ఉ॥ డెందము కృష్ణ వర్ణమగు ఠీవిగ రెక్కలు విప్పి యాడుచున్ బొందుగ నింగియందునటు మోదము మీరఁగఁ బాఱుచుండఁగన్ గ్రిందను నిల్చి కాంచఁగను గీలును చిక్కునొ కూఁత లేనిచో కొందరు కాకియంచు మఱి కొందరు కోకిల యంచుఁ బిల్వరే
(కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః కాకఃపికయోః। వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః॥ అనుకుంటానండి 8 లేక 9 వ తరగతిలో చదివినదనుకుంటాను, దాని ప్రకారం పూరణ అండి)
పెరటిలోని చెట్టు పయిన పెట్టినట్టి
రిప్లయితొలగించండిగూటియందున నిలబడీ , గొంతు విప్ప
కుండ యున్న దానిని జుచి కొంతమంది
కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి
రిప్లయితొలగించండిఇందరు మానవాళి కిట
నిష్ట మనిష్టములుండు సాజమే
పొందుగనున్న కాలమున
మోదమునొంది సమాదరింతురే
కందువ వీడినంత సహ
కారము శూన్యమదేల చోద్యమో
కొందరు కాకి యంచు మఱి
కొందఱు కోకిల టంచుఁ బిల్వరే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిమెచ్చనట్టి వారి పిలుపు గ్రుచ్చుకొనును
ప్రియము గాదెనచ్చిన వారి పిలుపు చూడ
గాయనీమణి కంఠాన గమకమొలుక
కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి!
ఉత్పలమాల
కుందగఁ బిల్వరే తమకు కూడని వారల నైపుణిన్ గనన్
విందుగ వీనులన్ వినుచు ప్రీతిగా మెత్తురు నచ్చువారలున్
సందడిఁ జేయుచున్ దరుణి సంబరమొందుచు నాలపించగన్
కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే!
రిప్లయితొలగించండిధరణి యందు హెచ్చుగ జనాదరణ పొంది
నట్టి నాయకుడుగు మోది యనిన నచ్చ
నట్టి వారుండిరి నిజమె యతనిని గని
కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి.
బందిని చేసి తెచ్చితివి భామను ధర్మము కాదటంచ నన్
చిందఱ తోడ నీతులను చెప్పిన యట్టి విభీషణుండనే
దందడ కాడవంచనెను తామస మందున రావణుండనన్
కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే.
దృశ్యమొక్కటైనను భిన్నదృక్కులుండు
రిప్లయితొలగించండిదృష్టికోణ నిర్దేశము దృశ్యమగును
పిల్ల వాడొక చిత్తరు వేసినపుడు
కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి
కొందరి చిత్తవృత్తి మరికొందరి భావన లుండు భిన్నమై
గందర గోళమన్నఁ బొడగాంచిన వారల దృష్టి కోణమే
పందెము వేసి చిత్రకుడు పక్షిని నల్లగ గీసినంతటన్
గొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే
సుందరి పెళ్ళిజూచుటకు చుక్కపురంబుకు వచ్చిరెందరో
రిప్లయితొలగించండిబంధుజనంబునందొకతి పక్షిపటంబును గీసి కుంచెతో
నందరి ముందు నుంచ జనులారసి చిత్రము మోదమొందుచున్
కొందరు కాకి యంచు మఱికొందరు కోకిల యంచు బిల్వరే
తే.గీ:ఈసు లభిమానములును సాహిత్య సీమ
రిప్లయితొలగించండినెక్కుడై బిరుదమ్ముల నిదియె చేర
నామె కవిత తిట్లను మెప్పు నందె, నామె
కాకి యనఁ, గొందఱయ్యది కేకి యనిరి”
ఉ:కొందరు సత్కవుల్ బిరుదు కోరక తోచిన దేదొ వ్రాసి యా
రిప్లయితొలగించండినందము నిచ్చి పొందగ ఘనమ్మగు కీర్తిని గోరు కొంద రా
నందము నొందగా బిరుదునన్, మరి యీసును, మైత్రి జూపుచున్
గొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే!
(3)ఉ:"అందము లేదు, నల్ల" దని యా పడతిన్ గని గేలి సేతురే!
రిప్లయితొలగించండిఅందము దేహసంస్థితమె? యా గళమందున విందు సేయు నా
యందము నెల్లరున్ గనరె!యా విదుషీమణి గాంచినంతనే
కొందరు కాకి యంచు మఱికొందఱు కోకిల యంచుఁ బిల్వరే”
ఉ॥ డెందము కృష్ణ వర్ణమగు ఠీవిగ రెక్కలు విప్పి యాడుచున్
రిప్లయితొలగించండిబొందుగ నింగియందునటు మోదము మీరఁగఁ బాఱుచుండఁగన్
గ్రిందను నిల్చి కాంచఁగను గీలును చిక్కునొ కూఁత లేనిచో
కొందరు కాకియంచు మఱి కొందరు కోకిల యంచుఁ బిల్వరే
(కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః కాకఃపికయోః।
వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః॥
అనుకుంటానండి 8 లేక 9 వ తరగతిలో చదివినదనుకుంటాను, దాని ప్రకారం పూరణ అండి)
తేటగీతి పూరణ హాస్యయుతంగా నండి
తొలగించండితే॥ కాకినిఁ దలఁప టక్కున కోకిల యని
వర్ణసామ్యమునుఁ గనుచు బాడి కాని
కాకి యనఁ గొందఱయ్యది కేకి యనిరి
యనగ దృష్టి లోపమగునొ యరియనైతి
గూటిలో నున్న పిల్లను కొందరు గని
రిప్లయితొలగించండికాకి యన కొందర య్య ది కేకి యనిరి
కూత విని యు కనుగొని కుశలు రగుచు
వినిన వారును దల లూపె పెద్ద గాను
నర్తకీ మణి యాడఁగ నాట్యముఁ బరి
రిప్లయితొలగించండికించి నట్టి వారి నడుగ నెంచ జనుల
మతము నాట నచ్చని యట్టి మనుజ వరులు
కాకి యనఁ గొంద ఱయ్యది కేకి యనిరి
సందియ మేల డెందమున శంకకు సుంతయు లేదు తావు సూ
యెందును గాకి కోకిలకు నెల్లరు నంతర మంత నేర్వరే
యందఱు ముక్త కంఠముగ నందురు దానిని కాకి యంచునే
కొందరు కాకి యంచు మఱి కొందఱు కోకిల యంచుఁ బిల్వరే
[పిల్వరే = పిల్వరు కదా; నేర్వరే = నేర్వరా? నేర్తురు]