20, ఆగస్టు 2026, గురువారం

సమస్య - 5565

21-8-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్”

(లేదా...)

“పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే”

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో తంత్రవహి శ్రీరామచంద్రమూర్తి గారి సమస్య)

27 కామెంట్‌లు:

  1. కందం
    విడలేనను కీచకునిన్
    నడిపించి వగలుఁ జిలుకుచు నర్తన శాలన్
    బడగొట్ట నేర్పరిచియున్
    బడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      నడకల హంసవేయనుచు నామది దోచితివంచు మాలినిన్
      దడఁబడఁ జేయఁ గీచకుఁడు, దాపున ముచ్చట దీర్చు వంక లో
      బడగనె నృత్యశాలఁ బడఁ బాచిక వేసియు నుంచి చీరతో
      పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే

      తొలగించండి
  2. వెడకాలమయ్యె బెండ్లయి ,
    కడురీతుల గుమి జెరుపరి కాంతుడనంగన్
    చెడినది చాలునిక యనుచు
    పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్”

    రిప్లయితొలగించండి

  3. గడసరి యగు నరకుని దం
    దడి సాగెడి వేళ బాలితాకగ సధ్యం
    చుడు కాపాడుట కై యా
    పడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్.


    విడువక కంకపత్రముల ఫేరవుడా నర కుండు రాల్చి దృం
    భుడగుచు రెచ్చినంత వ్రజ మోహను డంతట మూర్ఛబోవగా
    నడలక రుద్ర రూపమున నావహ మందున బ్రోచ నెంచుచున్
    పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే.

    రిప్లయితొలగించండి
  4. -

    అడరె బరిడ పురుగు! బిలిచె
    పడఁతుక నిజపతినిఁ; జంపి పావన యయ్యెన్
    వడి యాతడు మగడనుచు త
    న డాక జూపగలిగెనొక నవకాశమయో

    రిప్లయితొలగించండి
  5. కడు దురహంకృతిన్ మగఁడు కల్లును ద్రాగుచు నిల్లు గూల్చఁగన్
    తడ బడ నిల్లు చేరి పతి తన్నుచు దుర్భర బాధ సేయఁగన్
    కడు విసుగెత్తి చాలనుచు కాంత మహా కఠినంపు బుద్ధితో
    పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే

    మనవి:
    ఇది నా సొంత రచన కాదు ఛందోబద్దమైన యంత్ర సృష్టి. కాకుంటే అసలు ఆలోచనలు నావి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా మానవుని చైతన్యము గగనాంతరాళమును దాఁకు చున్నది. విశ్వామిత్రుఁడు ప్రతిసృష్టి సేయఁగా నేఁటి మేధావులు కృత్రిమ మేదస్సును (కృతక జ్ఞానము) సృష్టించినారు!

      కూల్చఁగన్ : కూల్పఁగన్ సాధువు. వ్యాకరణమును విస్మరించినది మీ యంత్ర రాజము! కల్లును ద్రాగుచు ద్రుత సంధి బాగుంది. ద్రాగుచు నిల్లు; తడబడ నిల్లు బాగున్నవి. బాధ సేయఁగన్ : గసడదవాదేశ సంధి బాగుంది. చాలనుచు కాంత: చాలనుచుఁ గాంత; బుద్ధితో / పడతి : బుద్ధితోఁ / బడతి, ద్రుత సంధి విస్మరించినది మరల.

      తొలగించండి
    2. ఆహా! సమస్యాపూరణలను ఇలా కూడ చేయవచ్చునా? బాగున్నది. అభినందనలు మీకు చెప్పాలా? కృత్రిమమేధకు చెప్పాలా?

      తొలగించండి
    3. అందరికీ నమస్కారం

      1. మొదటగా కామేశ్వరరావు గారికి 🙏 వ్యాకరణ దోషాలు పదాల ఎంపికలో ఇబ్బందులు ఉన్నాయి. నాకు తెలిసినవి సరి చేసి ప్రచురణ చేస్తున్నాను. తెలియనివితె లుసుకోవడానికి ఈ సభను ఎంచుకున్నాను.

      2. జిలేబీ గారికి శతావధానం ప్రక్రియ ఓ గీటురాయి కాగలదు అయితే అది చాలా దూర సాధ్యం. ప్రస్తుతం ఈ యంత్రం అష్టావధానంలోని కొన్ని ప్రక్రియలను బాగానే చేస్తున్నట్టుగానే ఉన్నది. కనీసం ఓ వంద సమస్యాపూరణలు విజయవంతంగా అయినా పరిష్కరించకుండా సాధారణ పరీక్షకు కూడా సిద్దంగా ఉందో లేదో నేను చెప్పలేను.

      3. శంకరయ్య గారికి, పద్యరచనకు అనుకూలమైన నేను తయారు చేస్తున్న యంత్రం తో పూరించిన పద్యాలను కూడా మీరు పరిశీలించగలరని మనవి.

      తొలగించండి
  6. కడు దుష్టుండగు నరకునిఁ
    గడతేర్చ నరుగ మురారి కాంతయు తోడై
    కడకున్, గాచి సమరమున
    పడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్

    విడువని ఘోరకృత్యములు పెంపెసగన్ నరకాసురున్ బయిన్
    వెడలె మురారి పోరునకు వెంబడి నిల్చిన సత్యభామ తాఁ
    దడబడ నట్టిదై పెనగి, దారుణ యుద్ధమునందుఁ గాచుచున్
    పడఁతి నిజేశ్వరున్, యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే

    రిప్లయితొలగించండి
  7. గడబిడ జేయుచు నొక్కడు
    తొడ గొట్టుచు భర్త పైకి దూసుకు రాగా
    తడయక రక్షింప నపుడు
    పడ తుక నిజపతి ని ::: :జంపి పావన య య్యె న్

    రిప్లయితొలగించండి
  8. చం॥ నడవడి తప్పి దుష్టులను నమ్మి స్వదేశపు గుట్టు శత్రువుల్
    పడయఁగ సాయమున్ గనుచు వర్తిల సంపదఁ బొంద ద్రోహియై
    తడబడకుండ వేడినను దారిని వీడక యుండఁ దప్పకన్
    బడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర మయ్యెనే

    (ఏదో సినిమాలో కూడ ఇలా దుష్టుడైన భర్తను చంపినట్టు గుర్తండి)

    రిప్లయితొలగించండి
  9. మిడుకుల మరిగిన, మంచియు
    చెడు భేదము లేని చలనచిత్రమునందున్,
    పెడదారిని ఒడికంబను
    పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. కం:జడిసి యని వీడ తిక్కన
    కడు నవమానించి పంపె గద సతి యనికిన్ !
    మడియ పతి,వీర పత్నిగ
    పడఁతుక నిజపతినిఁ జంపి పావన యయ్యెన్
    (ఖడ్గ తిక్కన యుద్ధం నుంచి తిరిగి వస్తే భార్య అతని అవమానించి యుద్ధానికి పంపి మరణానికి కారకురా లైంది. కానీ వీరపత్ని పావని అనిపించుకున్నది. )

    రిప్లయితొలగించండి
  11. చం:జడువకు మృత్యు దేవుడని,చంపుటకే యత డుండె నంచు, నా
    తడు పరతత్త్వమున్ దెలుపు దైవము లే! నచికేతు బ్రోచె నా
    తడు, కలడయ్య ధర్మపురి, దర్శన మొందు మటంచు గోరుచున్
    బడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే.

    (ధర్మపురి లో యముని ఆలయం ఉండటం ఒక విశేషం. "యముడు మృత్యుదేవత అని భయపడకు.నచికేతునికి జ్ఞానం ఇచ్చింది ఆయనే " అని భార్య భర్తను పంపింది. కఠోపనిషత్తు ఒక అద్భుత మైన ఉపనిషత్తు.జన్మమృత్యు రహస్యాలను నచ్చికేతుడు అనే బాలుడు యముణ్నే అడిగి నేర్చుకొనే అద్భుత సంవాదం అది. )

    రిప్లయితొలగించండి
  12. వడి వడి వచ్చి గృహమ్మున
    నడుగిడి యాయుధము నూని హతమార్ప నొకం
    డడరిన, రక్షింపంగం
    బడఁతుక నిజపతినిఁ, జంపి పావని యయ్యెన్


    పుడమిఁ బతివ్రతావళికిఁ బుణ్య చరిత్రల కెన్న దుష్కరం
    బడరునె వారి కుండునె దురాగత దుఃఖము లెన్నఁ డేని తా
    నడలక సత్యవంతునకు నాయు వొసంగెడు దార యైన యా
    పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే

    రిప్లయితొలగించండి
  13. విడివడి యుద్ధరంగము నివేశము జేరగ బాఱుఁ బోతుగా
    నుడువుచు ధైర్యమున్ బతికి నూతన శక్తి నొసంగి యిచ్చతో
    వడివడి పంపపోరునకు ఫాలముపై తిలకమ్ము దిద్ది యా
    పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    విడువక కోడలి వెంటను
    పడుచు నొక దినమున చెఱచ పతి
    యత్నించన్
    కొడవలితోడ మెడ నఱికి
    పడతుక నిజ పతినిఁ జంపి పావన యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  15. విడువక వెంటబడంగను
    తడబడుహృదయమ్ముతోడతాచేరిపతిన్
    కడు దుఃఖముతోచూచుచు
    *“పడఁతుక నిజపతినిఁ, జంపి పావన యయ్యెన్”*

    రిప్లయితొలగించండి