17, డిసెంబర్ 2020, గురువారం

సమస్య - 3577

18-12-2020 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దారము లేనట్టి పూలదండయె మేలౌ”

(లేదా…)

“దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్”

80 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    మీరిన ప్రీతినిన్ మురిసి మెండుగ సేవలు జేయగానహా
    నోరును విప్పకే తనరి నూతన రీతిని ప్రాణనాధునిన్
    కోరిక తీర్చ దారకహ కూర్చుచు బంగరునందు నూలుదౌ
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కొంత స్వీయ గ్రంథచౌర్యము :)

    సూరుడు గ్రుంకుచుండగను సుందరి సోనయె ముద్దులాడగా
    దూరపు కొండలన్ తడివి దొంతరి పేర్చుచు నేడురంగులన్
    కూరిమి మీరగా పృథివి గూర్చుచు చేర్చిన నింద్రచాపమౌ
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రథమ మీఁది పరుషములకు గసడదవలు బహుళముగా నగు' సూత్రం ప్రకారం 'సూరుడు గ్రుంకు..' అనవచ్చు.
      'దొంతర' శబ్దం ఉంది. 'దొంతరి'?

      తొలగించండి
  3. నారికివివాహసూత్రము
    పేరుగమెడలోమెఱయకపేరుకెయౌగా
    మారెనునాగరికంబిటు
    దారములేనట్టిపూలదండయెమేలౌ

    రిప్లయితొలగించండి

  4. బోనసు సరదా పూరణ:

    (షరా మామూలే:)

    నోరును పారవేయకయె నూకలు వండక పోడుబెట్టుచున్
    కోరక రాత్రి ప్రొద్దుటను గొంతెమ కోర్కెలు నెత్తిగోకుచున్
    మారము జేయకే ప్రియుని మక్కువ తీర్చగ పూర్తి పైడిదౌ
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్...

    రిప్లయితొలగించండి
  5. సూరివరేణ్యులు మెచ్చగ
    వారిమెడ నలంకరింప వరలెడు మాలన్
    కూరిమిని నెట్టి "చెత్త చె
    దారము" లేనట్టి పూలదండయె మేలౌ

    రిప్లయితొలగించండి
  6. బేరము లాడకనెవ్వర
    పారమ్ముగ సంపదలను ప్రాపున గొనరే
    భారమె యిలలోన నిగుడ
    దారము లేనట్టి పూలదండయె మేలౌ!!

    - - - - యెనిశెట్టి గంగా ప్రసాద్.

    రిప్లయితొలగించండి
  7. సమస్య :-
    “దారము లేనట్టి పూలదండయె మేలౌ”

    *కందం**

    పారను పట్టెడు రైతులు
    పోరాటము జేయు చుండ ప్రోత్సాహించన్
    పోరెడు రైతు మెడల మం
    దారము లేనట్టి పూలదండయె మేలౌ
    .....‌............✍️చక్రి

    (పోరాటము శాంతి గానే సాగాలి ఎర్రరంగు పడకూడదని నా భావన)

    రిప్లయితొలగించండి
  8. నారికి మంగళ సూత్రము
    తోరము లేనివ్రతముయు దోషము కాదా
    కారము లేనిది కూరయు
    దారము లేనట్టి పూలదండయె మేలౌ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేని వ్రతము' అన్నపుడు 'ని' గురువు కాదు. 'వ్రతముయు' అనడం దోషమే. "తోరము లేనట్టి వ్రతము దోషము కాదా" అనవచ్చు.

      తొలగించండి
  9. సమస్య :
    దారము లేనిదైన విరి
    దండయె మేలు గదా ధరింపగన్

    ( మిత్రవింద గోవిందుని కోసం స్వయంగా
    మాల కట్టి ఎదురుచూస్తున్నది )

    చేరెడు కన్నులున్న మృదు
    చేడియ పోడిమి మిత్రవిందయే
    తీరుగ దానుగా వలపు
    దీరగ గట్టిన పూలమాలికన్
    జేరగ వచ్చు కృష్ణు మెడ
    జెన్నుగ వేయదలంచె ; నందు మం
    దారము లేని దైన విరి
    దండయె మేలు గదా ! ధరింపగన్ .

    రిప్లయితొలగించండి
  10. ఎన్నికల వాగ్దానము , బుణ మాఫీ , ఆధారంగా ఈ నా ప్రయత్నము:

    ఉ:

    మీరక హద్దులన్, బుణము మేలును గోరుచు పైరు పెంపుకై
    తేరగ పొందగూర్తు మని, తిప్పలు లేకయె, రాయితంచనన్
    బేరము లాడు నాయకులు వేడగ హాలికు లిట్లుతల్చిరే
    దారము లేనిదైన విరి దండయె మేలు గదా ధరింపగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. పారాయణి ధవళాంబర
    ధారిణి పలుకుజెలి యంచ తత్తడి చెలిఁ సిం
    గారింపగ కావలె మం
    దారము లేనట్టి పూలదండయె మేలౌ.

    రిప్లయితొలగించండి
  12. సారెకుభావమందుననుశాంతగగోదయుపాండురంగనిన్
    పూచినతన్మయత్వమనుపూవునుభక్తినిపట్టియుంచెనే
    నారియుశీర్షమందునిడినాధునికావలకానుకిచ్చెగా
    దారములేనిదైనవిరిదండయెమేలుగదాధరింపగన్

    రిప్లయితొలగించండి
  13. 2వపాదంలోఓరగతన్మయత్వమున,అనిసరిచేసితిని

    రిప్లయితొలగించండి
  14. 1.
    భారము లేనిదయ్యె కడు పావన మయ్యెడు శోధనమ్మునన్
    నేరము లెంచకుండ నెరి నిక్కము లౌయగు భావ వీచికల్
    గారమునన్ మనంబునను జ్ఞానము నందియు పేరు పేరునన్
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్!!

    2.
    సారము లేని భారతము సంతసమీయ దదేలనంగనన్
    భారమె జీవితమ్ము సరి భావన లేనివికారముల్ సదా
    చారము గానకున్న మరి సత్కథలైన వినంగ గోర మం
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నిక్కములు+ఔ' అన్న తర్వాత 'అగు' ఎందుకు? పునరుక్తి కదా? "నిక్కములే యగు" అంటే సరి!

      తొలగించండి
  15. తీరుగ శోభనవేళను
    కూరిమి బెండ్లాడినసతి కుచ్చుల జడతో
    చేరగ ,బంగారు జరీ
    దారము లేనట్టి పూలదండయె మేలౌ

    గుచ్చుకోకుండా ఉంటుందని

    తేరులు మేళమేల మగధీరుడ
    ప్రాయపు కన్యకామణిన్
    తీరుగ బెండ్లియాడుటకు దేవుని సన్నిధి పైడితాళియన్
    దారము లేనిదైన, విరిదండయె
    మేలుగదా ధరింపన్
    కూరిమి క్రొత్తదారమిక కూర్చు గళంబున పచ్చకొమ్ముతో !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దూరము దూరమంచు తనధోరణి
      లోనను వెక్కసంబునన్
      సారెకు సారెకున్ జలము జల్లుచు
      నన్నిటిపైన శుద్ధికై
      ఘోరపు ఛాందసంబునను గోలను జేసెడు బామ్మపూజకై
      దారములేని దైన విరిదండయె మేలుగదా ధరింపగన్

      దారము మైల తడప ( అరటినార) మడి

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురువర్యా! నమోనమః! 🙏🙏🙏

      తొలగించండి
  16. కరుణశ్రీ గారికి అంకితం. ప్రత్యేకించి జయకృష్ణ బాపూజీ గారికి అంకితం

    ఉ||
    వారిజలోచనామణులు పూలుధరింపగ మానిరియ్యడన్
    భూరియశస్సు గాంచ విరబోయ సిరోజములన్ కుజంబులన్
    మీరగ పూలు, నిండగనమేయము దండలబోలు రీతినే
    దారము లేనిదైన విరిదండయె మేలుగదా దరింపగన్

    రోహిత్

    రిప్లయితొలగించండి
  17. భారతి బ్రహ్మమానస శుభాంగి సనాతని వాణి గొల్వగన్
    భారమటంచు నెంచక ప్రభాతమె నిద్దుర వీడి స్వచ్ఛమౌ
    సౌరభమీను పుష్పములు చంద్రిక లున్నను చాలునంటి మం
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్

    రిప్లయితొలగించండి
  18. ద్వారము నుండగ బారెడు
    హారము వేయంగ దెచ్చె, యానతి వినకున్
    మూరెడు బారునబంతియు
    దారము లేనట్టి పూలదండయె మేలౌ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...దెచ్చె నానతి వినకే/వినియున్" అనండి.

      తొలగించండి
  19. తీరగు కటకము కొరకై
    పోరాటము సలుపుచున్న పొలమరి మెడలో
    హారము వేయగ చెత్తచె
    దారము లేనట్టి పూలదండయె మేలౌ

    కటకము = రాజధాని

    రిప్లయితొలగించండి
  20. "కూరిమి గొల్పు నే సుమము? కూడనిదేది వధూటి! నీ కలం
    కారము జేయ” నంచు మమకారముతో బతి కోర నంత నా
    దార వచించె "నాథ, పరితాపమునున్ జనియింప జేయు మం
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్”
    [నీకు యే పూవులు యిష్టం ఏవి వద్దు అని క్రొత్తగా పెండ్లి అయిన భర్త తన భార్య నడుగగా ఆమె తన మేనుకు మందారాలు సరి పడవు (ఆంగ్లంలో "ఎలర్జీ" ) కాబట్టి అవి లేనివి ఏవైనా ధరిస్తాను అంటుంది]

    రిప్లయితొలగించండి


  21. రాబోయే నాయకునికి సన్నాహాలు


    భారీగా పూదండలు
    వారికి నచ్చదు వలదని వారింతురుగా!
    హేరాళముగా మరి మం
    దారము లేనట్టి పూలదండయె మేలౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. దారము లేకుండ జనులు
    హారము గట్టం గలుగుట నబ్బుర మనరే !
    పౌరుడు ప్రశ్నించె నెటుల
    దారము లేనట్టి పూల దండ యె మేలౌ?

    రిప్లయితొలగించండి


  23. బెంగాలు దీది జీపీయెస్ వారి పద్యాలలో :)


    వారు జిలేబి దీది! ప్రతివాది! ప్రభాకర శాస్త్రి పద్యమం
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగం
    భీరము! లేనిచో మరి పిపీలిక మై మన కండ్లముందరన్
    నేరక పోయి చిక్కుకొని నేవళికమ్మును గోలుపోదురే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరింప గంభీరము' అన్నపుడు మధ్యలో అరసున్న రాదు. సమస్య ప్రకారం 'ధరింపన్+కంభీరము' అని విడదీయవలసి వస్తుంది. అది కుదరదు కదా?

      తొలగించండి


  24. జగడాలమ్మీ విను విరి
    విగ దారము లేనిదైన విరిదండయె మే
    లు గదా ధరింపఁగన్, కూ
    రి గూర్చ వే గట్టిగాను ప్రీతినొసంగన్!


    జగడాలమ్మి :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. 18, 2020 5:38:00 AM
      ప్రేయసీప్రియుల సరససంభాషణ...

      కూరిమి తోడుగన్ రమణి! కుందసరమ్మును దాల్తువో! మహో
      దార‌సుమల్లికాసరము దాల్తువొ! చంపకమాల దాల్తువో!
      కోరు మనన్ వచించె సఖి కోమలసౌరభలుప్తనిర్గతో
      దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. ద్వారములేని గృహమ్మును
    వీరణమేమ్రోగనట్టి పెండ్లియు మరియున్
    తోరముగట్టని వ్రతమును
    దారము లేనట్టి పూలదండయె మేలౌ?

    రిప్లయితొలగించండి
  27. ద్వారము నిండుగ మామిడి
    తోరణముల పూవులలర తోషము నిండున్,
    తీరుగ వరుసల, నల్లని
    దారము లేనట్టి పూలదండయె మేలౌ!


    రిప్లయితొలగించండి
  28. సారములేనిజీవితముసర్వవశంకరిశాంకరీశివా
    బారముజేరనెంచితినపారకృపారసమందనేర్పునన్
    బారెడుకర్మబంధములభక్తిసుమాలరచించివేసెదన్
    *“దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్”*

    రిప్లయితొలగించండి
  29. సౌరభములిచ్చు సుమములు
    భారము గూర్చని లతికలు ఫలములు రుచివౌ
    కూరిమి భూమాత గొలువ
    దారము లేనట్టి పూలదండయె మేలౌ

    రిప్లయితొలగించండి
  30. కోరిక తీరినంత మరు కోర్కె జనించును మానసంబునన్
    తీరకయున్న డెందమున ద్రిక్కులువెట్టును  తృప్తి హీనతన్
    సౌరభమేమిలేని యొక సర్జువుకన్న సుగంధ పూర్ణమౌ
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్

    రిప్లయితొలగించండి
  31. దారము లోపింప నిరా
    ధారం బగు గాలిపటము తనరునె నింగిన్
    ధారుణిఁ గన్పట్టినచో
    దారము లేనట్టి పూలదండయె మేలౌ


    వారిద పంక్తి తుల్య ఘన వాల నికాయ విశేష శీర్షలౌ
    వారిజ నేత్ర లాస్య జిత వారిజ వైరులు సుందరాంగులే
    తీరుగ గూర్చి పువ్వులను దెచ్చిన కంటికిఁ గాన వచ్చెడిన్
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్

    రిప్లయితొలగించండి
  32. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

    *“దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్”*

    నా పూరణ

    ఉత్పలమాల

    హారము నిత్యశోభిత విహారముఁ జేయును కంఠమందునన్
    భారము లేనివౌను నవపల్లవ కోమల హస్తయుగ్మముల్
    గారవ రంజకం బగును కూరిమి మీరిన కౌగిలింతలే
    దారములేని దైన విరిదండయె మేలుగదా ధరింపనన్

    ఆదిభట్ల సత్యనారాయణ



    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  33. ఆరసి కనుమా శశిధర!
    సౌరభమే లేకయుండి చూపరిదైనన్
    భారముగలిగెడు నామం
    దారములేనట్టి పూలదండయె మేలౌ

    రిప్లయితొలగించండి
  34. గారముగ చేర మగ, డభి
    సారిక ముత్యాల మణుల సరములు జారన్,
    ప్రేరణ కింకేలా యొడి
    దారము? లేనట్టి పూలదండయె మేలౌ.

    ఒడిదారము-ఒడ్డాణము

    రిప్లయితొలగించండి
  35. దారములేనిదైన విరిదండయెమేలుగదాధరింపగన్
    దారములేకయుండునదిదండనిబిల్వగనొప్పునేయెటన్
    దారములేనిదండలిల దర్శనమైనధరింపుమోరమా!
    యారయదండకున్భువినినాశ్రితమేగదదారమెయ్యెడన్

    రిప్లయితొలగించండి
  36. చేరిరి షష్టిపూర్తియని చేయగ పండుగ సొంత యింటిలో
    దారయు పట్టుపుట్టముల దాలిచి వచ్చె విరాళితోడ తా
    తీరగు పూలమాలలను తెచ్చిరి పిల్లలు ప్రీతితోడ మం
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్

    రిప్లయితొలగించండి
  37. మరో పూరణ.

    దారము దగ్రదుష్కృతవిదారమ! భావితభారమా! సశృం
    గారపరిప్లుతాంతరవికారమ! కామ్యమనోవిహారమా!
    పూరితసద్గుణాకరమ! పూన్చు మదేదియు, లుప్తమోహనో
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  38. కందం
    నారీ! మూరకొక సుమము
    జారుచకు జడకు పొడుగున జారిణి వోలెన్
    గూరిచి చిక్కగ, కనబడు
    దారము లేనట్టి పూలదండయె మేలౌ!

    ఉత్పలమాల
    శ్రీరఘురాము చిత్రమును శ్రీరమ జానకి ప్రక్కనుంచుచున్
    తీరిచి పల్వురున్ బొగడఁ దేజము నింపఁగ గాంచుచున్ గళా
    కారుని మాల యేదనిన గ్రక్కునఁ దూలికఁ గూర్చి యిట్లనెన్
    దారము లేనిదైన విరిదండయె మేలు గదా ధరింపఁగన్!


     

    రిప్లయితొలగించండి