----------------------------------------------------- [ పోను పోను చివరకు వివాహాదిశుభకార్యములలో కూడా స్త్రీలు అసహ్యమైన పాశ్చాత్య వేషధారణ ధరింతు రేమో ! ] ---------------------------------------------------------
తొలి నిసి c బట్టువస్త్రముల దొడ్గి - తళుక్కని పొల్చు హేమభూ
పాకిస్తానులో అణచివేతకు, దౌర్జన్యాలకు గురి అయ్యే మైనారిటీ హిందువుల గురించి వ్రాసింది సరదా పూరణ ఎంతమాత్రం కాదు. బాగుంది. అభినందనలు. 'వర్తకమునకై' అనడం సాధువు. అక్కడ "వర్తకమునన్" అనవచ్చు. 'కిక్కుర్మంకను'సాధుప్రయోగం కాదు.
మన 'సరదా కవి' జి. ప్రభాకర శాస్త్రి గారు ఒక మంచి ఆంగ్ల రచయిత అని మీలో చాలామందికి తెలియక పోవచ్చు. వారు తమ బ్లాగు http://gpsastry.blogspot.com లో 2007 నుండి 2016 వరకు క్రమం తప్పకుండా తమ వ్యంగ్యాత్మక వ్యాసాలను, జీవితానుభవాలను ప్రచురిస్తూ వచ్చారు. వాటి సంకలనాలను గతంలో 6 పుస్తకాలుగా (పరిమిత సంఖ్యలో తమ ఆత్మీయులకు పంచడానికి మాత్రమే) ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాలను పొందిన అదృష్టవంతులలో నేనూ ఒకణ్ణి! వారి మిత్రులు వారి రచనలు ఆర్.కె. నారాయణను గుర్తుకు తెస్తాయంటారు. (నేను ఆర్కె నారాయణ పుస్తకాలు మాల్గుడీ డేస్, స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్, గైడ్ చదవలేదు కాని, అవి సినిమాలుగా, టివి సీరియళ్ళుగా వస్తే చూసాను). వారి ఇంగ్లీషు మన గ్రాంధికభాషలా ఉంటుంది. ఎన్నడూ వినని పదాలు ఎన్నో కనిపిస్తాయి వారి రచనల్లో. ఏ ముహూర్తాన వారికి శంకరాభరణం బ్లాగు పరిచయమయిందో అప్పటినుండి ఇంగ్లీషు రచనలు మాని సమస్యాపూరణలు చేస్తూ ఆ పూరణలను తమ బ్లాగులో 'శంకరార్పణం' పేరుతో ప్రకటిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా తమ వంగదేశాభిమానాన్ని, జన్మస్థలమైన ముత్తుకూరును, రాజకీయాలను చొప్పిస్తూ సరదా పూరణలు చేస్తూ ఉండడం మనకు తెలిసిందే. ఇప్పటికే 'శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు' అనే పుస్తకాన్ని ప్రకటించి ఉన్నారు. వారి ఆంగ్లరచనలను అభిమానంతో చదివి ఆనందించే వారి మిత్రులకు, శిష్యులకు వారిని దూరం చేసానేమో అనే అపరాధ భావం నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది కూడా. తాజాగా వారు తమ ఆంగ్ల రచనల ఏడవ సంకలనం 'The Little World of Ishani & Other Stories' ను e-book గా ప్రకటించారు. విశేషమూ, ఆనందకరమైన విషయమేమంటే ఆ పుస్తకాన్ని వారు నాకు అంకితమిచ్చారు. ఒక తెలుగు కవి ఆంగ్ల పుస్తకాన్ని అంకితం పొందడం అరుదైన విషయమే. కించిత్తు గర్వంగా ఉన్నది. ఇంతకాలం వారి తెలుగు సరదా పూరణలు చదివిన కవిమిత్రులకు వారి ఆంగ్ల రచనలను పరిచయం చేయాలనే కోరికతో వారి తాజా బుక్ లెట్ ను ఇక్కడ ప్రకటిస్తున్నాను. చదివి ఆనందించండి! స్పందనలను తెలియజేయండి.
మీది అన్నవరమా? నేను మా ఆవిడతో జనవరి 9న అన్నవరంలో ఉంటాను. 10న అన్నవరం ప్రక్కన హంసవరంలో పుస్తకావిష్కరణ సభ ఉంది. 11న విశాఖ, సింహాచలం. 12న శ్రీకాకుళం, శ్రీకూర్మం.. ఇదీ కార్యక్రమం.
గు రు మూ ర్తి ఆ చా రి , వెలుగోడు
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
గురువర్యునికి పాదనమస్కృతులు • నిన్నటి పూరణ
స్వీకరింప మనవి •
-----------------------------------------------------
[ పోను పోను చివరకు వివాహాదిశుభకార్యములలో కూడా
స్త్రీలు అసహ్యమైన పాశ్చాత్య వేషధారణ ధరింతు రేమో ! ]
---------------------------------------------------------
తొలి నిసి c బట్టువస్త్రముల దొడ్గి - తళుక్కని పొల్చు హేమభూ
షల సవరించి - యత్తరువు జల్లి - ముఖంబు నలంకరించి - పు
వ్వుల సిగ యందునం దురిమి - పుత్తడిబొమ్మగ బెండ్లికూతురున్
మలచిరి , చారులోచనలు | మానె న వన్ని భరించలేక , కో
మల సుషమాంగయౌ వధువు | " మన్మథకౌతుక మెప్పుడున్ మదిన్
గలుగును > పొంగునంగముల గాంచిన వేళ " నటంచు రొమ్ము క
ప్పుల - నతి పల్చనైన నొక మూరెడు జంపు గ లట్టి వస్త్ర శా
కలము ధరించి శోభనసుఖం బిడగా జనె నాతి భర్తకున్ |
గలిసెను సంప్రదాయ గమనమ్ములు పంకిలకూప మందు | కాం
తలు పరదేశనాగరికతన్ విడనాడుట. శ్రేయమౌ గదా !
{ తొలి నిసి = తొలి రాత్రి : తొడ్గి = తొడిగి : సవరించి =
అలంకరించి : అత్తరువు = అత్తరు : మానెను =
విడిచి వేసెను , త్యజించెను : సుషమ = సుకుమార
మైన , సుందరమైన : రొమ్ము కప్పులు = స్త్రీలు రొమ్ముపై
ధరించు బ్రాసియర్సు : శాకలము = శకలము = ముక్క :
వస్త్ర శాకలము = గుడ్డ ముక్క : పంకిలకూపము =
బురద గుంట }
*****************************************
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధ న్య వా ద ము లు గు రు దే వా !
తొలగించండిఅక్కోనం గల కొండపైఁ బ్రభువు భక్తాభీష్టదుండౌ, మనో
రిప్లయితొలగించండివాక్కాయంబుల నిష్ఠతోడ నతనిన్ ప్రార్థించి యా మూర్తికిన్
మ్రొక్కన్ గోర్కెలనెల్లఁ దీర్చును గదా పోనొప్పు రంగమ్మ! రా
మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్.
చక్కనౌ పూరణ
తొలగించండిఅభినందనలండీ
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
నక్కంగా విధిలేక వర్తకముకై నందమ్మునున్ వీడకే
చిక్కుల్ దీర్పగ మ్రొక్కి రాఘవునకున్ చీకాకులన్ వీడుటన్
కిక్కుర్మంకను పాకి దేశముననున్ క్రీడించుచున్ హిందువుల్
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్...
పాకిస్తానులో అణచివేతకు, దౌర్జన్యాలకు గురి అయ్యే మైనారిటీ హిందువుల గురించి వ్రాసింది సరదా పూరణ ఎంతమాత్రం కాదు. బాగుంది. అభినందనలు.
తొలగించండి'వర్తకమునకై' అనడం సాధువు. అక్కడ "వర్తకమునన్" అనవచ్చు. 'కిక్కుర్మంకను'సాధుప్రయోగం కాదు.
🙏
తొలగించండిచక్కాభజనలుసేయగ
రిప్లయితొలగించండిపక్కాగాప్లానువేసిపడిపడిపోగడన్
లెక్కాలక్ష్యములేకను
మక్కాఁజనిచేయఁదగురమాధిపుపూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చక్కగ భజనలు...పొగడన్" అనండి.
రిప్లయితొలగించండినిక్కముగ నయోధ్యాపురి
మ్రొక్కుటకుసరియగు నగర మోయీ వినవే
టక్కున భక్తుల తో స
మ్మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్!
జిలేబి
Zilebi garu:
తొలగించండిPlease check your mail. I had sent a pdf version of my latest Ishani e-book dedicated to our Kandi Sir...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
తొలగించండిజీపీయెస్ గారికి
నమో నమః!
అదురహో అంకితమందుకొన్న కంది శంకరయ్య గారున్ను !
Started reading already hilarious ( the bulbul mcky mouse too :))
మా "తాత" కష్టేఫలి గారికి కూడా పంపించవలసినదిగా విన్నపాలు. అట్లే శ్రీమాన్ సేఠు గారు విన్నకోట నరసన్న గారికి కూడా వీలైతే.
ఇట్లు
జిలేబి
🙏
తొలగించండిజిలేబి గారు:
తొలగించండిధన్యవాదములు. ఇద్దరికి పంపుతాను
కంది వారి పుస్తకావిష్కరణ పలుకులు:
తొలగించండిమన 'సరదా కవి' జి. ప్రభాకర శాస్త్రి గారు ఒక మంచి ఆంగ్ల రచయిత అని మీలో చాలామందికి తెలియక పోవచ్చు. వారు తమ బ్లాగు http://gpsastry.blogspot.com లో 2007 నుండి 2016 వరకు క్రమం తప్పకుండా తమ వ్యంగ్యాత్మక వ్యాసాలను, జీవితానుభవాలను ప్రచురిస్తూ వచ్చారు. వాటి సంకలనాలను గతంలో 6 పుస్తకాలుగా (పరిమిత సంఖ్యలో తమ ఆత్మీయులకు పంచడానికి మాత్రమే) ప్రకటించి ఉన్నారు. ఆ పుస్తకాలను పొందిన అదృష్టవంతులలో నేనూ ఒకణ్ణి! వారి మిత్రులు వారి రచనలు ఆర్.కె. నారాయణను గుర్తుకు తెస్తాయంటారు. (నేను ఆర్కె నారాయణ పుస్తకాలు మాల్గుడీ డేస్, స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్, గైడ్ చదవలేదు కాని, అవి సినిమాలుగా, టివి సీరియళ్ళుగా వస్తే చూసాను). వారి ఇంగ్లీషు మన గ్రాంధికభాషలా ఉంటుంది. ఎన్నడూ వినని పదాలు ఎన్నో కనిపిస్తాయి వారి రచనల్లో.
ఏ ముహూర్తాన వారికి శంకరాభరణం బ్లాగు పరిచయమయిందో అప్పటినుండి ఇంగ్లీషు రచనలు మాని సమస్యాపూరణలు చేస్తూ ఆ పూరణలను తమ బ్లాగులో 'శంకరార్పణం' పేరుతో ప్రకటిస్తున్నారు. ఎలాంటి సమస్యకైనా తమ వంగదేశాభిమానాన్ని, జన్మస్థలమైన ముత్తుకూరును, రాజకీయాలను చొప్పిస్తూ సరదా పూరణలు చేస్తూ ఉండడం మనకు తెలిసిందే. ఇప్పటికే 'శంకరాభరణం సమస్యలు - సరదా పూరణలు' అనే పుస్తకాన్ని ప్రకటించి ఉన్నారు. వారి ఆంగ్లరచనలను అభిమానంతో చదివి ఆనందించే వారి మిత్రులకు, శిష్యులకు వారిని దూరం చేసానేమో అనే అపరాధ భావం నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది కూడా.
తాజాగా వారు తమ ఆంగ్ల రచనల ఏడవ సంకలనం 'The Little World of Ishani & Other Stories' ను e-book గా ప్రకటించారు. విశేషమూ, ఆనందకరమైన విషయమేమంటే ఆ పుస్తకాన్ని వారు నాకు అంకితమిచ్చారు. ఒక తెలుగు కవి ఆంగ్ల పుస్తకాన్ని అంకితం పొందడం అరుదైన విషయమే. కించిత్తు గర్వంగా ఉన్నది.
ఇంతకాలం వారి తెలుగు సరదా పూరణలు చదివిన కవిమిత్రులకు వారి ఆంగ్ల రచనలను పరిచయం చేయాలనే కోరికతో వారి తాజా బుక్ లెట్ ను ఇక్కడ ప్రకటిస్తున్నాను. చదివి ఆనందించండి! స్పందనలను తెలియజేయండి.
తొలగించండిసరదా కవి శాస్త్రి ప్రభా
కర! దీది, ఖరగ్పురమ్ము కంది కవివరుల్
స్థిరముగ క.చ.రా మదిలో
వరలగ పద్యములు సభకు వరమై నిలిచెన్!
జిలేబి
🙏
తొలగించండిమ్రొక్కితినాపద వేళను
రిప్లయితొలగించండిదిక్కిక నీవే యటంచు స్థిర చిత్తముతో
నిక్కచ్చి భద్రగిరి రా
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తిక్కల్ మీరెడి యోగి రాజ్యమహహో తీండ్రించగన్ యూపినిన్
దిక్కుల్ తోచక భీతినిన్ వడకుచున్ ధీమంతులై పోరకే
చక్కంగానిక హజ్జుకున్ వెడలుచున్ జాగ్రత్తగా ముస్లిముల్
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్...
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిసందర్భము:: రుక్మిణితో సత్య భామ పలుకులు.
రిప్లయితొలగించండి🌹🌹
చక్కని వాడు సతి సిరిని
మక్కువ హృదయము నిలిపిన మాధవ మూర్తి
న్నిక్కము ధామమునకు , రు
క్మక్కా, చని చేయఁదగు రమాధిప పూజల్”
....భారతీనాథ్ చెన్నంశెట్టి....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఎక్కుచు నేడేడు గిరులు
దక్కించుము సేమమంచుఁ దలనీలమ్ముల్
మ్రొక్కుగ నిడఁ దిరుమల, ల
క్ష్మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్
శార్దూలవిక్రీడితము
చిక్కుందెచ్చును గాలకూటమనుచున్ శ్రీగౌరి యూకొట్టఁగన్
గ్రుక్కెన్ శంకరుఁడంత లోకములకున్ గూర్చంగ సేమమ్ము! యా
ముక్కంటీశుడె రామ నామ మహిమన్ బోధించ ముమ్మారు! ల
క్ష్మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'సేమమ్ము+ఆ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "సేమమ్ము నా ..." అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
తొలగించండిశార్దూలవిక్రీడితము
చిక్కుందెచ్చును గాలకూటమనుచున్ శ్రీగౌరి యూకొట్టఁగన్
గ్రుక్కెన్ శంకరుఁడంత లోకములకున్ గూర్చంగ సేమమ్ము! నా
ముక్కంటీశుడె రామ నామ మహిమన్ బోధించ ముమ్మారు! ల
క్ష్మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్
సమస్య :
రిప్లయితొలగించండిమక్కా చేరి సభక్తి గొల్వదగు రా
మయ్యన్ మహీజాపతిన్
( శ్రీరామనవమికి భద్రాచలం చేరిన అక్క తమ్ముళ్లలో తమ్ముడు అక్కతో ఆనందంగా )
దృక్కుల్ స్వామిపదమ్ములందుననె ; స
త్కృత్యమ్ము లెల్లప్పుడున్ ;
మ్రొక్కుల్ ముక్తిపదమ్ము కోసమె ; సదా ముగ్ధత్వమే నెమ్మదిన్ ;
జెక్కుల్ నిండెను మోదితాశ్రులహరిన్ ;
జెల్వారు భద్రాద్రి ; గ
న్మక్కా ! చేరి సభక్తి గొల్వదగు రా
మయ్యన్ ; మహీజాపతిన్ .
మోదితాశ్రులహరితో చెక్కులు నిండినవన్న మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివక్కాణించెడు నాదు మాటలను సంభావించి యాలించుమా
రిప్లయితొలగించండిచిక్కుత్రిక్కుల వేళ మ్రొక్కెనటనీ శ్రీవారె నాడెప్పుడో
మ్రొక్కున్ దీర్చగ నెంచి భద్రగిరికిన్ మోదంబుతోనేడు రా
మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చిక్కుత్రిక్కుల'?
మక్కువతో కొలువంగను
రిప్లయితొలగించండినిక్కము గా కానుపించు నీ రజ నాభుం
డక్కా యిది తెలి యుము తి
మ్మక్కా చని చేయదగు రమాధి పు పూజల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి“మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్”
*కందం**
చుక్కలు పొడిచిన రాతిరి
చక్కని పాటల భజనలు శ్రద్ధగ జేయన్
ప్రక్కన తిరుమల సీత
మ్మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్
....................✍️చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచక్కని జీవితము కొరకు
రిప్లయితొలగించండియెక్కువపూజలొనరించ నేగుచు గుడిలో
అక్కా,వినుమీ రోజు రా
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కొరకు నెక్కువ.." అనండి. మూడవ పాదంలో గణభంగం. "..రోజు ర।మక్కా.." అనండి.
చక్కని జీవితము కొరకు
తొలగించండినెక్కువపూజలొనరించ నేగుచు గుడిలో
అక్కా,వినుమీ రోజు ర
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్!!
సవరించితినార్యా! ధన్యవాదములతో...🙏
చక్కందనమున గుడిలో
రిప్లయితొలగించండిమ్రొక్కగ నూరన్ జనములు ముదమారంగన్
గ్రక్కున వోయిరి, రావే
మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికం.
ఇక్కట్టుల బాపుకొనగ
యెక్కుచు నారత్నగిరిని యిచ్ఛలు తీరన్
మొక్కుచు మనమింకను రా
మక్కా! చని చేయఁదగు రమాధిప పూజల్.
శ్రీ రమాసహిత సత్యనారాయణ మహరాజ్కీ జై,🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...బాపుకొనగ। నెక్కుచు... గిరిని నిచ్ఛలు..." అనండి.
మీది అన్నవరమా? నేను మా ఆవిడతో జనవరి 9న అన్నవరంలో ఉంటాను. 10న అన్నవరం ప్రక్కన హంసవరంలో పుస్తకావిష్కరణ సభ ఉంది. 11న విశాఖ, సింహాచలం. 12న శ్రీకాకుళం, శ్రీకూర్మం.. ఇదీ కార్యక్రమం.
తొలగించండిఒక అంధుడికి చూపు వచ్చునదిగా ఈ నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిశా:
దిక్కుల్ తోచని రీతి చింత గొనుచున్ దృష్టించ కోరంగ నై
చుక్కల్ జూచిననేమి నేడు విధిగా చూడంగ నీలోకమున్
మొక్కుల్ దీర్చగ పోవగా వలయునే మున్నెంచి ప్రార్థించ స
మ్మక్కా , చేరి సభక్తి గొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
వై. చంద్రశేఖర్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన
రిప్లయితొలగించండిసమస్య
*“మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్”*
(లేదా…)
*“మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్”*
కందము
చిక్కులు దీరును మనకును
మిక్కుటముగ పూజసేయ మేలౌ రీతిన్
దిక్కులు జూడకు మిటు రా
మక్కా! చని చేయదగు రమాధిపు పూజల్
చంపకమాల
అక్కోణంబున ముస్లిముల్ స్థిరముగా నల్లాను పూజింతురే
మక్కాచేరిసభక్తి ; గొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
వక్కాణించగ హిందువుల్ ఘనముగా భవ్యైక దీక్షామతిన్
దక్కన్ క్షేమము పూజసేయ వలయున్ తాదాత్మ్య సిధ్యర్ధమై
ఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపక్కా నమాజు సలుపుము
రిప్లయితొలగించండిమక్కా చని : చేయఁదగు రమాధిప పూజల్
మొక్కి మథురానగరి జని,
యొక్కొక దేవుని గొలువగ నొక్కొకటి దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిచక్కగ శౌరిని పొగడుచు
మక్కువమీర నరిగెదము మహిమల జూడన్
పెక్కగు రీతుల వేడెద
మక్కా! చని చేయదగు రమాధిప పూజల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచిక్కని మాయావరణము
రిప్లయితొలగించండిచక్కగ దొల్గంగజేయు సాధనమదియే
మక్కువ భద్రాద్రికి స
మ్మక్కా! చని చేయదగు రమాధిపు పూజల్
వక్కాణించెద నమ్ముమా స్ధిరముగా
పాపమ్ము దొల్గించుచున్
చుక్కానై భవసాగరమ్ము గడయన్
జొక్కంపు మార్గంబిదే
నిక్కంబైన మనంబునన్ దలచుమా
నీలాభ్రదేహున్ సుధీ
మక్కా! చేరి సభక్తి గొల్వదగు రామయ్య న్ మహీజాపతిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'సుధీమక్కా'? ఆవిడ పేరు 'సుధీమ' అనియా?
ధన్యాస్మి గురుదేవా! సుధీమ పేరు అని, బుద్ధిమంతురాలా అనికూడ భావన! 🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఅక్కా! ముస్లిము లెల్లరున్ పరమమై యల్లాను ప్రార్థింపగా
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు; రామయ్యన్ మహీజాపతిన్
వక్కాణింతునయోధ్య లోన బగితిన్ వందారు వందారనన్!
జిలేబి
తొలగించండిఅక్కా! ముస్లిము లెల్లరున్ పరమమై యల్లాను ప్రార్థింపగా
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు; రామయ్యన్ మహీజాపతిన్
వక్కాణింతునయోధ్య లోన బగితిన్ వందారు వందారనన్!
నిక్కంబై పరమాత్మ యెల్లరికి మన్నీడై వసించెన్ సుమా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచక్కగ నింగిన మెరిసె ఝ
రిప్లయితొలగించండిమక్కా చని,చేయదగు రమాధిపు పూజల్
నిక్కముగ నీ దివసమున్
చుక్కా యనిపలికె నొకడు సునయన తోడన్
ఝమక్కా = కృత్తికా నక్షత్రం
కార్తీక పున్నమి రోజున. కృత్తికా నక్షత్రం చంద్రుని తో చేరుతుంది ఆ రోజున. సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్న మంచిది అని తన భార్యతో ఒకడు చెప్పు సందర్భం
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికక్కా గగ్గలు నేర్చితో? రసలసద్గాధావళి న్వింటివో?
రిప్లయితొలగించండిపక్కా రాముని గాధలం జదివితో? భద్రాద్రినిం జూడవో?
మక్కా యేడనొ? రాము డేడ? యకటా! మంతవ్యమె ట్లయ్యె నే
మక్కా! చేరి సభక్తిఁ గొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్?
కంజర్ల రామాచార్య.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచెలియల కోరికల్ గన విచిత్రము లాధునికంపు బోకడల్
రిప్లయితొలగించండిచెలువముఁ గూర్చెఁ గొందరకు చీయని యెల్లరు చీత్కరించ నా
వలువలు దాల్చగన్, వలచి వచ్చిన నిట్టి యొకర్తు పచ్చి యా
కలము ధరించి శోభనసుఖంబిడఁగాఁ జనె నాతి భర్తకున్.
ఆకు+అలము = ఆకలము
కంజర్ల రామాచార్య.
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఒక స్నేహితుడు తెనాలి రామకృష్ణునికి ఈ సమస్య ఇస్తే ఎలా పూరిస్తాడు?
రిప్లయితొలగించండిశా||
తిక్కా నీకు? భలేగ జెప్పితివిగా తెల్లారె నీ చిత్తముల్
చుక్కల్ జూపగ చుక్కదాగినిచటన్ చోద్యంబిదే యెప్పుడీ
విక్కన్ మ్రొక్కవు, వేలయోజనములే యేగంగ నీకేలనా
మక్కా జేరి సభక్తి గొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
ఆదిపూడి రోహిత్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅక్కారాముడయోధ్యనాధుడటగుయ్యాళించుభక్తార్తినిన్
రిప్లయితొలగించండిజక్కంబెట్టుసమస్యసంకటములన్సత్యుండుతోడౌనుర
*“మ్మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్”*
జిక్కుల్వీడయోధ్యమందిరములోసీరామునర్చించినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచక్కంగానలరారు స్త్రీ కుచమునన్ జాహ్నమ్మ గంగా ఝరిన్
రిప్లయితొలగించండిచక్కంగా జడ పట్టినట్టి శివునా జన్మమ్మురాహిత్యునిన్
చక్కంగాగని లింగ రూపమును పూజల్ చేసె రాజన్యుడే
మక్కా చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్”
....భారతీనాథ్ చెన్నంశెట్టి....
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఎక్కంగా బనిలేదు మెట్లనట., దానింపార సీతమ్మ యన్
జుక్కన్ బ్రక్కన దాల్చి నిల్చెనట., జూచున్ సద్దయాదృష్టితో.,
మ్రొక్కంగాచెడి దేవుడంట., ధరలో బున్నెంపు భద్రాద్రి., ర....
మ్మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఋక్కుల్ దెల్పిన మూలసూత్ర మతడే ఋగ్వేద మంత్రంబులన్
రిప్లయితొలగించండిదిక్కైనిల్చెను భద్రశైల మునతా దివ్యప్రభావుండునై
మొక్కుల్ దీర్పగ జానకీపతియె సమ్మోదంబు జేకూర్చు! రా
మక్కా! చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్.
ఇక్కడ యక్కడ కాకను
రిప్లయితొలగించండిమక్కాచనిచేయదగు రమాధిపపూజల్
ఎక్కడ చేసినగలుగును
చక్కటి పుణ్యంబుమనకు శ్రద్ధనుజేయన్
చక్కగ స్నానమునుసలిపి
రిప్లయితొలగించండిప్రక్కన గుడిలో వెలసిన పరమాత్మునకున్
నిక్కపు భక్తిగనో రా
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్
కక్కూర్తెందుకుతమ్ముడాకవగమాగంటన్తలంపాయెగా
రిప్లయితొలగించండిచిక్కేలేదుగచూచివచ్చుటకుజేజమ్మన్వడిన్ఁగోల్వగా
నిక్కూనీలుగులేకనేమతములేసాయంచుభావించుచున్
మక్కాఁజేరిసభక్తిఁగోల్వఁదగురామయ్యన్మహీజాపతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమ్రొక్కినఁ జల్లఁగఁ గాచెడు
తొలగించండినక్కరి వర రక్షకుండు నంచిత దేవుం
డెక్కడ లేఁడు తలంచఁగ
మక్కా చని చేయఁదగు రమాధిప పూజల్
చక్కన్ గెల్చును బుద్ధి నందఱను దా శాంతుండు వేదజ్ఞుఁడే
చిక్కం డెన్నఁడు ధర్మ హీనులకు సచ్ఛీలుండు రామాలయం
బొక్కం డింపుగ దార సంయుతము, నీ వూహించు తప్పిందు నే
మక్కా, చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్
అక్కా!యిక్కడెకాక భక్తినిదగన్ నయ్యాప్రదేశంబులౌ
రిప్లయితొలగించండిమక్కాచేరిసభక్తిగొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్
నెక్కాలంబునునైన రామునినింపారగొల్వంగ దా
జక్కన్ గూర్చును శ్రీలు,ముక్తియునునిస్సందేహమౌనట్లుగా
చుక్కమ్మా! వెసరమ్ముసంతసముతో చూడంగ భద్రాద్రిలో
రిప్లయితొలగించండిదిక్కై బాధలనొందు వారినెపుడున్ దీవించు వాడాతడే
చిక్కుల్ తీరును తప్పకుండ కనినన్, శీఘ్రమ్ముగా నీవుఁ బ్రే
మక్కా, చేరి సభక్తిఁ గొల్వఁదగు రామయ్యన్ మహీజాపతిన్
నిక్కముగా ప్రాణమనిన
రిప్లయితొలగించండిలెక్కే జేయనట్టి వెఱ్ఱిలేచిన నరుడున్
చక్కగ పైకేగ దలచి
మక్కా చని చేయదగు రామాధిప పూజల్
నిక్కముగా ప్రాణమనిన
రిప్లయితొలగించండిలెక్కే జేయనట్టి వెఱ్ఱిలేచిన నరుడున్
చక్కగ పైకేగ దలచి
మక్కా చని చేయదగు రామాధిప పూజల్