6-8-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని”
(లేదా...)
“మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్”
(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)
పురిటి నొప్పులు మొదలయ్యె , పురుషుడెరిగి వడివ డిగనేగి బిలువగ వచ్చి , మంత్ర సాని వలసిన చర్యలు సలుపు చుండ మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని
తేటగీతి త్రిజగములఁ జుట్టి రమ్మన దివిని గుహుడునెమలి వాహనమెక్కియు నియతి నేగగౌరి కార్యోన్ముఖునిఁ జేయఁగఁ గరిముఖునిమగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని!చంపకమాలనగముల రౌతు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుండెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియేమగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!
సమీక్షకుల సవరణమేరకు ధన్యవాదములతో.. చంపకమాలనగజమగండు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుండెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియేమగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుతుని ప్రసవించి నంత తా చూడ గోరె మగని మొగము చూచి కనె ను మగువ సుతుని పోల్చి చూచియు మిక్కిలి మోద మంది ముద్దు లాడెను శిశువును మురిప మలర
ముని యొసగిన మంత్రము చేత ముగిద రవిని వేడి నంతట గగనమ్ము వీడి యెదుట హాస మొలకించుచు నిలిచినట్టి చాయ మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని.జగముల నేలు పుత్రులిల శర్వరి కుంతికి కల్గిరెట్లనన్ సుగతులు దక్కవయ్యె తగు చూలియె లేక యటంచు భర్త యే వగచుచు నుండ గాంచి పృథ వల్లభు బాధను తీర్చ దీనమౌ మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.
గగనవాణితో మిక్కిలి కలతచెందికంసుడుంచెను సోదరిన్ ఖైదులోనచివర కచ్చోట వ్యాకుల చిత్తుడైనమగని మొగముఁ జూచి కనెను మగువ సుతునిగగన వచస్సులే మిగుల కంపిల జేయగ క్రూరచిత్తుడైతగదని తండ్రిపల్కినను తానిడె కంసుడు సోదరిన్ జెఱన్వగయుచు వాసుదేవుడట వ్యాకుల చిత్తము తోడనుండగామగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్
గగనపు పల్కులన్ వినిన కంసుడు దేవకి నుంచ ఖైదులోజగమున కంతకున్ సతము శక్తిని గూర్చెడు వాని వేడుచున్వగవకకాన్పు వేళ బిగబట్టుచు బాధను నామె నాత్మలోమగని మొగంబుజూచి సుకుమారి సుతుంగనె లోకపూజ్యునిన్
-குட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)అగణితమైన పిరియమునమగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వాడగుపించెను పో తండ్రి వలె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్రామ రామజిలేబి
-https://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6
మగనిగ నీశునిన్ బడయ మంగళ జేసె తపంబు భక్తితోపగతునివోలె భావజుఁడు బాణము నేయగ నస్థిమాలిపైతగులము గల్గె నీశునకు తా వరియించెను మేనకాత్మజన్మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్
తే.గీ: ప్రసవవేదన బొందియు బతికి బైటబడియు ప్రక్కన నిలువగ పతియె, మురిసిమగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని"నచ్చముగ మిమ్ము బోలులెం" డంచు దనిసె
చం:"మగయును నాడుదిన్ సమమె,మారెను కాలము,కూతులిద్దరీ యుగమున జాలు" నన్న సతి నొప్పక బుత్రుని గోర భర్త ,ప్రీతిగ సతి యొక్క పుత్రు గనె ,దేశపు నేతగ నయ్యె పుత్రుడున్మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.(ఇద్దరు కూతుళ్లు చాలు అని భార్య అంటే కొడుకు ఉండాలని భర్త కోరాడు.భర్త ముఖ్యం చూచి అంటే ముఖమాటానికి ఆమె పుత్రుణ్ని కూడా కన్నది.ఆ పుత్రుడు దేశాధినేత,లోకపూజ్యు డయ్యాడు.)
చం॥ అగణిత ప్రేమమున్నఁ గడు వ్యాకులమొందరె సంతు లేనిచోమగఁడటు వైద్యుఁడై తనర మానిని లోపలి లోటుపాట్లనున్దగు విధి మాన్పి గర్భమునుఁ దాల్చఁగ శ్రద్ధగ కాన్పు చేయఁగన్మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్(పుట్టినపుడే తెలియదు కదండి. తరువాత పెరిగి లోకపూజ్యుడైనాడని అండి, సమకాలీన స్థితి తీసుకున్నానండి)
మురళీకృష్ణ గారు తేటగీతి పాదము ఆటవెలది చేయగా నేను కందమౌతుందా అని చూసానండికం॥ మగనికిఁ దెలుపఁగ విముఖతవగచుచు పిల్లలు వలదని పట్టుగఁ గోరన్మగని మొగముఁ జూచి కనెనుమగువ సుతుని భయపడఁగను మనుఁగడ కొఱకై(ఈకాలంలో కొందరికిలాంటి పెడబుద్ధులు పుడుతున్నాయండి. అప్పుడు భర్త పట్టుపట్టితే, విడాకులిచ్చేస్తాననేది అంతర్లీనం, అప్పుడు అంగీకరించింది అనే అర్థంలో)
పురిటి నొప్పుల సైచుచుఁ బువ్వుఁబోఁడి కన్నులను మూసి బిగపట్టి కాయ మెల్ల నర్మిలిఁ బ్రసవ వేళలో నాత్మ లోన మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని మగని మొగంబుఁ జూచి కనె మానిని యంధుని మూసి కన్నులన్ మగని మొగంబుఁ జూచి కనె మానిని రోయుచుఁ బాండు రోగినిన్ మగఁ డనఁ బూరుషుండె యిట మక్కువ మీఱఁగ శాంత చిత్తయై మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోక పూజ్యునిన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అతివకు పురిటి నొప్పులే యధికమవగమగని చూడవలెననుచు మగువ కోరభర్త మోముఁ జూపగ చరవాణి యందుమగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని.
వరము నిచ్చె శివుఁడు భక్తి వశము గాఁగతరుణి కోరె సుతుని దేవు దయను బొందిహరుని కృపను బడసె నొక్క యందగానిమగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని#యంత్రుడు #ఛందం
పురిటి నొప్పులు మొదలయ్యె , పురుషుడెరిగి
రిప్లయితొలగించండివడివ డిగనేగి బిలువగ వచ్చి , మంత్ర
సాని వలసిన చర్యలు సలుపు చుండ
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని
తేటగీతి
రిప్లయితొలగించండిత్రిజగములఁ జుట్టి రమ్మన దివిని గుహుడు
నెమలి వాహనమెక్కియు నియతి నేగ
గౌరి కార్యోన్ముఖునిఁ జేయఁగఁ గరిముఖుని
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని!
చంపకమాల
నగముల రౌతు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్
జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుం
డెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియే
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!
సమీక్షకుల సవరణమేరకు ధన్యవాదములతో..
తొలగించండిచంపకమాల
నగజమగండు పుత్రులకు నాకము భూమియు నబ్ధులెల్లెడన్
జగములు మూడిటిన్ వడిగ సంచరియించియు రమ్మనన్, గుహుం
డెగసియు వెళ్ళె; నంత కదిలింప వినాయకునెంచి గౌరియే
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుతుని ప్రసవించి నంత తా చూడ గోరె
రిప్లయితొలగించండిమగని మొగము చూచి కనె ను మగువ సుతుని
పోల్చి చూచియు మిక్కిలి మోద మంది
ముద్దు లాడెను శిశువును మురిప మలర
రిప్లయితొలగించండిముని యొసగిన మంత్రము చేత ముగిద రవిని
వేడి నంతట గగనమ్ము వీడి యెదుట
హాస మొలకించుచు నిలిచినట్టి చాయ
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని.
జగముల నేలు పుత్రులిల శర్వరి కుంతికి కల్గిరెట్లనన్
సుగతులు దక్కవయ్యె తగు చూలియె లేక యటంచు భర్త యే
వగచుచు నుండ గాంచి పృథ వల్లభు బాధను తీర్చ దీనమౌ
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగగనవాణితో మిక్కిలి కలతచెంది
రిప్లయితొలగించండికంసుడుంచెను సోదరిన్ ఖైదులోన
చివర కచ్చోట వ్యాకుల చిత్తుడైన
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని
గగన వచస్సులే మిగుల కంపిల జేయగ క్రూరచిత్తుడై
తగదని తండ్రిపల్కినను తానిడె కంసుడు సోదరిన్ జెఱన్
వగయుచు వాసుదేవుడట వ్యాకుల చిత్తము తోడనుండగా
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్
గగనపు పల్కులన్ వినిన కంసుడు దేవకి నుంచ ఖైదులో
రిప్లయితొలగించండిజగమున కంతకున్ సతము శక్తిని గూర్చెడు వాని వేడుచున్
వగవకకాన్పు వేళ బిగబట్టుచు బాధను నామె నాత్మలో
మగని మొగంబుజూచి సుకుమారి సుతుంగనె లోకపూజ్యునిన్
-
రిప్లయితొలగించండిகுட்டி ப்பய்யன் இப்பவே கன்னடிக்கிரானே:)
అగణితమైన పిరియమున
మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని వా
డగుపించెను పో తండ్రి వ
లె గుంభనపు నగవులన్ బలీయపు కనులన్
రామ రామ
జిలేబి
-
తొలగించండిhttps://youtube.com/shorts/ULvboz37KmE?is=u5fRAevfi77EPSu6
మగనిగ నీశునిన్ బడయ మంగళ జేసె తపంబు భక్తితో
రిప్లయితొలగించండిపగతునివోలె భావజుఁడు బాణము నేయగ నస్థిమాలిపై
తగులము గల్గె నీశునకు తా వరియించెను మేనకాత్మజన్
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్
తే.గీ: ప్రసవవేదన బొందియు బతికి బైట
రిప్లయితొలగించండిబడియు ప్రక్కన నిలువగ పతియె, మురిసి
మగని మొగముఁ జూచి, కనెను మగువ సుతుని
"నచ్చముగ మిమ్ము బోలులెం" డంచు దనిసె
చం:"మగయును నాడుదిన్ సమమె,మారెను కాలము,కూతులిద్దరీ
రిప్లయితొలగించండియుగమున జాలు" నన్న సతి నొప్పక బుత్రుని గోర భర్త ,ప్రీ
తిగ సతి యొక్క పుత్రు గనె ,దేశపు నేతగ నయ్యె పుత్రుడున్
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్.
(ఇద్దరు కూతుళ్లు చాలు అని భార్య అంటే కొడుకు ఉండాలని భర్త కోరాడు.భర్త ముఖ్యం చూచి అంటే ముఖమాటానికి ఆమె పుత్రుణ్ని కూడా కన్నది.ఆ పుత్రుడు దేశాధినేత,లోకపూజ్యు డయ్యాడు.)
చం॥ అగణిత ప్రేమమున్నఁ గడు వ్యాకులమొందరె సంతు లేనిచో
రిప్లయితొలగించండిమగఁడటు వైద్యుఁడై తనర మానిని లోపలి లోటుపాట్లనున్
దగు విధి మాన్పి గర్భమునుఁ దాల్చఁగ శ్రద్ధగ కాన్పు చేయఁగన్
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోకపూజ్యునిన్
(పుట్టినపుడే తెలియదు కదండి. తరువాత పెరిగి లోకపూజ్యుడైనాడని అండి, సమకాలీన స్థితి తీసుకున్నానండి)
మురళీకృష్ణ గారు తేటగీతి పాదము ఆటవెలది చేయగా నేను కందమౌతుందా అని చూసానండి
తొలగించండికం॥ మగనికిఁ దెలుపఁగ విముఖత
వగచుచు పిల్లలు వలదని పట్టుగఁ గోరన్
మగని మొగముఁ జూచి కనెను
మగువ సుతుని భయపడఁగను మనుఁగడ కొఱకై
(ఈకాలంలో కొందరికిలాంటి పెడబుద్ధులు పుడుతున్నాయండి. అప్పుడు భర్త పట్టుపట్టితే, విడాకులిచ్చేస్తాననేది అంతర్లీనం, అప్పుడు అంగీకరించింది అనే అర్థంలో)
పురిటి నొప్పుల సైచుచుఁ బువ్వుఁబోఁడి
రిప్లయితొలగించండికన్నులను మూసి బిగపట్టి కాయ మెల్ల
నర్మిలిఁ బ్రసవ వేళలో నాత్మ లోన
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని
మగని మొగంబుఁ జూచి కనె మానిని యంధుని మూసి కన్నులన్
మగని మొగంబుఁ జూచి కనె మానిని రోయుచుఁ బాండు రోగినిన్
మగఁ డనఁ బూరుషుండె యిట మక్కువ మీఱఁగ శాంత చిత్తయై
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోక పూజ్యునిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అతివకు పురిటి నొప్పులే యధికమవగ
మగని చూడవలెననుచు మగువ కోర
భర్త మోముఁ జూపగ చరవాణి యందు
మగని మొగముఁ జూచి కనెను మగువ
సుతుని.
వరము నిచ్చె శివుఁడు భక్తి వశము గాఁగ
రిప్లయితొలగించండితరుణి కోరె సుతుని దేవు దయను బొంది
హరుని కృపను బడసె నొక్క యందగాని
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని
#యంత్రుడు #ఛందం