4, డిసెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3564

5-12-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్”

(లేదా…)

“ఓడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే”

56 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పోడిమి మీర ప్రీతిగొని పోరున వీరులు రాజధానిదౌ
    కోడుల పందెమందు భళి కొంపలు కూలగ గోడుబెట్టగా
    కూడిక నందు తప్పులయి కొండొక నెన్నిక నందు లాస్టుగా
    నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే...

    రిప్లయితొలగించండి
  2. అలసిన మనసునకూరట
    కలనైనను నూహకందక ఫలము దక్కెన్
    వలసిన సంఖ్యనుజేరక
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్.!

    - - - - - - యెనిశెట్టి గంగా ప్రసాద్.

    ***ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల సందర్భంగా...

    రిప్లయితొలగించండి
  3. సలిపిన మోసమె తుదకున్
    మలుపది తిరిగెను కథనము మధుసూదనుచే
    తొలి జూద రంగమందున
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    త్రాడును పేడునున్ గనక తన్నుకు చచ్చుచు కాకినాడనున్
    కూడుచు నిర్వురాదటను గొప్పగ కన్నులు కొట్టి వేడుకన్
    రోడున రోమియోలహహ రువ్వగ ముద్దులు "సూర్యకాంత"కై
    యోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే...

    రిప్లయితొలగించండి
  5. GHMC ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షము వారి భావన...

    కందం
    బలముండ విర్రవీగుచు
    కలలన్నిటిఁ గల్లచేయ ఘాతకులనుచున్
    బలుకగ ముగింపు గతమున
    గెలిచినవాఁ డోడె! నోడి గెలిచె నొకండున్!!

    ఉత్పలమాల
    కూడిన మద్ధతున్ మఱచి ఘోరములెన్నియొ జేసినంతనే
    యోడలు బండ్లుగా నగును నోడలుగా నగు బండ్లు కర్మమై
    పీడ విడంగ నోట్లనట వేసిరొ! మందటి యెన్నికందు తా
    నోడినవాడు గెల్చె! మఱి యోడెను గెల్చినవాఁడు!! చిత్రమే?

    రిప్లయితొలగించండి
  6. చెలిమినిఁజేయందగదని
    విలువలుఁదెలియకప్రభుతనువేరుపడంగా
    కలతలుకలుగునుకాదా
    గెలిచినవాడోడెనోడిగెలిచెనోకండున్

    రిప్లయితొలగించండి
  7. అందరికీ నమస్సులు🙏
    ఉ.మా

    పోడిమి జూప నుద్యమము స్ఫూర్తిని నింపగ లాభమెంచకే
    తోడుగ నిల్వగన్ బ్రజలు తొల్లిటి నేతల కండదండగన్;
    వీడిని కాదు వాడనుచు వెర్రిగ నమ్ముచు గద్దె దించగన్
    *“ఓడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే”*

    *వాణిశ్రీ నైనాల, విజయవాడ*

    రిప్లయితొలగించండి


  8. చూడగ ధర్మనందనుడు జూదము మోసము నోడె గాని యా

    పాడిని గెల్చినాడు సభ, భ్రష్టసుయోధనుడే విజేతయై

    నాడట న్యాయమే విడిచి నల్గురి ముందర వక్రమార్గమున్

    "ఓడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే?"

    రేసోజు మల్లేశ్వర్

    రిప్లయితొలగించండి
  9. తలచియు వాపును బలమని
    పలికెను దా డం బ ములను పరువది పోవన్
    ఫలితము మార్పును జెందగ
    గెలిచిన వాడో డె యోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెలగుచు మోసపు పాళిని
    గెలిచిన కురురాజు తాను కీడుపడె ననిన్
    సులువుగ ధర్మజ్ఞునితో
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్.!

    రిప్లయితొలగించండి
  11. కలహమ్మున మధ్యందిన
    ఖలునివలెను రేగినట్టి కవ్వడి సుతుడే
    పలువురు వీరుల మనములు
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి

  12. బోనసు సరదా పూరణ:

    "ధర ఖర్వాటు డొకండు..."

    బోడిగ ఖల్వటమ్ములయి బొద్దుగ నుండెడి బ్రాహ్మలిద్దరున్
    వేడిమి తాళజాలకయె వేగమె పర్వుచు ముత్తుకూరునన్
    జోడుగ పోటినిన్ పడగ చొప్పడి యొక్కడు తాళవృక్షపుం
    నీడను జేరగా వడిగ నెత్తిని రాలగ తాటిపండు తా
    నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే...

    బొద్దు = లావు (నెల్లూరి భాష)

    రిప్లయితొలగించండి
  13. తెలిపినవి జేయలేకనె
    గెలిచినవాఁ డోడె ; నోడి గెలిచె నొకండున్
    పలువిధముల నాదుకొనెడి
    పలుకుల తోడన , చివరకు వాడే మగునో

    రిప్లయితొలగించండి
  14. విలువగు నెన్నికలందున
    ఫలితములవి యెట్టులుండొ పౌరుల కెరుకౌ
    తెలగాణ పోరున నిరుడు
    గెలిచిన వాడోడె నోడి గెలిచె నొకండున్

    వాడి శరాళికిన్ బెదరి పార్థుడు సంగర మందునన్ భళా
    వేడగ తాతగారినట వెల్లడిజేయగ
    గెల్చువైనమున్
    పేడిని ముందుగానిడుచు వేయగ బాణము సమ్మతినీయగా
    నోడినవాడు గెల్చె మఱి యోడెను గెల్చినవాడు చిత్రమే!

    రిప్లయితొలగించండి
  15. కులమతభాషాసీమల
    కలతలు పెంచెడు పలుకులు కమ్మగ పలుకన్
    గెలుపోటములేమైనను
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    ఓడినవాడు గెల్చె మరి
    యోడెను గెల్చినవాడు చిత్రమే

    ( భారతభూమిపై దండెత్తిన అలెగ్జాండరును నిరోధించి గెలిచినవాడు పురుషోత్తముడు .కాని విజితుని విజేతగా విజేతను విజితునిగా చిత్రించారు పాశ్చాత్య హ్రస్వదృక్కులు )
    ఉత్పలమాల
    ....................

    వేడుక మీర విశ్వమును
    వేగమె పొందగ పొంగివచ్చె నా
    నాడు సికందరుం ; డతని
    నా పురుషోత్తమధీరసింహుడే
    వాడిమితోడ యుద్ధమున
    వాయగ గొట్టెను ; హ్రస్వదృష్టిలో
    నోడినవాడు గెల్చె ; మరి
    యోడెను గెల్చినవాడు ; చిత్రమే !
    ( హ్రస్వదృష్టి - లఘుదృష్టి ; సికందర్ - అలెగ్జాండర్ బిరుదనామం )

    రిప్లయితొలగించండి
  17. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కూడిన ద్వేషభావమున కుత్సితుడైన సుయోధనుండటన్
    యోడగజేసె కంకుని నయోగపు జూదమునందు, తానుగా
    కీడుపడెన్ ననీకమున ఖేదముతో దరుమయ్య చేతిలో
    ఓడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే!
    (అయోగము=కపటము-ఆంధ్రవాచస్పత్యము; అనీకము=యుద్ధము)

    రిప్లయితొలగించండి


  18. అలకల పాన్పెక్కెను సతి
    గెలువగ పతి, బుజ్జగించి కేల్మొగి యతడే
    చెలువము మీర శరణనగ,
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. ఓడెనెవండు గెల్చి? మఱి యోడియు గెల్చె నెవండు బల్మితో?
      నోడిన వారె యందరిల నూర్ములు నై దగి గెల్పలోటముల్
      వాడిన పూవు లౌను, క్షణభంగురనాట్యవిచిత్రరంగమం
      దోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురం.

      తొలగించండి
  20. వాడిగ వేడిగా ముగిసె పట్టణపెన్నిక లన్ని వేడ్కగా
    నేడు గణించి రోటులవి, నెగ్గునటంచు దలంచినట్టి వా
    డోడె ధనమ్ము పంచిననయో! గత యెన్నిక లందు చిత్తుగా
    నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే

    రిప్లయితొలగించండి
  21. వాడిగ సాగె భాగ్యపురి భావి పురాగ్రణి కెన్నికల్ జనుల్
    చూడని రీతిలో నతుల చోద్యపు మాటల భండనంబుతో
    వేడిగ సాగి యోట్లకథ వీగగ నేడిటు తేటతెల్లమై
    ఓడినవాడు గెల్చె మఱి యోడెను గెల్చినవాడు చిత్రమే

    రిప్లయితొలగించండి
  22. మైలవరపు వారి పూరణ

    వేడుక భాస్కరుండనెడి వీరుడు గెల్చె కబడ్డి విష్ణుపై,
    నోడెను భాస్కరుండె మరియొంటరియై యొకమారు విష్ణుచే,
    జూడగ గెల్పునోటమియు సూక్ష్మతరంబగు భేదమంతియే!
    ఓడినవాడు గెల్చె మరియోడెను గెల్చినవాడు చిత్రమే!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  23. తలబడవాలియుదమ్ముడు
    బలముగరామునిశరమ్ము వాలినిగూల్చెన్
    తలచిరి వానరులప్పుడు
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  24. పాడిరివందిమాగధులభంగినిమీడియరాజధానిలో
    మోడినిమెచ్చియిచ్చిరియమోఘమెజారిటిభాజపాకునా
    నాడుబడాయిమాటలకునాణ్యతహెచ్చెనుకేసియారునే
    *“యోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే”*

    రిప్లయితొలగించండి
  25. మాడెనువాడిమోముపురమందుననోడెనసెంబ్లియెన్నికన్
    మోడిబలంబుముంగిటనుమ్రోడయెప్రాంతియపార్టివీర్యమే
    దాడియెదిర్చియంపియయిదాసచివుండయెభాగ్యసీమలో
    *“నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే”*

    రిప్లయితొలగించండి
  26. కలకాలమొకేరీతిగ
    గలిబొలిపలుకులగుచునుప కారములేమిన్
    పలువురుమదిభావించగ
    గెలిచినవాడోడెనోడిగెలిచెనొకండున్

    రిప్లయితొలగించండి
  27. గెలిచిన కొలువైరి సభల
    తలపుగ దాయాది మాట తలచిన వేళల్
    కలగా దోచెను విజయము
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. చూడగనేటి యోటునిక జూపరులందరిమానసంబునన్
      వీడనియద్భుతంబులవి వేమఱుగుర్తుకువచ్చుచుండెనా
      వాడునువీడునంచనక పెద్దమనంబున గెల్పునిచ్చుటన్
      నోడినవాడుగెల్చె మఱియోడెనుగెల్చినాడుచిత్రమే

      తొలగించండి
  29. ఉ:

    కూడగ మిత్రబృందమున కోరిక మేరకు చీట్ల పేకలన్
    తోడుగ గూడియాడుచును తోచిన తిండిని మెక్కుచుండగన్
    వాడుక రూకలెంచనిక పందెము గెల్వగ శూన్య మంచనన్
    ఓడిన వాడు గెల్చె మరి యోడెను గెల్చినవాడు చిత్రమే

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. వాడిమితో ప్రచారమును బాటల యందున జేసియిచ్చతో
    పోడిగ నన్నివర్గములు మోదముతోడుత వోట్లనియ్యగా
    వాడు జయమ్ము గైకొనెను పాడిగ, కోర్టులొసంగు తీర్పుతో
    నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే

    రిప్లయితొలగించండి
  31. తలిరువిలుకాఁడు హరుపైఁ
    జెలంగి బాణమ్ము నేసె శీఘ్రమ కాలెం
    బులకించెన్ శివుని మనము
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్


    పాడిగ జట్టు లన్నిటను బంతము తోడుత నాడి నంతటం
    గూడ జయమ్ము లెక్కువగఁ గొండ్రు విజేతగ నందుఁ గాంచఁగా
    నాడిన యాట లందును మహత్త్వము మీఱఁగ నొక్క జట్టుపై
    నోడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే

    రిప్లయితొలగించండి
  32. వలసిన సంఖ్యను చేరక
    తెలగాణ సమితి విజయము దిశ లేదయ్యెన్
    నిలచెను బిజెపియు నోడియు
    గెలిచిన వాడోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  33. నిలచెను కారుయు కదలక
    వలచెను బీజే పి పార్టి, బలముయు పెరిగెన్
    కలచెను సమితికి మనసున
    గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్

    రిప్లయితొలగించండి
  34. ఓడగలేదునేననుచు,నోపికపోవగజూసె ట్రంపదే
    పాడినపాట పాడుచును పాపమువీడడు శ్వేత సౌధమున్
    బైడను యేమిజేయునిక,పైసవిదిల్చడు మార్పుకోసమున్
    నోడిన వాడుగెల్చెమఱి నోడెను, గెల్చినవాడు చిత్రమే
    ++++++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  35. ఓడుచునన్నియెన్నికలనోపికతోతనపట్టునెన్నడున్
    వీడకపోటిచేయనొక వేకువఝామునగాంచె స్వప్నమం
    దోడకతానుగెల్చెననియోడెనుదస్యుఁడటంచు మేల్కొనన్
    ఓడినవాఁడు గెల్చె మఱి యోడెను గెల్చినవాఁడు చిత్రమే

    రిప్లయితొలగించండి
  36. ----------------------------------------------------
    05-12-2020 (శనివారం) పూరణ

    “గెలిచినవాఁ డోడె నోడి గెలిచె నొకండున్”
    ----------------------------------------------------
    కం.
    గెలిచెను తానెగబడి సుడి
    వలయంబున ఫార్టి యోడెఁ బండె నవతలన్
    గెలువక ప్రభువాయె విధిన్
    గెలిచిన వాఁడోడె నోడి గెలిచె నొకండున్
    - గానుగుల
    విజయవాడ
    ----------------------------------------------------

    రిప్లయితొలగించండి


  37. .గెలుపోటములవి సహజం
    బిలలో వినుమెప్పుడైననిదినిజమౌగా
    ఛలమునువీడుచు గనుమిక
    గెలిచినవాఁడోడెనోడి గెలిచెనొకండున్!*

    రిప్లయితొలగించండి