యము = వర్ణ నాపద్యము, నీచమైన వర్ణనము]
తే॥గీ
రిప్లయితొలగించండిపృచ్ఛకులిడుముడినివెట్ట బెదరిపోక
రమ్య భావకలిత పద్య రచనజేయ
తరముగానివగుచు నూక దంపుడైన
పద్యములురాని యవధాని వాసిఁగాంచె!!
ఆశు పద్యాలు ధా ర గా నల్ల గలిగి
రిప్లయితొలగించండిప్రేక్షకాళి ని మెప్పించ విధ ము గాగ
పద్యముల చెప్పు నెప్పుడు భావ రహిత
పద్యములు రాని యవధాని వాసి గాంచె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
యతియు,గణములు,ఛందస్సు గతులు తప్ప
కుండ పద్య నియమములు కుదురుగాను
చెప్పి యొక్క తప్పైనను చేయనట్టి
పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె.