28-7-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై”(లేదా...)“పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్”
విరించి.వేలాది ప్రతిమ లట లోపాలను కలిగెనని యారు బయటయె పెట్టన్ శూలము తో యొకడా శిల్పాలను దునియలుగఁ జేసె పటు విక్రముడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాలిని దునిమెను రఘువైచేలములిడి సిగ్గు కాచె శ్రీ కృష్ణుండైబాల వటువుగన్ బలి పాపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
విరించి.మూలకు పెట్టినట్టి పలు బొమ్మలు లోపము నున్న వాటితోనాలయ మంత నిండెనని యర్చకు లెల్లరు గోలపెట్టగాశూలము తోడవచ్చి యొక శూరుడు వ్యర్థము లైన యట్టి శిల్పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్.
ఆలనుమేపెడిగోల్లడుచేలనువ్రాలినచికుబుకుచిన్నదిపిట్టన్కూలగగోట్టెనువెంబడిపాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై
పద్యం బాగుంది. కాని సమస్యాపరిష్కారమే అర్థం కాలేదు. వివరించండి.
పాలపిట్టనుముక్కలుగచేశాడు
తాలిమి గలిగిన వాడై మేలొనరించుచు సతతము మేటి ఘనుండై జాలము సేయక దా కో పాలను దునియలుగ జేసె పటు విక్రముడై
క్రొవ్విడి వెంకట రాజారావు: శూలధరుని నిరతమ్ముగ మేలగు భక్తిని గొలవగ మెండుగ నతడే వీలుగ మృకండు సుతు పా పాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై
కందంబాలల జంపిన గురుసుతుఁగూలచ వలదనుచు నాపి గోవిందుఁడనన్మేలని, నర్జునుఁడట జుంపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడైఉత్పలమాలబాలల జాలిలేక నుపపాండవులందరి మట్టుపెట్టినన్గూలచ బోకు బాపడని గోకుల కృష్ణుడు మధ్యమార్గమేమేలని జెప్ప ద్రోణసుతు మీదకు దూకుచు నర్జునుండు జుంపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఆలమునాతని రథమునుగూలిచినను చెలగె క్రీడి కొమరుండాహావాలమునరి వీరుల చాపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
సమస్య :పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్ ( తన మీది ప్రేమను వీడి కారెమపూడి రణరంగానికి వెళ్లమన్న మాంచాల మాట పాటించిన బాలచంద్రుడు)ఉత్పలమాల -----------" చేలము బట్టబోకు ప్రియ !చెంగున సిద్ధము కమ్ము పోరికిన్ ;వేల నెరుంగనేర రట వీరులు కారెమపూడి యందునన్ బాలుడ ! లె " మ్మనన్ సతియె ;భళ్లున లోపల నున్న ప్రేమపు ష్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్ .(బల్లిదుడు - శక్తిమంతుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పాలసు డెల్లవేళలను బాండవమధ్యము బావమర్ది గోపాలని మాటిమాటికిని వంకలుపెట్టెడు వాని వంద పాపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడందరు మెచ్చుచుండగన్జాలము లేక చంపి, కడు చయ్యనజైద్యుని యుగ్రరూపియై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "చైద్యుని నుగ్రరూపియై" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆలను కాచెడి కృష్ణుడుకూలగ చేసెను తరువుల కువలయమందున్తాలిమితోవైరుల పాపాలను దునియలుగ చేసె పటు విక్రముడై
ఉ: కూలగ వచ్చె వారధని క్రొత్తగ కట్టిరటంచు దెల్పగాగోలగ లోకులెల్లరును గుంపున గూడి సమాశ్రయింపగన్వైళము నింజనీరు తగు వాటము నెంచి పరిశ్రమింప లో పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్వైళము =శీఘ్రముగావై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వారధిని' టైపాటు.
ధన్యవాదములు
క్రొవ్విడి వెంకట రాజారావు: శూలధరున్ ననారతము సొంపగు భక్తిని సంస్తుతించుచున్ మేలగు రీతి నాతనిని మెండుగ వేడు గజాసరుండునున్ మాలిమితో హరుండు తన మాయను జూపుచు బ్రోచి వాని పాపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్.
పోలికలేకయుద్ధమునపోరునుసల్పుచుపార్ధుపుత్రుడున్చాలినతండ్రితేజమునచాపముబట్టుచుభీకరుండునైపాలనుబడ్డశత్రువులుపంతముతోడనుచేయుదుర్విలాపాలనోనర్చెముక్కలుగబల్లిదుడైజనులెల్లమెచ్చగన్
కె.వి.యస్. లక్ష్మి: లీలను జూపుచు కృష్ణుడు శైలమునెత్తి ప్రజ గాచి సర్పపు మదమున్ తూలించి వానివౌ పా పాలను దునియలుగ చేసె పటు విక్రముడై.
నేలయు నింగియునొకటైనీలభములు గర్జనలతొ నెగడుచు గురియన్నేలకునొరిగిన తరుజొంపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'గర్జనలతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "గర్జనలను" అనవచ్చు.
నేలయు నింగియునొకటైనీలభములు గర్జనలను నెగడుచు గురియన్నేలకునొరిగిన తరుజొంపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
(కరోన సందర్భం లో )బాలుని వెలుపలకంపగవీలుపడని కారణమున వేశ్మము నందేలాలనదోడ పితయె జులపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడైవేశ్మము = ఇల్లు
కూలెనురుక్మి,యపుడు కరవాలముతో గొరిగె గుండు వసుదేవసుతే,చాలాగడములనుచు జులపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వసుదేవసుతే' అనడం సాధువు కాదు.
గాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగానేలనుగూలె వృక్షములు నిల్చెను వాహన రాకపోకలున్బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొంపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వాహన రాకపోకలు' దుష్టసమాసం. "నిల్చెను వాహనముల్ పథంబునన్" అందామా?
ధన్యవాదములు గురువుగారూ, సవరిస్తాను
గాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగానేలనుగూలె వృక్షములు నిల్చెను వాహనముల్ పథంబునన్ బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొంపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
యేలనొ! కల్సిరాకనొక ఏనుగుచెర్వుననీరుద్రాగగాకాలునుమోపితొండముతొకడ్పులునిండగత్రాగియుండకన్గోలనుజేసినీటిపయికొట్టుచుతేలుచుఈదులాడగాకాలునుపట్టెనక్రము సకామునవిష్ణువె చంపివాటి, శాపాల నొనర్చె మక్కలుగ బల్లిదుడైజనులెల్లమెచ్చగన్ ....తోకల....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. "ఏలనొ' అనండి. 'తొండముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "తొండమున" అనవచ్చు.
కాలునివలె క్రోధాగ్నులనోలాడుచు ద్రోణసుతుడు నుపపాండవనిర్మూలనమొనర్చితద్రూపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
కాలములో, క్రోధముననుకూలగ కోర్కెలు, తపమున కౌశికుడయ్యెన్మేలౌ బ్రహ్మర్షిగ, కోపాలను దునియలుగఁ జేసె, పటు విక్రముఁడై.
కాలమును వెదకి చూడుముపాలించెనెపుడు కరుణగ పశుపతి తానేఆలించుచు భక్తులతాపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
ఆలయముల దేవుని రూపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడైవేలుపుపై లలి విడెనా !యేల యిటుల జరుగుచుండె నేలిక జడమా ?
పాలనొసంగు సాకు గొని బాలుని యక్కున జేర్చి ప్రేమతోజోలను పాడుచున్ విషముఁ జొన్పగ వచ్చినఁ గాంచి పాలతోపీలిచి ప్రాణవాయువులు , వెన్నుడు పూతన పొందినట్టి శాపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
ఆలమునందునా దురితులందరు గూడి రథంబు గూల్చినన్బాలుడు సింగమై దుమికె వారలనుక్కడగింప వేగమేవాలము దూసి శాత్రవులపై చెలరేగుచు నిల్చి వారి చాపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
వాలమురహి వానరములబాలుడు దాజెక్క శిలనుబంధువు మిగులన్ హేళన జేయుచు నాశిల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై
చాలిక యింద్రయాగములు! చక్కగ గొల్చెదమీ మహాగిరిన్ మేలగు పుణ్యకార్యమని మేఘపువర్ణుడు జెప్పినంత బైడాలముతో శచీపతి విడంబములేకయె వర్షధారలన్నేలను నాకమున్ గలుప నీడగ కొండను కేలబట్టి తాపాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
ఆలికినిఁ బాక పరిపాకాల సమానుఁడ నరయఁగఁ గానే యంచున్ వ్రేలను ముంచుచుఁ గాయుచుఁ బాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై కీలి నిభ ప్రభా కలిత కీర్తి వికీర్ణ సుఘోర దర్శ నాభీల వరూధినీ సహిత భీద పరాక్రమ సుప్రచండ బాహా లస దుగ్ర శాత్రవ జయార్భట చిహ్న సునిర్మి తేద్ధ స్తూపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
వాలము లేకయుండగను వానరమూకల జెక్కు పుత్రునిన్ చాలును శిల్ప చెక్కడము శ్రద్ధగ బొమ్మిక పాఠశాలకున్ మేలగు జీవితంబునకు,మెప్పును బొందెద వంచు బల్కిశిల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
కందంలీలగ యశోద గాంచెనుబాలుని మనుతిన్ననోట పద్నాలుగు లోకాల! నటులఁ కృష్ణుఁడు పాపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై!ఉత్పలమాలఏల పరాత్పరా! రణము యీ గురు బంధుల గూల్చ లేననన్జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
సవరణతో ఉత్పలమాలఉత్పలమాలఏల పరాత్పరా! సమర మీ గురు బంధుల గూల్చ లేననన్జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూపాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
కూలగదోయునే మనల కుప్పగ యారురిపుల్ గదా యనిన్పాలకుడంతటన్ తలచి పట్టుగ నంతము చేయునా తరిన్బోలము రీతిగా గురుని బోధతొ యంతర వైరులా ప్రతాపాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
పాలు పెరుంగు దొంగిలుచు పల్లెతలాడెడి కల్లలంచునా బాలుడు తల్లి నేమరచు బాల్య విశేషములందు గాంచ గోపాలుడు వల్లవాంగనల వల్వలు దోచెనటంద్రు గాని పా పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
ఉత్పలమాల:-----------మేలును జేయగాదగును,మేదినిపైనను బీదవారికిన్ పూలనుబెట్టివారలిక,పూజలుజేయగనుండ శ్రద్ధతోకూళలుజేరికొందరిట, కుట్రకుతంత్రములల్ల వారి పాపాలనొనర్చె ముక్కలుగ ,బల్లిదుడై జనులంత మెచ్చగన్.
రిప్లయితొలగించండివిరించి.
వేలాది ప్రతిమ లట లో
పాలను కలిగెనని యారు బయటయె పెట్టన్
శూలము తో యొకడా శి
ల్పాలను దునియలుగఁ జేసె పటు విక్రముడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాలిని దునిమెను రఘువై
రిప్లయితొలగించండిచేలములిడి సిగ్గు కాచె శ్రీ కృష్ణుండై
బాల వటువుగన్ బలి పా
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివిరించి.
మూలకు పెట్టినట్టి పలు బొమ్మలు లోపము నున్న వాటితో
నాలయ మంత నిండెనని యర్చకు లెల్లరు గోలపెట్టగా
శూలము తోడవచ్చి యొక శూరుడు వ్యర్థము లైన యట్టి శి
ల్పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆలనుమేపెడిగోల్లడు
రిప్లయితొలగించండిచేలనువ్రాలినచికుబుకుచిన్నదిపిట్టన్
కూలగగోట్టెనువెంబడి
పాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై
పద్యం బాగుంది. కాని సమస్యాపరిష్కారమే అర్థం కాలేదు. వివరించండి.
తొలగించండిపాలపిట్టనుముక్కలుగచేశాడు
తొలగించండితాలిమి గలిగిన వాడై
రిప్లయితొలగించండిమేలొనరించుచు సతతము మేటి ఘనుండై
జాలము సేయక దా కో
పాలను దునియలుగ జేసె పటు విక్రముడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశూలధరుని నిరతమ్ముగ
మేలగు భక్తిని గొలవగ మెండుగ నతడే
వీలుగ మృకండు సుతు పా
పాలనుఁదునియలుగఁజేసెపటువిక్రముడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిబాలల జంపిన గురుసుతుఁ
గూలచ వలదనుచు నాపి గోవిందుఁడనన్
మేలని, నర్జునుఁడట జుం
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
ఉత్పలమాల
బాలల జాలిలేక నుపపాండవులందరి మట్టుపెట్టినన్
గూలచ బోకు బాపడని గోకుల కృష్ణుడు మధ్యమార్గమే
మేలని జెప్ప ద్రోణసుతు మీదకు దూకుచు నర్జునుండు జుం
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఆలమునాతని రథమును
రిప్లయితొలగించండిగూలిచినను చెలగె క్రీడి కొమరుండాహా
వాలమునరి వీరుల చా
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిపాల నొనర్చె ముక్కలుగ
బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
( తన మీది ప్రేమను వీడి కారెమపూడి రణరంగానికి వెళ్లమన్న మాంచాల మాట పాటించిన బాలచంద్రుడు)
ఉత్పలమాల
-----------
" చేలము బట్టబోకు ప్రియ !
చెంగున సిద్ధము కమ్ము పోరికిన్ ;
వేల నెరుంగనేర రట
వీరులు కారెమపూడి యందునన్
బాలుడ ! లె " మ్మనన్ సతియె ;
భళ్లున లోపల నున్న ప్రేమపు
ష్పాల నొనర్చె ముక్కలుగ
బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్ .
(బల్లిదుడు - శక్తిమంతుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపాలసు డెల్లవేళలను బాండవ
రిప్లయితొలగించండిమధ్యము బావమర్ది గో
పాలని మాటిమాటికిని వంకలు
పెట్టెడు వాని వంద పా
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదు
డందరు మెచ్చుచుండగన్
జాలము లేక చంపి, కడు చయ్యన
జైద్యుని యుగ్రరూపియై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చైద్యుని నుగ్రరూపియై" అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆలను కాచెడి కృష్ణుడు
రిప్లయితొలగించండికూలగ చేసెను తరువుల కువలయమందున్
తాలిమితోవైరుల పా
పాలను దునియలుగ చేసె పటు విక్రముడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండికూలగ వచ్చె వారధని క్రొత్తగ కట్టిరటంచు దెల్పగా
గోలగ లోకులెల్లరును గుంపున గూడి సమాశ్రయింపగన్
వైళము నింజనీరు తగు వాటము నెంచి పరిశ్రమింప లో
పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
వైళము =శీఘ్రముగా
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారధిని' టైపాటు.
ధన్యవాదములు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశూలధరున్ ననారతము సొంపగు భక్తిని సంస్తుతించుచున్
మేలగు రీతి నాతనిని మెండుగ వేడు గజాసరుండునున్
మాలిమితో హరుండు తన మాయను జూపుచు బ్రోచి వాని పా
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోలికలేకయుద్ధమునపోరునుసల్పుచుపార్ధుపుత్రుడున్
రిప్లయితొలగించండిచాలినతండ్రితేజమునచాపముబట్టుచుభీకరుండునై
పాలనుబడ్డశత్రువులుపంతముతోడనుచేయుదుర్విలా
పాలనోనర్చెముక్కలుగబల్లిదుడైజనులెల్లమెచ్చగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిలీలను జూపుచు కృష్ణుడు
శైలమునెత్తి ప్రజ గాచి సర్పపు మదమున్
తూలించి వానివౌ పా
పాలను దునియలుగ చేసె పటు విక్రముడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేలయు నింగియునొకటై
రిప్లయితొలగించండినీలభములు గర్జనలతొ నెగడుచు గురియన్
నేలకునొరిగిన తరుజొం
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'గర్జనలతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "గర్జనలను" అనవచ్చు.
నేలయు నింగియునొకటై
తొలగించండినీలభములు గర్జనలను నెగడుచు గురియన్
నేలకునొరిగిన తరుజొం
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
(కరోన సందర్భం లో )
రిప్లయితొలగించండిబాలుని వెలుపలకంపగ
వీలుపడని కారణమున వేశ్మము నందే
లాలనదోడ పితయె జుల
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
వేశ్మము = ఇల్లు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూలెనురుక్మి,యపుడు కర
రిప్లయితొలగించండివాలముతో గొరిగె గుండు వసుదేవసుతే,
చాలాగడములనుచు జుల
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వసుదేవసుతే' అనడం సాధువు కాదు.
గాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగా
రిప్లయితొలగించండినేలనుగూలె వృక్షములు నిల్చెను వాహన రాకపోకలున్
బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొం
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వాహన రాకపోకలు' దుష్టసమాసం. "నిల్చెను వాహనముల్ పథంబునన్" అందామా?
ధన్యవాదములు గురువుగారూ, సవరిస్తాను
తొలగించండిగాలులు వీచి భీకరముగా పెను వర్షము గుమ్మరించగా
తొలగించండినేలనుగూలె వృక్షములు నిల్చెను వాహనముల్ పథంబునన్
బాలకుడొక్కరుండపుడు బాటనుసిద్ధముచేయ చెట్ల జొం
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
యేలనొ! కల్సిరాకనొక
రిప్లయితొలగించండిఏనుగుచెర్వుననీరుద్రాగగా
కాలునుమోపితొండముతొ
కడ్పులునిండగత్రాగియుండకన్
గోలనుజేసినీటిపయి
కొట్టుచుతేలుచుఈదులాడగా
కాలునుపట్టెనక్రము
సకామునవిష్ణువె చంపివాటి, శా
పాల నొనర్చె మక్కలుగ
బల్లిదుడైజనులెల్లమెచ్చగన్
....తోకల....
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. "ఏలనొ' అనండి. 'తొండముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "తొండమున" అనవచ్చు.
కాలునివలె క్రోధాగ్నుల
రిప్లయితొలగించండినోలాడుచు ద్రోణసుతుడు నుపపాండవని
ర్మూలనమొనర్చితద్రూ
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలములో, క్రోధమునను
రిప్లయితొలగించండికూలగ కోర్కెలు, తపమున కౌశికుడయ్యెన్
మేలౌ బ్రహ్మర్షిగ, కో
పాలను దునియలుగఁ జేసె, పటు విక్రముఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలమును వెదకి చూడుము
రిప్లయితొలగించండిపాలించెనెపుడు కరుణగ పశుపతి తానే
ఆలించుచు భక్తులతా
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆలయముల దేవుని రూ
రిప్లయితొలగించండిపాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
వేలుపుపై లలి విడెనా !
యేల యిటుల జరుగుచుండె నేలిక జడమా ?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాలనొసంగు సాకు గొని బాలుని యక్కున జేర్చి ప్రేమతో
రిప్లయితొలగించండిజోలను పాడుచున్ విషముఁ జొన్పగ వచ్చినఁ గాంచి పాలతో
పీలిచి ప్రాణవాయువులు , వెన్నుడు పూతన పొందినట్టి శా
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
ఆలమునందునా దురితులందరు గూడి రథంబు గూల్చినన్
రిప్లయితొలగించండిబాలుడు సింగమై దుమికె వారలనుక్కడగింప వేగమే
వాలము దూసి శాత్రవులపై చెలరేగుచు నిల్చి వారి చా
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
వాలమురహి వానరముల
రిప్లయితొలగించండిబాలుడు దాజెక్క శిలనుబంధువు మిగులన్
హేళన జేయుచు నాశి
ల్పాలను దునియలుగ జేసె పటువిక్రముడై
చాలిక యింద్రయాగములు! చక్కగ గొల్చెదమీ మహాగిరిన్
రిప్లయితొలగించండిమేలగు పుణ్యకార్యమని మేఘపువర్ణుడు జెప్పినంత బై
డాలముతో శచీపతి విడంబములేకయె వర్షధారలన్
నేలను నాకమున్ గలుప నీడగ కొండను కేలబట్టి తా
పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
ఆలికినిఁ బాక పరిపా
రిప్లయితొలగించండికాల సమానుఁడ నరయఁగఁ గానే యంచున్
వ్రేలను ముంచుచుఁ గాయుచుఁ
బాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై
కీలి నిభ ప్రభా కలిత కీర్తి వికీర్ణ సుఘోర దర్శ నా
భీల వరూధినీ సహిత భీద పరాక్రమ సుప్రచండ బా
హా లస దుగ్ర శాత్రవ జయార్భట చిహ్న సునిర్మి తేద్ధ స్తూ
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
వాలము లేకయుండగను వానరమూకల జెక్కు పుత్రునిన్
రిప్లయితొలగించండిచాలును శిల్ప చెక్కడము శ్రద్ధగ బొమ్మిక పాఠశాలకున్
మేలగు జీవితంబునకు,మెప్పును బొందెద వంచు బల్కిశి
ల్పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
కందం
రిప్లయితొలగించండిలీలగ యశోద గాంచెను
బాలుని మనుతిన్ననోట పద్నాలుగు లో
కాల! నటులఁ కృష్ణుఁడు పా
పాలను దునియలుగఁ జేసె పటు విక్రముఁడై!
ఉత్పలమాల
ఏల పరాత్పరా! రణము యీ గురు బంధుల గూల్చ లేననన్
జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్
లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూ
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
సవరణతో ఉత్పలమాల
తొలగించండిఉత్పలమాల
ఏల పరాత్పరా! సమర మీ గురు బంధుల గూల్చ లేననన్
జాలిక మోహమంచు హరి సర్వము తానని విశ్వరూపమున్
లీలగ జూపి గీతనిడ ప్రేరణఁ బొంది కిరీటి వైరి రూ
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
కూలగదోయునే మనల కుప్పగ యారురిపుల్ గదా యనిన్
రిప్లయితొలగించండిపాలకుడంతటన్ తలచి పట్టుగ నంతము చేయునా తరిన్
బోలము రీతిగా గురుని బోధతొ యంతర వైరులా ప్రతా
పాలనొనర్చె ముక్కలుగ బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
పాలు పెరుంగు దొంగిలుచు పల్లెతలాడెడి కల్లలంచునా
రిప్లయితొలగించండిబాలుడు తల్లి నేమరచు బాల్య విశేషములందు గాంచ గో
పాలుడు వల్లవాంగనల వల్వలు దోచెనటంద్రు గాని పా
పాల నొనర్చె ముక్కలుగ బల్లిదుఁడై జనులెల్ల మెచ్చఁగన్
ఉత్పలమాల:
రిప్లయితొలగించండి-----------
మేలును జేయగాదగును,మేదినిపైనను బీదవారికిన్
పూలనుబెట్టివారలిక,పూజలుజేయగనుండ శ్రద్ధతో
కూళలుజేరికొందరిట, కుట్రకుతంత్రములల్ల వారి పా
పాలనొనర్చె ముక్కలుగ ,బల్లిదుడై జనులంత మెచ్చగన్.