27, ఆగస్టు 2026, గురువారం

సమస్య - 5572

28-8-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నాశార్థము నాడు దక్కె నా మనువకటా”

(లేదా...)

“నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ”

(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. -
    శ్రీశంకరి కృప గరువము
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా
    రాశిఫలముల దయ నిపుడు
    దేశద్రిమ్మరి బతుకు కుదేలు మనెగదా


    జిలేబీయంత్రము

    రిప్లయితొలగించండి
  2. ఈశానుని వేడితి నా
    యీశుని జూపించుమనుచు నిన్ని దినములన్
    ఆశ యొడగూడెనిప్పుడు ,
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా

    రిప్లయితొలగించండి
  3. ఒక దీనురాలి ఆవేదన:

    కందం
    ఈశా! మర్మము నెఱుఁగక
    యాశలఁజిక్కంగ లవ్ జిహాదున వేయన్
    పాశము మెడలో దేశపు
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా!

    శార్దూలవిక్రీడితము
    ఈశా! మారణహోమమున్ జరుప వారెంచంగ మర్మాన నా
    కాశల్ మిక్కుటమౌచు నీ వలపు జీహాదందునన్ వేయఁగన్
    బాశమ్మున్మెడలోన వాడుఁ గుతితో వారించకే దేశపున్
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా! యేమి చెప్పంగనౌ?

    రిప్లయితొలగించండి
  4. ఆశించంగ విశేషభావనలతో
    నాశల్దరిన్నిల్వగా
    ధీశక్తిన్ కలితార్థమై చెలగుచున్ ధ్యేయోత్సుకానంద  సం
    కాశంబందున ప్రేమరాగమహిమన్
    గానంగ రమ్యప్రభ
    న్నాశార్థమ్మున నాకు దక్కె మను వ
    న్నా యేమి చెప్పంగనౌ!

    ప్రభన్+ఆశార్థమ్మున

    రిప్లయితొలగించండి

  5. ఆశా వాదిని కావున
    నా శిఖరిణి తెచ్చు కోశ మధిక మటంచున్
    హే శివ గయాళి యగు తా
    నా శార్థము నాడు దక్కె నా మనువకటా.


    కోశంబయ్యది భూరి దెచ్చునని నే కూళుండనై గాదుటే
    యా శంపాంగిని యెన్నుకుంటిని కదా యా గట్టి వాయిన్ గనన్
    పాశంబయ్యెను కంధరమ్మునకిటన్ బ్రాణేశ యే నాకు తా
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ.

    రిప్లయితొలగించండి
  6. ఆశావాదము లేదని
    పాశక్రీడ విడనాడు వాడే కలడా
    క్లేశములేలయని యడుగ
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా

    ఆశావాదిని కాకపోయినను నేనాహ్లాదమే కోరెదన్
    దేశాన్నేలెడి నేతగా ప్రజలకాదేశంబు నేనిచ్చెదన్
    గోశాగారము నందునున్న ధనమున్ గోల్పోతివేమన్నచో
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    రిప్లయితొలగించండి
  7. ఆశలు చిగురింప o గా
    నాశము లేనట్టి బ్రతుకు నలువను గోర న్
    లేశము దయ జూ పక యె వి
    నా శా ర్థ ము నాడు దక్కె నామను వ కటా!!

    రిప్లయితొలగించండి
  8. నాశంబౌ వ్యసనంబులన్ దిరుగుచున్ నానాటికిన్ భ్రష్టుడై
    దోషంబుల్ దన కేల రావనుచు తాన్ దోషంబులన్ ముంచగన్
    ఆశల్ వీడక ద్యూతపానముల సంధానంబులన్ జిక్కుచున్
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    వాసిన్ బొందిన ధర్మరాజు విధిచే వారింపరానిన్నెఱిన్
    దోషమ్మెంచక జూదమాడి పడెనా ద్రోహమ్ముతో సర్వమున్
    కాసింతైన ఫలమ్ము లేదనుచు నా కష్టమ్ములన్ బొందుచున్
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    రిప్లయితొలగించండి
  9. ఆశించి యధిక కట్నపు
    రాశిని ,నే చేసు కుంటి ప్రమదముతోడన్
    గాశిలితి తెలిసి నడవడి
    నాశార్థము నాడుదక్కెనామనువకటా!

    రిప్లయితొలగించండి
  10. కం: ఆశించ నెన్నొ చదువుల,
    నాశని గా చదువు మాన్ పె నాయన,యిటు నా
    యాశను జంపుచు విద్యా
    నాశార్థము నాడు దక్కె నా మనువకటా!


    రిప్లయితొలగించండి
  11. శా:ఆశించన్ బహు భవ్యకావ్యరచనావ్యాసంగమున్, భార్య చే
    నాశించన్ సహకార మామెకు సదా అర్థమ్మె ముఖ్యమ్ముగా
    లేశమ్మున్ సహియించదయ్యె! "పనియే లేదా?" యనున్ శేముషీ
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ!

    రిప్లయితొలగించండి
  12. నా సమస్యను స్వీకరించిన గురువు గారికి ధన్యవాదం

    రిప్లయితొలగించండి
  13. శా॥ ఏశాపమ్మున భార్య నొందితినొ భావేచ్ఛా విహీనుండనై
    యాశల్ చావఁగఁ గష్ణనష్టముల నిత్యంబిట్లు జీవించఁగా
    నీశుండీ విధి నిర్దయుండయెనొ నేనే పాపముల్ చేసితో
    నాశార్థమ్మున నాకు దక్కెను మనువన్నా యేమి చెప్పంగనౌ

    (ఒక గయ్యాళిని పొందిన భర్త ఆవేదన)

    రిప్లయితొలగించండి
  14. ఆశాసౌధము కూలిపోయినది నేనన్యాయమై పోతినే
    లేశంబంతయు ప్రేమలేదు నను తా లెక్కింపదే మాత్రమున్
    పాశమ్మైనది నాదు కుత్తుకకు సంభావింప నా యాలితో
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    రిప్లయితొలగించండి
  15. ఈశుండ వైతి లలనకు
    నీ శాతోదరి సుఖ మిడు నిట్లనకుమ యా
    వేశమున బ్రహ్మ చర్యపు
    నా శార్థము నాఁడు దక్కె నా మను వకటా


    ఆశా పాశము లేల నయ్య యని వార్యార్థమ్ములం దిట్టు లే
    యాశం జూచిన నన్ని పుట్టుకలు తథ్యాంతమ్ములే చుమ్మిలన్
    నాశార్హమ్ములె యెల్ల వారలకు నన్నా చింత నీ కేలయా
    నా శార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    [మనువు =జీవనము]

    రిప్లయితొలగించండి
  16. శా:దేశ మ్మందున నే సమస్య గని యందించంగ నా వ్యాస మా
    వేశమ్మున్ గొని నాటి యా మనువు పై ద్వేషమ్మునో మెప్పునో
    నా శీర్షమ్మున రుద్దుచుందురు కనంగా వ్యాససంలేఖనా
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ!
    (ఈ మధ్య కాలం లో మనుస్మృతి,మనువు పెద్ద చర్చనీయాంశా లయ్యాయి. ఇతను దేన్ని గురించి వ్యాసం రాసిన ఏనాటి వాడో ఐన మనువు పై గోల మొదలు. నా రచనా వ్యాసంగం నాశనం కావటానికి ఈ మనువు దొరికాడు అని రచయిత బాధ. )



    రిప్లయితొలగించండి
  17. పాశమ్మందున చిక్కియో పడతి నాప్యాయమ్ము బెండ్లాడితిన్
    దేశమ్మంతయు త్రిప్పితిన్ కరము సంతృప్తిన్ బ్రసాదించుచున్
    వైశాల్యమ్మును వీడియాపె చెడుగై వంచించె వక్రత్వమున్
    నాశార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ

    రిప్లయితొలగించండి