3-8-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్యాయమె జయమునందు నవనీస్థలిపై”
(లేదా...)
“అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కాకరపర్తి దుర్గాప్రసాద్ గారి సమస్య)
భీష్మద్రోణుల వీర మరణం తరువాత సుయోధనుని మానసం:కందంమాన్యుండౌ హరి పూన్చగవిన్యాసంబుల దునిమిరె భీష్మున్ ద్రోణున్శూన్యాచారుల విజ్ఞతనన్యాయమె జయమునందు నవనీస్థలిపై! శార్దూలవిక్రీడితముమాన్యుండౌ హరి పూన్చఁగన్ జెలఁగి దుర్మార్గాన భీష్మున్, గురున్విన్యాసంబుల పాండునందనులు దుర్భేద్యాదులన్ ద్రుంచిరేశూన్యాచారుల ధర్మమూర్తులనుచున్ స్తోత్రంబులింకేలనో?యన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ!
మాన్యుల నవమానించెడిఅన్యాయమె జయమునందు నవనీస్థలిపైసన్యాస మొందినప్పుడె ధన్యడనెద రెవరినైన ధారణి యందున్
ధన్యంబౌ జీవిత మనిసన్యాసము స్వీకరించి సాగింత్రు విధుల్విన్యాసములన్ జూడగనన్యాయమె జయమునందు నవనీస్థలిపైసన్యాసాశ్రమమే విశేష మనరే సంక్లిష్టమౌ ముక్తికైసన్యాసమ్మును స్వీకరించి ఘనులై సాగింతురే కృత్యముల్విన్యాసమ్ములఁ గాంచినంత విధిగా విస్పష్టమీ సత్యమేఅన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
*(సుర గణము విష్ణు మూర్తి తో మొరపెట్టు కొనుట)*దైన్యంబున చేరితి మిట మాన్యా భువినవతరించి మాకింకను నీ వే న్యాయము చేయని చో యన్యాయమె జయమునందు నవనీస్థలిపై.దైన్యంబయ్యెను మాదు జీవన మటన్ దాక్షిణ్యమున్ వీడి మా కన్యాయంబును గూర్చు చుండె నిజమా కల్మాషుడే గాంచ నీ వే న్యాయమ్మును జేయకున్ననిక నా హీనాత్మకున్ జేతిలో నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ.
కన్యాత్వంబును పాడుజేయు నొకడున్ కామంధ కారాన సౌజన్యంబింతయు లేక దుశ్చరితుడై సంస్కార హీనుండునైవన్యప్రాణుల పట్టి పేరడచి తా భావించు నీరీతిగానన్యాయంబె జయించు చుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
అన్యాయపు జనులకు సరియన్యాయమె జయమునందు నవనీస్థలిపై
-పుణ్యాత్ములకేది యెలమివన్యమృగమరయు నగరపు ప్రఖరపు జిత్తుల్?అన్యాయపు జనులకు సరియన్యాయమె జయమునందు నవనీస్థలిపై
అన్యుల తప్పుడు సాక్ష్య ము మాన్యము గా జే కొనుచును మహిసంభవమై జన్య ము గా దీ ర్పు జరుగన న్యా య మె జయము నందు నవ నీ స్థలి పై
ధన్యుఁడు ధర్మాచరణముమాన్యతతో సలుపునట్టి మనుజుడు భువిలోనన్యాయకారి తలఁపుననన్యాయమె జయమునందు నవనీస్థలిపై
ధన్యాత్ముండు జగమ్మునందు గడు శ్రద్ధాసక్తులన్ ధర్మమున్మాన్యుండై యొనరించుచుండు నిరతం బాతండె ధర్మాత్ముడౌవిన్యాసంబుగ పాపముల్ సలిపి భావించున్ దురాత్ముండు నేడన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
కం:అన్యాయద్యూతమ్మునవన్యుల జేసితివి కౌరవపతీ! మము సామాన్యులనకు, ప్రథమమునందన్యాయమె జయమునందు నవనీస్థలిపై”(అని భీముడు అన్నట్లు.)
శా: ధన్యమ్మౌ భరతావనిన్ గలిని జింతన్ జేసి బ్రహ్మర్షులౌమాన్యుల్ జెప్పిరి భావి నిట్లు "నశియింపన్ వర్ణధర్మమ్ములే,సన్యాస మ్మొక వేషమౌచు, ద్విజులున్ శాస్త్రమ్ములన్ వీడగానన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ”(పురాణాలలో ఋషులు కలికాలం ఇలా ఉంటుం దని చెప్పారు. )
అన్యమ్మును జింతింపకు విన్యస్తం బగు జయమ్ము పిదపం దథ్యం బా న్యాయమునకు ముందుగ నన్యాయమె జయము నందు నవనీస్థలిపై కన్యా భోగము లందు మగ్నుఁ డగు లంకా నాథుఁ డెల్లప్పుడున్ మాన్యామాన్య వివేక శూన్యులకు ధర్మం బన్న దెందుండు రాజన్యాశేష పరాజయార్థ మయి రక్షః పాలు రాజ్యమ్ములో నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మమౌ
పుణ్యాత్ముల్ వ్యథ రాజకీయముల సంపూర్ణమ్ముగా వీడగాదైన్యమ్మొందె విలాతి పాలనవడిన్ దౌర్బాగ్యులే పొంది తా మన్యమ్మైన విధమ్ములన్ బ్రజల భాగ్యమ్ముల్ గొనన్ వారిదౌ అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.కన్యల హత్యాచారమ్మన్యాయమె;జయమునందు నవనీ స్థలిపైమాన్యులు ధర్మమెఱుంగుచుదైన్యుల కాపాడుచుండ దక్షత తోడన్.
భీష్మద్రోణుల వీర మరణం తరువాత సుయోధనుని మానసం:
రిప్లయితొలగించండికందం
మాన్యుండౌ హరి పూన్చగ
విన్యాసంబుల దునిమిరె భీష్మున్ ద్రోణున్
శూన్యాచారుల విజ్ఞత
నన్యాయమె జయమునందు నవనీస్థలిపై!
శార్దూలవిక్రీడితము
మాన్యుండౌ హరి పూన్చఁగన్ జెలఁగి దుర్మార్గాన భీష్మున్, గురున్
విన్యాసంబుల పాండునందనులు దుర్భేద్యాదులన్ ద్రుంచిరే
శూన్యాచారుల ధర్మమూర్తులనుచున్ స్తోత్రంబులింకేలనో?
యన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ!
మాన్యుల నవమానించెడి
రిప్లయితొలగించండిఅన్యాయమె జయమునందు నవనీస్థలిపై
సన్యాస మొందినప్పుడె
ధన్యడనెద రెవరినైన ధారణి యందున్
ధన్యంబౌ జీవిత మని
రిప్లయితొలగించండిసన్యాసము స్వీకరించి సాగింత్రు విధుల్
విన్యాసములన్ జూడగ
నన్యాయమె జయమునందు నవనీస్థలిపై
సన్యాసాశ్రమమే విశేష మనరే సంక్లిష్టమౌ ముక్తికై
సన్యాసమ్మును స్వీకరించి ఘనులై సాగింతురే కృత్యముల్
విన్యాసమ్ములఁ గాంచినంత విధిగా విస్పష్టమీ సత్యమే
అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
రిప్లయితొలగించండి*(సుర గణము విష్ణు మూర్తి తో మొరపెట్టు కొనుట)*
దైన్యంబున చేరితి మిట
మాన్యా భువినవతరించి మాకింకను నీ
వే న్యాయము చేయని చో
యన్యాయమె జయమునందు నవనీస్థలిపై.
దైన్యంబయ్యెను మాదు జీవన మటన్ దాక్షిణ్యమున్ వీడి మా
కన్యాయంబును గూర్చు చుండె నిజమా కల్మాషుడే గాంచ నీ
వే న్యాయమ్మును జేయకున్ననిక నా హీనాత్మకున్ జేతిలో
నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ.
కన్యాత్వంబును పాడుజేయు నొకడున్ కామంధ కారాన సౌ
రిప్లయితొలగించండిజన్యంబింతయు లేక దుశ్చరితుడై సంస్కార హీనుండునై
వన్యప్రాణుల పట్టి పేరడచి తా భావించు నీరీతిగా
నన్యాయంబె జయించు చుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
రిప్లయితొలగించండిఅన్యాయపు జనులకు సరి
యన్యాయమె జయమునందు నవనీస్థలిపై
-
రిప్లయితొలగించండిపుణ్యాత్ములకేది యెలమి
వన్యమృగమరయు నగరపు ప్రఖరపు జిత్తుల్?
అన్యాయపు జనులకు సరి
యన్యాయమె జయమునందు నవనీస్థలిపై
అన్యుల తప్పుడు సాక్ష్య ము
రిప్లయితొలగించండిమాన్యము గా జే కొనుచును మహిసంభవమై
జన్య ము గా దీ ర్పు జరుగ
న న్యా య మె జయము నందు నవ నీ స్థలి పై
ధన్యుఁడు ధర్మాచరణము
రిప్లయితొలగించండిమాన్యతతో సలుపునట్టి మనుజుడు భువిలో
నన్యాయకారి తలఁపున
నన్యాయమె జయమునందు నవనీస్థలిపై
ధన్యాత్ముండు జగమ్మునందు గడు శ్రద్ధాసక్తులన్ ధర్మమున్
రిప్లయితొలగించండిమాన్యుండై యొనరించుచుండు నిరతం బాతండె ధర్మాత్ముడౌ
విన్యాసంబుగ పాపముల్ సలిపి భావించున్ దురాత్ముండు నే
డన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
కం:అన్యాయద్యూతమ్మున
రిప్లయితొలగించండివన్యుల జేసితివి కౌరవపతీ! మము సా
మాన్యులనకు, ప్రథమమునం
దన్యాయమె జయమునందు నవనీస్థలిపై”
(అని భీముడు అన్నట్లు.)
శా: ధన్యమ్మౌ భరతావనిన్ గలిని జింతన్ జేసి బ్రహ్మర్షులౌ
రిప్లయితొలగించండిమాన్యుల్ జెప్పిరి భావి నిట్లు "నశియింపన్ వర్ణధర్మమ్ములే,
సన్యాస మ్మొక వేషమౌచు, ద్విజులున్ శాస్త్రమ్ములన్ వీడగా
నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ”
(పురాణాలలో ఋషులు కలికాలం ఇలా ఉంటుం దని చెప్పారు. )
అన్యమ్మును జింతింపకు
రిప్లయితొలగించండివిన్యస్తం బగు జయమ్ము పిదపం దథ్యం
బా న్యాయమునకు ముందుగ
నన్యాయమె జయము నందు నవనీస్థలిపై
కన్యా భోగము లందు మగ్నుఁ డగు లంకా నాథుఁ డెల్లప్పుడున్
మాన్యామాన్య వివేక శూన్యులకు ధర్మం బన్న దెందుండు రా
జన్యాశేష పరాజయార్థ మయి రక్షః పాలు రాజ్యమ్ములో
నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మమౌ
పుణ్యాత్ముల్ వ్యథ రాజకీయముల సంపూర్ణమ్ముగా వీడగా
రిప్లయితొలగించండిదైన్యమ్మొందె విలాతి పాలనవడిన్ దౌర్బాగ్యులే పొంది తా
మన్యమ్మైన విధమ్ములన్ బ్రజల భాగ్యమ్ముల్ గొనన్ వారిదౌ
అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యావిధుల్ ధర్మమౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కన్యల హత్యాచార
మ్మన్యాయమె;జయమునందు నవనీ స్థలిపై
మాన్యులు ధర్మమెఱుంగుచు
దైన్యుల కాపాడుచుండ దక్షత తోడన్.