13, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5350

14-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్”
(లేదా...)
“తనకున్ శత్రువులైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా”
(భరతశర్మ గారి శతావధానంలో వేంకట కృష్ణకుమార్ గారి సమస్య)

2 కామెంట్‌లు:

  1. కందం
    అనయము దేవుని నమ్ముచుఁ
    దన కర్తవ్యమున సాగు ధర్మపరునిపై
    కొనసాగ దాడు, లణచుచు
    తన శత్రువులైన జనుల, దైవము ప్రోచున్

    రిప్లయితొలగించండి
  2. తనకలిని గలుగ జేయును
    తన శత్రువులైన జనుల దైవము ; ప్రోచున్
    తనపయి నమ్మక ముంచిన
    మనుజుల సర్వ సమయముల మాన్యత తోడన్

    రిప్లయితొలగించండి