13-9-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు"(లేదా...)"దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేనివారికిన్"
తలపనాకలిమంటలుదగులుకోనగతరిగిపోవునుతలపులుధర్మనిరతిపట్టెడన్నముపెట్టకవట్టిచదువుదానమోనరింపరాదుక్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: ఆకలిని దరిజేరుచు నన్నమడుగు పేదవారలకెప్పుడు ఖాదనమిడి అలరజేయు చుండుము గాని యర్థ మసలు దాన మొనరింప రాదు క్షుద్భాధితులకు.
దనుజ సంతతి యనదగు తామసులకు దాన మొన రింప రాదు :క్షుద్భాధి తులకు కుక్షి నింపగ యత్నిo ప గోరు వారి మాధవుడు మెచ్చు ట నిజము మహిని యంద్రు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "మహిని నంద్రు" అనండి.
పిడికెడు మెతుకు లందక వీధియందుకదలలేని వాని నొకని గాంచినీవుదానమిడుచు రక్షించెడు తరుణమున నిదానమొనరింపరాదు క్షుద్బాధితులకు.
వానికి వాని సంతునకు వాస్తవమొప్పగ లేక తిండియున్మానసమందు వేదన సమన్వితమాయెను దారిలేక తాబూనెను భిక్షమెత్త, నొక పూజ్యడుదానము చేసె నావు గోదానము జేయ బూను టుచితంబొకొ తిండికి లేని వానికిన్
దీనుల కోగిరమ్మునకు దిక్కిక లేదని వీధు లందునన్ జానెడు పొట్టకై కరము జాపెడు ధ్వాక్షుని పాత్రలో ననుద్యానము తోడనన్నమిడ ధర్మము గాని హరీతుండవౌచు సందానము జేయబూనుటుచితమ్మొకొ తిండికి లేనివారికిన్.
ప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటులపంపకమిడుట నెంతయు పాడిగాదుఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచిదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "పంపక మిడుట యెంతయు.." అనండి.
ప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటులపంపకమిడుట యెంతయు పాడిగాదుఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచిదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
పాలకులొసగు సంక్షేమ పథకములకెసొగయుచు శ్రమము నెరుగని సోమరులకుదాన మొనరింపరాదు ; క్షుద్బాధితులకువలయు భోజనమొసగుచు వాసిగొనుము
తేటగీతికన్నకొడుకుకు హానియన్ కడుపుమంటక్షుచ్ఛమింప హరి కవచ కుండలములనెంచఁగ విచికిత్స వదలి యిన సుతుండుదాన మొనరింపరాదు క్షుద్బాధితులకుఉత్పలమాలప్రాణము దీయుఁ గోవిడని బంధితులౌచును గూలి వారలున్హీన పరిస్థితిన్ గనఁగ నెంతకుఁ దీరక మీర నాకలుల్పూనుచు వైద్యసేవలని పొట్లము లందున మందు మాత్రమేదానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేనివారికిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఉన్నమ్మా ఉన్నమ్మకే పెడుతుంది , లేనమ్మా ఉన్నమ్మకే పెడుతుంది !మానము పెంచునంచు నభిమానము జాటుచునున్నవారికేవైనముగాను కూతురి వివాహపు వేళను నన్నవస్త్రముల్దానము జేయబూను టుచితమ్మొకొ? తిండికి లేని వారికిన్ ప్రాణము నిల్పగాదగిన భక్ష్యము చేలము లిచ్చినన్దగున్
ఓట్లు మాత్రమే లక్ష్యమై నోట్లు పంచిప్రజల మేలును మరచిన కుజనులగుచునీచ మార్గమ్ము నెంచిన నేతలు పరిదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
ఉ: కూనల దొంగిలించి నతి క్రూరము దుర్బల పర్చ దేహమున్హీనులటంచు కూడలిగ హేయపు వృత్తిని దింపజేయుచున్దానవ నైజమున్ గలిగి దారుణ రీతి గడింప ద్రవ్యమున్దానము జేయ బూను టుచితమ్మొకొ ? తిండికి లేని వారికిన్వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
మానధనాఢ్యులై మెలుఁ గమాయక జీవులకింక నేఁ డపాదానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ, తిండికి లేనివారికిన్?దీనుల గావగా ప్రభుత ధీమను బీమను సేద్యమందు సంధానము సేయుటుత్తమము ధారణి నేలెడి నాయకోత్తముల్.అపాదానము-నష్టము
కనకము, ధనము, వజ్రపు గడనగలనుదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు,వితరణ మొనరింపవలయు విరివిగ రుచిగలది, సుచిగల, యన్నము కరుణ తోడ.
సమస్య :దానము జేయబూనుటుచి తమ్మొకొ తిండికి లేనివారికిన్ ( శుష్కప్రియాలు - శూన్యహస్తాలు )మానవ ! మంచిబట్టలవి మానము గాయగ లేనివారికిన్ ;గానగ రాని కష్టముల గందరగోళము నందువారికిన్ ;జేనగు సాయమున్ మరచి చేరుచు మెచ్చుల మాటలాడి వా గ్దానము జేయబూనుటుచి తమ్మొకొ ! తిండికి లేనివారికిన్ .
వానలు మెండుగా కురియ బంటలు హెచ్చుగ పండినందునన్కానగలేము వాసముల గాదెలు ఖాళిగ , నట్టి వారికిన్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ ; తిండికి లేనివారికిన్బోనము నిచ్చి యాకలిని పూర్తిగ బాపుట పాడియౌ గదా !
ఆకలినిగొన్న వానికి నన్నమిడకశూన్యహస్తము జూపుట శోభనిడదుప్రతిఫలంబుగా దేవుని వరము లడిగిదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భూనుతసద్గుణాఢ్య! హుతభుక్తతి నిల్లు విదగ్ధమౌ తరిన్పూనిక బావిఁ ద్రవ్వుదువె! పొంగునె! తత్క్షణనీరమయ్యెడన్వానకు గూలి కొట్టుకొని వాసము సర్వము వోవ,శుష్కవాగ్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్.కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
దానము నీయగా దగును తల్లడమందున నున్నవానికిన్కానక కన్నుమిన్ను పరకాంతలగూడెడి దుర్మదాంధుకున్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ? ,తిండికి లేనివారికిన్దానముఁజేయ పాడియగు దైవము మెచ్చును వారి యీవికిన్
ధ్యానమొనర్చుచున్ సతత మాలయమందున యాచనార్థమైగానముచేయుచున్ హరిని, కమ్మని గాత్రముతోడమించుచున్పానము చేయగా మధువు పైకము నంత వ్యయమ్ము చేసినన్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్?
తానొక భాగ్యశాలినను దర్పము దోడ ప్రచార కాంక్షతోదానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ; తిండికి లేనివారికిన్దానము జేయుటే పరమ ధర్మమదే పరమాత్మ సేవయౌగాననపాత్రదానమునకార్యముగా గ్రహియింప మేలగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వండి'ని 'ఒండి' అనరాదు. "అన్నమును వండి వడ్డించ నన్నదాత" అనండి.
ధనము మత్తుగ గలవాని కెన్నడిలను దానమొనరింపరాదు,క్షుద్బాధితులకునన్న దానము జేసిన మిన్నగానుపుణ్య మబ్బును దప్పక గణ్యముగను
కృతజ్ఞతలు పూజ్యశ్రీ
హీనముగా దలంతునిక హేమపుటాభరణంబు లుండగాదానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్ దానముజేయకుండగను ధార్మికసూక్తులు బోధసేయుటన్ దానము జేయగా వలయు దప్పక యన్నము నీరమున్ రతిన్
ఎడఁ గనఁడు తాను దూఱంగ మెడకు డోల?తిండి పెట్ట లేఁడు కడుపు నిండుగ నన నగల మాట లేలయ్య కన్యామణులనుదాన మొనరింపరాదు క్షుద్బాధితులకుమీనము మేషముల్ దలఁప మేలొడఁ గూడునె రోగి కెన్నఁడుం గాన నెఱింగి చక్కగను గార్యము సేయ ఫలమ్ము దక్కదే నేను దలంతు వే కడుపు నిండుగ నన్నము నీక పైడినిన్ దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్
తలపనాకలిమంటలుదగులుకోనగ
రిప్లయితొలగించండితరిగిపోవునుతలపులుధర్మనిరతి
పట్టెడన్నముపెట్టకవట్టిచదువు
దానమోనరింపరాదుక్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆకలిని దరిజేరుచు నన్నమడుగు
పేదవారలకెప్పుడు ఖాదనమిడి
అలరజేయు చుండుము గాని యర్థ మసలు
దాన మొనరింప రాదు క్షుద్భాధితులకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదనుజ సంతతి యనదగు తామసులకు
రిప్లయితొలగించండిదాన మొన రింప రాదు :క్షుద్భాధి తులకు
కుక్షి నింపగ యత్నిo ప గోరు వారి
మాధవుడు మెచ్చు ట నిజము మహిని యంద్రు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మహిని నంద్రు" అనండి.
రిప్లయితొలగించండిపిడికెడు మెతుకు లందక వీధియందు
కదలలేని వాని నొకని గాంచినీవు
దానమిడుచు రక్షించెడు తరుణమున ని
దానమొనరింపరాదు క్షుద్బాధితులకు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివానికి వాని సంతునకు వాస్తవ
రిప్లయితొలగించండిమొప్పగ లేక తిండియున్
మానసమందు వేదన సమన్విత
మాయెను దారిలేక తా
బూనెను భిక్షమెత్త, నొక పూజ్యడు
దానము చేసె నావు గో
దానము జేయ బూను టుచితం
బొకొ తిండికి లేని వానికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిదీనుల కోగిరమ్మునకు దిక్కిక లేదని వీధు లందునన్
జానెడు పొట్టకై కరము జాపెడు ధ్వాక్షుని పాత్రలో నను
ద్యానము తోడనన్నమిడ ధర్మము గాని హరీతుండవౌచు సం
దానము జేయబూనుటుచితమ్మొకొ తిండికి లేనివారికిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటుల
రిప్లయితొలగించండిపంపకమిడుట నెంతయు పాడిగాదు
ఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచి
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పంపక మిడుట యెంతయు.." అనండి.
ప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటుల
తొలగించండిపంపకమిడుట యెంతయు పాడిగాదు
ఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచి
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
పాలకులొసగు సంక్షేమ పథకములకె
రిప్లయితొలగించండిసొగయుచు శ్రమము నెరుగని సోమరులకు
దాన మొనరింపరాదు ; క్షుద్బాధితులకు
వలయు భోజనమొసగుచు వాసిగొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండికన్నకొడుకుకు హానియన్ కడుపుమంట
క్షుచ్ఛమింప హరి కవచ కుండలముల
నెంచఁగ విచికిత్స వదలి యిన సుతుండు
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
ఉత్పలమాల
ప్రాణము దీయుఁ గోవిడని బంధితులౌచును గూలి వారలున్
హీన పరిస్థితిన్ గనఁగ నెంతకుఁ దీరక మీర నాకలుల్
పూనుచు వైద్యసేవలని పొట్లము లందున మందు మాత్రమే
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేనివారికిన్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఉన్నమ్మా ఉన్నమ్మకే పెడుతుంది , లేనమ్మా ఉన్నమ్మకే పెడుతుంది !
రిప్లయితొలగించండిమానము పెంచునంచు నభిమానము జాటుచునున్నవారికే
వైనముగాను కూతురి వివాహపు వేళను నన్నవస్త్రముల్
దానము జేయబూను టుచితమ్మొకొ? తిండికి లేని వారికిన్
ప్రాణము నిల్పగాదగిన భక్ష్యము చేలము లిచ్చినన్దగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఓట్లు మాత్రమే లక్ష్యమై నోట్లు పంచి
రిప్లయితొలగించండిప్రజల మేలును మరచిన కుజనులగుచు
నీచ మార్గమ్ము నెంచిన నేతలు పరి
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండికూనల దొంగిలించి నతి క్రూరము దుర్బల పర్చ దేహమున్
హీనులటంచు కూడలిగ హేయపు వృత్తిని దింపజేయుచున్
దానవ నైజమున్ గలిగి దారుణ రీతి గడింప ద్రవ్యమున్
దానము జేయ బూను టుచితమ్మొకొ ? తిండికి లేని వారికిన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిమానధనాఢ్యులై మెలుఁ గమాయక జీవులకింక నేఁ డపా
రిప్లయితొలగించండిదానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ, తిండికి లేనివారికిన్?
దీనుల గావగా ప్రభుత ధీమను బీమను సేద్యమందు సం
ధానము సేయుటుత్తమము ధారణి నేలెడి నాయకోత్తముల్.
అపాదానము-నష్టము
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికనకము, ధనము, వజ్రపు గడనగలను
రిప్లయితొలగించండిదాన మొనరింపరాదు క్షుద్బాధితులకు,
వితరణ మొనరింపవలయు విరివిగ రుచి
గలది, సుచిగల, యన్నము కరుణ తోడ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిదానము జేయబూనుటుచి
తమ్మొకొ తిండికి లేనివారికిన్
( శుష్కప్రియాలు - శూన్యహస్తాలు )
మానవ ! మంచిబట్టలవి
మానము గాయగ లేనివారికిన్ ;
గానగ రాని కష్టముల
గందరగోళము నందువారికిన్ ;
జేనగు సాయమున్ మరచి
చేరుచు మెచ్చుల మాటలాడి వా
గ్దానము జేయబూనుటుచి
తమ్మొకొ ! తిండికి లేనివారికిన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివానలు మెండుగా కురియ బంటలు హెచ్చుగ పండినందునన్
రిప్లయితొలగించండికానగలేము వాసముల గాదెలు ఖాళిగ , నట్టి వారికిన్
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ ; తిండికి లేనివారికిన్
బోనము నిచ్చి యాకలిని పూర్తిగ బాపుట పాడియౌ గదా !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆకలినిగొన్న వానికి నన్నమిడక
రిప్లయితొలగించండిశూన్యహస్తము జూపుట శోభనిడదు
ప్రతిఫలంబుగా దేవుని వరము లడిగి
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభూనుతసద్గుణాఢ్య! హుతభుక్తతి నిల్లు విదగ్ధమౌ తరిన్
తొలగించండిపూనిక బావిఁ ద్రవ్వుదువె! పొంగునె! తత్క్షణనీరమయ్యెడన్
వానకు గూలి కొట్టుకొని వాసము సర్వము వోవ,శుష్కవా
గ్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదానము నీయగా దగును తల్లడమందున నున్నవానికిన్
రిప్లయితొలగించండికానక కన్నుమిన్ను పరకాంతలగూడెడి దుర్మదాంధుకున్
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ? ,తిండికి లేనివారికిన్
దానముఁజేయ పాడియగు దైవము మెచ్చును వారి యీవికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధ్యానమొనర్చుచున్ సతత మాలయమందున యాచనార్థమై
రిప్లయితొలగించండిగానముచేయుచున్ హరిని, కమ్మని గాత్రముతోడమించుచున్
పానము చేయగా మధువు పైకము నంత వ్యయమ్ము చేసినన్
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితానొక భాగ్యశాలినను దర్పము దోడ ప్రచార కాంక్షతో
రిప్లయితొలగించండిదానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ; తిండికి లేనివారికిన్
దానము జేయుటే పరమ ధర్మమదే పరమాత్మ సేవయౌ
గాననపాత్రదానమునకార్యముగా గ్రహియింప మేలగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి'వండి'ని 'ఒండి' అనరాదు. "అన్నమును వండి వడ్డించ నన్నదాత" అనండి.
ధనము మత్తుగ గలవాని కెన్నడిలను
రిప్లయితొలగించండిదానమొనరింపరాదు,క్షుద్బాధితులకు
నన్న దానము జేసిన మిన్నగాను
పుణ్య మబ్బును దప్పక గణ్యముగను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృతజ్ఞతలు పూజ్యశ్రీ
రిప్లయితొలగించండిహీనముగా దలంతునిక హేమపుటాభరణంబు లుండగా
రిప్లయితొలగించండిదానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్
దానముజేయకుండగను ధార్మికసూక్తులు బోధసేయుటన్
దానము జేయగా వలయు దప్పక యన్నము నీరమున్ రతిన్
ఎడఁ గనఁడు తాను దూఱంగ మెడకు డోల?
రిప్లయితొలగించండితిండి పెట్ట లేఁడు కడుపు నిండుగ నన
నగల మాట లేలయ్య కన్యామణులను
దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు
మీనము మేషముల్ దలఁప మేలొడఁ గూడునె రోగి కెన్నఁడుం
గాన నెఱింగి చక్కగను గార్యము సేయ ఫలమ్ము దక్కదే
నేను దలంతు వే కడుపు నిండుగ నన్నము నీక పైడినిన్
దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్