1, సెప్టెంబర్ 2021, బుధవారం

సమస్య - 3829

2-9-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవి వెలింగెను తూర్పున రాత్రివేళ”
(లేదా...)
“రాతిరి చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై”

40 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పగటి పూటను నింగిని ప్రస్ఫురముగ
    రవి వెలింగెను తూర్పున; రాత్రివేళ
    పశ్చిమమ్మున చంద్రుడు ప్రతిదినమ్ము
    తారలను గూడి నభమున తళుకు జూపు.

    రిప్లయితొలగించండి
  2. భరతమాతకుసంకెలభగ్నమంద
    తెల్లదోరయనుమబ్బునుతేలిపోయె
    అర్ధరాత్రినిచీకట్లునంతమందె
    రవివెలిగెనుతూర్పునరాత్రివేళ

    రిప్లయితొలగించండి
  3. కాంతి విరజిమ్ము చును తాను గగన మందు
    రవి వెలింగెను తూర్పున : రాత్రి వేళ
    పశ్చి మాన భాసించుచు ప్రభవ మంది
    చంద్రు డగుపించి నొసగును చల్ల దనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చంద్రు డగుపించి యొసగును" అనండి.

      తొలగించండి
  4. తెల్లవారెను లోకమ్ము దినకరుండు
    "రవి వెలింగెను తూర్పున, రాత్రి వేళ
    పరగ కైరవియుదయించె పశ్చిమమున
    వెన్నెల వెలుగు ప్రకృతికి వన్నె దెచ్చె!

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    బానిసత్వము వాపెడు పట్టుదలను
    నాంధ్ర దేశాన నల్లూరి యగ్గిపిడుగు
    తెల్లవారల గుండె గుభిల్లుమన కొ
    రవి వెలింగెను తూర్పున రాత్రివేళ

    ఉత్పలమాల
    జాతిని బానిసత్వపు విచారము వీడగ తెల్లవారలున్
    భీతిని వీడి పోరుటయె విజ్ఞతయంచును రామరాజు తా
    చేతన గూర్చ నాంధ్రులకు జీల్చగ తెల్లలఁ దొల్గ నంధమౌ
    రాతిరి చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై

    రిప్లయితొలగించండి
  6. శీతమయూఖుడున్ దిరిగె జెన్నుగ
    వెన్నల జల్లుచున్ ధరన్
    రాతిరి, చండ భాస్కరుడు రాజిలె
    గాంచుము తూర్పుకొండపై
    భూతలమందు మానవులు
    బోవుగ సాగిరి చేయ కృత్యముల్
    మేతను జంతుజాలములు మేయగ
    బోవుచునుండె గానకున్



    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శీతల మిచ్చుచున్ నడరె శీతమయూఖుడు నింగినందునన్
    రాతిరి; చండభాస్కరుడు రాజిలె గాంచుము తూర్పుకొండపై
    భీతిలజేయు తాపనము విస్తరణమ్మొనరించి విస్తృతిన్
    భూతలమందు వేసవిని పోషణ జేసెను రుద్రరూపుడై.

    రిప్లయితొలగించండి
  8. సకల జనుల మనోకాంక్ష సఫలమొంది
    వ్యర్థ పాలన ముగియగనర్థ రాత్రి
    మనదు నవ్య భారత దేశమున స్వతంత్ర
    రవి వెలింగెను తూర్పున రాత్రివేళ

    రిప్లయితొలగించండి
  9. సూర్య శశులు రీతి విడరు సుంతగూడ
    ప్రతి దినంబును తూర్పున బగటిపూట
    రవి వెలింగెను ; తూర్పున రాత్రివేళ
    గలువఱేడు వెలుంగుట గాంచవేల

    రిప్లయితొలగించండి
  10. ఉ:

    చూతము రారటంచు జన జోరున గీచెడు చిత్రకారునిన్
    పూతగ రంగులద్దుచును బొమ్మగ మార్చును జూసి నంతలో
    నేతలు వచ్చినారనుచు నెమ్మది బర్చగ వ్రాలె పొద్దు నా
    రాతిరి, చండ భాస్కరుడు రాజిలె గాంచుము తూర్పు కొండపై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  11. పక్షిజాతులు మేల్కుని స్వాగతములు
    పలుక చీకటిన్ జీల్చుచు ప్రభవమంది
    రవి వెలింగెను తూర్పున , రాత్రివేళ
    నలసి శయనించునట్టియాయంశుధరుడు.

    రిప్లయితొలగించండి
  12. పాతబడెన్ నిశావిభవ,భాసిలుచంద్రుడెచిన్నబోయెగా
    ఆతళుకీనుతారలికయాకశవీధులకానరావుగా
    ఆతరుణమ్మెపాఱెనిల,వాడెను,బాసెను,వీగిపోవగా
    రాతిరి,చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై



    రిప్లయితొలగించండి
  13. నీతిగవేదశాస్త్రములు
    నేర్చె పురోహితరామకృష్ణులే
    ఖ్యాతిగభద్రకాళిగుడి
    కాంక్షయుతీర నుపాసనంబుతో
    మాతకటాక్షమందగ, య
    మాసన చంద్రునిజూపెశక్తతో
    భూతలవాసులచ్చొరువు
    బొందగ ఓలలితాస్వరూపిణీ
    రాతిరి చండభాస్కరుడు
    రాజిలెగాంచుముతూర్పుకొండపై
    ...తోకల...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కటాక్షమందగ నమాసన... జూపె శక్తితో... వాసు లచ్చెరువు..టైపు దోషాలనుకుంటాను.

      తొలగించండి
  14. తెల్లదొరలను తరుమగా దేశమందు
    స్వేచ్ఛవాయువుల్ పెల్లుగా వీచె నపుడు
    బానిసత్వపు శృంఖలాల్ బ్రద్దలవగ
    రవి వెలింగెను తూర్పున రాత్రివేళ

    రిప్లయితొలగించండి
  15. ఒక యువకుడు కలగని మిత్రునికి చెప్పు సందర్భం.
    చేతనమందు చేరి యొక చిన్నది యాతన పెట్టుచుండ నా
    నాతిని పెండ్లియాడి చని నచ్చిన దేశము, మారుకేళిలో
    శీతమయూఖు వెన్నెలను చేరి యెసంగ, గతించె చెచ్చెరన్
    రాతిరి, చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై

    రిప్లయితొలగించండి

  16. భీతిలి యంబుదాయమున పెక్కగు తారల తోడగూడి జై
    వాతృకుడేగుదెంచగ నభమ్మును వీడుచు పారనేమిరా
    రాతిరి చండభాస్కరుడు, రాజిలె గాంచుము తూర్పుకొండపై
    పాతి సమూహమెల్ల రహి స్వాగతమంచును పిల్చినంతనే.

    రిప్లయితొలగించండి
  17. శీతమయూఖుడై చెలగి జీవులకిచ్చును శాంతిసౌఖ్యముల్
    రాతిరి ,చండభాస్కరుడు రాజిలె గాంచుము తూర్పుకొండపై
    చేతనరూపుడై జనుల జేయగ కార్యము లుత్సహించుచున్
    జోతలు వారికిన్ జగతిఁ జూపగ దారిని జోడుకన్నులై

    రిప్లయితొలగించండి
  18. ఆతత చంద్రికాస్ఫురిత యామిని నూయలలూపి లోకమున్
    శీతకరుండు దానరిగె సేదను దీరగ, మాయమాయెనా
    రాతిరి; చండభాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై
    చేతన గూర్చుచున్ జనుల జీవనయాత్రకు ప్రాణశక్తియై

    రిప్లయితొలగించండి
  19. ప్రబల తేజస్సు తోడను బ్రజలు మెచ్చ
    రవివెలింగెను తూర్పున ,రాత్రివేళ
    చలువ వెన్నెల తోడను జంద్రుడుండి
    హాయి గూర్చును నెనలేని హర్ష మొదవ

    రిప్లయితొలగించండి
  20. శీతలమయూఖుడున్ వెలుగు సేదనుదీర్చగ మానవాళికిన్
    రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపై
    యాతప యుక్తుడై మిగుల యార్తిని నీయచు ,నెల్లవారుదా
    భీతిని గల్గునట్లుగను బెంపువహించుచు నుండెనాయనన్

    రిప్లయితొలగించండి
  21. భాషణప్రియుఁ డాప్తుఁడు వేష భాష
    లందు రమణీయుఁడు పుడమి యందు నాదు
    ప్రాపున మదీయ మిత్రుఁడు దీపకాంతి
    రవి వెలింగెను దూర్పున రాత్రివేళ


    ఊతము నీయఁ జాగుట కనూరుఁడు కా రథ చోదకుండు సం
    ప్రీతి సెలంగఁ బ్రాణులకు వెల్గుల నీయఁగ నిత్య గామియై
    యాతత తాప సంయుతుఁడు యామము నర్ధము కాఁగ నేఁగి యా
    రాతిరి, చండ భాస్కరుఁడు రాజిలెఁ గాంచుము తూర్పుకొండపై

    రిప్లయితొలగించండి
  22. ఉదయవేళలయందున నుజ్జ్వలముగ
    రవివెలింగెను తూర్పున రాత్రివేళ;.
    చంద్రుడు దయించి కూర్చును సంతసమ్ము
    జగతి
    లోని జనుల కెల్ల జవముగాను

    రిప్లయితొలగించండి
  23. ఉ:

    కూతలు హెచ్చ వేయునట కోటలు దాటగ గొప్పలెంచుచున్
    తీతువు గూయు చందమున తియ్యగ బల్కును దెల్వకుండగన్
    తాతకు నేర్పు దగ్గులను తగ్గక పౌత్రుడు నివ్విధంబుగన్
    రాతిరి చండ భాస్కరుడు రాజిలె గాంచుము తూర్పు కొండపై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి