25-1-2026 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్”(లేదా...)“వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”(భరతశర్మ గారి శతావధానంలో గౌరీభట్ల రఘురామ శర్మ గారి సమస్య)
కందంసరసకుఁ జేరెడు సమయమసురసంధ్యన్ దగదనఁ బతి. ,చోద్యమనంగన్దరుణి దితియె పొరలిన కావరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్చంపకమాలసరసకుఁ జేరగానసురసంధ్యను కశ్యపు డొప్పకుండినన్మరిమరి కౌతుకమ్మున సమాగము దప్పదటన్నరీతిగన్వరుసను మార్చకే దితియె వాంఛలు దీరఁగ పొర్లినట్టి కావరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సరికాదు సురత మిదియె య సురసంధ్య యని పతి దితికి సూచించిన నే మి రమణి కోరెనుగద కా వరమున, రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్.సరి యిది కాదు కాదసుర సంధ్యను సంగమమ్మటంచున్ పురుషుడు చెప్పనేమీ సతి మూర్ఖత వీడక సంప్ర యోగమున్ విరహము తాళలేననుచు వేడగ నాదితి యున్నతిల్లు కా వరమునఁ, బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్.
తరతరముల జనహితముగ పరిపాలనమును సలిపిన వంశమె గాదా !అరుదగు విధముగ నిపుడు ప్రవరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
-జయవిజయులు,/ ఆదాము ఈవులు ద్వంద్వ ప్రకృతి/ ద్వైతము ....హరిని గొలిచె పణిహారిగ గరువము తలకెక్కగా నకరిణికి గురియైయిరమనెడీ మోక్షపు స్థావరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్శుభోదయముజిలేబి
నిరతము నీరజోదరుని నిండు మనంబున నిల్పి గొల్చుచున్పరమ పవిత్రులైన హరి భక్తుల సంగతమందు నార్తితోహరిని భజించుటన్నఁగడు హర్షముఁజూపెడు బాలకుండుగావరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
(ప్రహ్లాదుని జననమండి హరి వరమున పుట్టినవాడే కదా)కం॥ ధరఁ గశ్యపాత్మజుఁ డటుల వరలఁగ దురిత గుణములను బంకజనాభున్వరదుని వేడఁగ నాతనివరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్చం॥ ధరణిని కశ్యపాత్మజుఁడు తల్లడపెట్టఁగ సజ్జనాళినిన్సరగున దేవతాళి చని చక్రిని వేడఁగ నూరడించుచున్హరి కరుణామయుండు దరహాస వికాశముతో నొసంగె నావరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్కశ్వపాత్మజుడు హిరణ్యకశిపుడు (ప్రహ్లాదుడు చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు కదండి)
సమస్య:“వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”చం.మా :పరసతి బట్ట శాపమును, పాపపు భీతియు లేక సీతనే ! గరువము తోడ దెచ్చెనుగ, గారవమంచు నశోకవాటికన్ కరమును బట్టలేక మరి కాంతను వేడెను గూడ, కండ, కా “వరమునఁ బుట్టె రాక్షసుఁడు, వైభవమొప్ప, జగంబు నేలఁగన్”
నిరతము హరినామమ్మునుస్మరియించుచు నార్తితోడ మదిలో నెపుడున్హరినిఁ గొలుచు భక్తునిగావరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
గురు తప మొనరింప నరేతరుల వలనఁ జావు లేమి ధాత యొసంగెన్ నిరతమ్మును జెలరేఁగుచు వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్ వర మిడ పద్మనాభుఁడు సుపర్వుల కింపుగ లోకరక్షకై పురుష వరుండు రాఘవుఁడు వుట్టె వధింపఁగ రావణాసురున్ సురముని దత్త శాపమునఁ జోద్యము వైశ్రవణుండు కండ కావరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్
మురియగ నసుర గణంబులు నిరుపమ విక్రముo డ గాగ నిగనిగ లాడేతరుణమున లంకా స్థా వరమున రాక్షసుడు పు ట్టె పాలింప భువిన్
కందం
రిప్లయితొలగించండిసరసకుఁ జేరెడు సమయమ
సురసంధ్యన్ దగదనఁ బతి. ,చోద్యమనంగన్
దరుణి దితియె పొరలిన కా
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
చంపకమాల
సరసకుఁ జేరగానసురసంధ్యను కశ్యపు డొప్పకుండినన్
మరిమరి కౌతుకమ్మున సమాగము దప్పదటన్నరీతిగన్
వరుసను మార్చకే దితియె వాంఛలు దీరఁగ పొర్లినట్టి కా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసరికాదు సురత మిదియె య
సురసంధ్య యని పతి దితికి సూచించిన నే
మి రమణి కోరెనుగద కా
వరమున, రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్.
సరి యిది కాదు కాదసుర సంధ్యను సంగమమ్మటంచున్
పురుషుడు చెప్పనేమీ సతి మూర్ఖత వీడక సంప్ర యోగమున్
విరహము తాళలేననుచు వేడగ నాదితి యున్నతిల్లు కా
వరమునఁ, బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్.
తరతరముల జనహితముగ
రిప్లయితొలగించండిపరిపాలనమును సలిపిన వంశమె గాదా !
అరుదగు విధముగ నిపుడు ప్ర
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
-
రిప్లయితొలగించండిజయవిజయులు,/ ఆదాము ఈవులు
ద్వంద్వ ప్రకృతి/ ద్వైతము ....
హరిని గొలిచె పణిహారిగ
గరువము తలకెక్కగా నకరిణికి గురియై
యిరమనెడీ మోక్షపు స్థా
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
శుభోదయము
జిలేబి
నిరతము నీరజోదరుని నిండు మనంబున నిల్పి గొల్చుచున్
రిప్లయితొలగించండిపరమ పవిత్రులైన హరి భక్తుల సంగతమందు నార్తితో
హరిని భజించుటన్నఁగడు హర్షముఁజూపెడు బాలకుండుగా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్
(ప్రహ్లాదుని జననమండి హరి వరమున పుట్టినవాడే కదా)
రిప్లయితొలగించండికం॥ ధరఁ గశ్యపాత్మజుఁ డటుల
వరలఁగ దురిత గుణములను బంకజనాభున్
వరదుని వేడఁగ నాతని
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
చం॥ ధరణిని కశ్యపాత్మజుఁడు తల్లడపెట్టఁగ సజ్జనాళినిన్
సరగున దేవతాళి చని చక్రిని వేడఁగ నూరడించుచున్
హరి కరుణామయుండు దరహాస వికాశముతో నొసంగె నా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్
కశ్వపాత్మజుడు హిరణ్యకశిపుడు
(ప్రహ్లాదుడు చాలా సంవత్సరాలు పరిపాలిస్తాడు కదండి)
సమస్య:
రిప్లయితొలగించండి“వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవమొప్ప జగంబు నేలఁగన్”
చం.మా :
పరసతి బట్ట శాపమును, పాపపు భీతియు లేక సీతనే !
గరువము తోడ దెచ్చెనుగ, గారవమంచు నశోకవాటికన్
కరమును బట్టలేక మరి కాంతను వేడెను గూడ, కండ, కా
“వరమునఁ బుట్టె రాక్షసుఁడు, వైభవమొప్ప, జగంబు నేలఁగన్”
నిరతము హరినామమ్మును
రిప్లయితొలగించండిస్మరియించుచు నార్తితోడ మదిలో నెపుడున్
హరినిఁ గొలుచు భక్తునిగా
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
గురు తప మొనరింప నరే
రిప్లయితొలగించండితరుల వలనఁ జావు లేమి ధాత యొసంగెన్
నిరతమ్మును జెలరేఁగుచు
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్
వర మిడ పద్మనాభుఁడు సుపర్వుల కింపుగ లోకరక్షకై
పురుష వరుండు రాఘవుఁడు వుట్టె వధింపఁగ రావణాసురున్
సురముని దత్త శాపమునఁ జోద్యము వైశ్రవణుండు కండ కా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్
మురియగ నసుర గణంబులు
రిప్లయితొలగించండినిరుపమ విక్రముo డ గాగ నిగనిగ లాడేతరుణమున లంకా స్థా
వరమున రాక్షసుడు పు ట్టె పాలింప భువిన్