కపిలు సచిను ద్రావిడు వలె కల్ప మందు కీర్తి గాంచెద ననుచును క్రీడ లందు శ్రద్ధ చూపించి చదువు నశ్రద్ధ చేయ సున్న మార్కులు, ర్యాంకేమొ చూడ ఫస్టు లాట లందున నదిగద యద్భుతంబు.
కర్కసు రాలు తల్లి సహకారము తో ప్రతి నిత్యమందు తా నర్కుని కంటె ముందు చరణాయుధమయ్యది కూసినంతనే పార్కున కేగి యాటలట పంతము బూనుచు నేర్చి మేటియై మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో.
ఉ॥ తర్కమిదేలనో తెలివి తక్కువ రీతిని వాదమేలనో మార్కుల ర్యాంకు వేరు కద మన్నన నొందుచు నాటలందునన్ బేర్కొన నగ్రగామి యను పేరు గడించఁగ వాటియందునన్ మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో
(మార్కులలో కాదండి ఆటలలో ఫస్టు ర్యాంకండి)
ఉ॥ పేర్కొన ధ్యాస చిన్నపుడు పిల్లల కట్లు పరీక్షలందునన్ మార్కుల పైన నుండుఁ గద మార్పులు పిమ్మట నెన్నియో సుమా! కర్కశ లోకమందునటు కాలము సాగఁగ జీవితమ్నునన్ మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో
చి॥ సంకీర్త్ శర్మ 14-15 సం॥ అబ్బాయికదా, అప్పుడు మార్కులు ర్యాంకుల ధ్వాస జీవితములో ఫస్టు గా నిలిచేదానికి మార్కులకు సంబంధం లేదండి. ఆ యదార్థమే తెలుపుతున్నాను.
లెక్కల పరీక్ష మార్కల లెక్క గట్ట
రిప్లయితొలగించండినన్న కెన్నియని గురువు నడిగినంత ,
జాబితా యడుగున నుండి జదివి చెప్పె ,
సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు
మొదటి ర్యాంకున నిల్చెడు మురళి లాస్టు!
రిప్లయితొలగించండిదిక్కు తోచని పంతులు తెరచి చూడ
మాయ కృత్రిమ మేధది! మాధవికన
సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు!
ఉత్పలమాల
అర్కుడు పశ్చిమాద్రి నుదయంబున పుట్టిన పుట్టుగాక! సా
వర్కరు నిల్వడే చివర! ప్రశ్నలనన్ని పరీక్షవ్రాసెనన్
దర్కమునెంచి పంతులట తప్పది కృత్రిమమేధదంచనన్
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో!
రిప్లయితొలగించండికపిలు సచిను ద్రావిడు వలె కల్ప మందు
కీర్తి గాంచెద ననుచును క్రీడ లందు
శ్రద్ధ చూపించి చదువు నశ్రద్ధ చేయ
సున్న మార్కులు, ర్యాంకేమొ చూడ ఫస్టు
లాట లందున నదిగద యద్భుతంబు.
కర్కసు రాలు తల్లి సహకారము తో ప్రతి నిత్యమందు తా
నర్కుని కంటె ముందు చరణాయుధమయ్యది కూసినంతనే
పార్కున కేగి యాటలట పంతము బూనుచు నేర్చి మేటియై
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో.
ప్రకటన లిడినిరుద్యోగ వరమిదియని
రిప్లయితొలగించండినిర్వహించినారు పరీక్ష నీఛులకట
కడకు ఫలితంబు లీరీతి గానవచ్చె
సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు
తార్కిక మైన పద్ధతికి తామిక దూరమటంచు నెంచుచున్
బేర్కొని నారు ర్యాంకులను వేగముగా మరి నీతి బాహ్యులై
మర్కట తుల్యులా ఘనులు మార్కులు ర్యాంకులు వెల్లడించగా
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో
ఉ॥ తర్కమిదేలనో తెలివి తక్కువ రీతిని వాదమేలనో
రిప్లయితొలగించండిమార్కుల ర్యాంకు వేరు కద మన్నన నొందుచు నాటలందునన్
బేర్కొన నగ్రగామి యను పేరు గడించఁగ వాటియందునన్
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో
(మార్కులలో కాదండి ఆటలలో ఫస్టు ర్యాంకండి)
ఉ॥ పేర్కొన ధ్యాస చిన్నపుడు పిల్లల కట్లు పరీక్షలందునన్
మార్కుల పైన నుండుఁ గద మార్పులు పిమ్మట నెన్నియో సుమా!
కర్కశ లోకమందునటు కాలము సాగఁగ జీవితమ్నునన్
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో
చి॥ సంకీర్త్ శర్మ 14-15 సం॥ అబ్బాయికదా, అప్పుడు మార్కులు ర్యాంకుల ధ్వాస జీవితములో ఫస్టు గా నిలిచేదానికి మార్కులకు సంబంధం లేదండి. ఆ యదార్థమే తెలుపుతున్నాను.
జీవితమ్నునన్ 3-4 రెండు పాదాలకు అన్వయం.