16, ఆగస్టు 2026, ఆదివారం

సమస్య - 5561

17-8-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నలభీములు వండినారు నారదు పెండ్లిన్”

(లేదా...)

“నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో మహాభాష్యం నరసింహ శ్రీహరేశ్ గారి సమస్య)

20 కామెంట్‌లు:

  1. కలలోన బెండ్లి జూచితి
    నల గాంచితి(గ్రోలితి) కమ్మనైన నాహారమహో!
    తిలకించి నాడ నేనట
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్!

    రిప్లయితొలగించండి
  2. కలగంటి నిన్నటి నిశను
    యిలకు దిగిన నారద ముని యీప్సిత మొందన్
    నెలతుకను వివహమాడగ ,
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కలగంటిని నిన్నటి నిశ । నిలకు..." అనండి.

      తొలగించండి

  3. తెలియక పోయిన నెప్పుడు
    పలువిధ శాస్త్రము లెరిగిన పఠిని యటంచున్
    పలికెడి పామరు డిట్లనె
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్.


    పలువురి చేత దూరబడు పామరు డాతడు కల్లు పాకకున్
    జెలమరి తోడ జేరి యట శీధువు గ్రోలుచు భూరి జ్ఞానమున్
    కలిగిన వాడినంచు కల కాలము చెప్పెడి వాడు చెప్పెనే
    నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే.

    రిప్లయితొలగించండి
  4. పిలిచితి పెండ్లికి రమ్మని
    పొలుపున నారదుని పాత్ర పోషకుడనగా
    తరలెను నాటక బృందము
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్

    నలుగురి మెప్పునొందె నవ నాటకమండలి తెల్గునేలపై
    పలువురు వేషధారులటఁ బ్రస్తుతు లొందిన గొప్పవారలే
    పిలువగ నేగిరా నటులు పెండ్లని నారద పాత్రధారికిన్
    నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే

    రిప్లయితొలగించండి
  5. కలనొక పెండ్లిసంబరముఁగాంచితి రాతిరి, స్వప్నమందునన్
    నలినదళాక్షి యొక్కరిత నారదునిన్ మనువాడ నత్తరిన్
    పలువురు దేవతల్ మునులు వచ్చిరి పెండిలి తంతు చూడగన్
    నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే

    రిప్లయితొలగించండి
  6. కలు ద్రావిన మైకములో
    కలవరమున మందుడొకడు కడు చోద్యముగా
    పలికెను చవులూరునటుల
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్

    రిప్లయితొలగించండి
  7. కం: అల దేవర్షియె వలచెనె
    లలన నొకతె? కనెనె పుత్రులను? పుక్కిటి గా
    ధల వండి వార్చు విద్యల
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్”
    (నారదుడి పెళ్లి అనేది ఒక పురాణ గాధ కానీ దేవర్షి విషయం లో నమ్మ దగింది కాదు. కథలు వండి వార్చటం లో నిపుణు లైన నలభీము లెవరో తయారు చేసారు. కథలు,అబద్ధపు వార్తలు అల్లటం అనే దాన్ని వండటం అని వ్యంగ్యం గా అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  8. చం:"నలుడు,వృకోదరుండు బచనమ్మున దిట్టలు గాదె! తెల్పు వా
    రల ఘను డెవ్వ?"డం చడుగ బ్రాశ్నికు డా యవధాని యిట్లనెన్
    "కలసిరె వారు వంటలను గమ్మ గ జేసెడు స్పర్థ నెన్నడేన్?
    నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే”
    (వంటలో నలుడు గొప్పా? భీముడు గొప్పా? అని అప్రస్తుత ప్రసంగం లో అడిగాడు.ఆ యిద్దరూ పోటీ లో కలిస్తే చెప్పగలం. వాళ్లేమైనా నారదుడి పెళ్లికి వంట చేసారా? అని అవధాని తిరిగి ప్రశ్నించాడు. వాళ్లు కలవటమే అసంబద్ధం కనుక ఎవరు గొప్ప అనేది తేలదు అని.)

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. చం॥ తలఁపుల నిండె రామునకు తల్లి మహీజకు నాలయమ్మునన్
      బలువురు పెండ్లి వేడుకలు భవ్య మనోహర రీతిఁ గాంచఁగన్
      వలచి వివాహ భోజనము వాల్చఁగ మేనును స్వప్నమందునన్
      నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే

      చం॥ తెలుపఁగ పాకశాస్త్రమున దిట్టలు సాటియె లేని వారలే
      నలుఁడును భీముఁడుం గనఁగ నారదుఁడా యొక బ్రహ్మ చారియే
      పొలుపుగ పూరణార్థమని ముగ్గురఁ గూర్చె సమస్య నవ్వఁగన్
      నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే

      తొలగించండి
  10. కల యందైనను గాంచని
    పలువురు సమ్మతి తెలుపని వాక్య ము నొక టిన్
    దెలుపు మననొక డనె నిటుల
    నల భీములు వండి నారు నారదు బెండ్లిన్

    రిప్లయితొలగించండి
  11. నారదుని స్వప్నము...

    కందం
    నలభీమ పాకపు రుచులు
    పులకింతలు రేప హరియె మోహము రేపన్
    గలిగిన స్వప్నమునందున్
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్

    చంపకమాల
    నలునిఁ గనంగ నారదుఁడు నర్మిళి విందు నొసంగె కమ్మగన్
    వలలుని వంట సైతమును వాంఛను మ్రెక్కిన జ్ఞాపకంబునన్
    బులకలు రేపగన్ హరియె మోహముఁ గొల్పుచు స్వప్నమందునన్
    నలుఁడును భీముఁడుం గలసి నారదు పెండ్లికి వంటఁ జేసిరే!


    రిప్లయితొలగించండి
  12. చెలఁగి తగవులం బెట్టెడు
    ఖలు పెండ్లికిఁ బాక శాస్త్ర గణ్యులు వండం
    బలికె నొకం డిబ్భంగిన్
    నలభీములు వండినారు నారదు పెండ్లిన్


    వలయును వంట వా రనఁగఁ బంపఁగ నెన్నిక సేసి మిన్నగా
    నలునిని మించు వా రడరి, నా వచియించిన వారు వండఁగా
    నలవడు నయ్య యెట్టి రుచి యన్నఁ గరమ్ము శ్రమించి చేయ నా
    నలుఁడును భీముఁడుం గలసి నారదు, పెండ్లికి వంటఁ జేసిరే

    [కలసి ను + ఆరదు= కలసి నారదు; కలసిను = కలసి కూడ; ఆరదు = కలుగదు]
    “కలసి ను” ప్రయోగమునకుఁ బ్రమాణము:
    వాటువడి మూర్ఛవోయిం / బోటర దైత్యుండు దెలిసి.... ఉ. హరి. 4. 235.; మూర్ఛ వోయిను + పోటర దైత్యుండు. – ప్రౌఢ వ్యాకరణము. శబ్ద. 116.

    రిప్లయితొలగించండి