5, జులై 2021, సోమవారం

సమస్య - 3773

6-7-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు”
(లేదా...)
“తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్”

70 కామెంట్‌లు:

  1. విశ్వరూపంబుఁజూపుచువింతగాను
    కోమ్ముక్రోవ్వునుమలచుచుక్రోత్తఁజూపి
    పుర్వుకోవిడునరులనుపూనితరుమ
    గోయ్యితమకుతామేత్రవ్వుకోనుటమేలు

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సాటి వారికి సాయమే సల్పకుండి
      స్వార్థమే ధ్యేయమై నిట సందుకొనెడి
      నేటి కాలము నందున నేర్పు జూపి
      గొయ్యి దమకు దామే త్రవ్వుకొనుట మేలు!

      తొలగించండి

  3. ఎన్నికలవేళ నేతల నెన్నుకొనగ
    ధనము మద్యము నాశించు మనుజు నకది
    గొయ్యిఁ దమకుదామే త్రవ్వు కొనుట, మేలు
    కాదనుచు చెప్పిన వినరీ కాలమందు.

    రిప్లయితొలగించండి
  4. కాలుడొచ్చు వేళ వలయుగదర గొయ్యి

    పరుల సాయమునాశించి భంగ పడకు

    ఎవరు తవ్విన గోతిలో చేరు వాడె

    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చు'ను 'ఒచ్చు' అనరాదు. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  5. కె.వి.యస్. లక్ష్మి:

    పొరుగువారి తోడ నెపుడు పొందెరుగని
    పాడు జనుల కాలమ్మిది పరమ నిజము
    తమవి మంచి చెడుల తీరు తామె నేర్చి
    గొయ్యి దమకు దామే త్రవ్వుకొనుట మేలు!

    రిప్లయితొలగించండి
  6. అల్ప సంతోషు లయ్యు తామాశ పడుచు
    డబ్బు మద్యము లకు లొంగు జబ్బు వల్ల
    గొయ్యి తమకు దామే త్రవ్వు కొనుట : మేలు
    మంచి నేతను యోచించి యెంచు టెపుడు

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కొలువుసేయు మనుచు కోరి కూళు నెన్న
    గొయ్యి తమకు దామే త్రవ్వు కొనుట; మేలు
    చేయు నాయకు నెన్నుము చెన్నుమీర
    సేవ జేయుచు నాతడు క్షేమ మొసగు.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. హనుమంతులవారు రావణాసురుని తో....

      తేటగీతి
      జానకమ్మను విడువంగ జాతి మిగులుఁ
      గాదనఁగ రామబాణమ్ము కదనమందు
      మూఢ! రావణా! గూల్చక మునుపె తమరి
      గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు!

      మత్తేభవిక్రీడితము
      భ్రమలన్ వీడుచు జానకీ జనని శ్రీరామాంక మున్ జేర్చినన్
      క్షమతో జాతికి రావణా! శుభమగున్గాదంచుఁ బెట్రేగినన్/గుంపించినన్
      సమరంబందున రామబాణములతో చావెంచు పూర్వమ్ముగన్
      తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్



      తొలగించండి

  9. కుమతుల్ నీతియె లేనినేతలిల మూర్ఖుల్ దుర్మతుల్ వారిపై
    మమకారమ్మును జూపి యోటునిడి సమ్మానమ్మునే జేయుటే
    తమకుందాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా, మేలగున్
    భ్రమలన్ వీడుచు మేకవన్నె పులులన్ వారించి యోడించినన్.

    రిప్లయితొలగించండి
  10. సుమతిన్ దానని సూక్తులెన్నొ బలుకన్ సోంబేరి
    సోగ్గాడదే
    తమకమ్మందిన స్త్రీలహో తెలియకే తన్లాడి సొమ్ముల్నిడన్
    నిముషంబైనను నాలసించకను వెన్నివ్వంగ
    దెల్యంగనౌ
    తమకుందాముగ గొయ్యి త్రవ్వుకొనుటే తథ్యంబుగా!
    మేలగున్
    కమలాక్షుల్ తగు జాగ్రతన్ మెసలగా కాపట్యు లన్ నమ్మకే

    రిప్లయితొలగించండి
  11. పెండ్లివారలు వత్తురే, వంటజేయ
    గాడిపొయ్యిని త్రవ్వెడి వాడురాక
    పలుగు పారదెచ్చి యనెనె వధువువారు
    "గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు"

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విమలంబైన విశేషమౌ కొలుపులన్ ప్రేరింతుమీ గొప్పగా
    తమకెల్లప్పుడు నన్న దుర్మతులకున్ స్థానంబొసంగగా
    తమకుందాముగ గొయ్యి త్రవ్వుకొనుటే; తథ్యంబుగా మేలగున్
    క్షమతో జాతికి సేవలన్ చలుపుచున్ కార్యార్థులౌవ్వారితో!

    రిప్లయితొలగించండి
  13. హితముగోరినవారిని హీనపరచి
    కీడుతలబెట్టబూనెడు పాడుబుద్ధి
    కలిగియుండుట కన్నను కాపురుషులు
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు

    రిప్లయితొలగించండి
  14. మ:

    కుమతీ నీకిది భావ్య మెట్లగున టో ? క్రూరంపు టాలోచనల్
    సుమతిన్ జూచిన తీరులో నిను గనన్ సుస్పష్టమౌ ద్వేషమే
    మమతల్ నిండిన మంచి మాట దెలుపన్ మానింక నీ బోధనల్
    తమకుందాముగ గొయ్యి ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. మమకారంబది జీవితమ్మునను క్షే
    మం బిచ్చు నీ తోడుతన్
    క్రమము న్దప్పగ ముప్పుగా బెనగి వ
    క్రంబొంది వేధింపదే
    కుమతుల్ దానిని దన్నుగా దలతురే-
    కొంతైన ఖేటించకన్,
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్!

    రిప్లయితొలగించండి
  16. ఎంతటి యులిపి యనునది యెరుగ కుండ
    తమను బాలించుమని దగు తక్తు నొసగ
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట ; మేలు
    గాదె వానిని వేగమె గద్దె దించ

    రిప్లయితొలగించండి
  17. నీరు యింకెడు రీతిన నీవు తవ్వు
    గొయ్యి భూగర్భ జలముల గొంకు దీర్చు
    నీటినొడిసిబట్టుట నేటి నీతిగనుక
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీరు+ఇంకెడు' అన్నపుడు యడాగమం రాదు. "నీర మింకెడి.." అనండి.

      తొలగించండి
    2. సవరణతో...

      నీరమింకెడి రీతిన నీవు తవ్వు
      గొయ్యి భూగర్భ జలముల గొంకు దీర్చు
      నీటినొడిసిబట్టుట నేటి నీతిగనుక
      గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు

      తొలగించండి
  18. శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో...

    అమితోత్సాహవివేచనాదిరహితవ్యర్థప్రబోధుండవై
    సమయజ్ఞత్వము లేని వాడవొ! కటా! సత్యోక్తి పాటింతువా!
    భ్రమలన్ వీడు మదేమి ధర్మమగు దుర్వార్యంబులౌ నాపదల్,
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్?

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. ఈ నాటి‌ శంకరా భరణము వారి సమస్య

    గొయ్యి తమకు తామే తవ్వు కొనుట మేలు

    ఇచ్చిన పాదము‌ తేట గీతి

    నా పూరణ సీసములో


    మోహినిగా రూపమును దాల్చి
    భస్మాసురుని జంపినట్డి విరోథి‌ యతడు

    క్షీర సాగరమును చిలికి సుధ ను‌ పొంద
    బోవ రిపుల‌ నోట బోసి నట్టి

    మోసగాడతడు,ప్రముఖ దైత్య
    గణములన్
    మట్టు బెట్టుచు నుండు మాయగాడు,

    రిపుని నామమును కీర్తించగా పాడి కా
    దనుచు ప్రహ్లాదుడా కినుక తోడ

    తెల్పితిని గాదె పలుమార్లు, తెలిసి తెలిసి

    హరిని‌ కొల్చుట కన్నను సరస గతిని

    గొయ్యి తమకు తామే తవ్వు కొనుట మేలు

    గాదె యని బలికె హిరణ్య కశిపుడపుడు

    రిప్లయితొలగించండి
  20. రమకుం నాధుని దివ్య నామమును నోరారంగ కీర్తించకన్

    ఉమకుం నాధుని భస్మ పూజలను చేతుల్ నొవ్వగా సేయకన్

    తమకంబెందుకు మానవాధముడ సాధ్యంబౌన లోకంబునన్

    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే , తథ్యంబుగా మేలగున్”

    తమ వాడొక్కడు తోడు యుండినను, సంతానంబె త్రవ్వేరుగా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రమకున్ నాథుని... కీర్తించకే.. ఉమకున్... సేయకే... తోడు గల్గినను..." అనండి.

      తొలగించండి
  21. తల్లిదండ్రుల, గురువుల ధర్మ బోధఁ
    స్వీకరించని బలశాలి, స్వేచ్ఛ కోరి
    పరువు పాప భీతిని విడి బతుకు వారు
    గొయ్యి తమకు తామే తవ్వుకొనుట మేలు
    .......చిదిరాల సుధాకర్

    రిప్లయితొలగించండి
  22. తమకమ్మొంది ధనమ్ముపైఁ గొనగ విస్తారమ్ముగా దానిఁ జ
    ట్టముఁ జుట్టంబని యెంచుచున్ బడచినన్ డంబమ్ముతో, నెంచగా
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా, మేలగున్
    క్రమమౌ పధ్ధతి సొమ్ముకూడగను సత్కార్యమ్ము లందెప్పుడున్

    రిప్లయితొలగించండి
  23. తమకంబాగక వారకాంత వశులై తత్సౌఖ్యమే మేలనన్
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే; తథ్యంబుగా మేలగున్
    తమమున్ వీడి పరాత్పరుండు జగదాధారుండె సత్యంబుగా
    తమకుం దాము గ్రహించి నిత్యము మదిన్ ధ్యానింప సద్భక్తులై

    రిప్లయితొలగించండి
  24. అన్న! వైదేహి నారాము కప్పగించి
    రణము దప్పించి గావుము రాజ్యమింక!
    లేక మిగులునే ప్రాణముల్ లేశమైన!
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. తమరే భూమిజ నప్పగించ సరి! తాత్సారంబికన్ సేయకన్,
      గమనీయంబగు పాలనన్ సలుపుమా, కాకుత్స్థునిన్ వేడుమా!
      రమయే జానకి సోదరా! యథవ యీ రాజ్యంబు నాశంబగున్!
      తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్!

      తొలగించండి
  25. మొక్క నాటెడు ఫలితమ్ము బొందగోర
    గొయ్యి దమకుదామే త్రవ్వు కొనుట మేలు
    ఫలిత మెటులున్న జేసిన భవ్యు డెఱుగు
    నేది యెవరికి యర్హతో యిచ్చు నదియ

    రిప్లయితొలగించండి
  26. వీఁకఁ జెలఁగి యన్యాక్రాంత మేక మెంచి
    యెన్నఁ డైన నాలోచన పన్ని యెడఁద
    స్వీయ నిధులను బూడ్పంగఁ జెల్వముగను
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు


    అమలస్వాంత రమా వికార హృది క్రూరాశీవి షాభమ్ముగా
    సమయించుం గద తన్ను ఘోరముగ నిశ్శం కాన్య దారాంచిత
    ప్రమదా రత్నవిలోల మానసము విభ్రాంతమ్ము కన్నన్ ధరం
    దమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్

    రిప్లయితొలగించండి
  27. తమకం బొందిన మానసంబునయి తాదాత్మ్యంబుతో నిద్ధరన్
    మమకారంబును బొంది మొక్కలనుదామాన్యంబుగాబాతుచో
    దమకుందాముగ గొయ్యిత్రవ్వుకొనుటే తధ్యంబుగా మేలగున్
    రమయుం సంతస మొందుచున్ నిడును నార్యాసంపదల్ మెండుగా

    రిప్లయితొలగించండి
  28. తమకున్మేలొనరించు వారి యెడలన్దాక్షిణ్యమున్ జూపకన్
    కుమతుండై సతతంబు కీడుసలుపన్ క్షుద్రంపునా దుష్కృతుల్
    యమలోకంబునకీడ్చువాని నిది సత్యంబౌను, పాపాత్ములున్
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్

    రిప్లయితొలగించండి
  29. తమకం బొప్పగ నేలికల్ జనులపై దౌష్ట్యమ్ము సారించుచున్
    మమకారమ్ము సహించ నట్టి, ఖలులై మారంగ దేశమ్మునన్
    శమమే వ్రాలగ పౌరులిట్లనిరి " భ్రష్టాచారులౌ వారిలన్
    దమకుం దాముగ గొయ్యి ద్రవ్వు కొనుటే తథ్యంబుగా మేలగున్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదంలో "సహించ నట్టి " బదులుగా "ను జూపనట్టి" గా చదువుకొన ప్రార్థన.
      శ్రీధరరావు

      తొలగించండి
  30. తమరీ భూమిజ నప్పగించ సరి! తాత్సారంబికన్ సేయకన్,
    గమనీయంబగు పాలనన్ సలుపుమా, కాకుత్స్థునిన్ వేడుమా!
    రమయే జానకి, యీవెఱుంగు మథవా రాజ్యంబు రక్షింపగన్!
    తమకుం దాముగ గొయ్యిఁ ద్రవ్వుకొనుటే తథ్యంబుగా మేలగున్!

    రిప్లయితొలగించండి
  31. కలియు గ మిదిలే నిలకడలే కనుక రోన
    విలయ తాండవ మాడెడు వింత రోజు
    లివియు చచ్చిన నెవ్వడు నెత్త రారు
    గొయ్యిఁ దమకుఁ దామే త్రవ్వుకొనుట మేలు

    రిప్లయితొలగించండి
  32. వీరాగ్రేసరుడైన కృష్ణుడెచటన్
    ప్రేమించి జన్మించె సోద్యంబుగన్
    దూరాలోచన లేని కుంతికెవరున్
    దొల్దొల్త జన్మించె దేజంబుతో
    ధీరండైన సుయోధనుండె
    వరికిన్ ధీశాలియైపుట్టెడిన్
    కారాగారమునన్ జనించెనుగదా, కర్ణుండు ,గాందారికిన్

    రిప్లయితొలగించండి